English | Telugu

స్కూల్ లో ఉన్నప్పటినుంచే ఫస్ట్ నైట్ కోసం ఎదురుచూస్తున్నా

ఇష్మార్ట్ జోడి 3 నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో వెడ్డింగ్ థీమ్ ఇచ్చాడు హోస్ట్ ఓంకార్. ఐతే కంటెస్టెంట్స్ అంతా కూడా పెళ్లి దుస్తుల్లో అచ్చమైన పెళ్ళికొడుకు పెళ్లి కూతుళ్లలా వచ్చారు. ఇందులో అలీ రెజా, మాసుమా చానా అందంగా మురిసిపోయారు. ఇక ఓంకార్ అలీ రెజాని ఒక వెరైటీ ప్రశ్న అడిగాడు . "ఫస్ట్ నైట్ కోసం ఈ ఏజ్ నుంచి ఎదురు చూస్తున్నావు" అని. దానికి "స్కూల్ ఏజ్ నుంచే" ఆన్సర్ చెప్పాడు అలీ రెజా. "ఫస్ట్ నైట్ రోజు ఎనర్జీ కోసం ఏదైనా స్పెషల్ ఫుడ్ తిన్నారా" అని అడిగాడు. "ఎనర్జీ డ్రింక్స్ కంపెనీ ఉంటది కదా సర్. అది మా దగ్గర నుంచే వెళ్తుంది" అన్నాడు అలీ రెజా.

త్రినయని సీరియల్ కి శుభం కార్డ్ పడనుందా.. ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్!

జీతెలుగులో ప్రసారమయ్యే సీరియల్స్ లో త్రినయని టాప్-5 లో ఉంది. అయితే ఈ సీరియల్ త్వరలో ముగుస్తుందనే వార్తలొస్తున్నాయి. జీతెలుగులో అత్యధిక రేటింగ్ వచ్చే సీరియల్స్‌లో త్రినయని ఒకటి. ఈ సీరియల్ ప్రారంభం నుంచి కూడా మంచి టీఆర్పీ రేటింగ్‌ను సాధిస్తోంది. గత వారం ఈ సీరియల్‌‌కి 6.62 రేటింగ్ వచ్చింది. పడమటి సంధ్యారాగం సీరియల్‌ 8.49 రేటింగ్‌తో టాప్‌లో ఉంటే.. మేఘ సందేశం 7.98 రేటింగ్‌తో రెండో స్థానంలో నిలిచింది. నిండునూరేళ్ల సావాసం 7.87 రేటింగ్‌తో మూడో స్థానంలో ఉంటే.. జగద్ధాత్రి 7.02 రేటింగ్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక త్రినయని 6.62 రేటింగ్‌తో ఐదో స్థానంలో నిలిచింది. 

పిచ్చి అభిమానంతో ప్రాణాలు పోగొట్టుకోవద్దు

ఆట సందీప్ భార్య జ్యోతిరాజ్ సందీప్ అప్పుడప్పుడు కొన్ని మోటివేషనల్ వీడియోస్ కూడా  చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటి ఒక వీడియో చేసింది. రీసెంట్ గా అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలుసు. ఒక ఫ్యాన్ ప్రాణమే పోయింది. అలాంటి ఫ్యాన్స్ కి జ్యోతి రాజ్ ఒక వార్నింగ్ లాంటి మెసేజ్ ఇచ్చింది. "ఫ్యాన్స్ ఇప్పటికైనా మారండి. పిచ్చి ప్రేమ పెంచుకున్న ఈ ఫ్యాన్స్ కి ఈ వీడియో. మీరు తలుచుకుంటే నార్మల్ పర్సన్ ని కూడా పెద్ద సెలెబ్రిటీని చేస్తారు..మీరు తలుచుకుంటే ఎంత తోపు హీరోని కానీ హీరోయిన్ ని ఐనా కూడా ఓవర్ నైట్ జైలుకు కూడా పంపిస్తారు. మీ పిచ్చి అభిమానం ఎప్పుడూ ఎవరికీ ఇబ్బందికరంగా ఉండకూడదు. ఇకముందైనా మారండి. మీ హీరోస్ ని హీరోయిన్స్ ని చూసి మీ ప్రాణాలు పోగొట్టుకోవద్దు. వాళ్ళు కూడా మన లాంటి మనుషులే..మన తల్లితండ్రుల కన్నా గొప్ప కాదు.

