English | Telugu

Nari Nari Naduma Murari: నారీ నారీ నడుమ మురారి మూవీ రివ్యూ 

Publish Date:Jan 14, 2026

      సినిమా పేరు: నారీనారీనడుమ మురారి  న‌టీన‌టులు: శర్వానంద్,  సాక్షి వైద్య, సంయుక్త మీనన్, శ్రీ విష్ణు, నరేష్, సంపత్,సునీల్, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగర్, సత్య త‌దిత‌రులు సినిమాటోగ్ర‌ఫీ:  జ్ఞానశేఖర్  వి ఎస్   ఎడిట‌ర్‌: రవి శంకర్    మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్  నిర్మాత‌: అనిల్ సుంకర, రామ బ్రహ్మం  బ్యానర్:ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్  మాటలు: నందు, భాను రచన, ద‌ర్శ‌క‌త్వం:  రామ్ అబ్బరాజు  రిలీజ్ డేట్ : జనవరి 14  ,2025    ఎక్స్ క్యూజ్ మీ.. సంక్రాంతి కుర్చీ పై నేను కూడా కన్నేసానంటు శర్వానంద్(Sharwanand)ఈ రోజు 5 .59 నిమిషాలకి నారీ నారీ నడుమ మురారి తో థియేటర్స్ లో అడుగుపెట్టాడు. ప్రచార చిత్రాలతో మంచి హైప్ ని కూడా క్రియేట్ చేసుకుంది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.   కథ గౌతమ్(శర్వానంద్) ఆర్కిటెక్ జాబ్ చేస్తుంటాడు. నిత్య(సాక్షి వైద్య) కూడా ఆర్కిటెక్ జాబ్ చేస్తుంటుంది. ఇద్దరు ఒకరికొకరు ప్రేమించుకుంటారు. నిత్య తండ్రి రామ లింగయ్య(సంపత్) ఫేమస్ లాయర్. తమ ప్రేమ విషయం రామలింగయ్య కి చెప్తారు. మీ ఇద్దరిది ప్రేమ కాదని, ప్రేమ అయితే మీ ఇద్దరి లైఫ్ లో కొన్ని జరిగేవి అని  రామలింగయ్య చెప్తాడు. కానీ తమది ప్రేమనే అని గౌతమ్, నిత్య గట్టిగా చెప్తారు. దీంతో పెళ్ళికి ఒప్పుకుంటాడు. కానీ  రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనే కండిషన్ పెడతాడు. కానీ గౌతమ్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలంటే గౌతమ్ ఆఫీస్ బాస్ దియా( సంయుక్త మీనన్) సహాయం కావాల్సి ఉంటుంది. గౌతమ్ పెళ్ళికి దియాకి సంబంధం ఏంటి? దియా నే ఎందుకు సహాయం చెయ్యాలి? దియా సాయం చేసిందా?  గౌతమ్, నిత్య లది ప్రేమ కాదని రామలింగయ్య  ఎందుకు అన్నాడు! రిజిస్టర్ మ్యారేజ్ కి ఒప్పుకున్న రామలింగయ్య టార్గెట్ ఏంటి! చివరకి గౌతమ్, నిత్య ఒక్కటి అయ్యారా! అసలు నారీ నారీ నడుమ మురారి టార్గెట్ ఏంటి అనేదే చిత్ర కథ.   ఎనాలసిస్  సినిమా చూస్తున్నంత సేపు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా హాయిగా నవ్వుకుంటూనే ఉంటాం. ఆర్టిస్టుల దగ్గరనుంచి, టెక్నీషియన్స్ దాకా అందరు నిజమైన సంక్రాంతిని మన ముందు ఉంచారు. కథ,కథనాలు ప్రధాన బలంగా నిలిచాయి. ఫస్ట్ హాఫ్ ఓపెన్ చేస్తే శర్వానంద్ ఎంట్రన్స్ రొటీన్ గా అనిపించినా ఆ తర్వాత పర్పస్ తెలిసి మనకి తెలియకుండానే నవ్వుల్లోకి వెళ్ళిపోతాం. ఆ పాయింట్ సినిమా చివరి దాకా విపరీతమైన ఎంటర్ టైన్ మెంట్ ని జనరేట్ చెయ్యడంతో పాటు సినిమాకి కొత్త లుక్ ని తీసుకొచ్చింది.  నిత్య, గౌతమ్ లవ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్  చాలా కొత్తగా ఉండి,కేరళ అందాలని కూడా చూపించింది.   వెంటనే దియా ఫ్లాష్ బ్యాక్  వచ్చి సినిమా లుక్ ని మార్చేసి సినిమా హిట్ అనేలా చేసింది. ఆ సంధర్భంగా దియా తండ్రితో వచ్చిన సీన్స్ బాగున్నాయి.  