English | Telugu
10 కోట్లు ఇస్తాను.. డైరెక్ట్ చేస్తారా
Updated : Jan 15, 2026
-మంచు విష్ణు కీలక నిర్ణయం
-ఇంతకీ ఏం చెప్పదలచుకున్నాడు
-మరి మీరు డైరెక్షన్ చేస్తారా!
మంచు విష్ణు(Manchu vishnu)గత ఏడాది జూన్ లో ఎపిక్ డెవోషనల్ ఫిలిం 'కన్నప్ప' తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దేవుడి పేరుపై జరిపే మూఢనమ్మకాలని, శివుడ్నివ్యతిరేకించే తిన్నడు అనే అడవి బిడ్డగా, ఆ తర్వాత శివుడు ఉన్నాడని గుర్తించి ఆయన రూపమైన శ్రీకాళహస్తీశ్వరుడికి(Srikalahasteeswarudu)ప్రియ భక్తుడుగా మారి తన రెండు కళ్ళు సమర్పించే కన్నప్ప గా విష్ణు నటన ఒక రేంజ్ లో ఉంటుంది.ప్రస్తుతం తన కొత్త చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. కానీ రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా ఒక సరికొత్త ప్రకటన చేసాడు.
ఎక్స్ వేదికగా రిలీజ్ చేసిన వీడియోలో విష్ణు మాట్లాడుతు మన టాలెంట్ ని తెలియచేయడానికి ఇన్ స్టాగ్రామ్, పేస్ బుక్, యూట్యూబ్ వంటివి ఉన్నాయి. కానీ ప్లాట్ ఫార్మ్ ఉంటే సరిపోదు. మీరు ఎదగడానికి ప్రాపర్ అవకాశం కావాలి. యాభై సంవత్సరాల క్రితం ఇండస్ట్రీలో కి వచ్చిన మా నాన్న గారిలో ఉన్న టాలెంట్ ని గుర్తించి దాసరి నారాయణరావు గారు ప్రోత్సహించారు. మా నాన్న గారి జీవితాన్ని ఆ రోజు ఆయనిచ్చిన ఒక్క అవకాశం మార్చేసింది. ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని ప్రోత్సహించాలని 'ఎవా' ఇంటర్ నేషనల్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ని అనౌన్స్ చేస్తున్నాను. ఇది కేవలం షార్ట్ ఫిలిం కాంటెస్ట్ నే కాదు మీలో ఉన్న డైరెక్షన్ స్కిల్స్ ని గుర్తిస్తుంది.
also read:తెలుగు సినిమా గెలిచిందోచ్.. కానీ ఆ ఒక్కటి మాత్రం అడక్కు
మీరు షూట్ చేసిన 10 నిమిషాల షార్ట్ ఫిలిం లో విజేతగా నిలిచిన వాళ్ళకి 10 కోట్ల రూపాయిల ఫీచర్ ఫిలిం డైరెక్ట్ చేసే అవకాశం వస్తుంది . విన్నర్ ని మా నాన్న బర్త్ డే రోజున మార్చి 19 న ప్రకటిస్తామని చెప్పాడు. సదరు షార్ట్ ఫిలిం కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవడానికి వాట్స్ అప్ నెంబర్ ని కూడా విష్ణు ఇవ్వడం జరిగింది.