అల్లు అర్జున్, రవితేజ కల్లోకి వచ్చారు..జెడి.చక్రవర్తి చెప్పారని బిగ్ బాస్ 8 కి వెళ్లాను

బిగ్ బాస్ 8 విష్ణుప్రియ అండ్ పృద్వి ఎపిసోడ్స్  మంచి క్యూట్ గా ఉంటాయి. అలాంటి విష్ణుప్రియకు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు వియర్డ్ కలలు వచ్చేవట. ఆ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.  "ఒక రోజు మా నాన్న, ఒక రోజు మా తమ్ముడు చనిపోయినట్టు, ఒక రోజు మా చెల్లిని కిడ్నప్ చేసినట్టు, ఒక రోజు అల్లు అర్జున్, రవితేజగారు నా డ్రీమ్ లోకి వచ్చి రా పార్టీ చేసుకుందాం అన్నట్టు రకరకాల కలలు వచ్చాయి. మూడు నెలల పాటు నాకు సరిగా నిద్ర లేదు. ఒక ఉద్యమంలా బతికాను నిద్రలేక. ఒకవేళ బిగ్ బాస్ హౌస్ నుంచి ఏదైనా  దొబ్బేయాల్సి వస్తే కొన్ని పింక్ చెయిర్స్ తీసుకుపోయి నా బాల్కనీలో వేసుకుంటా.

ప్రియుడితో ఇనయా సుల్తానా బ్రేకప్.. నెట్టింట వైరల్ గా మారిన ఫోటోలు!

బిగ్ బాస్ సీజన్-6 ద్వారా ఫేమస్ అయిన వారిలో ఇనయా సుల్తానా ఒకరు. తన ఆటతీరుతో, మాటతీరుతో ఆకట్టుకున్న ఇనయా.. బయటకొచ్చాక తన లవర్ తో కలిసి గోవా ట్రిప్ లకి వెళ్లి అక్కడ హాటల్ గదుల్లో టవల్ పై ఫోటోలు దిగి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అవి వైరల్ అయ్యాయి. ‌ఇక వాటి గురించి నెటిజన్లు కామెంట్ చేయగా.. పెళ్లా.. అబబ్బే.. అలాంటి ఉద్దేశం మాకు ఇప్పుడైతే లేదు. అయినా మేమిద్దరం చిన్నపిల్లలం. మా గోల్స్ అచీవ్ చేసిన తరువాత పెళ్లి చేసుకుంటేనే మాకు సంతృప్తి.. అప్పటి వరకూ మాకు ఇదే తృప్తి అని అన్నాడు గౌతమ్. మా రిలేషన్ గురించి చాలామంది కామెంట్లు పెడుతున్నారు. వీళ్లు ఎంత కాలం కలిసి ఉంటారులే అని అంటున్నారు. వాటిని నేను కేర్ చేయను. అయినా మా రొమాంటిక్ ఫొటోలు బాగున్నాయి కదా చూసి ఆనందించాలి.. కానీ ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టడం ఏంటని అతను అన్నాడు. 

Karthika Deepam2 : దీప పోగుచేసిన డబ్బు కార్తీక్ కి ధైర్యమిచ్చిందా.. జ్యోత్స్న రివేంజ్ ఆమెపైనే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -237 లో.... కాంచన దగ్గరికి శ్రీధర్ వెళ్తాడు. కార్తీక్ రెస్టారెంట్ పెట్టడానికి కావల్సిన డబ్బు ఇస్తాను.. నాకు సారీ చెప్పాలి.. ఇంకా నన్ను మీతో ఉండనివ్వాలని శ్రీధర్ షరతులు పెడతాడు. దాంతో కాంచనకి కోపం వచ్చి.. నీ డబ్బు అవసరం లేదు ఇచ్చిన మాట వెనక్కి తీసుకోను.. నా దైర్యం నా కొడుకు తన వెంట నిజాయితీ గల భార్య దీప ఉంది అంటు తన డబ్బు తనకి ఇస్తుంది. దాంతో ఇంకా ఇక్కడెందుకు ఇంత అవమానం జరిగిన తర్వాత అని కావేరిని తీసుకొని శ్రీధర్ వెళ్ళిపోతాడు.

Brahmamudi : బ్రహ్మముడి సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. ఆ పదిలక్షలు ఎలా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -602 లో..... ప్రకాష్ ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి.. కావ్య పెత్తనం నచ్చాడం లేదనీ చెప్తుంది. దాంతో ధాన్యలక్ష్మి పైన కోప్పడతాడు ప్రకాష్. ఆ తర్వాత అపర్ణ దగ్గరికి కావ్య వచ్చి.. నేను చేస్తుంది తప్పంటారా అని అడుగుతుంది. నువ్వేం చేసినా అలోచించి చేస్తావ్ కానీ ఇంట్లో వాళ్ళకే తిండి విషయం మనలో ఇలా చేస్తన్నావంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అది ఏంటని అడగను.. చెప్పే అవసరం ఉంటే చెప్పే దానివి అని అపర్ణ అంటుంది. అవును అత్తయ్య బలమైన కారణం ఉంది చెప్పాలిసిన టైమ్ వచ్చినప్పుడు చెప్తానని కావ్య అంటుంది.