కార్తీక్ క్యారక్టర్ లో చేసిన నరేష్ ఎపిసోడ్ అయితే సూపర్. సత్య సీన్స్ కూడా బాగా పేలాయి. ఇంటర్ వెల్ ట్విస్ట్  సూపర్. ఇక సెకండ్ హాఫ్ లో ఏం జరగబోతుందనే క్యూరియాసిటీ చివరకి వరకు నడిచింది. రిజిస్టర్ సత్యమూర్తి వచ్చిన సీన్స్  ఒక రేంజ్ లో పేలాయి. వెన్నెల కిషోర్ క్యారక్టర్  ప్లేస్ మెంట్, ఆ క్యారక్టర్ యాటిట్యూడ్, సదరు క్యారక్టర్ ని కథకి అన్వయించుకున్న తీరుతో వచ్చిన సీన్స్ అన్ని హైలెట్.   ముఖ్యంగా గౌతమ్, దియా, నిత్య మధ్య వచ్చిన సీన్స్, దియా తండ్రి ఫ్లాష్ బ్యాక్ చెప్పిన సీన్స్ అయితే ఎక్స్ లెంట్. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్  ఒక రేంజ్ లో ఉండటంతో పాటు కథ కి ఉన్న పర్పస్ ని తెలియచేశాయి. నటి నటులు సాంకేతిక నిపుణుల పని తీరు  రెండు కోణాలు దాగి ఉన్న గౌతమ్ క్యారక్టర్ లో శర్వానంద్ పెర్ ఫార్మ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పుడే అయిపోయిదనుకోకు, ఇప్పుడే మొదలయింది, తెలుగు సినిమాపై నా  ప్రభావం చాలా బలంగా ఉండబోతుందనేలా విజృంభించి చేసాడు. లుక్, స్టైల్ పరంగా కూడా సరికొత్త శర్వానంద్ ని కళ్ళ ముందు ఉంచాడు. హీరోయిన్స్ గా చేసిన సాక్షి వైద్య, సంయుక్త మీనన్ కూడా మెస్మరైజ్ చేసే స్థాయిలో ది బెస్ట్ పెర్ ఫార్మ్ ఇచ్చారు. శ్రీవిష్ణు కనిపించిన కాసేపు అయినా నవ్వులు పూయించాడు. ఇక నరేష్, సంపత్, సునీల్, వెన్నెల కిషోర్, సత్య అయితే తమ ఫ్యాన్ బేస్ ని వెయ్యి రేట్లు పెరిగేలా చేసారు. ఈ సినిమాతో వాళ్ళకి వీరాభిమానులు ఏర్పడతారేమో. అంతలా తమ నాచురల్ పెర్ ఫార్మ్ తో కుమ్మి పడేసారు. మిగతా ఆర్టిస్టులు కూడా తమ క్యారెక్టర్స్ కి  నూటికి నూరుపాళ్లు న్యాయం చేసారు. ఇక నందు, భాను నుంచి  డైలాగ్స్ అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి. నవ్వని వాడు పాపాత్ముడు అనేలా తమ కాలంతో విజృంభించారు. అక్షరానికి ఉన్న పవర్ ని కూడా చాటి చెప్పినట్లయింది. దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రైటర్ గా రామ్ అబ్బరాజు నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యాడు. క్యారెక్టర్స్ ని ఉపయోగించుకున్న తీరుకి హాట్స్ ఆఫ్ చెప్పవచ్చు. ఫొటోగ్రఫీ, నిర్మాణ విలువలు  అతిపెద్ద బలంగా నిలిచాయి. సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కథకి,క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ గా సింక్ అయ్యాయి.   ఫైనల్ గా చెప్పాలంటే మనలో ఉన్న ఆల్ టెన్షన్స్ ని తగ్గించే నవ్వుల దివ్య ఔషధం నారీ నారీ నడుమ మురారి. పర్ ఫెక్ట్ సంక్రాంతి సినిమా. కుటుంబ సమేతంగా అందరు ఎంజాయ్ చేసే మూవీ. బ్లాక్ బస్టర్ అనేది చిన్న వర్డ్.   రేటింగ్ 3 . 25 / 5                                                                                                                                                                                                                                            అరుణాచలం   

