English | Telugu

శ్రీరాముని పట్ల భక్తి.. 'ఆదిపురుష్' టికెట్లు ఉచితంగా ఇస్తానని నిర్మాత ప్రకటన!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు, రామ భక్తుల దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం 'ఆదిపురుష్'. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న వేళ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అధినేత అభిషేక్ అగర్వాల్ తీసుకున్న నిర్ణయం ఆసక్తిని కలిగిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు పది వేల టికెట్లను ఉచితంగా ఇస్తానని ఆయన ప్రకటించారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా కనువిందు చేయనున్న చిత్రం 'ఆదిపురుష్'. టి.సిరీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకుడు. ఈ చిత్రం జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా విషయంలో మేకర్స్ తీసుకున్న ఓ నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షించింది. 'ఆదిపురుష్' ప్రదర్శితమయ్యే ప్రతి థియేటర్ లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటుని కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఇప్పుడు 'ది కాశ్మీర్ ఫైల్స్', 'కార్తికేయ-2' వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత అభిషేక్ అగర్వాల్ తీసుకున్న నిర్ణయం కూడా ఆసక్తికరంగా మారింది. "శ్రీ రాముని పట్ల నాకున్న భక్తితో, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు 10,000+ టిక్కెట్లను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను." అని అభిషేక్ అగర్వాల్ ప్రకటించారు. ఆయన నిర్ణయం పట్ల ప్రశంసలు కురుస్తున్నాయి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.