English | Telugu
Jayam serial: నిప్పు అంటించింది వీరూనే అని చెప్పేసిన గంగ.. రుద్ర నమ్ముతాడా?
Updated : Jan 15, 2026
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం' (Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-168లో.. గంగ ఇంటికి రాగానే హారతి తీసుకొని వస్తుంది శకుంతల. దాని మీద ప్రమాణం చేసి చెప్పు.. ఇంకెప్పుడు బాక్సింగ్ ఆడనని ప్రమాణం చేసి చెప్పమని గంగతో శకుంతల అంటుంది. ఇక బాక్సింగ్ దగ్గర ఏం జరిగిందో గంగ ఏడుస్తూ చెప్తుంది. రుద్రకి ప్రాణహాని ఉందని తెలిసి నేను లాస్ట్ మినిట్ లో రింగ్ నుండి బయటకు వచ్చాను లేదంటే గెలిచేదాన్ని అని గంగ రిక్వెస్ట్ చేస్తుంది. నన్ను ఛాంపియన్ గా చేయాలనేది రుద్ర సర్ కల..దయచేసి దానిని పాడుచేయొద్దు.. కావాలంటే నేను ఏ శిక్ష అయిన భరిస్తాను నన్ను క్షమించండి అత్తయ్య అని శకుంతల కాళ్ళ మీద పడి ఏడుస్తుంది. ఇక గంగ ఏడ్వడం చూసి శకుంతల ఏం చేయలేకపోతుంది.
ఇక రుద్ర ఆలోచిస్తూ సూపర్ మార్కెట్ కి వెళ్తాడు. అందులో కూర్చొని ఆలోచిస్తుంటాడు. ఇక రుద్రని వెతుక్కుంటూ సూపర్ మార్కెట్ కి వెళ్తుంది గంగ. అదే సమయంలో మాస్క్ వేసుకున్న ఒకడు సూపర్ మార్కెట్ పైకి నిప్పు అంటించిన కర్రని విసిరేయడం గంగ చూస్తుంది. దాంతో వెంటనే లోపలికి వెళ్తుంది గంగ. నువ్వెందుకు వచ్చావ్ గంగ అని రుద్ర అడుగుతాడు. మీరెక్కడుంటే అక్కడే ఉంటానని గంగ అంటుంది. కాసేపటికి ఇద్దరు ఫైర్ నుండి బయటకి వస్తారు.
మరోవైపు ఇలా సూపర్ మార్కెట్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని విషయం ఇంట్లో తెలుస్తుంది. పెద్దసారు, శకుంతలతో పాటు ఇంట్లోని వాళ్ళంతా టెన్షన్ పడతారు. కాసేపటికి గంగ, రుద్ర ఇంటికి వస్తారు. వాళ్ళని చూసి అందరు కంగారుపడతారు. ఏం జరిగిందని శకుంతల అడుగుతుంది. గంగ ఏదో చెప్పబోతుంటే తనని రుద్ర ఆపి.. ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్తాడు. ఇంట్లో అన్నీ అశుభాలే జరుగుతున్నాయి.. అందుకే పెద్దవాళ్ళు చెప్పేది వినాలని శకుంతల అంటుంది.
మరుసటి రోజు రుద్ర ఒక్కడే కూర్చొని బాధపడుతుంటే ఇంట్లో ఉండే వాళ్ళు వచ్చి.. ఇది ఎలా జరిగిందని అడుగుతారు. ఇది ఫైర్ యాక్సిడెంట్ కాదని ఎవరో కావాలని చేశారని రుద్ర అంటాడు. దాంతో అందరు టెన్షన్ పడతారు. ఇక అప్పుడే వీరు వచ్చి టాపిక్ డైవర్ట్ చేయాలని చూస్తాడు.
ఇక గంగ కాఫీ తీసుకొని వచ్చి రుద్రకి ఇచ్చి వెళ్తుంటుంది. అదే సమయంలో ఒకతను వీరుని చూసి.. తలకి ఆ దెబ్బ ఎలా తగిలింది అని అడుగుతారు. అది వింటుంది గంగ. నిన్న ఫైర్ యాక్సిడెంట్ చేసిన వాడిని తలపై కొట్టింది గంగకి గుర్తొస్తుంది. వీడే ఫైర్ యాక్సిడెంట్ కి కారణం.. నేను రాయితో కొట్టానని గంగ అంటుంది. అది విన్న రుద్ర.. వెంటనే గంగని తన గదికి తీసుకొని వెళ్తాడు. ఏదైనా మాట్లాడేటప్పుడు సాక్ష్యాలతో మాట్లాడాలి.. నువ్వు నిరూపించలేనప్పుడు అలా అనకూడదు.. ఇంతకముందు నాకు ఇలాగే జరిగిందని గంగని రుద్ర హెచ్చరిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.