Allu Arjun and Lokesh join hands for a bumper actioner

Publish Date:Jan 14, 2026

The monumental project featuring Icon Star Allu Arjun in an epic collaboration with blockbuster filmmaker Lokesh Kanagaraj was announced today. This highly anticipated project brings together two of the most celebrated names in Indian cinema, promising a spectacular experience. The project was announced with a powerful video content and it raises hype to the next level on this project backed by the prestigious Mythri Movie Makers in association with BV works. It has already captured the imagination of fans nationwide. The project is spearheaded by ace producers Naveen Yerneni and Ravi Shankar, with producer Bunny Vas joining as co-producer along with Nutty, Sandy, and Swathi. The official announcement video took social media by storm, with discussions about the scale and tone of this ambitious venture. Allu Arjun, a phenomenon known for his unparalleled style, electrifying screen presence, and pan-India stardom with Lokesh Kanagaraj, a director celebrated for redefining commercial cinema with his gritty narratives and high-impact filmmaking. Along with them, the rockstar Anirudh joined the team.  With sensational composer Anirudh Ravichandran scoring the music and the film scheduled to commence shooting in August 2026, the anticipation continues to soar. Tentatively titled AA23, the film is expected to present Allu Arjun in a never-seen-before avatar under Lokesh Kanagaraj’s dynamic direction, making it one of the most awaited cinematic events in recent times. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

ఒకే సంవత్సరం 8 సినిమాలు.. అందులో 5 బ్లాక్‌బస్టర్స్‌.. అదీ శోభన్‌బాబు స్టామినా!

