English | Telugu

జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి కారణం హైపర్ ఆది ?

జబర్దస్త్ షోకి యాంకర్ గా అనసూయ వెళ్లిపోయాకా చాలా మంది మారారు కానీ అప్పటికి ఇప్పటికీ ఒకే ఒక్క యాంకర్ రష్మీ మాత్రమే అలాగే ఆ షోస్ ని ఏలుతోంది. ఐతే ఈ గ్యాప్ లో సౌమ్య రావు కూడా జబర్దస్త్ యాంకర్ గా కన్నడ నుంచి వచ్చింది. కానీ చాలా కొద్దీ టైంలోనే వెళ్ళిపోయింది. ఐతే ఆమె షో నుంచి వెళ్లిపోవడానికి కారణం హైపర్ ఆది అనే టాక్ బాగా వైరల్ అయ్యింది. మరి ఇప్పుడు హైపర్ ఆది గురించి సౌమ్య తన మాటల్లో చెప్పుకొచ్చింది. "జబర్దస్త్ కి హోస్ట్ గా వచ్చినప్పుడు నాకు అసలు ఆ షో అంటే ఏంటో కూడా తెలీదు. హోస్ట్ అనసూయ అంటే కూడా ఎవరో తెలీదు. తర్వాత వాళ్ల వీడియోస్, షోస్ చూసి తెలుసుకున్నా. సుధీర్, రష్మీ జోడి నేనెప్పుడూ చూడలేదు. వాళ్ళ గురించి నాకేం తెలీదు. ఆఫ్ స్క్రీన్ లో సుధీర్ ఎం మాట్లాడరు.. వచ్చినప్పుడు హాయ్ అని వెళ్ళేటప్పుడు బై అని చెప్పి వెళ్ళిపోతారు అంతే.

Brahmamudi : భార్యని వాటేసుకొని నిజం చెప్పేసిన భర్త.. సూపర్ ట్విస్ట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -598 లో.... కళ్యాణ్ కి అప్పు ఫోన్ చేస్తుంది. నేను ఎలాగైనా ఎస్సై అయి తిరిగి వస్తాను. అందుకే ఎంత కష్టమైనా ఉంటున్నానని అప్పు అంటుంది. నువ్వు నన్ను చూడడానికి రావొచ్చు కదా అని అప్పు అనగానే.. త్వరలో వస్తానని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత కళ్యాణ్ నా దగ్గర ఏదైనా దాస్తున్నాడా అని అప్పు అనుకుంటుంది. అయిన నాకు చెప్పకుండా ఉండడులే అనుకుంటుంది అప్పు. ఆ తర్వాత కావ్యని ఎలాగైనా ఇంప్రెస్ చెయ్యాలని అనుకుంటాడు రాజ్. ఆ తర్వాత కిచెన్ లోకి వచ్చి టీ పెట్టుకుంటాడు రాజ్. అప్పుడే అపర్ణ వచ్చి.. ఏంటి ఈ మార్పు అన్నట్లుగా మాట్లాడుతుంది.

Karthika Deepam2 : కట్టుబట్టలతో బయటకొచ్చేసిన కార్తీక్, దీప.. శివన్నారాయణ‌కి ఛాలెంజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -233 లో....ఎక్కడో ముత్యాలమ్మ గూడెంలో టిఫిన్ అమ్ముకునే దీప.. ఇప్పుడు ఏకంగా రెస్టారెంట్ ఓనర్ అవుతుంది. ఇది గొప్ప విషయం కదా అని శివన్నారాయణ అనగానే.. మీకు ఇష్టం లేకపోతే సైలెంట్ గా ఉండండి అని కార్తీక్ అంటాడు. నా భార్య పేరు మీద రెస్టారెంట్ కడుతాను.. పెట్టుబడి ఏమైనా నిన్ను అడిగనా అని కార్తీక్ అనగానే.. పెట్టుబడి పెట్టడానికి దీప  ఏం తాకట్టు పెట్టి నీకు ఇచ్చిందని శివన్నారాయణ అనగానే నా ఇల్లు బ్యాంక్ లో తాకట్టు పెట్టి పెట్టుబడి తీసుకుంటున్నానని కార్తీక్ అంటాటు. నీకు ఇల్లు ఎక్కడిది.. ఇవి నా ఆస్తులని శివన్నారాయణ‌ అంటాడు.

