English | Telugu

ఎన్టీఆర్, రామ్ చరణ్.. సీన్ రివర్స్!

'ఆర్ఆర్ఆర్' సమయంలో మరే కొత్త సినిమాపై దృష్టి పెట్టకుండా పూర్తిగా ఆ సినిమాకే అంకితమై పని చేశాడు జూనియర్ ఎన్టీఆర్. అంతేకాదు 'ఆర్ఆర్ఆర్' విడుదలైన ఏడాది దాకా కొన్ని కారణాల వల్ల తన తదుపరి సినిమా 'దేవర' షూటింగ్ ప్రారంభించలేదు. అయితే ఎన్టీఆర్ తో కలిసి 'ఆర్ఆర్ఆర్'లో నటించిన రామ్ చరణ్ మాత్రం దానికి పూర్తి భిన్నంగా అడుగులు వేశాడు. ఓ వైపు 'ఆర్ఆర్ఆర్' చేస్తూనే మరోవైపు తన తండ్రిలో కలిసి 'ఆచార్య' సినిమా పూర్తి చేశాడు. అలాగే 'ఆర్ఆర్ఆర్' విడుదలకు ముందే 'గేమ్ ఛేంజర్' చిత్రాన్ని ప్రారంభించాడు. అదే ఫ్లోలో సగం షూటింగ్ కూడా పూర్తి చేశాడు. దీంతో 'ఆర్ఆర్ఆర్' స్టార్స్ లో చరణ్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంటే, ఎన్టీఆర్ మాత్రం విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నాడని కామెంట్స్ వినిపించాయి. ఒకానొక సమయంలో ఎన్టీఆర్ తీరు పట్ల ఫ్యాన్స్ కూడా అసహనం వ్యక్తం చేశారు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అన్నట్లుగా ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది.

'ఆర్ఆర్ఆర్' తర్వాత 'దేవర' స్టార్ట్ చేయడానికి దాదాపు ఏడాది సమయం తీసుకున్న ఎన్టీఆర్.. ఇప్పుడు పక్కా ప్లానింగ్ తో జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. మార్చిలో 'దేవర' షూట్ స్టార్ట్ అయ్యి, నాలుగు షెడ్యూల్స్ కూడా పూర్తి చేసుకుంది. దాదాపు నలభై శాతం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. నవంబర్ లోపు మొత్తం షూటింగ్ పూర్తి చేసేలా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్తున్నారు. 2024, ఏప్రిల్ 5 న సినిమాని విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. నవంబర్ నుంచి మార్చి లోపు బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2' షూటింగ్ పూర్తి చేయనున్నాడు ఎన్టీఆర్. అంటే వచ్చే ఏడాది వేసవి లోపు ఎన్టీఆర్ రెండు సినిమాల షూటింగ్ పూర్తి చేస్తాడు.

ఓ వైపు ఎన్టీఆర్ స్పీడ్ ఇలా ఉంటే, మరోవైపు చరణ్ స్పీడ్ కి మాత్రం బ్రేక్ లు పడ్డాయి. అప్పట్లో కొన్ని కారణాల వల్ల 'ఇండియన్-2' షూటింగ్ వాయిదా పడటంతో ఆ గ్యాప్ లో చరణ్ తో 'గేమ్ ఛేంజర్'ను స్టార్ చేశాడు దర్శకుడు శంకర్. 'గేమ్ ఛేంజర్' కొంత షూటింగ్ జరిగాక, 'ఇండియన్-2' వివాదం సద్దుమణగడంతో ఆ సినిమాపైకి శంకర్ ఫోకస్ షిఫ్ట్ అయింది. 'ఇండియన్-2'ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుండటంతో ప్రస్తుతం శంకర్ దృష్టి ఎక్కువగా ఆ సినిమా మీదే ఉంది. దాంతో 'గేమ్ ఛేంజర్' ఆలస్యమవుతోంది. ఇంకా 40 శాతానికి పైగా షూటింగ్ పెండింగ్ ఉంది అంటున్నారు. 'ఇండియన్-2' పూర్తై విడుదలైతే తప్ప, శంకర్ 'గేమ్ ఛేంజర్'పై ఫుల్ ఫోకస్ పెట్టే అవకాశంలేదు. మొదట 'గేమ్ ఛేంజర్' సంక్రాంతికి వస్తుంది అనుకున్నారు, తర్వాత సమ్మర్ అన్నారు. ఇప్పుడు అది కూడా అనుమానమే అంటున్నారు. అంటే 'గేమ్ ఛేంజర్' పూర్తయ్యేలోపు ఎన్టీఆర్ రెండు సినిమాలు పూర్తి చేయనున్నాడు. అంతేకాదు 'దేవర', 'వార్-2' పూర్తి కాగానే, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందనున్న 'ఎన్టీఆర్ 31' షూటింగ్ మొదలుపెట్టనున్నాడు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.