English | Telugu

సార్ చిత్రానికి సెన్సార్ అభ్యంతరాలు!

విభిన్న చిత్రాల నటుడు, విల‌క్ష‌ణ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటిస్తున్న తొలి తెలుగు చిత్రం సార్. ఈ చిత్రానికి తెలుగులో తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే వంటి చిత్రాలను తీసిన వెంకీ అట్లూరి దర్శకత్వం వ‌హిస్తుండ‌గా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్విభాషా చిత్రంగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 17న విడుదల చేయనున్నారు. మొదటి మూడు చిత్రాలను ప్రేమకథాచిత్రాలుగా ఎంచుకున్న వెంకీ అట్లూరి ఈ సినిమాలో మాత్రం ఓ సామాజిక అంశాన్ని తన భుజాల పైకి తీసుకున్నారు. సోషల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఈ సినిమా తమిళ్లో వాతిగా విడుదల కానుంది. కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టంపై ఈ సినిమా సెటైరికల్ గా ఉండనుందని సమాచారం. ఇప్పటికే విడుద‌లైన పాట‌లు బాగా ఆకట్టుకున్నాయి. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో ఒక జూనియర్ కాలేజీ లెక్చరర్ పాత్రలో ధనుష్ కనిపించనున్నారు.

ఇలాంటి పాత్రలో ధనుష్ కనిపించడం ఇదే మొదటిసారి అని చెప్పాలి. మాస్ క్యారెక్టర్స్ లో ఎక్కువ కనిపించిన ధనుష్ మొదటిసారి ఒక లెక్చ‌ర‌ర్ గా ఈ మూవీలో సందడి చేయనున్నారు. ఈ సినిమా సెన్సార్ కి వెళ్ళింది. సినిమాలో కొన్ని కాంట్రవర్సీ క్రియేట్ చేసే సన్నివేశాలకు సెన్సార్ బోర్డ్ అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది. వాటిని స‌రిచేయమని సూచించారు. ఇక ఈ సినిమా రన్ టైం 2:03 (రెండు గంట‌ల మూడు సెకన్లు) . సామాజిక అంశాలను ప్ర‌స్తావిస్తూ విద్యార్థుల భవిష్యత్తు కార్పొరేట్ విద్యా వ్యవస్థ కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడుతోంది? కార్పొరేట్ విద్యా విధానం తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? అనే విషయాలను ఇందులో ప్రస్తావించినట్టు సమాచారం. కార్పొరేట్ కాలేజీలలో పిల్లల్ని చదివించాలని అనుకునే తల్లిదండ్రులకు సామాజిక సందేశం ఇచ్చే విధంగా ఈ కాన్సెప్ట్ ఉండబోతుందని తెలుస్తోంది. తొలిసారిగా తెలుగులో నటిస్తున్న ధ‌నుష్ న‌టిస్తున్న ఈ చిత్రం ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో చూడాలి.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.