English | Telugu

గౌతమ్ పెళ్ళి తనకు నచ్చిన అమ్మాయితో జరుగుతుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -136 లో.. కృష్ణపై నుండి కిందకి వస్తుంది. ఇక అంత హాల్లో ఉండడం చూసి.. ఏసీపీ సర్ కి నేను నిజం చెప్పినట్లు తెలియకుండా మాట్లాడాలని కృష్ణ అనుకుంటుంది.  సర్ ఏంటి అలా ఉన్నారు.. ఏదో చెయ్యకూడనిది చేస్తున్నట్లని కృష్ణ అంటుంది. అప్పుడు పక్కనే ఉన్న ముకుంద.. నువ్వు కాలేజీకి వెళ్ళు.. మురారికి పెద్ద అత్తయ్య గారు ఒక పని అప్పజెప్పారు.. నువ్వేమైనా చిన్న పిల్లవా కాలేజీ కి ఒక్కదానివి వెళ్లలేవా అంటుంది. వెళ్తాను మీ పనికి మీరు వెళ్ళండి.. నా పనికి నేను వెళ్తాను.. ఎవరి పని ముందు అవుతుందో చూడాలని అంటుంది కృష్ణ.  ఆ తర్వాత భవాని దగ్గరికి వెళ్ళిన కృష్ణ.. అత్తయ్య నన్ను ఆశీర్వదించండి.. ఈ రోజు నేను ఆపరేషన్ పూర్తి చేస్తున్న అని చెప్పి తన ఆశీర్వాదం తీసుకుంటుంది. సర్ బయట వరకు నాతో రండని చెప్పి మురారిని తీసుకువెళ్తుంది కృష్ణ. ఇక కృష్ణ, మురార ఇద్దరు బయటకు వెళ్లగానే.. ఈ తింగరి పిల్లకి నిజం ఏమైనా తెలిసిందా అని భవాని అనగానే.. లేదు వదిన తెలిస్తే కృష్ణ అసలు ఇలా ఉండేది కాదని ఈశ్వర్ అంటాడు

మీ ఇద్దరి మధ్య ఏ విభేదాలు రాకుండా నేను చూసుకుంటాను!

స్టార్ మా టీవీలో ప్రసారమవవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -135 లో.. మా పెద్దమ్మ, కృష్ణలకి మాటిచ్చానని మురారి ఆలోచిస్తుంటాడు. మరోవైపు కృష్ణని తీసుకొని రేవతి మేడపైకి వెళ్తుంది. అసలు ఏం చేస్తున్నావ్ కృష్ణ అని రేవతి అడుగుతుంది.. ఎలాగైనా ఈ పెళ్లిని ఆపి గౌతమ్ సర్ తో నందిని పెళ్లి చేస్తానని కృష్ణ అంటుంది. మధ్యలో నీ కాపురం ఏమవుతుందో అని నాకు టెన్షన్ గా ఉంది కృష్ణా అని రేవతి అనగానే.. మీరేం టెన్షన్ పడకండి.. ఏసీపీ సర్ నాకు మాటిచ్చాడు.. నందు గురించి ఏసీపీ సర్ కి నిజం చెప్పాను.. అంతా సర్ చూసుకుంటానని అన్నాడని కృష్ణ అంటుంది. అటు వాళ్ళ పెద్దమ్మకి మాటిచ్చాడు. ఇటు నీకు ఇచ్చాడని రేవతి అంటుంది. భవాని అత్తయ్యకి కూడా మాట ఇచ్చాడా అని కృష్ణ తన మనసులో అనుకుంటుంది. ఏసీపీ సర్, భవాని అత్తయ్యల మధ్య ఏ విబేధాలు రాకుండా నేను చూసుకుంటాను.. మీరు వెళ్లి ప్రశాంతంగా పడుకోండని రేవతికి చెప్పి తనని పంపించేస్తుంది కృష్ణ

నందు విషయంలో సరికొత్త మలుపు.. మురారికి తెలిసిన నిజం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సూపర్ ట్విస్ట్ తో ముందుకు సాగుతుంది. మంగళవారం నాటి ఎపిసోడ్ -134 లో... రేవతి బెడ్ సర్దుతుంటే నందు, కిరణ్ ల పెళ్ళిపత్రిక కనిపిస్తుంది. అది చూసిన రేవతి షాక్ అవుతుంది. ఇన్ని రోజులు నేను దగ్గరికి వెళ్తే మాట మారుస్తూ మాట్లాడుకునేది ఇదేనా.. ఇంత విచక్షణ లేకుండా తయారవుతున్నారని రేవతి ఆ పెళ్లి పత్రిక తీసుకొని కృష్ణ దగ్గరికి వెళ్తుంది. కృష్ణ దగ్గరికి రేవతి వెళ్ళగానే.. ఏంటీ అత్తయ్య అని కృష్ణ అడుగుతుంది. ఇది చూడు నీకు కావలిసిన అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని ఆ పెళ్ళిపత్రికని ఇస్తుంది రేవతి. అది ఓపెన్ చేసి చూసేసరికి నందుకి పెళ్లి చేస్తున్నారని అర్థమై కృష్ణ షాక్ అవుతుంది. ఇన్ని రోజులు అమెరికాకి పంపిస్తున్నానంటూ చేసే ప్లాన్ ఇదేనా అని కృష్ణ అంటుంది. మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య.. నందు పెళ్లి ఎలాగైనా గౌతమ్ తో జరిపిస్తానని కృష్ణ అంటుంది. సరే అని చెప్పేసి రేవతి అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

