English | Telugu

ప్ర‌భాస్‌కి ఆ స్టామినా ఉందంటున్న బ్యూటీ

ఇప్పుడు ఎక్క‌డ విన్నా రామనామ‌మే. ప్ర‌భాస్ ఆదిపురుష్ సినిమా వార్త‌లే. ఆదిపురుష్ గురించి లేటెస్ట్ గా న‌టి సోనాల్ చౌహాన్ కూడా త‌న అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. ఓమ్‌ర‌వుత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ఆదిపురుష్‌. జూన్ 16న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కింది ఈ చిత్రం. తొలిసారి ప్ర‌భాస్ పౌరాణిక పాత్ర‌లో న‌టించారు. ఆయ‌న కెరీర్‌లో ఫ‌స్ట్ త్రీడీ సినిమా కూడా ఇదే. ఈ చిత్రం గురించి సోనాల్ మాట్లాడుతూ ``ప్ర‌భాస్ న‌టించిన ఆదిపురుష్ చూశాక బాలీవుడ్ దృష్టి మారిపోతుంది. ఆదిపురుష్‌కి ముందు, ఆదిపురుష్ త‌ర్వాత అని మాట్లాడుకుంటారు జ‌నాలు. ఓం ర‌వుత్ అంత అద్భుతంగా ఈ సినిమాను తెర‌కెక్కించారు`` అని అన్నారు. ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ ఓ రోల్ చేస్తున్నార‌నే వార్త‌లు వ‌చ్చాయి. టీమ్ ఆమెను అప్రోచ్ అయిన‌ప్పుడు అస‌లు క‌థ‌నుగానీ, త‌న పాత్ర గురించిగానీ అడ‌గ‌లేద‌ట సోనాల్‌. ఇన్‌స్టంట్‌గా ఒప్పుకున్నార‌ట‌.

ఈ సినిమా కోసం లీడింగ్ లేడీగా జాక్వ‌లిన్ పేరు కూడా వినిపించింది. అయితే సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ మ‌నీ లాండ‌రింగ్ కేసులో ఆమె ఉన్నార‌ని తెలిసి డ్రాప్ అయ్యారు మేక‌ర్స్. ఆదిపురుష్‌లో ప్ర‌భాస్‌, కృతిస‌న‌న్‌, సైఫ్ అలీఖాన్‌, దేవ్‌ద‌త్త నాగె, స‌న్నీ సింగ్‌, వ‌త్స‌ల్ సేథ్ కీ రోల్స్ చేశారు. త‌మిళ్‌, తెలుగు, మ‌ల‌యాళం, హిందీలో విడుద‌ల కానుంది. సోనాల్ చౌహాన్ పేరుగానీ, ఆమె న‌టించిన పాత్ర గురించి కానీ, అఫిషియ‌ల్‌గా రివీల్ చేయ‌లేదు ఆదిపురుష్ మేక‌ర్స్. దీంతో ఆమె ఈ సినిమాలో ఉన్నారా లేదా అనే అనుమానాలు వ్యక్త‌మ‌వుతున్నాయి. తెలుగులో చివ‌రిగా నాగార్జున స‌ర‌స‌న ఘోస్ట్ లో న‌టించారు సోనాల్‌. 2008లో రొమాంటిక్ డ్రామా జ‌న్న‌త్‌తో లీడింగ్ లేడీగా సినీ ఎంట్రీ ఇచ్చారు ఈ బ్యూటీ. ప్ర‌స్తుతం స‌ల్మాన్‌ఖాన్ టైగ‌ర్‌3లో న‌టిస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ మేక‌ర్స్ కూడా సోనాల్ ప్రెజెన్స్ గురించి అఫిషియ‌ల్‌గా ప్ర‌క‌టించ‌లేదు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.