English | Telugu
విడాకులు అనౌన్స్ చేసిన స్టార్ కపుల్.. ముగ్గురు పిల్లల విషయంలో కీలక నిర్ణయం
Updated : Jan 5, 2026
-భారతీయ మీడియా వర్గాల్లో మరో సంచలనం
-16 ఏళ్ళ వివాహ బంధానికి గుడ్ బై చెప్పాల్సిన అవసరం ఏంటి
-సోషల్ మీడియా వేదికగా మహి విజ్ చేసిన పోస్ట్ ఏంటి
-మరి ముగ్గురు పిల్లల పరిస్థితి ఏంటి!
ఈ మధ్య కాలంలో భార్యా, భర్తలైన సినీ, టీవీ సెలబ్రటీలు పోటాపోటీగా విడాకులు తీసుకుంటున్నారు. కొత్తగా వివాహ బంధంలోకి అడుగుపెట్టినా వాళ్లే కాకుండా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న వాళ్ళు సైతం విడాకులు ప్రకటిస్తు ఉండటం అభిమానులని కలవర పరుస్తు ఉంది. రీసెంట్ గా మరో సెలబ్రటీ కపుల్ డైవర్స్ తో తమ పదహారు సంవత్సరాల వివాహ బంధానికి సెండ్ ఆఫ్ చెప్పి అభిమానులకి కలవర పాటుకి గురి చేసింది.
మహి విజ్, జై భానుషాలి.. బాలీవుడ్ సినీ,టీవీ రంగంలో సుదీర్ఘ కాలం నుంచి తిరుగులేని ఆది పత్యాన్ని చెలాయిస్తూ వస్తున్నారు. 2011 లో ఈ ఇద్దరి వివాహం జరగగా ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. రీసెంట్ గా మహి విజ్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా విడాకులపై స్పందిస్తు 'ఇద్దరం విడిపోయినా కూడా పిల్లలు తారా, ఖుషి, రాజ్‌వీర్‌ల కోసం మంచి తల్లిదండ్రులుగా, మంచి స్నేహితులుగా ఉండేందుకు ప్రయత్నిస్తాం. మేము వేరు దారుల్లో నడుస్తున్నా విడాకుల నిర్ణయం వెనుక ఎలాంటి నెగిటివిటీ,డ్రామా లేదు. కేవలం ప్రశాంతత కోసమే విడాకుల నిర్ణయాన్ని ఎంచుకున్నాం..స్నేహబంధం కొనసాగుతూనే ఒకరిని ఒకరం గౌరవించుకునే విషయంలో రాజీ పడం. ఈ సమయంలో అభిమానుల ప్రేమ, గౌరవం, దయ అవసరం అని తెలిపింది.
Also read:ధురంధర్ తో కొత్త లోక కలిస్తే.. మీకు ఓకేనా!
పదిహేడు సంవత్సరాల వయసులో మోడలింగ్ గా కెరీర్ ప్రారంభించిన మహి విజ్ టెలివిజన్ రంగంలో సుమారు 30 సిరీస్ ల వరకు చేసింది. గత ఏడాది డిసెంబర్ 2 నుంచి కలర్స్ టీవీ లో వస్తున్న సెహర్-హోనే కో హై లో చేస్తుంది. సినిమాల విషయానికి వస్తే 2004 లో తెలుగులో ప్రభు దేవా హీరోగా వచ్చిన తపన అనే మూవీలో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత మలయాళంలో, కన్నడంలో ఒక సినిమా చేసింది. ఇక జై భానుషాలి విషయానికి వస్తే తను కూడా మోడల్ గానే కెరీర్ స్టార్ట్ చేసి సినీ, టీవీ, వెబ్ సిరీస్ నటుడుగా, అనేక షోస్ కి ప్రెజంటర్ గా చేస్తు తనదైన శైలిలో దూసుపోతున్నాడు. లాస్ట్ ఇయర్ మార్చిలో అభిషేక్ బచ్చన్ నుంచి వచ్చిన బి హ్యాపీ అనే మూవీలో కీలకమైన క్యారక్టర్ లో కనిపించాడు.