English | Telugu
Jayam serial: బెడిసికొట్టిన పారు ప్లాన్.. గంగకి కాంప్లిమెంట్!
Updated : Jan 9, 2026
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -163 లో... రుద్ర గదిలో ఉండగా శకుంతల తాళం వేస్తుంది. పెద్దమ్మ చేస్తుంది తప్పని చెప్పు పెద్ద నాన్న అని వంశీ, సూర్య పెద్దసారుతో అంటారు. నేను చెప్పను ఎందుకంటే ఎవరు నేను చెప్పింది వినట్లేదని పెద్దసారు కోప్పడతాడు. ఆ తర్వాత పెద్దసారు వెనకాల డోర్ నుండి పైకి తాడు విసురుతుంటే వంశీ, సూర్య వస్తారు. పెద్దసారు హెల్ప్ చేస్తారు. దాంతో రుద్ర తాడు సాయంతో కిందకి దిగి గంగ దగ్గరికి వెళ్తాడు.
మరొకవైపు పారు ప్లాన్ లో భాగంగా గంగతో మంచిగా ఉన్నట్లు యాక్టింగ్ చేస్తూ డ్యాన్స్ చేస్తుంది పారు. ఇక పారు సైగ చెయ్యగానే తన ఫ్రెండ్ బేరర్ దగ్గరికి వెళ్లి ఇది జ్యూస్ లో కలపండి కానీ ఒక అమ్మాయికి ఇవ్వండి అని గంగని చూపిస్తుంది. అ తర్వాత బేరర్ తీసుకొని వెళ్లి జ్యూస్ ఇవ్వగానే గంగ అది తాగి మత్తుగా డ్యాన్స్ చేస్తుంది. దాంతో అది పారు వీడియో తీసి వీరుకి పంపిస్తుంది. పారు ఇంకా అక్కడ ఇంచార్జ్ కి పంపి అది మేడమ్ కి చూపించి మేడమ్ ని తీసుకొని రా.. వాళ్లు వచ్చి గంగని సస్పెండ్ చేస్తారని పారు చెప్పగానే అతను సరే అంటాడు.
వీరు అకాడమీ మేడమ్ కి ఫోన్ చేసి మీ అకాడమీ పక్కన వాళ్ళు సాండ్స్ వస్తున్నాయ్.. డిస్టబెన్స్ అని కంప్లైంట్ ఇచ్చారని ఫోన్ చేసి మాట్లాడుతాడు. దాంతో మేడమ్ వెంటనే గంగ వాళ్ల రూమ్ వైపు వస్తుంది. మేడమ్ వచ్చేసరికి గదిలో పారు ఫ్రెండ్స్ మత్తుగా డ్యాన్స్ చేస్తుంటారు. గంగ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. దాంతో పారు ఫ్రెండ్స్ పై మేడమ్ కోప్పడుతుంది. గంగ వాళ్లు చేసే ప్రాక్టీస్ అండ్ డెడికేషన్ చూసి మెచ్చుకుంటుంది.
మరొకవైపు శకుంతలకి గంగ వీడియో చూపిస్తాడు వీరు. అకాడమీకి గంగని పంపిస్తే ఇలా చేస్తుందని శకుంతల కోప్పడుతుంది. అప్పుడే రుద్ర వస్తాడు. అదంతా అబద్ధమని పారు చేసిన కుట్ర గురించి మొత్తం చెప్తాడు. అక్కడ బేరర్ గా మత్తు తీసుకుంది రుద్రనే.. ఇక పారు ప్లాన్ ని ముందే గంగకి చెప్తాడు రుద్ర . దాంతో పారుని నమ్మించడానికి గంగ మత్తులో ఉన్నట్లు యాక్టింగ్ చేసిందని శకుంతలతో రుద్ర చెప్తాడు. అయినా నేను వద్దన్నా ఎలా వెళ్ళావ్.. ఎవరు తాళం తీశారని శకుంతల అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.