English | Telugu

ఆశా షైనీ ప్రైవేట్ భాగాలపై కొట్టిన నిర్మాత ఎవరో?

ఆశా షైనీ అలియాస్ ఫ్లోరా సైని ఒక భారతీయ సినీ నటి, మోడల్. తెలుగు సినిమాలలో ఎక్కువ‌గా నటించింది. ఈమె తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది. 1999లో ప్రేమ కోసం అనే సినిమాతో కెరీర్‌ను ప్రారంభించింది.సూప‌ర్ స్టార్ల‌యిన రజనీకాంత్, విజయ్ కాంత్, బాలకృష్ణ, వెంకటేష్, ప్రభు, కార్తీక్, జగపతిబాబు, రాజశేఖర్ వంటి హీరోల సరసన సుమారు 70 కి పైగా సినిమాల్లో నటించింది. ఈమె సహాయ పాత్ర పోషించిన నరసింహ నాయుడు చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అందులోని ‘ల‌క్స్ పాపా ల‌క్స్ పాపా లంచ్ కొస్తావా..’ లడ్డు తినిపిస్తావా అనే పాట ఓ రేంజ్ లో పాపులర్ అయింది.

మార్చి 2008లో ఆమెను చెన్నైలో నకిలీ వీసా కలిగి ఉన్నదని నేరం మీద అరెస్టు చేశారు. దాంతో ఆమెను తమిళ చిత్ర పరిశ్రమ బహిష్కరించింది. కానీ ఆమె నిర్దోషినని నిరూపించుకుంది. దాంతో రెండు వారాల తర్వాత నిషేదాన్ని ఎత్తివేశారు. మనసున్న మహారాజు, సర్దుకుపోదాం రండి, నరసింహనాయుడు, ప్రేమతో రా, నువ్వు నాకు నచ్చావు, అక్క బావెక్క‌డ వంటి చిత్రాల‌లో నటించింది. ఆశ సైని 20 ఏళ్ల కిందట తన కెరీర్ ప్రారంభించిన తర్వాత కొంతకాలం తెరపై కనిపించకుండా పోయింది. దానికి కారణం నిర్మాతతో బెడిసి కొట్టిన ఎఫైర్.

2018లో ప్రముఖ నిర్మాతతో తనకు రిలేషన్షిప్ ఉందని వెల్లడించింది. అప్పట్లో ఆ వార్తలు హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా మరోసారి ఆమె గతాన్ని గుర్తు చేసుకుంది. తన ఇంస్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేసింది. ఆ నిర్మాతతో నేను నాలుగు నెలలు రిలేషన్ లో ఉన్నాను. శారీరక వేధింపులకు గురయ్యాను. అతడు ప్రముఖ నిర్మాత. కానీ వెంటనే పరిస్థితులు మారాయి. అతను నన్ను దుర్భాషలాడేవాడు. నా ముఖాన్ని పట్టుకొని నా ప్రైవేట్ భాగాలపై కొట్టేవాడు. అతను నా ఫోన్ తీసుకొని నన్ను పని మానేయమని బలవంతం చేసేవాడు. 14 నెలల పాటు అతను నన్ను ఎవరితో మాట్లాడనివ్వలేదు. ఒక సాయంత్రం నన్ను నా కడుపుపై కొట్టాడు. నేను అక్కడి నుండి నిస్స‌హాయంగా పారిపోయాను అని తన ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రస్తుతం నేను సంతోషంగా ఉన్నాను. ఆ నిర్మాత వల్ల నేను పొందిన శారీరక మానసిక బాధ నుంచి బయటపడటానికి నెలలు పట్టింది. నెమ్మదిగా నేను తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. పరిస్థితులు చక్కబడడానికి సమయం పట్టినప్పటికీ ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు నేను ప్రేమలో పడ్డాను. ఎంతటి చీకటిలోనైనా నేను వెలుతురును వెతుక్కుంటాను అని తెలిపింది ఆశా సైని. అంతేకాకుండా కొత్త బంధంలోకి అడుగుపెట్టబోతున్నానని ఇందుకు అందరి ఆశీస్సులు త‌న‌కు కావాలని ఆశాసైని కోరింది.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.