English | Telugu

Jayam Serial : ఇంటి నెలఖర్చులకి గంగకి డబ్బు ఇచ్చిన శకుంతల.. ఇషిక ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -169 లో..... సూపర్ మార్కెట్ ని తగలబెట్టింది వీరు అని గంగకి అర్థమవుతుంది. వీరు దగ్గరికి గంగ వెనకాల నుండి వచ్చి తన పీకపై చున్నీ వేసి లాగుతుంది. దాంతో వదిలెయ్ అని వీరు భయపడుతాడు. నన్నే చంపాలని చూస్తావా.. నీ సంగతి చెప్తానని వీరు అంటాడు. నువ్వే ఇదంతా చేసావని నాకు తెలుసని వీరుకి గంగ వార్నింగ్ ఇస్తుంది.

అ తర్వాత పెద్దసారు బయటకు వెళ్తే.. అక్కడ లక్ష్మీ కనిపిస్తుంది. తనతో లక్ష్మీ మాట్లాడుతుంది. గంగ పోటీలో గెలిచిందా అని లక్ష్మీ అడుగగా.. లేదు ఓడిపోయిందని పెద్దసారు జరిగింది మొత్తం చెప్తాడు. ఒకసారి గంగతో మాట్లాడుతానని లక్ష్మీ అంటుంది. వెంటనే రుద్రకి పెద్దసారు ఫోన్ చేస్తాడు. ఇక పెద్దసారు ఫోన్ ని లక్ష్మీకి ఇస్తాడు. రుద్రతో లక్ష్మీ మాట్లాడి తర్వాత గంగతో మాట్లాడుతుంది. సూపర్ మార్కెట్ ఎటాక్ గురించి గంగ చెప్పబోతుంటే రుద్ర ఫోన్ తీసుకొని ఇక్కడ అంతా బానే ఉంది.. మీరేం కంగారు పడకండి అని రుద్ర చెప్తాడు. ఆ తర్వాత ఇషిక ఇంట్లో మెయింటెనెన్స్ సరిగ్గా చెయ్యడం లేదని పెద్దసారు అంటాడు. గంగ చూడు సూపర్ మార్కెట్ ని ఎలా చూసుకుంటుందోనని పెద్దసారు అంటాడు.

అయితే గంగకి ఇంటి మెయింటెనెన్స్ ఇవ్వండి అని ఇషిక అంటుంది. అప్పుడే రుద్ర వచ్చి వద్దు గంగ అని సైగ చేస్తాడు. ఇంట్లో అందరు గంగకి ఇవ్వాలని అంటారు. ఒకసారి చేస్తే కదా తెలుస్తుందో లేదోనని శకుంతల అంటుంది. గంగకి శకుంతల కొంత డబ్బు ఇచ్చి.. ఇవి ఈ నెల ఖర్చులకి సరిపెట్టాలని శకుంతల అనగానే గంగ తీసుకొని తన గదిలో ఉన్న బట్టల్లో దాస్తుంది అది ఇషిక చూస్తుంది. ఆ తర్వాత గంగ పేరెంట్స్ రుద్రని చూడడానికి వస్తారు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.