రెండు కొత్త క్యారెక్టర్లు.. శౌర్య, హిమలకు బావలు వచ్చారు!
రోజుకు ఒక మలుపుతో 'కార్తీక దీపం' సీరియల్ కొత్త దారుల్లో పయనిస్తోంది. మోనిత జైలుకు వెళ్లిందన్న మాటే గానీ కార్తీక్ కుటుంబంలో ఎవరికీ సుఖం లేకుండా చేస్తోంది. మోనిత చేస్తున్న పనులకు కార్తీక్, దీప దంపతులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మరోవైపు తండ్రిని దోషిలా చూడటమే కాదు, మోనితను నిజంగా తమ తండ్రి మోసం చేశాడని కార్తీక్ పిల్లలు బాధపడుతున్నారు. ఇప్పుడు కథంతా తండ్రి, పిల్లల చుట్టూ తిరుగుతోంది.