English | Telugu

ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ర్సెస్ వ‌రుణ్‌ ధావ‌న్‌.. ఎవ‌రు గెలుస్తారు?

సౌత్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, నార్త్ లో వ‌రుణ్‌ ధావ‌న్ ఇప్పుడు ఓ విష‌యంలో పోటీప‌డ‌బోతున్నారు. ఇప్పుడు ఇద్ద‌రూ త‌మ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు. త్వ‌ర‌లోనే నెక్స్ట్ సినిమాల మీద ఫోక‌స్ పెంచుతారు. అక్క‌డే వీరిద్ద‌రి మ‌ధ్య ఓ కామ‌న్ పాయింట్ క‌నిపిస్తోంది. ఇందులో గెలుపు ఎవ‌రికి? అనే విష‌యం మీద అమాంతం ఇంట్ర‌స్ట్ పెరిగిపోతోంది.

విజ‌య్ హీరోగా త‌మిళ్‌లో అట్లీ డైరక్ట్ చేసిన సినిమా తేరి. స‌మంత‌, అమీజాక్స‌న్ హీరోయిన్‌లుగా న‌టించారు. ఈ సినిమాకు అప్ప‌ట్లో త‌మిళ్‌లో సూప‌ర్‌డూప‌ర్ క్రేజ్ వ‌చ్చింది. ఇప్పుడు ఈ సినిమానే తెలుగులో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో తెర‌కెక్కించ‌బోతున్నారు హ‌రీష్ శంక‌ర్‌. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ న‌టించే ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ క‌థ ఇదేన‌ని రీసెంట్‌గా స్క్రీన్‌ప్లే రైట‌ర్ ద‌శ‌ర‌థ్ ఓపెన్ అయ్యారు. అయితే ఇప్ప‌టికీ ఈ సినిమా తేరికి రీమేకేన‌నే విష‌యాన్ని మాత్రం హ‌రీష్ శంక‌ర్ క‌న్‌ఫ‌ర్మ్ చేయ‌లేదు.

మ‌రోవైపు బాలీవుడ్లో జ‌వాన్ చేస్తున్నారు అట్లీ. షారుఖ్‌, న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమా స‌మ్మర్‌కి రిలీజ్ అవుతుంది. ఈ సినిమా త‌ర్వాత త‌న తేరి కాన్సెప్ట్ మీద మ‌ళ్లీ ఫోక‌స్ చేయ‌బోతున్నారు అట్లీ. తేరిని హిందీలో వ‌రుణ్‌ధావ‌న్‌తో తెర‌కెక్కించ‌నున్నారు. చాలా రోజుల నుంచి వ‌రుణ్‌ధావ‌న్‌తో స్టోరీ డిస్క‌ష‌న్‌లో ఉన్నారు అట్లీ.

చాలా క‌థ‌లు విన్న వ‌రుణ్‌ధావ‌న్ తేరి స్క్రిప్ట్ ని ఇంకోసారి పాలిష్ చేయ‌మ‌ని, అందులో న‌టిస్తాన‌ని హింట్ ఇచ్చార‌ట‌. సెప్టెంబ‌ర్ నుంచి ఈప్రాజెక్ట్ సెట్స్ మీద‌కు వెళ్తుంది. వ‌రుణ్ ఇంకా పేప‌ర్స్ మీద సైన్ చేయ‌లేద‌ని, జ‌స్ట్ వెర్బ‌ల్ ప్రామిస్ చేశార‌ని టాక్‌.

ఏదైనా, ఇప్పుడు ఈ స‌బ్జెక్ట్ ని ఫ్రెష్‌గా తెర‌కెక్కిస్తున్న హ‌రీష్‌కి, హిందీలో రీరైట్ చేస్తున్న అట్లీకి మ‌ధ్య కూడా గ‌ట్టి పోటీ ఉంటుంద‌న్న‌ది కాద‌న‌లేని పాయింట్‌.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.