English | Telugu

తాగుబోతు రమేష్ ని కొట్టిన ఫైమా

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఫైమా తాగుబోతు రమేష్ ని ఇష్టమొచ్చినట్టు తిట్టిపారేసింది. అసలు ఒక సీనియర్ కమెడియన్ అని కూడా లేకుండా తిట్టేసింది. "మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక నా పరువంతా గంగలో కలిసిపోయింది" అనేసరికి తాగుబోతు రమేష్ వెళ్ళిపోతాడు. "ఎక్కడికి వెళ్తున్నారు" అని అడిగింది ఫైమా. " పరువు పోయిందన్నావుగా గంగలోకి వెళ్లి తీసుకొస్తా" అని చెప్పాడు. దాంతో ఫైమా తాగుబోతు రమేష్ ని పిచ్చ కొట్టుడు కొట్టింది. ఇక ఇందులో ఒక టాస్క్ ఇచ్చారు ..వేరే వాళ్ళు వచ్చి నెమలీకతో డిస్టర్బ్ చేస్తూ ఉన్నా కూడా టాస్క్ ఆడే వాళ్ళు సూదిలో దారం ఎక్కించాలి. ఐతే నాటీ నరేష్  సూదిలో దారం ఎక్కిస్తుంటే మహేశ్వరీ వచ్చి నెమలీకతో బాగా దిస్తుర్బ్ చేస్తుంది.

llu illalu pillalu : ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. ట్రాప్ చేసాడంట!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -36 లో... ధీరజ్ మళ్ళీ ఎందుకు వచ్చాడంటూ రామరాజు గొడవ పెడుతుంటే.. వద్దని వేదవతి ఆపుతుంది. వాడు తప్పు చేసాడని వద్దని అంటున్నారు. మరి చెప్పకుండా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళని ఎందుకు రానిచ్చారని వేదవతి అడుగుతుంది. రామరాజు ఆలోచలలో పడి.. సరే ఇక ముందు వాడు ఏదైనా తప్పు చేస్తే నీ సంగతి చెప్తానని రామరాజు అంటాడు. దాంతో ఇంట్లో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అత్తయ్య నేనే హెల్ప్ చేస్తే చివరికి నన్నే వెళ్ళమంటారా అని నర్మద అంటుంది. దాంతో నీకు నాకు మాటలు లేవు అంటూ వెళ్ళిపోతుంది వేదవతి.