Publish Date:Jan 14, 2026

(జనవరి 14 శోభన్‌బాబు జయంతి సందర్భంగా..) 1937 జనవరి 14న కృష్ణా జిల్లాలో జన్మించిన ఉప్పు శోభనాచలపతిరావు అలియాస్‌ శోభన్‌బాబు తెలుగు చలన చిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరుచుకున్న హీరో. తను హీరోగానే రిటైర్‌ అవుతాను తప్ప క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ప్రేక్షకులకు కనిపించకూడదు అని దృఢంగా నిశ్చయించుకున్న ఆయన.. హీరోగానే రిటైర్‌ అయ్యారు. ఆ తర్వాత తండ్రిగా, తాతగా నటించే అవకాశాలు ఎన్ని వచ్చిన క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేయలేదు. శోభన్‌బాబు కెరీర్‌ ఎంతో విలక్షణంగా సాగింది. హీరోగా తనను తాను ప్రూవ్‌ చేసుకునేందుకు ఎన్నో కష్టాలు పడ్డారు. 1959లో దైవబలం చిత్రంతో నటుడిగా చిత్ర రంగ ప్రవేశం చేసిన శోభన్‌బాబు.. సోలో హీరో అవ్వడానికి 7 సంవత్సరాలు పట్టింది. పాతిక సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు, కొంత ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్లు చెయ్యాల్సి వచ్చింది.   హీరోగా నిలదొక్కుకున్న తర్వాత ఆయన్ని స్టార్‌ హీరోని చేసిన సంవత్సరం 1975. శోభన్‌బాబు కెరీర్‌లో ఈ సంవత్సరానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ సంవత్సరం ఆయన నటించిన 8 సినిమాలు రిలీజ్‌ కాగా, అందులో 5 సినిమా బ్లాక్‌బస్టర్స్‌గా, శతదినోత్సవ సినిమాలుగా నిలిచాయి. అంతేకాదు, తను చేసిన సినిమాల మధ్యే పోటీ ఏర్పడడం విశేషంగా చెప్పుకోవచ్చు.   1975 సంవత్సరం జనవరిలో తాతినేని రామారావు దర్శకత్వంలో రూపొందిన ‘దేవుడు చేసిన పెళ్లి’ చిత్రం విడుదలైంది. శోభన్‌బాబు హీరోగా నటించిన తొలి కలర్‌ సినిమా ఇదే. ఈ సినిమాలో శారద ద్విపాత్రాభినయం చేశారు. చక్కని కథ, గుండెల్ని పిండేసే సెంటిమెంట్‌ ప్రధానంగా సాగే ఈ సినిమాను 15 కేంద్రాల్లో 50 రోజులు, 3 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించారు. తెలుగు చలన చిత్ర చరిత్రలోనే తొలిసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లలో ఉదయం ఆటను ప్రత్యేకంగా మహిళల కోసం కేటాయించారు.   ఏప్రిల్‌లో ఎస్‌.ఎస్‌.బాలన్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘అందరూ మంచివారే’. అంతకుముందు ‘మంచి మనుషులు’ వంటి సూపర్‌హిట్‌ చిత్రంలో కలిసి నటించిన శోభన్‌బాబు, మంజుల ఈ సినిమాలో మరోసారి జోడీ కట్టారు. సాంఘిక చిత్రాల్లో తొలిసారి ఈ సినిమా కోసం 6 లక్షల రూపాయలతో ఒక భారీ సెట్‌ను నిర్మించడం విశేషం. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు.   మే నెలలో కె.రాఘవేంద్రరావు దర్శకుడుగా రూపొందిన తొలి సినిమా ‘బాబు’ విడుదలైంది. ఇందులో శోభన్‌బాబు, వాణిశ్రీ, అరుణా ఇరానీ ప్రధాన పాత్రల్లో నటించారు. 25 లక్షల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్‌ వచ్చాయి. తొలివారం 16 లక్షలు కలెక్ట్‌ చేయడం విశేషం. రెండు వారాల వరకు ఫర్వాలేదు అనిపించినా ఆ సమయంలోనే శోభన్‌బాబు, వాణశ్రీలతోనే కె.విశ్వనాథ్‌ రూపొందించిన ‘జీవనజ్యోతి’ విడుదలై ఘనవిజయం సాధించడంతో ‘బాబు’ చిత్రంపై ఆ ప్రభావం ప‌డింది. ఫలితంగా ‘బాబు’ ఏవరేజ్‌ మూవీగా నిలిచింది.   శోభన్‌బాబు, శారద జంటగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన ‘బలిపీఠం’ చిత్రం జూలై 17న విడుదలైంది. రంగనాయకమ్మ కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్ని ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. శోభన్‌బాబు, శారద నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.   శోభన్‌బాబు, మంజుల జంటగా వి.మధుసూదనరావు దర్శకత్వంలో రూపొందిన ‘జేబుదొంగ’ చిత్రం ఆగస్ట్‌ 14న విడుదలైంది. అప్పటి వరకు ప్రేమకథా చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు చేస్తూ వచ్చిన శోభన్‌బాబుపై జేబుదొంగ అనే టైటిల్‌ వర్కవుట్‌ అవ్వదని, తప్పకుండా ఫ్లాప్‌ అవుతుందని ఇండస్ట్రీలోని ప్రముఖులు భావించారు. కానీ, వారి అంచనాలను తారుమారు చేస్తూ సినిమా సూపర్‌హిట్‌ అయింది. ఈ సినిమా తర్వాత నవంబర్‌లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో శోభన్‌బాబు, మంజుల జంటగా వచ్చిన ‘గుణవంతుడు’ చిత్రం పెద్దగా ఆడలేదు.   ఇక ఈ సంవత్సరం డిసెంబర్‌ 19న వచ్చిన ‘సోగ్గాడు’ చిత్రం సంచలన విజయం సాధించి శోభన్‌బాబు పేరుకు ముందు సోగ్గాడు చేరింది. కె.బాపయ్య దర్శకత్వంలో డి.రామానాయుడు నిర్మించిన ఈ సినిమాలో జయచిత్ర, జయసుధ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్‌ అయి శోభన్‌బాబు కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్‌ మూవీగా నిలిచింది. ఈ సినిమా మ్యూజికల్‌గా కూడా చాలా పెద్ద విజయం సాధించింది. ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో మరో సినిమాతో కె.బాపయ్య బిజీగా ఉండడంతో హైదరాబాద్‌లో కొన్ని సన్నివేశాలను ఆయన కజిన్‌ కె.రాఘవేంద్రరావు చిత్రీకరించడం విశేషం. 1975లో శోభన్‌బాబు హీరోగా వచ్చిన 8 కలర్‌ సినిమాల్లో 5 సినిమాలు ఘనవిజయం సాధించాయి. అలా ఈ సంవత్సరం శోభన్‌బాబు కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన సంవత్సరంగా నిలిచింది.

