English | Telugu
తుక్కుగూడ కరాటే రాజుగా ఆది
Updated : Mar 6, 2025
ఢీ షో ఈవారం ఆడియన్స్ ని బాగా అలరించింది. ఇక ఇందులో ఆది యాక్షన్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకున్నాడు. అంటే కరాటే డ్రెస్ అన్నమాట..మళ్ళీ ఒక బెల్ట్ కూడా పెట్టేసాడు. బ్యాక్ గ్రౌండ్ లో "లుక్ ఎట్ మై ఫేస్ " అనే పవన్ కళ్యాణ్ సాంగ్ వస్తోంది. ఇక ఆది వామప్ చేస్తూ ఉన్నాడు. నందు ఐతే తుక్కుగూడ కరాటే రాజు గారు కమాన్ అంటూ ఎంకరేజ్ చేసాడు. ఇక ఆది ఐతే స్టేజి మీద అటు ఇటు తిరిగాడు. రెండు కుర్చీల మధ్య ఇటుక పలకలు పెట్టారు. అలాగే కర్రలకు కుండలు వేలాడదీశారు.
వామప్ చేసాక ఆది అలిసిపోయేసరికి నందు గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఎవరైనా ఎక్సర్ సైజ్ చేసాక అలిసి పోతారు. నువ్వెంటి వామప్ చేసాక అలిసిపోయావ్ అన్నాడు. ఇక ఆ ఫ్రస్ట్రేషన్ భరించలేక గట్టిగా అరుస్తూ ఆ ఇటుక పలకలను చేత్తో విరగ్గొట్టాడు.దీంతో జడ్జెస్ కూడా చాల ఇంప్రెస్ అయ్యారు. ఇక కుండల్ని పగలగొట్టాల్సిన సమయం వచ్చింది. నందు ఐతే కొంచెం ముందుకువచ్చి కుండను పట్టుకుని కాలితో కొట్టాడు. అంటే గట్టిగ దెబ్బ తగిలినట్లుంది. అది ఒరిజినల్ అంటూ గట్టిగ అరిచాడు. ఎలాగో ఫైనల్ గా ఒక కుండను పగలగొట్టారు. ఇంకో కుండ ఉంది.. మీ మోచేతులతో పగలగొట్టండి అంటూ నందు సలహా ఇచ్చాడు. తర్వాత రెండో కుండను పగల గొట్టలేకపోయాడు. ఐతే ఆ కుండను తలతో పగలగొట్టాలంటూ హన్సిక మరీ గారంగా అడిగింది. ఇప్పుడు ఆ కుండను నా తలతో కొడితే తర్వాత ఆ కుండతో నా చుట్టూ తిరుగుతారు అంటూ కామెడీ చేసాడు. తర్వాత నందు మోకాళ్ళ మీద పగలగొట్టడానికి రెండు టైల్స్ ఇచ్చాడు. ఆది కూడా పగలగొట్టి ఫైనల్ గా నొప్పి భరించలేకపోయాడు. ఇక అశ్విని శ్రీ ఐతే ఈ టైల్ ప్లేట్స్ ని కాళ్ళ మీద పెట్టుకుని పగలగొట్టేసింది. ఇలా ఈ వారం ఆది కరాటే మ్యాన్ గెటప్ లో ఎంటర్టైన్ చేసాడు.