English | Telugu

గీతూ రాయల్ కి బిగ్ బాస్ ట్రోఫీ.. నాగార్జున ఇచ్చే ట్రోఫీ ఒక్క ఎపిసోడ్ కే అంటూ కామెంట్స్!

గీతూ రాయల్ బిగ్ బాస్ సీజన్ 6 లో హౌస్ లోకి వెళ్లి కంటెస్టెంట్ గా గేమ్ బాగా ఆడింది. అన్ని రకాల టాస్కులు ఆడింది. గీతూ ఆట తీరు చూసి తానే ఫైనల్ విన్నర్ అనుకున్నారు అంతా కానీ అనూహ్యంగా ఎలిమినేట్ ఐపోయి ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత కొద్దీ రోజుల పాటు ఇంట్లోంచి బయటకు రాలేదు సోషల్ మీడియాలో కూడా కనిపించలేదు. అలాంటి టైములో ఒక రోజు ఆమె కోసం ఒక అభిమాని వచ్చి ఒక గిఫ్ట్ ఇచ్చి వెళ్లారని గీతుకి వాళ్ళ అమ్మ చెప్పింది. ఐతే ఆ గిఫ్ట్ ని అలాగే ఆ ఇచ్చిన వారి చేతులతోనే ఓపెన్ చేయించి తీసుకోవాలని అలాగే ఉంచుకుందట. ఐతే రీసెంట్ గా ఆ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు గీతూ ఇంటికి వచ్చారు. వాళ్ళను చూసాకా గీతూ అల్తాఫ్ అంటూ పేరు చెప్పి గుర్తు పట్టి ఇంట్లోకి తీసుకెళ్లింది.

ఐతే బిగ్ బాస్ ఎలిమినేట్ ఐన టైములో ఇచ్చిన గిఫ్ట్ ని ఇంకా ఓపెన్ చేయలేదు అని చెప్పి దాన్ని తెచ్చి తన అభిమానితో ఓపెన్ చేయించి ఏమిటా అని చూసింది. తీరా చూస్తే అది బిగ్ బాస్ ట్రోఫీ.. అచ్చంగా అలాగే ఉండేసరికి ఎగిరి గంతులేసినంత పని చేసింది. ఆ ట్రోఫీని అభిమాని చేతుల మీదగా అందుకుంటూ "నాగార్జున గారు ఇచ్చే ట్రోఫీ ఒక్క ఎపిసోడ్ కి..అభిమాని ఇచ్చే ట్రోఫీ జీవితం జీవితానికి" అంటూ తనివితీరా ఆ బిగ్ బాస్ ట్రోఫీని చూసి మురిసిపోయింది. ఇక ఈ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసి "ఆవేశాన్ని ఆపగలం కానీ అభిమానాన్ని ఆపలేము.." అంటూ తన అభిమానికి థ్యాంక్స్ చెప్పింది. ఇక గీతూ మోటివేషనల్ వీడియోస్ చేస్తూ అలాగే బిగ్ బాస్ రివ్యూస్ చెప్తూ సోషల్ మీడియాలో నిత్యం కనిపిస్తూనే ఉంటుంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.