రాజశేఖర్ 'బిగ్ బాస్' హోస్ట్ అయితే?!
'స్టార్ మా'లో ఈ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు 'బిగ్ బాస్' ఐదో సీజన్ షురూ కానుంది. అయితే, అంతకంటే కొన్ని గంటల ముందు, మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు 'కామెడీ స్టార్స్' కార్యక్రమంలో కూడా 'బిగ్ బాస్' సందడి చేయనున్నాడు. 'బిగ్ బాస్' థీమ్ మీద 'కామెడీ స్టార్స్'లో సద్దాం టీమ్ ఒక స్కిట్ చేసింది. అందులో 'బిగ్ బాస్' హోస్ట్‌గా సద్దాం సందడి చేయనున్నాడు.