వసుధార గదిలోకి రాగానే డోర్ లాక్ చేసిన రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -739 లో.. రిషి గదిలోకి వసుధార కాఫీ తీసుకొని వస్తుంది. రిషి వెనకాల నుంచి వచ్చి డోర్ గడియ పెడతాడు. ‌ఒక్కసారిగా వెనుకకు తిరిగి ఎవరా అని చూసి షాక్ అవుతుంది ‌వసుధార. తనకి క్లోజ్ గా వస్తుంటాడు రిషి. దాంతో వసుధారకి టెన్షన్ తో చెమటలు పడతాయి. ఆ తర్వాత భయంభయంగా కాఫీ తీసుకోండని అంటుంది. కాఫీ మళ్ళీ చేసుకోవచ్చు.. ఈ క్షణం మళ్ళీ రాదు కదా అని రొమాంటిక్ గా మాట్లాడతాడు రిషి. సర్ ఎవరో వస్తున్నారని వసుధార అంటుంది. వస్తే ఏంటి.. మనం పెళ్లి చేసుకోబోతున్నామని రిషి అంటాడు. పెళ్లి చేసుకోబోతున్నాం.. చేసుకోలేదు కదా సర్ అని వసుధార అంటుంది. ఈ శూన్యమాసం ఎప్పుడు అయిపోతుందో ఏంటో.. మనసు పలు విధాలుగా ఆలోచిస్తుందని రిషి అంటాడు. సర్ కాఫీ తాగండి‌‌.. చల్లారిపోతుందని చెప్పేసి వసుధార అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

అత్తారింటి నుండి రాజ్ రానని చెప్పడంతో బాధపడ్డ అపర్ణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -72 లో.. రుద్రాణి, అపర్ణ ఇద్దరూ కార్ లో వెళ్తూ.. కనకం వాళ్ళ ఇంటి అడ్రస్ ని దారిలో వెళ్తున్న స్వప్నని అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత కనకం ఇంటికి వెళ్తారు. మరోవైపు రాజ్ పడుకొని ఉండగా.. రాజ్  నడుముకి ఆయిట్‌మెంట్ రాయాలా అని అడుగుతుంది కావ్య. అది పట్టించుకోకుండా అసలు ఫస్ట్ నైట్ రోజు స్టోర్ రూమ్ లోకి ఎందుకు వచ్చాను? ఏం జరిగిందని అడుగుతాడు రాజ్. అప్పుడు కావ్య మీరు ఆయిట్‌మెంట్ రాసుకుంటే చెప్తానని అనగా, రాజ్ సరే అంటాడు. ఆ తర్వాత కావ్య అన్ని సగం సగం చెప్తుంది. మీరు తాగేసి నా గదిలోకి వచ్చారంటూ ఆయిట్‌మెంట్ రాస్తుండగా.. తనకి చెక్కిలిగింతలు అవుతున్నాయంటూ రాజ్ నవ్వుతాడు. ఇక అదే సమయంలో అపర్ణ, రుద్రాణి‌ ఇద్దరూ కనకం వాళ్ళ ఇంటి గుమ్మం దగ్గరికి వస్తారు. రాజ్ అలా నవ్వుతు ఉండడం చూసిన అపర్ణ.. నా కొడుకుని పూర్తిగా మార్చేశారంటూ బాధపడుతూ.. రాజ్ అని గట్టిగా పిలుస్తుంది

బెడ్ రూమ్‌లో నందు పెళ్ళి పత్రిక... కృష్ణని కొట్టడానికి చేయెత్తిన మురారి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -133 లో.. భవాని దగ్గరికి ఈశ్వర్ వచ్చి నందు పెళ్లి గురించి మాట్లాడుతాడు. నందుకి కాబోయే అత్తవారింట్లో మర్యాదలు బాగున్నాయి.. మన నందు వాళ్ళింట్లో హ్యాపీగా ఉంటుందని ఈశ్వర్ అంటాడు. అందుకే కదా ఈ పెళ్లి చేస్తున్నాను.. ఆ తింగరిపిల్లకి ఇదంతా తెలియకుండా ఉండాలి.. లేదంటే ఏ తింగరి పనైనా చేస్తుందని భవాని అంటుంది. ఆ తర్వాత కృష్ణ, మురారి లు రెస్టారెంట్ కి వెళ్ళి వస్తారు. వాళ్ళిద్దరిని చూసి రేవతి ఎక్కడికి వెళ్లారని అడుగుతుంది. మురారి రెస్టారెంట్ లో జరిగిందేమీ చెప్పకని కృష్ణకి చెప్పినా తనేం వినిపించుకోకుండా.. మేమిద్దరం స్వీట్స్ తినిపించుకున్నామని చెప్తుంది.