English | Telugu

Brahmamudi: రాజ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు.. డెలివరీకి కావ్య ఒప్పుకుంటుందా?

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-925 లో.. తన కడుపులో బిడ్డపై రుద్రాణి చేసిన కుట్ర గురించి తల్చుకొని కావ్య బాధపడుతుంది. అప్పుడే రాజ్ వచ్చి.. ఇప్పుడు అది ఎందుకు ఆలోచిస్తున్నావు మర్చిపోమని దైర్యం చెప్తాడు. మీరు డెలివరి టైమ్ లో నా పక్కన ఉంటానని మాటివ్వండి అని కావ్య అనగానే రాజ్ మాటిస్తాడు.

మరొకవైపు ఉదయం అందరు హాల్లో దిగులుగా కూర్చొని ఉంటారు. ధాన్యలక్ష్మి కాఫీ తీసుకొని వచ్చి ఇస్తే వద్దు తాగాలని లేదని ఇద్దరు అంటారు. అమ్మమ్మా మా అమ్మ చేసిన తప్పుకు ఇంకా కోపం పోలేదంటే తన పిల్లలం ఇక్కడే ఉన్నాం కొట్టండి తిట్టండి పడతామని రాహుల్ అంటాడు. ఆ తర్వాత ప్రకాష్ వచ్చి ఏంటి ప్రొద్దున నుండి రుద్రాణి కన్పించడం లేదని అడుగుతాడు. బాబాయ్ ఇలా జరిగింది మర్చిపోవడం నీకు అదృష్టం అని ప్రకాష్ తో రాజ్ అంటాడు.

ఆ తర్వాత ఇంటికి పోలీసులు వస్తారు. మీరు దొంగ బంగారం సప్లై చేస్తున్నారని తెలిసి సాండి అనే అతను మీ ఆఫీస్ కి వచ్చి డీలింగ్ పెట్టుకున్నాడని తెలిసిందని ఇన్‌స్పెక్టర్ అంటాడు. వాడు ఆఫీస్ కి వచ్చి ఆఫర్ ఇచ్చింది నిజమే కానీ దానికి నేను ఒప్పుకోలేదని రాజ్ అంటాడు. దాంతో సాండిని పిలిపిస్తారు. రాజ్ తనతో ఒప్పందం కుదుర్చుకున్నాడని సాండి చెప్పగానే అబద్ధం అని రాజ్ అంటాడు. మీ ఇంట్లో దొంగ బంగారం ఉన్నట్లు సమాచారం అని ఇన్‌స్పెక్టర్ అంటాడు. పోలీసులు ఇంట్లో సెర్చ్ చేస్తారు. కానీ ఇంట్లో ఏం ఉండదు.

అయితే రాజ్ కార్ లో సూట్ కేసు దొరుకుతుంది. ఆ సూట్ కేసుని రాత్రి రాజ్ కార్ లో పెడతాడు రాహుల్. సాండికి ఫోన్ చేసి పోలీసులకి దొరికిపోమని చెప్తాడు. ఇక రాజ్ కార్ లో సూట్ కేసు చూసి.. ఇప్పుడు ఏమంటారని రాజ్ తో ఇన్‌స్పెక్టర్ అంటాడు. అదెలా వచ్చిందో నాకు తెలియదని రాజ్ చెప్తాడు. దాంతో రాజ్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. కావ్య బాధపడుతుంది.

తరువాయి భాగంలో కావ్యకి నొప్పులు రావడంతో హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. మా ఆయన వస్తేనే నేను ఆపరేషన్ చేయించుకుంటానని కావ్య అంటుంది. రాజ్ కి బెయిల్ రావడానికి రెండు రోజులు పడుతుందన్నారని ఇంట్లో వాళ్ళు అంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.