English | Telugu

త్వరలో మీ అందరికి బిగ్ సర్ప్రైజ్ అంటున్న సిరి - శ్రీహాన్

శ్రీహాన్ - సిరి హన్మంత్ అంటే బుల్లితెర మీద తెలియని వారంటూ ఎవరూ లేరు. యూట్యూబ్‌, షార్ట్ ఫిల్మ్స్, ఇన్‌స్టా రీల్స్‌తో వీళ్ళు బాగా పాపులర్ అయ్యారు. బిగ్‌బిస్ సీజ‌న్ 5లో సిరి, సీజ‌న్ 6లో శ్రీహాన్‌ పార్టిసిపేట్ చేశారు. ఐతే బిగ్ బాస్ కి వెళ్ళక ముందు వచ్చినంత గుర్తింపు వెళ్లి వచ్చాక తగ్గిందనే చెప్పాలి. వీళ్ళు రియల్ లైఫ్ లో లవర్స్ గా ఉన్నారు. ఐతే ఆన్ స్క్రీన్ మీద ఎప్పుడూ కలిసే కనిపిస్తూ ఉంటారు. కానీ వీరు ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. పెళ్ళెప్పుడు అని అడిగితే మాత్రం దాటేస్తూ ఉంటారు. ఐతే వీళ్ళు అసలెప్పుడు పెళ్లి చేసుకుంటారు అనే ఆస‌క్తి చాలా మందిలో ఉంది. ఐతే త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ చాలా సార్లు చెప్పుకొచ్చారు. అలాగే వీళ్ళు పెళ్లికాక ముందేనుంచే ఒక బాబును కూడా పెంచుకుంటున్నారు. చూస్తే వీళ్లకు ఎప్పుడో పెళ్ళైపోయి ఒక బాబు ఉన్నాడేమో అనుకుంటారు. కానీ కాదు. ఇక ఈ రూమర్స్ కి చెక్ పెడుతూ తాజాగా.. ఒక అనౌన్స్మెంట్ ని వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ద్వారా చెప్పారు.

"సో గైస్..ఇంతటితో మీ అందరి వెయిటింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాం.. వైజాగ్‌లో జరగబోయే ఒక సర్ప్రైజ్ గురించి చెప్పే సమయం దాదాపు వచ్చేసింది! అదేంటో కొద్ది రోజుల్లోనే మేము రివీల్ చేయబోతున్నాం.. అప్పటి వరకు వేచి ఉండండి .." అంటూ పోస్ట్ పెట్టారు.

ఐతే వీళ్ళ పెళ్లి విషయం చెప్పబోతున్నారా..లేదంటే ఏదైనా మూవీ న్యూస్ చెప్పబోతున్నారు..ఏదైనా షోలో చేస్తున్నారా..దాని గురించి చెప్పాలనుకుంటున్నారా.. అనేదే ఇప్పుడు సస్పెన్స్. ఇంతకు వాళ్ళు ఎం రివీల్ చేస్తారో కొద్దీ రోజులు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది. ఐతే ప్రియాంక జైన్, సుష్మ కిరణ్, కీర్తి భట్ వాళ్ళు కూడా వెయిటింగ్ , కంగ్రాట్యులేషన్స్ అని మెసేజ్ పెట్టడాన్ని బట్టి చూస్తుంటే నిజంగా పెళ్ళేనేమో అనిపిస్తోంది అంటున్నారు నెటిజన్స్.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.