English | Telugu

అయ్యో సుదీర్ బాబు అప్పుడే ఓటీటీకి!

ఒకవైపు ఘ‌ట్టమనేని ఫ్యామిలీకి కాంపౌండ్ హీరో. మహేష్ బాబుకు బామ్మర్ది. మంచి ఫిజిక్ ఉంది. హీరోకి కావలసిన లక్షణాలని ఉన్నాయి. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శ‌ని అన్న‌ట్లుగా తయారైంది హీరో సుధీర్ బాబు ప‌రిస్థితి. సుధీర్ బాబుకు కథల ఎంపిక సరిగా చేతకావడం లేదు. ఆయన తాజాగా హంట్ చిత్రంలో నటించారు. ఇది అప్పుడెప్పుడో 10 ఏళ్ల క్రితం వచ్చిన ఓ మలయాళ చిత్రానికి ఫ్రీ మేక్. ఈ సినిమా గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదలైంది. ఇలా విడుదలైన రెండు వారాలకే ఓటీటీలో రాబోతోంది.

ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 10 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ ఏర్పాటు జరుగుతున్నాయి. ఇందులో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు. మొత్తం మీద సినిమా విడుదలైన 16 రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుండడం విశేషం. స్వలింగ సంపర్కుడి పాత్రలో కనిపించి సుధీర్ బాబు అందరికీ షాక్ ఇచ్చారు. ఆయన అలాంటి రోల్ చేయడం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. మొత్తానికి మలయాళం నుండి కాపీ కొట్టిన ముంబై పోలీస్ సినిమా ఆధారంగా రూపొందిన హంట్ చిత్రం అందరికీ పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పాలి.

సినిమా పర్వాలేదని టాక్ వచ్చినప్పటికీ రీమేక్ అనే ముద్రపడ‌టంతో సినిమాను ఓటిటిలో రిలీజ్ రిలీజ్ చేయ‌డానికి రెడీ అయిపోయారు. సినిమాలో స‌రైన కంటెంట్, కొత్త‌ద‌నం లేని పాత చిత్రాల‌కు, రీమేక్ ల‌కు కాలం చెల్లింద‌ని, అలా ఎవ‌రైనా ప్ర‌య‌త్నిస్తే హంట్ చిత్రం వంటి ఫ‌లితాలే రిపీట్ అవుతాయ‌ని ఈ చిత్రం మ‌రోసారి నిరూపించింది. స్టార్ హీరోల ప‌రిస్థితి వేరు. వారు రీమేక్ లు చేసినా, ఫ్రీమేక్ లు చేసినా ఓపెనింగ్స్ విష‌యంలో ఎలాంటి ఢోకా ఉండ‌దు. కాస్త ఆయా అభిమానుల‌కు కావాల్సిన అంశాల‌ను వండి వారిస్తే ఎలాగోలా నెట్టుకొస్తాయి. కానీ చిన్న హీరోల ప‌రిస్థితికి ఇది భిన్నం. కంటెంట్ను బ‌లంగా ఉండేలా, నేటి జ‌న‌రేష‌న్ కి తగ్గ‌ట్లుగా చూసుకోవాల్సి వుంటుంది. ఈవిష‌యాల‌లో తేడా వ‌స్తే మ‌రో హంట్ అవుతాయి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .