Read more!

English | Telugu

ఆ ప్రపోజల్ ని కాదన్న జగతి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -741లో రిషి గదిలోకి వసుధార వెళ్తుంటే దేవయాని ఆపి వద్దని చెప్తుంది. పెద్దమ్మ నేనే రమ్మన్నాను.. అనవసరంగా చిన్నదాన్ని పెద్దది చేస్తున్నారని దేవయానికి రిషి కౌంటర్ ఇచ్చి.. రా వసుధర అని తీసుకొని వెళ్తాడు. 

రిషి, వసుధారలు మెడికల్ కాలేజీ ప్లాన్ గురించి డిస్కస్ చేస్తుంటారు. ఈ మెడికల్ కాలేజీ నా కల మాత్రమే కాదు.. మా తాత గారి కల.. ఇప్పుడు నెరవేరుతుందను రిషి సంతోషంగా అంటాడు. మీకు ఈ విషయంలో ఏ సహాయం అయినా నేను చేస్తాను సర్ అని వసుధార అంటుంది. అప్పుడే టాబ్లెట్ మీద ఉన్న పేపర్స్ గాలికి కొట్టుకుపోతుంటే.. వసుధార వాటిని తీసుకురావడానికి వెళ్తుంది. అలా మేడపైన పేపర్స్ ని తీసుకుంటూ మేడ చివరి దాకా వెళ్తుంది వసుధార.. తనని అలా చివరిదాకా వెళ్లడం చూసిన రిషి.. వెంటనే వెనక్కి లాగుతాడు. బుద్ది ఉందా కళ్ళు కన్పించడం లేదా చూసుకోవాలి కదా అని వసుధారపై అరుస్తాడు రిషి. సర్ పేపర్స్ అంటూ వసు చెప్తుండగా.. వెళ్ళు ఇక్కడ నుండి అని రిషి అంటాడు. ఇక వసు అలిగి బుంగమూతి పెట్టి వెనక్కి చూస్తూ వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం రిషి రెడీ అయి వసుధార దగ్గరికి వస్తాడు. పదా వసుధార.. వెళదామని రిషి అంటాడు. లేదు సర్ నాకు లేట్ అవుద్ది అంటూ బెట్టు చేస్తుంది వసుధార. సరే నేను వెళ్తున్నానని వెళ్ళిపోతాడు రిషి. వసుధార నడుచుకుంటూ వెళ్తుంటే.. దార్లో తన కోసం రిషి వెయిట్ చేస్తూ ఉంటాడు. వసుధార రిషిని చూడనట్టుగా పక్కనుండి వెళ్ళిపోతుంది. రిషి తనని అలానే చూస్తూ ఉండేసరికి.. ఏంటి సర్ అలానే చూస్తున్నారని అడుగుతుంది. నేను నీ వైపేం చూడట్లేదని రిషి అంటాడు. కాసేపు వసుధార రిషిని దబాయిస్తుంది. ఆ తర్వాత కార్ ఎక్కి కూర్చుంటుంది. ఏంటీ రానన్నావ్ కదా అని రిషి అంటాడు. వస్తానని వసుధార అంటుంది. ఇద్దరు నవ్వుకుంటారు.. ఇదే ప్రేమంటే.. అలగడాలు.. మళ్ళీ కలిసిపోవడలని వసుధార అంటుంది. ఆ తర్వాత రిషికి సౌజన్యరావు ఫోన్ చేసి ప్రపోజల్ తో రెడీ గా ఉన్నామని అంటాడు. నేను బిజీగా ఉన్నాను సర్.. మీ దగ్గరికి జగతి మేడం, వసుధారలని పంపిస్తున్నానని రిషి ఫోన్ లో సౌజన్యరావుకి చెప్తాడు.

ఆ తర్వాత జగతి, వసుధారలు‌ కలిసి సౌజన్యరావు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతారు. మీ ప్రపోజల్ ఏంటి సర్ అని వసుధార అడుగుతుంది. మా కాలేజీలో మీ కాలేజీని కలపాలి.. ఎందుకంటే మీ కాలేజీ కంటే మా కాలేజీ ముందు స్టార్ట్ చేసామని సౌజన్యరావు అనగానే.. జగతి వసుధారలు షాక్ అవుతారు. మా కాలేజీ అంటే రిషి కి ప్రాణం.. అసలు దీనికి మేము ఒప్పుకోము.. ఇంతటితో దీన్ని ఆపేద్దామని జగతి అంటుంది. మీరు అనుకున్నది జరగదని చెప్పి ఇద్దరు నుండి వెళ్ళిపోతారు. దీన్ని ఎలా ఒప్పుకోరో నేను చూస్తానని సౌజన్యరావు తన మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.