Read more!

English | Telugu

చాటుగా ఇంట్లోకొచ్చి రాజ్‌కి దొరికిపోయిన స్వప్న!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -74 లో..  రాజ్ బెడ్ పై నిద్రపోతుంటాడు. సడెన్ గా మెలుకువ వచ్చి నిద్ర లేచి నేలపై పడుకున్న కావ్యని చూసి జాలిపడుతుడు. ఇక తన దుప్పటి తీసి కావ్యకి కప్పుదామనుకుంటాడు. ఇక వెంటనే నేనేంటి స్వప్న కోసం వచ్చి‌ ఈ కావ్య పై జాలిపడుతున్నాను..  ఛీఛీ అని రాజ్ అనుకుంటాడు.. ఇక డోర్ తిసి రాజ్ బయటకు వెళ్తాడు. అప్పుడే చాటుగా డోర్ తీసుకొని స్వప్న లోపలికి వస్తుంది. ఇక ఒకరికొకరు చూసుకోకుండా డాష్ ఇచ్చుకుంటారు. అలా ఇద్దరు ఒకరికొకరు చూసుకొని షాక్ అవుతారు.

స్వప్నని చూసిన రాజ్.. రా నువ్వు వస్తావని నాకు తెలుసు అంటూ కోప్పడతాడు. అసలు నువ్వు పెళ్లి మండలం నుండి ఎందుకు వెళ్లిపోయావ్? ఎవరు నిన్ను వెళ్లమన్నారు? నన్ను ఎందుకు ఇలా మోసం చేసావని స్వప్నని రాజ్ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతాడు. అప్పుడే రాజ్ గదిలో లేకపోవడంతో కావ్య బయటకు వస్తుంది. స్వప్నని చూసి షాక్ అవుతుంది. మా పరువు తీసి ఏ మొహం పెట్టుకొని వచ్చావని కావ్య అంటుంది. భలే నటిస్తున్నావని కావ్యని రాజ్ అంటాడు. నువ్వు ముందు పక్కకి జరుగు.. ఏ వీర వనిత నీ సంగతి నేను తెలుస్తానని స్వప్నతో రాజ్ అంటాడు.  నేను పెళ్లి మండపం నుండి వెళ్ళింది నిజమే కానీ కావ్య మిమ్మల్ని కావాలని చేసుకుందని స్వప్న అంటుంది. కావ్య షాక్ అవుతూ.. చేసిందంతా చేసి నా మీద నెట్టేస్తున్నావా అని స్వప్న పై చెయ్ చేసుకుంటుంది కావ్య. మళ్ళీ తిరిగి స్వప్న కూడా కావ్యను కొడుతుండగా రాజ్ ఆపుతాడు. కావ్య, స్వప్నలను తిట్టి తన గదిలోకి వెళ్ళిపోతాడు రాజ్.

బయట ఏదో మాటలు వినిపిస్తున్నాయని కనకం బయటకు వస్తుంది. స్వప్నని చూసి షాక్ అవుతుంది. కనకం రాగానే మళ్ళీ యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది స్వప్న. కనకం మీద పడి.. నన్ను క్షమించమ్మా అని ఏడుస్తుంది. అలా అనగానే కనకం స్వప్నని వెనక్కి నెట్టేస్తుంది. ఎవర్తివే నువ్వు.. నా పెద్ద కూతురు ఎప్పుడో చచ్చిపోయింది.. నా ముందు కన్పించకంటు తన విశ్వరూపం చూపిస్తుంది కనకం. అప్పుడే కావ్య వాళ్ళ పెద్దమ్మ, చెల్లి అప్పులు కూడా బయటకు వచ్చి స్వప్నని చూస్తారు. ఏ మొహం పెట్టుకొని వచ్చావే అని కనకం అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.