English | Telugu

దొంగలున్నారు జాగ్రత్త.. పట్టపగలే 20 లక్షలు కొట్టేశారు!

బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి రివ్యూస్ తో ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు ఇష్మార్ట్ జోడి 3 లో తన వైఫ్ కవితతో పాటు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా టాస్కులు ఆడి గట్టి పోటీ ఇస్తున్నాడు. అలాంటి ఆది.. పట్టపగలే 20 లక్షలు కొట్టేశారని, దొంగలు తిరుగుతున్నారు జాగ్రత్త అంటూ కొన్ని టిప్స్ చెప్పాడు. ఆ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసాడు. తన ఇంటి పక్కన ఉండే ఇంట్లో ఇద్దరు టీచర్స్ ఉన్నారట. వాళ్ళు వాళ్ళ పనికి వెళ్ళిపోయాక ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్నాక సైలెంట్ గా వచ్చి తలుపులు పగలగొట్టి 20 లక్షల బంగారాన్ని ఎత్తుకుపోయారని చెప్పాడు. అది కూడా పట్టపగలు అని చెప్పాడు. (Adi Reddy)

ఇంట్లో ఎవరూ లేనప్పుడే ఇంట్లో ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి అని ఆది చెప్పాడు. అలా కాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ చెప్పాడు. "మీరెప్పుడైనా ఊరు వెళ్లాల్సి వస్తే లోకల్ పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇస్తే మంచిది. అప్పుడు వాళ్ళు నిఘా పెడతారు. డోర్ కి సిసి కెమెరా ఏర్పాటు చేస్తారు. అప్పుడు ఇంటికి ఎవరైనా వస్తే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మనం వెంటనే అలెర్ట్ కావొచ్చు...ఇక ఇంకో విషయం ఏంటంటే ఇంట్లో ఖరీదైన వస్తువుల్ని పెట్టుకోవద్దు. బ్యాంకులో లాకర్ ఇస్తారు. అందులో ఎన్ని వస్తువులు కావాలంటే అన్ని దాచుకోవచ్చు అని చెప్పాడు. దానికి నెటిజన్స్ వెంటనే ఆన్సర్స్ ఇచ్చారు. "ముందు మీ ఇంటికి ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వేయించుకోండి...ఇంతకు ఆ దొంగ దొరికాడా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.