English | Telugu

సవతి తల్లి ఆస్తుల కోసమే ఇదంతా చేస్తుందని కనిపెట్టేసిన సీతాకాంత్.. పాపం పెద్దాయన!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -285 లో....శ్రీలత సందీప్ లు కలిసి మాట్లాడుకుంటారు. రామలక్ష్మి, సీతాకాంత్ లని చంపేయడానికి రౌడీకి కాల్ చేసా ఇంకా రావడం లేదని ఇద్దరు మాట్లాడుకుంటారు. అప్పుడే ధన వచ్చి.. ఎవరిని చంపాలి అంటున్నారని అనగానే సందీప్ కవర్ చేస్తాడు. నేను చెప్పినట్టు విను అప్పుడే ఆస్తులు మనకి వస్తాయి. అటు అక్క.. ఇటు మేము అంటూ మధ్యలో ఉండకని శ్రీలత అనగానే నేను మీ వైపే అని ధన అంటాడు.

ఆ తర్వాత ధన ఒంటరిగా కూర్చొని రామలక్ష్మి తన కోసం చేసిన పనులు గుర్తుచేసుకొని.. మా అక్కకి ఇలా అన్యాయం చెయ్యడం కరెక్ట్ కాదు అనుకుంటాడు కానీ మళ్ళీ తను తిట్టిన సంఘటన గుర్తుచేసుకొని నన్ను తమ్ముడు అని కూడా చూడకుండా తిట్టిందని అలా చెయ్యడంలో తప్పు లేదని అనుకుంటాడు. ఆ తర్వాత అక్కడ ఇద్దరు ముసలివాళ్లు ప్రేమగా మాట్లాడుకోవడం చూసి సీతాకాంత్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. వాళ్ళు ఎలా ప్రేమగా ఉన్నారు చూడమంటూ వాళ్ళ గురించి రామలక్ష్మితో సీతాకాంత్ మాట్లాడతాడు. ఆ తర్వాత రౌడీకి సందీప్ ఫోన్ చేసి ఇంకడప్పుడు వస్తావ్.. సీతాకాంత్, రామలక్ష్మిని త్వరగా చంపెయ్ అని సందీప్ మాట్లాడుతుంటే.. పెద్దాయన వింటాడు. ఆ తర్వాత ఫోన్ కట్ చేసీ వెనక్కి చూడగానే పెద్దాయన కోప్పడ్తాడు. ఏదో కవర్ చేస్తుంటాడు కానీ పెద్దాయన నమ్మడు. అప్పుడే ధన వస్తాడు. మీ అక్కాబావలని చంపాలి అనుకుంటున్నావని పెద్దాయన అనగానే.. తప్పేముంది ఆస్తులు కావాలంటే తప్పదని ధన అనగానే.. పెద్దాయన షాక్ అవుతాడు.

ఆ తర్వాత పెద్దాయన తల పైన కొడుతాడు సందీప్. అది సీతాకాంత్ దూరం నుండి చూస్తాడు. అప్పుడే శ్రీలత వచ్చి ఎవరికి తెలియకుండా చేయమంటే ఇలా అందరికి తెలిసేలా చేస్తున్నావంటూ సందీప్ ని కొడుతుంది. అంటే నువ్వు వాళ్ళతో కలిసిపోయావా అని పెద్దాయన అనగానే.. మరి ఏం చెయ్యమంటారు.. నా కొడుకు నేను సంతోషంగా ఉండాలంటే ఆస్తులు కావాలి. అలా అయితే సీతా, రామలక్ష్మిలు ఉండకూడదని శ్రీలత అంటుంది. వీడి సంగతి తర్వాత చూద్దాం.. గదిలో ఉంచండి. మన పని అయ్యాక వద్దామని శ్రీలత అంటుంది. ఆ మాటలని విన్న సీతాకాంత్ మనసు ముక్కలు అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.