ఆ సినిమా బ్యాన్‌ చెయ్యాలంటూ లేడీ గ్యాంగ్‌స్టర్‌ పిటిషన్‌.. 2 కోట్లు డిమాండ్‌!

Publish Date:Jan 14, 2026

వయొలెంట్‌ లవ్‌స్టోరీగా విజయ్‌ దేవరకొండ, సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను హిందీలో షాహిద్‌ కపూర్‌ హీరోగా ‘కబీర్‌ సింగ్‌’ పేరుతో రూపొందించారు సందీప్‌రెడ్డి. హిందీలో కూడా ఈ సినిమా సూపర్‌హిట్‌ అయింది. ఆ తర్వాత రణబీర్‌ కపూర్‌తో సందీప్‌ చేసిన ‘యానిమల్‌’ కూడా మోస్ట్‌ వయొలెంట్‌ మూవీగా నిలిచింది.    ఈ క్రమంలోనే షాహిద్‌ కపూర్‌ హీరోగా విశాల్‌ భరద్వాజ దర్శకత్వంలో హిందీలో ‘ఓ రోమియో’ పేరుతో ఓ సినిమా రూపొందింది. ఫిబ్రవరి 13న ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కాబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన స్టిల్స్‌, ట్రైలర్‌ ఆల్రెడీ విడుదలయ్యాయి. వాటిని పరిశీలిస్తే.. అది కబీర్‌సింగ్‌, యానిమల్‌ సినిమాలను పోలి ఉంది. సినిమాలో పరిధులు దాటిన హింస ఉన్నట్టుగా తెలుస్తోంది.    ఇప్పుడు ‘ఓ రోమియో’ సినిమా చట్టపరమైన చిక్కుల్లో పడిరది.  ఈ చిత్రానికి సంబంధించి ముంబైకి చెందిన గ్యాంగ్‌స్టర్‌ హుస్సేన్‌ ఉస్తారా కుమార్తె సనోబర్‌ షేక్‌.. ‘ఓ రోమియో’ నిర్మాత సాజిద్‌ నడియాడ్‌వాలా, దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌లకు నోటీసులు పంపారు. ఈ సినిమా తన తండ్రి హుస్సేన్‌ ఉస్తారా జీవిత కథ ఆధారంగా రూపొందుతోందని, ఇందులోని కథ తన తండ్రికి వ్యతిరేకంగా ఉందని ఆమె ఆరోపిస్తున్నారు. అలా తమ కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు గానూ రూ.2 కోట్ల నష్టపరిహారాన్ని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు సినిమా విడుదలను నిలిపివేయాలని పిటిషన్‌ వేశారు.    ఈ సినిమా వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిందని ట్రైలర్‌లో ప్రస్తావించారు. దీంతో ఈ వివాదానికి బలం చేకూరింది. ఫిబ్రవరి 13న ‘ఓ రోమియో’ రిలీజ్‌ కాబోతోంది. ఇంకా నెలరోజుల వ్యవధి ఉంది. ఈలోగా ఈ సినిమాకి సంబంధించిన వివాదాన్ని కోర్టు ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంది. ఈ సినిమాలో షాహిద్‌ కపూర్‌, త్రిప్తి దిమ్రి, విక్రాంత్‌ మాస్సే, నానా పటేకర్‌, తమన్నా భాటియా, దిశా పటాని, అవినాష్‌ తివారీ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కమీనే, హైదర్‌, రంగూన్‌ తర్వాత షాహిద్‌, విశాల్‌ భరద్వాజ్‌ కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో సినిమా ఇది. 

