English | Telugu

తరుణ్ భాస్కర్ ఈసారి హిట్టు కొట్టేలా ఉన్నారు!

అప్పటివరకు పెద్దగా ఎవరూ పట్టించుకోని విజయ్ దేవరకొండ తో పెళ్లి చూపులు చిత్రం తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. ఈ చిత్రానికి జాతీయ పురస్కారం అందుకున్నారు. ఆ తరువాత ఈ నగరానికి ఏమైంది అనే విభిన్న చిత్రం తీశారు. ఆ వెంటనే వెంకటేష్ తో సినిమా ఉంటుందని ప్రకటన వచ్చింది. కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. కొంత విరామం తర్వాత తరుణ్ భాస్కర్ విభిన్న ప్రయత్నం చేస్తున్నారు. ఈ తాజా ఎంటర్టైనర్ పేరు కీడా కోలా. రాజమౌళి ఈగతో సినిమా సంచలనం సృష్టిస్తే తరుణ్ భాస్కర్ కీడా కోలా అంటే బొద్దింకతో సినిమా చేస్తున్నారు. ఇదొక క్రైమ్ కామెడీ థ్రిల్లర్. అందరూ కొత్తవారు నటిస్తున్నారు.

మొత్తం మీద ఎనిమిది మంది నటీనటులు కీలక పాత్రలో కనిపించనున్నారు. అందరూ కొత్తవారే. స్టార్లతో సినిమా అంటే టెన్షన్ తో కూడుకున్న పని. అందుకే టెన్షన్ లేకుండా క్రైమ్ కామెడీ నేపథ్యంలో ఈ మూవీని తీస్తున్నానని తరుణ్ భాస్కర్ చెప్పుకొచ్చారు. ఇందులో బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నారు. నెవ‌ర్ బిఫోర్ అవ‌తార్ లో ఆయ‌న కనిపించబోతున్నారని తరుణ్ భాస్కర్ తెలిపారు. ప్రతి ఇంట్లో ఉండే తాత పాత్రలో ఆయన కనిపిస్తారు. పేరు వరదరాజు. వీల్ చైర్ లో బంది అయిన వ్యక్తి. దానికి యూరిన్ బ్యాగ్. గమ్మత్తయిన కథతో ఈ మూవీ షూటింగ్ రాకెట్ స్పీడ్ తో జరుగుతుంది. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లు అంటూ ఎవరూ లేరు. కామెడీ కింగ్ బ్రహ్మానందమే అన్నీ తానై కీలకపాత్రలో కనిపించనున్నారు. తాజాగా బ్రహ్మానందం పోస్టర్ కూడా విడుదల అయింది. మీ ప్రపంచం వింతగా మారబోతోంది.... అనే ట్యాగ్ ని జ‌త చేశారు. మొత్తానికి తరుణ్ భాస్కర్ మరోసారి కొత్త వారితో సంచలనం సృష్టించేలా ఉన్నారు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.