English | Telugu
సైలెంట్‌గా అంత పనిచేసిన రజనీకాంత్!
Updated : Jun 22, 2023
ఇండియన్ సినిమా సూపర్‌స్టార్‌లలో రజనీకాంత్‌ది ఎప్పుడూ స్పెషల్ ప్లేసే. ఆయన ట్రెండ్‌ని ఫాలో అవ్వరు. ఆయన ఏం సెట్‌చేస్తే అదే ట్రెండ్ అవుతుంది. ఈ విషయం మళ్లీ ఇప్పుడు మరోసారి ప్రూవ్ అయింది. రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా జైలర్. ఈ సినిమాను ఆగస్టు 10న రిలీజ్ చేయనున్నారు. ఆల్రెడీ విడుదల చేసిన ముత్తువేల్ పాండ్యన్ లుక్‌కీ, సినిమాలో స్టార్ కాస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియోకి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా రజనీకాంత్ ఫ్యాన్స్ కి బంపర్ గిఫ్ట్ ప్యాక్ చేశారు మేకర్స్. ఆ గిఫ్ట్ అందుకున్న తలైవర్ ఫ్యాన్స్ నెల్సన్‌ని బర్త్ డే విషెస్‌తో ముంచెత్తుతున్నారు. జైలర్ సినిమాను నిర్మిస్తోంది సన్ పిక్చర్స్. ఈ సంస్థ తన అఫిషియల్ ట్విట్టర్‌లో వీడియో షేర్ చేసింది. ఆడియన్స్ దృష్టిని ఎప్పటికప్పుడు ఆకర్షిస్తూ, మెస్మరైజ్ చేస్తూ, అన్ కన్వెన్షనల్ డైరక్టర్‌గా పేరు తెచ్చుకున్న నెల్సన్ దిలీప్‌కుమార్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ వీడియో రిలీజ్ చేసింది.
ఈ వీడియోలో నెల్సన్ గత చిత్రాలు కోలమావు కోకిల, డాక్టర్, బీస్ట్ ఉన్నాయి. ఈ వీడియో ఎండింగ్‌లో జైలర్ బీటీయస్ గ్లింప్సస్ జనాలకు సర్‌ప్రైజ్ ఇచ్చాయి. ఈ గ్లింప్స్ వల్ల జైలర్ సినిమాకు సంబంధించిన వివరాలు ఏవీ తెలియకపోయినా, సినిమా సన్నివేశాలు రిఫ్లెక్ట్ కాకపోయినా తలైవర్ వైబ్స్ ఫ్యాన్స్ కి పండగ వాతావరణం తెచ్చేశాయి. జైలర్ సినిమాలో రజనీకాంత్‌ని ముత్తువేల్ పాండ్యన్‌గా చూడటానికి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఈ సినిమాలో ఆయనతో పాటు జాకీష్రాఫ్, శివరాజ్‌కుమార్, సునీల్, రమ్యకృష్ణన్, వినాయకన్, మిర్నా మీనన్, తమన్నా, మోహన్‌లాల్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. సన్ పిక్చర్స్ కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. నెల్సన్ సినిమాలు అన్నిటికీ ఇప్పటిదాకా అనిరుద్ సంగీతం అందించారు. గత మ్యూజికల్ హిట్స్ లాగానే ఈ సినిమాలోని పాటలు కూడా చార్ట్ బస్టర్ కావాలన్నది ఫ్యాన్స్ కోరిక.