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

Publish Date:Jan 14, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు. బాంబ్ స్కాడ్ వాళ్ళు స్టేషన్ కి వచ్చి చెక్ చేస్తారు. మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని వాళ్ళు అంటారు. పక్కన చూస్తే రాజ్ ఉండడు. దాంతో ఇదంతా రాజ్ పని అని ఇన్‌స్పెక్టర్ కి అర్థం అవుతుంది. వెంటనే ఇన్‌స్పెక్టర్ అప్పుకి కాల్ చేసి మీ బావ స్టేషన్ నుండి తప్పించుకున్నాడని.. అతన్ని అరెస్ట్ చేసి తీసుకొని వచ్చే బాధ్యత నీదే అని అంటాడు. సర్ నేను లీవ్ లో ఉన్నానని అప్పు అంటుంది. లీవ్ లో ఉంటే ఏంటి నీ డ్యూటీ నువ్వు చెయ్ అని ఇన్‌స్పెక్టర్ అంటాడు. ఆ తర్వాత రాజ్ హాస్పిటల్ కి వస్తాడు. నా భార్యని కాపాడుకోవడానికి నాకు ఇంతకంటే వేరే మార్గం ఏం కన్పించలేదని స్టేషన్ నుండి తప్పించుకొని వచ్చానని రాజ్ ఇంట్లో వాళ్ళకి చెప్తాడు. రాజ్ లోపలకు వెళ్తుంటే.. ఆగండి మీరు మీ భార్య దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు స్టేషన్ నుండి తప్పించుకొని మరొక తప్పు చెయ్యొద్దని అప్పు అనగానే అనగానే అందరు షాక్ అవుతారు. నాకు మిమ్మల్ని అరెస్ట్ చెయ్యమని ఆర్డర్ వచ్చిందని అప్పు అనగానే అందరు అప్పుపై కోప్పడతారు. ఎలా అరెస్ట్ చేస్తావో చెయ్ అని అందరు రాజ్ కి అడ్డుగా నిలబడగా కావ్య దగ్గరికి రాజ్ వెళ్లి మాట్లాడతాడు. రాజ్ ని చూసి ఒక క్రిమినల్ ఇక్కడ ఉంటే మా హాస్పిటల్ కి బ్యాడ్ నేమ్ అని డాక్టర్ అంటుంటే.. ప్లీజ్ డాక్టర్ అలా అనొద్దు.. ప్లీజ్ ఆపరేషన్ చెయ్యండి అని రాజ్ రిక్వెస్ట్ చేస్తాడు. తరువాయి భాగంలో కావ్యకి ఆపరేషన్ చేస్తారు. కావ్యకి పాప పుడుతుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

NBK 111: బాలయ్య ఫ్యాన్స్ కి ఊహించని షాక్!

