English | Telugu
Mana Shankara Vara Prasad Garu: మెగాస్టార్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దిశగా 'మన శంకర వరప్రసాద్ గారు'..!
Updated : Jan 16, 2026
- బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు'
- నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్ కి చేరువ
- చిరంజీవి కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ దిశగా పరుగులు
సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Vara Prasad Garu) మూవీ, బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. మేకర్స్ తెలిపిన ప్రకారం.. మొదటి రోజు ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.84 కోట్ల గ్రాస్ రాబట్టింది. అలాగే, మొదటి నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్ కి చేరువ కావడం విశేషం.
చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్ కావడం, దానికితోడు వెంకటేష్ ప్రత్యేక పాత్ర పోషించడంతో 'మన శంకర వరప్రసాద్ గారు'పై విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక సినిమాకి పాజిటివ్ టాక్ రావడం, సంక్రాంతి సెలవులు తోడు కావడంతో.. వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజు రూ.84 కోట్ల గ్రాస్ సాధించగా.. రెండో రోజు రూ.36 కోట్లు, మూడో రోజు రూ.32 కోట్లు, నాలుగో రోజు రూ.38 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. దీంతో మొదటి నాలుగు రోజుల్లోనే రూ.190 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ప్రస్తుత జోరు చూస్తుంటే.. ఆదివారం నాటికి రూ.250 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ రివ్యూ
చిరంజీవి కెరీర్ లో రూ.240 కోట్లకు పైగా గ్రాస్ తో 'సైరా నరసింహారెడ్డి', రూ.230 కోట్లకు పైగా గ్రాస్ తో 'వాల్తేరు వీరయ్య' టాప్ లో ఉన్నాయి. ఇప్పుడు 'మన శంకర వరప్రసాద్ గారు' మొదటి వారంలోనే ఆ వసూళ్లను దాటేసి, చిరంజీవి కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలవనుంది. అంతేకాదు, త్వరలోనే ఈ మూవీ రూ.300 కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్యంలేదు.