Eto Vellipoyindhi Manasu : ఆస్తుల కోసం కొడుకుని లేపేయ్యాలని చూస్తున్న సవతి తల్లి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -284 లో... శ్రీలత దగ్గరికి రామలక్ష్మి వచ్చి మీరు నిజంగానే మారిపోయారా అని అడుగుతుంది. రామలక్ష్మి అడిగిన వాటిల్లో సందీప్ ఇష్టమని శ్రీలత చెప్పగానే.. అంటే మీకు సీతా సర్ కన్నా సందీప్ ఇష్టం అన్నమాట అని రామలక్ష్మి అనగానే.. సీతా ఇష్టమే కానీ సందీప్ ని నవమాసాలు మోసి కన్నాను కదా అని శ్రీలత కవర్ చేస్తుంది. మీరు మారిపోతే మంచిదే కానీ మారకుండా సీతా సర్ నీ ఏమైనా చెయ్యాలనుకుంటే మాత్రం మళ్ళీ నా సంగతి తెలుసు కదా అని వార్నింగ్ ఇస్తుంది రామలక్ష్మి.

అఖిల్ కామెంట్స్ కి నిఖిల్ కౌంటర్...ప్రతీ ఒక్కరికీ ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు

పొలిటికల్ కామెంట్స్ మాత్రమే కాదు.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు చేసే కామెంట్స్ బయట వాళ్ళ ఫాన్స్ కానీ ఇతరత్రా ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చేసే కామెంట్స్ కూడా  బాగా డిబేటబుల్ అవుతాయి.. అలాగే కాంట్రవర్సి కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి. ఐతే రీసెంట్ గా బిగ్ బాస్ 8 కి సంబంధించి గత బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్  చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీనికి నిఖిల్ కౌంటర్ ఇచ్చాడు ఒక ఇంటర్వ్యూలో. "గౌతమ్ రియల్ విన్నర్ కానీ గౌతమ్ ని బిగ్ బాస్ విన్నర్ ని చేయాలనుకోవడం లేదు..నిఖిల్ ని విన్నర్ ని చేయాలనుకుంటోంది..ఏదో జరుగుతోంది" అంటూ కొన్ని రోజుల క్రితం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

విజయ సేతుపతి సలహా : బేబక్క తినడమే కాదు.. మంచిగా వర్కౌట్ చేయండి 

సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్, యుట్యూబర్, సింగర్ బెజవాడ బేబక్క గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె వాడే పడికట్టు పదాలతో సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యింది. "బై పెండ్స్...గట్టిగా పాపాలు చేసేయండి. నాలుగు కాలాలు పాటు హాయిగా  ఉంటారు" లాంటి రీల్స్ తో ఆమె బాగా హైలైట్ అయ్యింది. ఇక ఈ బిగ్ బాస్ సీజన్ 8 కి వెళ్లి వచ్చింది. ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ ఐపోయింది. ఐతే రీసెంట్ గా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అనౌన్స్ చేసే రోజున విజయ్ సేతుపతిని తెలుగు బిగ్ బాస్ కి తీసుకొచ్చారు హోస్ట్ నాగార్జున. అలాగే ఎలిమినేట్ ఐన, ఎక్స్ - కంటెస్టెంట్స్ అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టారు. అందులో ముందుగా ముక్కు అవినాష్ చెయ్యెత్తి టాప్ 5 కంటెస్టెంట్ ని సర్ అని విజయ్ సేతుపతికి చెప్పాడు.