Publish Date:Jan 5, 2026

  బాలకృష్ణ ఫ్యాన్స్ కి బిగ్ షాక్ హిస్టారికల్ ఫిల్మ్ ని పక్కన పెట్టారా? NBK 111 కొత్త స్టోరీ ఏంటి? నయనతార ప్లేస్ లో ఎవరు?   'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), గోపీచంద్ మలినేని మరో ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపిన విషయం తెలిసిందే. బాలకృష్ణ కెరీర్ లో 111వ సినిమాగా రానున్న ఈ ప్రాజెక్ట్ ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. ఈ హిస్టారికల్ ఫిల్మ్ లో నయనతార హీరోయిన్. ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. (NBK 111)   బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలయికలో హిస్టారికల్ ఫిల్మ్ అనగానే.. అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమాని వెండితెరపై చూస్తామా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే ఫ్యాన్స్ కి షాకిచ్చేలా.. ఈ మూవీ స్టోరీ ఛేంజ్ అయినట్లు సమాచారం.   ప్రస్తుతం పెద్ద సినిమాల పరిస్థితి పెద్దగా బాలేదు. ఓటీటీ బిజినెస్ కూడా మునుపటిలా జరగడంలేదు. ఈ పరిస్థితులలో హిస్టారికల్ ఫిల్మ్ అయితే భారీ బడ్జెట్ అవుతుందనే ఉద్దేశంతో.. ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ ని పక్కన పెట్టాలని టీమ్ నిర్ణయించిందట. దాని స్థానంలో మరో కొత్త స్క్రిప్ట్ తో సినిమా చేయబోతున్నారట. ఈ స్క్రిప్ట్ ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టుగా ఉంటుందని, మలినేని ఈసారి అందరినీ సర్ ప్రైజ్ చేయడం ఖాయమని అంటున్నారు.   Also Read: రాశి సంచలన వీడియోతో చిక్కుల్లో అనసూయ.. క్షమాపణలు చెబుతుందా?   అలాగే 'NBK111' హీరోయిన్ కూడా మారనున్నట్లు వినికిడి. హిస్టారికల్ ఫిల్మ్ అనుకున్నప్పుడు హీరోయిన్ గా నయనతారను ప్రకటించారు. ఆమె రెమ్యూనరేషన్ రూ.10 కోట్లకు పైగా ఉంటుంది. ఇప్పుడు బడ్జెట్ ని కంట్రోల్ చేయడం కోసం ఆమెకు బదులుగా మరో హీరోయిన్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట.   'NBK111' గురించి వినిపిస్తున్న వార్తల్లో నిజానిజాలు ఎంతో తెలియదు కానీ.. ఇటీవల కాలంలో బడ్జెట్ లు పెరిగిపోయి నష్టపోతున్నామంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బడ్జెట్ విషయంలో ముందే జాగ్రత్తలు తీసుకోవడం అనేది అభినందించదగ్గ విషయమే.  

Tiger Shroff to be part of Allu Arjun and Atlee film?

Publish Date:Jan 6, 2026

Allu Arjun has delivered a massive blockbuster with Pushpa 2 The Rule and his market in North India is huge. Taking that into consideration, Sun Pictures have accepted to give Atlee, a free hand to make his sci-fi fantasy drama on a never-seen-before scale with Hollywood VFX Studios, Action Co-ordinators collaborating on it.  Now, the reports suggest that the movie could be spilt into two parts and both will be shot at one go. The movie team won't be going back to shoot the second part but rather they would be spending 6-8 months on VFX and scale of the second part, if the reports are true.  Currently, the reports suggest that Tiger Shroff is in talks and he even joined the film for a crucial part. Will he be playing an antagonist or supporting protagonist is yet to be known. Vijay Sethupathi is said to be a part of the film. Already, Deepika Padukone is part of the film and she completed two schedules.  Mrunal Thakur and Janhvi Kapoor are said to be part of the project as there will be a triple role for Allu Arjun with connection between past lives and future. We have to wait and see, how many of these reports will emerge to be true. Atlee is currently working on meeting a Hollywood Studio to distribute the film, state reports.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

Anaganaga Oka Raju

Publish Date:Dec 31, 1969

The Raja Saab

Publish Date:Dec 31, 1969

Psych Siddhartha

Publish Date:Dec 31, 1969