Read more!

English | Telugu

నందు విషయంలో సరికొత్త మలుపు.. మురారికి తెలిసిన నిజం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సూపర్ ట్విస్ట్ తో ముందుకు సాగుతుంది. మంగళవారం నాటి ఎపిసోడ్ -134 లో... రేవతి బెడ్ సర్దుతుంటే నందు, కిరణ్ ల పెళ్ళిపత్రిక కనిపిస్తుంది. అది చూసిన రేవతి షాక్ అవుతుంది. ఇన్ని రోజులు నేను దగ్గరికి వెళ్తే మాట మారుస్తూ మాట్లాడుకునేది ఇదేనా.. ఇంత విచక్షణ లేకుండా తయారవుతున్నారని రేవతి ఆ పెళ్లి పత్రిక తీసుకొని కృష్ణ దగ్గరికి వెళ్తుంది. కృష్ణ దగ్గరికి రేవతి వెళ్ళగానే.. ఏంటీ అత్తయ్య అని కృష్ణ అడుగుతుంది. ఇది చూడు నీకు కావలిసిన అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని ఆ పెళ్ళిపత్రికని ఇస్తుంది రేవతి. అది ఓపెన్ చేసి చూసేసరికి నందుకి పెళ్లి చేస్తున్నారని అర్థమై కృష్ణ షాక్ అవుతుంది. ఇన్ని రోజులు అమెరికాకి పంపిస్తున్నానంటూ చేసే ప్లాన్ ఇదేనా అని కృష్ణ అంటుంది. మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య.. నందు పెళ్లి ఎలాగైనా గౌతమ్ తో జరిపిస్తానని కృష్ణ అంటుంది. సరే అని చెప్పేసి రేవతి అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

మరోవైపు నందు ఫోటో పట్టుకొని గౌతమ్.. నా గురించి అలోచించి అలోచించి నువ్వు అలా అయ్యావ్. మన పెళ్ళయ్యాక నిన్ను మాములు మనిషిని చేస్తానని అంటాడు. మరోవైపు నందు గురించి కృష్ణ ఆలోచిస్తుండగా తన దగ్గరికి మురారి వస్తాడు. సారీ కృష్ణ.. పెద్దమ్మ కి ఇప్పటివరకు ఎదురుతిరగలేదు. నువ్వు అలా మాట్లాడేసరికి నేనలా చేయవలిసి వచ్చిందని అంటాడు. నాకు కొంచెం టైం పట్టుద్ది ఏసీపీ సర్ అని కృష్ణ అంటుంది. ఇక కృష్ణ కోపం తగ్గించడానికి కామెడీగా మాట్లాడుతాడు మురారి. ఇప్పుడు కామెడీగా మాట్లాడొద్దని కృష్ణ అనగానే.. సరే సీరియస్ గా మాట్లాడుకుందామని గౌతమ్ పెళ్లి గురించి మాట్లాడేసరికి.. ఆ పెళ్లి జరిగేలా లేదని కృష్ణ అంటుంది. ఎందుకు జరగదు.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏదైనా నేను జరిపిస్తానని చెప్పాను కదా అని మురారి అనగానే.. మీ పెద్దమ్మను ఎదురించి పెళ్లి చెయ్యగలరా అని కృష్ణ అనగానే.. మురారి ఆశ్చర్యంగా చూస్తాడు. గౌతమ్ సార్ ప్రేమించింది ఎవరినో కాదు నందుని.. మీరు ట్రైనింగ్ లో ఉన్నపుడు ఇదంతా మీకు తెలియకుండా జరిగింది. ఆ షాక్ లో నందు గతం మర్చిపోయింది. ఇంకా నందుకి గతం గుర్తు రాకుండా ఉండడానికి టాబ్లెట్స్ కూడా వాడతున్నారు మీ పెద్దమ్మ, మీ నాన్న, మీ బాబాయ్ అని కృష్ణ చెప్పగానే.. అవును ఇదంతా నాకేం తెలియదని మురారి అంటాడు. ఇప్పుడు చెప్పండి సర్ మీ పెద్దమ్మని ఎదురించి గౌతమ్, నందుల పెళ్లి చేస్తారా అని కృష్ణ అనగానే.. నందు జీవితం గురించి అలోచించి ఈ పెళ్లి చేస్తానని.. కృష్ణకి చేతిలో చెయ్యి వేసి మాటిస్తాడు. అప్పుడు కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది.

ఆ తర్వాత మురారి ఒంటరిగా కూర్చొని.. ఒకవైపు పెద్దమ్మకి మాటిచ్చాను, మరోవైపు కృష్ణకి మాటిచ్చానని ఆలోచిస్తాడు. ఇక ఇద్దరు మురారిని నిలదీస్తున్నట్లు ఉహించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే