English | Telugu

ఆడియో ఫంక్షన్ కి రావడానికి సుమన్ రెండు లక్షలడిగారు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

తన సినిమా ఆడియో ఫంక్షన్‌కు రావడానికి సీనియర్ నటుడు సుమన్ రెండు లక్షలు అడిగారంటూ దర్శకుడు నర్రా శివనాగు సంచలన వ్యాఖ్యలు చేశారు. సుదర్శన్‌, రంగస్థలం మహేశ్‌, అర్జున్‌ తేజ్‌ కీలక పాత్రధారులుగా శివనాగు దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'నట రత్నాలు'. ఇనయా సుల్తాన కథానాయిక. మర్డర్‌ మిస్టరీ క్రైం థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎవరెస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డా.దివ్య నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఆడియో ఫంక్షన్‌ బుధవారం హైదరాబాద్‌లో జరిగింది.

ఈ సందర్భంగా దర్శకుడు శివనాగు మాట్లాడుతూ "సినిమా ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటారు. నేను అవన్నీ దాటుకొచ్చిన వాడినే. అలాంటి ఇతివృత్తంతో తీసిన సినిమా ఇది. మంచి విజయం సాధిస్తుంది. నేను 14 చిత్రాలు తీశా. ఏ సినిమా వల్ల నా నిర్మాతకు నష్టంరాలేదు. చాలా వరకూ నాకు సహకరిస్తారు. ఈ మధ్యకాలంలో చిన్న సినిమా ఫంక్షన్‌లకు ఎవరూ సహకరించట్లేదు. నేను గతంలో మూడు సినిమాలు తీసిన ఓ హీరోని ఈ వేడుకకు ఆహ్వానించా. ఆ వ్యక్తికి ఫోన్‌ చేస్తే అసిస్టెంట్‌తో మాట్లాడమని చెప్పారు. పది రోజులు సాగదీసి ఆయన మేకప్‌మెన్‌ ఫోన్‌ ఎత్తి "శివనాగు గారు రెండు లక్షలు ఇస్తే ఆడియో ఫంక్షన్‌కి వస్తారట అండీ" అని చెప్పాడు. అంటే ఆడియో రిలీజ్‌ చేయాలంటే రెండు లక్షలు ఇవ్వాలా? డబ్బిచ్చి పొగడాలా? ఆ నటుడు ఎవరో కాదు. సీనియర్‌ నటుడు సుమన్‌. ఏ హీరోనైనా దర్శకుడే తయారు చేస్తారు. సుమన్‌గారి తీరు చూశాక నా బాధ కలిగింది. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో పరిశ్రమ ఉంది" అన్నారు.

ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ మాజీ ఎంఎల్‌ఎ యరపతినేని శ్రీనివాసరావు ఆడియో సీడీలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. "గతంలో నేను కొన్ని ఆడియో ఫంక్షన్‌లకు వచ్చా. సమర సింహారెడ్డి, నరసింహనాయుడు, మిర్చి తరహా చిత్రాలంటే నాకు ఇష్టం. ఈ చిత్రం బాగా నడుస్తుందని భావిస్తున్నా. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు" అన్నారు. నిర్మాత దివ్య మాట్లాడుతూ "సినిమా బాగా వచ్చింది. త్వరలో విడుదల చేస్తాం" అన్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .