బిగ్ బాస్ 5: ఉమాదేవి అవుట్!
'బిగ్ బాస్-5' నుండి మరో మహిళ ఎలిమినేట్ అయ్యింది. తొలి వారం హౌస్ నుండి సరయును బయటకు పంపిన బిగ్ బాస్... రెండో వారం ఉమాదేవిని పంపించారు. దాంతో బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు మహిళలు షో నుండి బయటకు వచ్చినట్టు అయ్యింది. దాంతో నామినేట్ అయిన మిగతావాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. ఉమాదేవితో పాటు రెండో వారంలో ఎలిమినేషన్స్ ప్రక్రియలో నటరాజ్, కాజల్, లోబో, ప్రియాంక, ప్రియ, యాని మాస్టర్ నామినేట్ అయ్యారు.