Read more!

English | Telugu

సౌజన్యరావు కన్నింగ్ ప్లాన్.. రిషి పసిగట్టేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -740లో.. DBST కాలేజీకి సౌజన్యరావు వస్తాడు. DBST కాలేజీ బోర్డు చూసి అది పీకేసి MSR అని పెట్టాలని అనుకుంటాడు. ఇక డైరెక్ట్ రిషి క్యాబిన్ కి వెళ్లి కూర్చుంటాడు సౌజన్యరావు. అప్పుడే రిషి తన క్యాబిన్ కి వెళ్ళగా.. అక్కడ ఉన్న సౌజన్యరావుని అనుమానంగా చూస్తూ లోపలికి వస్తాడు. MSR కాలేజ్ లు నావే అని సౌజన్యరావు తనను తాను పరిచయం చేసుకుంటాడు. అవునా మీ గురించి విన్నానంటూ రిషి మాట కలుపుతాడు.  

ఆ తర్వాత తన కన్నింగ్ ప్లాన్ తో రిషిని పొగడటం స్టార్ట్ చేస్తాడు సౌజన్యరావు. ఇదంతా నా గొప్పతనం కాదు. మా తాతయ్య, పెద్ద నాన్న, డాడ్ వాళ్ళది. నేను ఆ గౌరవాన్ని కాపాడుతూ.. ఒక మెట్టు పైకి తీసుకొచ్చానని రిషి అంటాడు. మీరు మెడికల్ కాలేజీ స్టార్ట్ చేస్తున్నారని విన్నాను. అందులో నేను కూడా భాగస్వామ్యమవుదామని అనుకుంటున్నాను.. మీరు ఏమంటారని సౌజన్యరావు అడుగుతాడు. మీరు మాతో కలిసి పని చేస్తానంటే మాకు సంతోషమే అని రిషి అంటాడు. మరి మీరు మాతో కలిసి ఏ విధంగా సహకరిస్తారో.. ఎలా ముందుకు వెళ్తారో టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఒక పేపర్ రూపంలో ఉంటే బాగుంటుందని రిషి అంటాడు. నేను వచ్చేటప్పుడే పేపర్స్ అన్ని తీసుకొద్దామని అనుకున్నా కానీ ఫస్ట్ మీటింగ్ లోనే ఎందుకని తీసుకురాలేదని సౌజన్యరావు అంటాడు. అప్పుడే వసుధారకి రిషి కాల్ చేసి తన క్యాబిన్ కి రమ్మంటాడు. కాసేపటికి వసుధార వస్తుంది. సౌజన్య రావుని పరిచయం చేసి.. మనం స్టార్ట్ చేస్తోన్న మెడికల్ కాలేజీలో మనతో కలిసి వీళ్ళు పని చెయ్యాలనుకుంటున్నారని వసుధారతో రిషి చెప్తాడు. ఆ తర్వాత తను ఫ్రీగా ఉన్నప్పుడు తర్వాతి మీటింగ్ ఏర్పాటు చేయమని వసుధారకి రిషి చెప్తాడు.

కాసేపటికి సౌజన్యరావు వెళ్తూ.. మిమ్మల్ని ఎవరో అటాక్ చేసారంట కదా.. ఏ ఫీల్డ్ లో అయినా శత్రువులు ఉంటారు.. మనం జాగ్రత్తగా ఉండాలని సౌజన్యరావు అంటాడు. శత్రువులకి ఈ రిషి సర్ సంగతి తెలియదని వసుధార కౌంటర్ వేస్తుంది. ఆ తర్వాత సౌజన్యరావు ఇద్దరికీ బై చెప్పేసి వెళ్ళిపోతాడు. రిషి ఇంటికి వెళ్ళి సౌజన్యరావు గురించి చెప్పి.. మనతో కలిసి వర్క్ చేస్తున్నారని చెప్తాడు. ఆ తర్వాత వసుధారని తన గదిలోకి రమ్మంటాడు రిషి. వసుధార వెళ్తుంటే.. ఈ టైంలో రిషి గదిలోకి ఎందుకని దేవయాని ఆపుతుంది. ఇంతలో రిషి వచ్చి.. నేనే రమ్మని చెప్పాను అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే