English | Telugu

Podarillu: మహా, చక్రిలని ఫాలో చేస్తున్న ప్రతాప్ రౌడీలు.. భూషణ్ పట్టుకుంటాడా?

స్టార్ట్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -24 లో... మహా లెటర్ రాసి పెట్టి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. అది చదివిన మహా వాళ్ళ నాన్న ప్రతాప్ తీవ్ర మనోవేదనకి గురి అవుతాడు.

ఇక అప్పుడే ఆది వచ్చి.. నాన్న మన కార్లు అన్నీ ఉన్నాయి.. మన డ్రైవర్ చక్రి కనపడటం లేదు.. వాడి ఫోన్ కూడా కలవడం లేదని చెప్తాడు. దాంతో అందరు టెన్షన్ పడతారు. అప్పుడే భూషణ్ వస్తాడు. ఏం జరిగింది మహా ఎక్కడ అని అడుగుతాడు. ఇక భూషణ్ పెద్దపెద్దగా అరుస్తాడు. అప్పుడే మహా వాళ్ళ అమ్మ చేతిలోని లెటర్ చూసి ఇవ్వమని అడుగుతాడు. అది తీసుకొని చదివిన భూషణ్ షాక్ అవుతాడు.

ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నారని ప్రతాప్ ని భూషణ్ అడుగుతాడు. వాళ్ళు ఎంతో దూరం వెళ్ళరు.. మనం వెతుకుదామని ఆదితో ప్రతాప్ అనగానే.. నేనేం చేయాలి.. మీతో పాటే వస్తానని భూషణ్ అంటాడు. ఇక ప్రతాప్, భూషణ్, ఆది కలిసి మహాని వెతకడానికి బయల్దేరి వెళ్తారు.

కారులో వెళ్తుంటే మహా ఆ డ్రైవర్ చక్రిగాడితో లేచిపోయిందని భూషణ్ అంటాడు. జాగ్రత్తగా మాట్లాడండి.. నోరు అదుపులో పెట్టుకోమని భూషణ్ తో ప్రతాప్, ఆది అంటారు. మహాని తీసుకొస్తా అని ప్రతాప్ అంటాడు. ఇంటి ముందున్న సీసీటీవి ఫూటేజ్ చూడగా అందులో చక్రితో కలిసి బ్యాగ్ తీసుకెళ్ళినట్టుగా ఉంటుంది. ఇక అది చూసిన ప్రతాప్, ఆదితో పాటు భూషణ్ షాక్ అవుతాడు.

ఇక తమ షాప్ ల ముందున్న సెక్యూరిటీకి కాల్ చేస్తాడు ప్రతాప్.. మా అమ్మాయి ఏదైనా కారులో వెళ్తే నాకు చెప్పు అని సెక్యూరిటీతో ప్రతాప్ చెప్పగానే అతను సరేనంటాడు. మరోవైపు కారులో ఉన్న భూషణ్ నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. దాంతో ప్రతాప్ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. తర్వాత రౌడీలని కాల్ చేస్తాడు ప్రతాప్.

ఇక కాసేపటికి చక్రి, మహాల కార్ కి అడ్డంగా ప్రతాప్ పంపిన రౌడీలు వస్తారు. వారిని తప్పించుకొని చక్రి కార్ ని పక్కకి నడుపుతాడు. ఇక చక్రి, మహా కార్ లో ఫాస్ట్ గా వెళ్తుంటే వెనకాల రౌడీలు ఫాలో చేస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.