English | Telugu

ఆ సినిమా బ్యాన్‌ చెయ్యాలంటూ లేడీ గ్యాంగ్‌స్టర్‌ పిటిషన్‌.. 2 కోట్లు డిమాండ్‌!

వయొలెంట్‌ లవ్‌స్టోరీగా విజయ్‌ దేవరకొండ, సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను హిందీలో షాహిద్‌ కపూర్‌ హీరోగా ‘కబీర్‌ సింగ్‌’ పేరుతో రూపొందించారు సందీప్‌రెడ్డి. హిందీలో కూడా ఈ సినిమా సూపర్‌హిట్‌ అయింది. ఆ తర్వాత రణబీర్‌ కపూర్‌తో సందీప్‌ చేసిన ‘యానిమల్‌’ కూడా మోస్ట్‌ వయొలెంట్‌ మూవీగా నిలిచింది.

ఈ క్రమంలోనే షాహిద్‌ కపూర్‌ హీరోగా విశాల్‌ భరద్వాజ దర్శకత్వంలో హిందీలో ‘ఓ రోమియో’ పేరుతో ఓ సినిమా రూపొందింది. ఫిబ్రవరి 13న ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కాబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన స్టిల్స్‌, ట్రైలర్‌ ఆల్రెడీ విడుదలయ్యాయి. వాటిని పరిశీలిస్తే.. అది కబీర్‌సింగ్‌, యానిమల్‌ సినిమాలను పోలి ఉంది. సినిమాలో పరిధులు దాటిన హింస ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇప్పుడు ‘ఓ రోమియో’ సినిమా చట్టపరమైన చిక్కుల్లో పడిరది. ఈ చిత్రానికి సంబంధించి ముంబైకి చెందిన గ్యాంగ్‌స్టర్‌ హుస్సేన్‌ ఉస్తారా కుమార్తె సనోబర్‌ షేక్‌.. ‘ఓ రోమియో’ నిర్మాత సాజిద్‌ నడియాడ్‌వాలా, దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌లకు నోటీసులు పంపారు. ఈ సినిమా తన తండ్రి హుస్సేన్‌ ఉస్తారా జీవిత కథ ఆధారంగా రూపొందుతోందని, ఇందులోని కథ తన తండ్రికి వ్యతిరేకంగా ఉందని ఆమె ఆరోపిస్తున్నారు. అలా తమ కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు గానూ రూ.2 కోట్ల నష్టపరిహారాన్ని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు సినిమా విడుదలను నిలిపివేయాలని పిటిషన్‌ వేశారు.

ఈ సినిమా వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిందని ట్రైలర్‌లో ప్రస్తావించారు. దీంతో ఈ వివాదానికి బలం చేకూరింది. ఫిబ్రవరి 13న ‘ఓ రోమియో’ రిలీజ్‌ కాబోతోంది. ఇంకా నెలరోజుల వ్యవధి ఉంది. ఈలోగా ఈ సినిమాకి సంబంధించిన వివాదాన్ని కోర్టు ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంది. ఈ సినిమాలో షాహిద్‌ కపూర్‌, త్రిప్తి దిమ్రి, విక్రాంత్‌ మాస్సే, నానా పటేకర్‌, తమన్నా భాటియా, దిశా పటాని, అవినాష్‌ తివారీ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కమీనే, హైదర్‌, రంగూన్‌ తర్వాత షాహిద్‌, విశాల్‌ భరద్వాజ్‌ కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో సినిమా ఇది.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.