English | Telugu

Karthika Deepam2 : జ్యోత్స్న ప్లాన్ సక్సెస్.. దీప అసహ్యించుకున్న ఆ ఇంటి వాళ్ళు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -317 లో.... జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ ఆగిపోవడానికి కారణం దీప అని దీప దగ్గరికి సుమిత్ర వస్తుంది. నీకు నా కూతురు ఏం అన్యాయం చేసింది.. ఎందుకు ఇలా పగ బట్టావని దీప ని సుమిత్ర తిడుతుంది‌. వాడు నిజంగానే మంచివాడు కాదు అమ్మ అని దీప అంటుంటే.. అందుకు సాక్ష్యం ఏమైనా ఉందా అని సుమిత్ర అడుగుతుంది. దీప సైలెంట్ గా ఉండడంతో సాక్ష్యం లేదు కదా అన్ని ఇలాంటి పనులే చేస్తావ్.. అందరిని బాధపెడుతావని సుమిత్ర తిడుతుంది.

నిన్ను నా కూతురు కన్నా ఎక్కవగా నమ్మాను.. నా గుండెల మీద తన్నావ్ అని సుమిత్ర కఠినంగా మాట్లాడుతుంది. అప్పుడే దశరథ్ ఎంట్రీ ఇస్తాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావ్ అని సుమిత్రని అడుగుతాడు. నా కూతురు నీకు ఏం అన్యాయం చేసిందని అడగడానికి వచ్చానని సుమిత్ర అంటుంది. నువ్వు ఇలా అడిగినంత మాత్రాన ఆగిపోయిన ఎంగేజ్ మెంట్ జరగదు కదా.. పదా వెళదామని సుమిత్రని తీసుకొని వెళ్తు.. నీ కోడలిని బాధపెట్టి ఉంటే క్షమించు అని కాంచనతో దశరత్ అనగానే.. కాంచన బాధపడుతుంది. మరొకవైపు జ్యోత్స్నకి జ్యూస్ తీసుకొని వస్తుంది పారిజాతం. గౌతమ్ గురించి ఆ దీప చెప్పింది నిజమేనా అని అడుగుతుంటే నన్ను ఇర్రిటేట్ చెయ్యకని పారిజాతాన్ని పంపిస్తుంది. నిజమేనా ఏంటి గ్రానీ.. నిజమే ఇదంతా నా ప్లాన్.. ఆ రోజు గౌతమ్ తో మాట్లాడడానికి వెళ్ళినప్పుడే వాడి గురించి తెలిసింది. అక్కడ పనిమనిషితో మాట్లాడ్డం దాన్ని దీప అడ్డుకోవడం అంతా చూసాను.. అంతా తెలిసి ఇక్కడ వరకు తీసుకొని వచ్చాను కావాలనే క్యాటరింగ్ దీప వాళ్ళకి ఇచ్చాను.. వాళ్ళు ఎంగేజ్ మెంట్ కి వచ్చేలా చేసాను అత్తని పిలవడానికి తాతను పంపాను.

ఇదంతా ఎందుకంటే నాపై ఎవరికి డౌట్ రాదు.. ఇదంతా దీప కావాలని చేసిందని అందరు తనని ఛీ కొడుతారు. సో నేను అనుకున్నట్లే అయింది.. ఇదంతా నా బావ కోసం అని జ్యోత్స్న నవ్వుకుంటూ రాక్షసనందం పొందుతుంది. మరొకవైపు దీప బాధపడుతుంటే శౌర్య వచ్చి.. ఏమైంది అంటుంది.‌ శౌర్యని లోపలికి తీసుకొని వెళ్తుంది అనసూయ. నువ్వు అందరిలో గౌతమ్ ని కొట్టి ఉండాల్సింది కాదని కాంచన అంటుంది. జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ ఆపితే నాకేం వస్తుందని దీప బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.