English | Telugu

ఓంకార్ మీద మండిపడ్డ అమర్....నీకు ఆ హక్కు లేదంటూ గట్టిగా వార్నింగ్

బుల్లితెర మీద ఇష్మార్ట్ జోడి కొత్త సీజన్ 3 దుమ్ము రేపుతోంది. ఐతే ఇప్పటి వరకు ఎలిమినేషన్స్ సరదాసరదాగా గడిచిపోయింది కానీ ఇప్పుడు మాత్రం కొంచెం గట్టిగానే ఫైట్ కాబోతోంది అన్న విషయం ప్రోమో ద్వారా తెలుస్తోంది. రీసెంట్ గా రిలీజయిన ప్రోమోలో అమర్ దీప్ బాగా ఫైర్ అవడం అలాగే యాంకర్ ఓంకార్ కూడా సీరియస్ కావడం చూడొచ్చు.. ఒక టీమ్ గ్రీన్ డ్రెస్ లు, ఇంకో టీమ్ ఎల్లో డ్రెస్ లు వేసుకొచ్చారు. ఎప్పటిలాగే జోక్స్, నవ్వులు అన్నీ మామూలుగానే జరిగాయి. రాజేష్ , సుజాత బాగా నవ్వించారు. ఇక ఇక్కడ జోడీస్ కి సంబందించిన వాళ్ళ పేరెంట్స్ కూడా షోకి వచ్చారు. ఇక వాళ్ళ ఫామిలీ మెంబర్స్ ని పిలిచి ఈ షో మీద ఉన్న ఒపీనియన్ ని అడిగాడు ఓంకార్. ఫామిలీ అంటే ఎలా ఉండాలి, ఎలా కలిసి ఉండాలి .. ఈ షో సొసైటీకి మంచి మెసేజ్ ని ఇస్తోంది. అలాగే వైఫ్ ని ఎలా ట్రీట్ చేయాలి, ఎలా రెస్పెక్ట్ చేయాలి అనేది కూడా ఈ షో ద్వారా తెలుస్తోంది.