English | Telugu

Karthika Deepam2 : సుమిత్రకి నిజం చెప్పేసిన జ్యోత్స్న.. తనపై కోప్పడ్డ శివన్నారాయణ!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -563 లో..... సుమిత్ర గురించి దీప బాధపడుతుంటే కార్తీక్ వచ్చి దైర్యం చెప్తాడు. నేను అమ్మకి నిజం చెప్తాను.. జ్యోత్స్న కన్నకూతురు కాదని అని దీప అనగానే వద్దు ఇప్పుడు అత్తయ్య పరిస్థితి చూసావా ఈ టైమ్ లో వద్దని కార్తీక్ అంటాడు. మరొకవైపు జ్యోత్స్న, పారిజాతం మాట్లాడుకుంటారు. అసలు కార్తీక్ కి.. నువ్వు అసలైన వారసురాలివి కాదని తెలిసి ఉంటుందని పారిజాతం అనగానే జ్యోత్స్న భయపడుతుంది.

నీకెలా తెలుసని జ్యోత్స్న అనగానే రోజు సాయంత్రం టైమ్ కి వెళ్ళేటోడు.. అలాంటిది నీపై దృష్టి పెట్టి ఇంటికి కాపలా ఉన్నాడని పారిజాతం అంటుంది. అసలు బావ ప్లాన్ ఏంటి అని జ్యోత్స్న అనుకుంటుంది. మరుసటిరోజు దీప, కార్తీక్ శివన్నారాయణ ఇంటికి బయల్దేరతారు. అత్త ముందు జాగ్రత్తగా ఉండమని దీపకి కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. మీరేంటి ఇక్కడ అని కార్తీక్ అనగానే నేనే రమ్మన్నాను.‌. వదినని చూడడానికి వెళ్తానని కాంచన అంటుంది. పెద్ద ప్లానే.. మీరు దీపని కార్ లో తీసుకొని వెళ్ళండి‌. నేను మిమ్మల్ని ఫాలో అవుతానని కార్తీక్ అంటాడు.

అ తర్వాత మమ్మీకి నిజం చెప్పాలని అనుకుంటున్నా గ్రానీ.. తనకి బ్లడ్ కాన్సర్ అని చెప్పేస్తా.. భయంతో మమ్మీ ఉండదు. మనం సేఫ్ అని జ్యోత్స్న అనగానే పారిజాతం తన చెంపచెల్లుమనిపిస్తుంది. అలా చేయడం తప్పు అని పారిజాతం అంటుంది. అయిన పారిజాతాన్ని జ్యోత్స్న కన్విన్స్ చేస్తుంది. జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు సుమిత్ర దగ్గరికి వెళ్తారు. సుమిత్రకి జ్యోత్స్న టాబ్లెట్ ఇచ్చి తనతో మాట్లాడుతుంది‌. మమ్మీ నీకు బ్లడ్ కాన్సర్.. ఆ విషయం ఇంట్లో వాళ్ళు చెప్పలేకపోతున్నారని అంటుంది. కానీ సుమిత్ర అదేం వినకుండా పడుకుంటుంది. ఛీ ఇప్పటివరకు చెప్పింది అంతా వట్టిదేనా అని జ్యోత్స్న అనుకుంటుంది. అదంతా శివన్నారాయణ, దీప కార్తీక్, కాంచన వింటారు. కాసేపటికి జ్యోత్స్నపై అందరు కోప్పడుతారు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.