Read more!

English | Telugu

ఇన్ స్టాగ్రామ్ లో కాజల్ క్వశ్చనింగ్!

ఆర్జే కాజల్.. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న డబ్బింగ్ ఆర్టిస్ట్..  ఆర్జే గా  తన కెరీర్ స్టార్ట్ చేసిన కాజల్.. రెడ్ FM లో వర్క్ చేస్తూ అనేక సీరియల్స్ కి డబ్బింగ్ చెప్తుంది. అలాగే తన పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి సెలబ్రిటీ లను ఇంటర్వ్యూ చేస్తూ.. యూట్యూబర్ గా పేరు సంపాదించుకుంది. అంతేకాకుండా బిగ్ బాస్-5 లోకి డబ్బింగ్ ఆర్టిస్ట్ కేటగిరీ లో అడుగుపెట్టింది.  అప్పటివరకు తెర వెనకాలే ఉన్న కాజల్.. బిగ్ బాస్ ఎంట్రీతో ఫేమ్ లోకి వచ్చింది.

అయితే ప్రస్తుతం 'జానకి కలగనలేదు' సీరియల్ లో హీరోయిన్ కి డబ్బింగ్ చెప్తుంది కాజల్. రీసెంట్ గా‌ ఈటీవి విన్ ఓటీటీ వేదికలో రిలీజ్ అయిన 'అసలు' మూవీలోని హీరోయిన్ పూర్ణకి కాజలే డబ్బింగ్ చెప్పింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడీయా, యూట్యూబ్ లలో తన గురించి అప్‌డేట్స్ ని ఇస్తూ ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటూ వస్తోంది కాజల్. అయితే  కాజల్ తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో 'ఆస్క్ మీ క్వశ్చన్' ని స్టార్ట్ చేసింది. మీ ఫేవరెట్ ప్లేస్ ఎక్కడ అక్క అని ఒక అభిమాని అడుగగా.. రామప్ప నాకిష్ణమైన ప్లేస్ అని కాజల్ చెప్పింది. క్రేజీ టాక్స్ విత్ కాజల్ స్టార్ట్ చెయ్ అక్క అని ఒకరు అడగగా.. రంజాన్ పూర్తయ్యాక స్టార్ట్ చేస్తానని అంది కాజల్. గీతు గురించి ఏమైన చెప్పండని ఒకరు ప్రశ్నించగా.. సేమ్ నాలాగే అనిపిస్తుంది. కానీ నాకన్నా కొంచెం ఎక్కువ.. లోపల అలా ఉన్నానా అని నేను బిగ్ బాస్ లో నుండి బయటకొచ్చాక చూసుకుంటే మర్చిపోవాడానికి నాకే సంవత్సరం పట్టింది..  కానీ గీతు గ్రేట్.. లాట్ ఆఫ్ లవ్స్ గీతు అని తనకి ట్యాగ్ చేసింది కాజల్. 

'అసలు' మూవీలో పూర్ణ వాయిస్ మీదే కదా అని ఒకరు అడుగగా.. అవును.. కొంతమంది ఫోన్ చేసి మరీ అభినందించారని కాజల్ చెప్పింది. ప్రియాంక సింగ్ గురించి చెప్పండని ఒక అభిమాని అడుగగా.. తన ఫోటో పెట్టి నెక్స్ట్ టైం మనం కలిసి ఫోటో దిగుదామని చెప్పి ప్రియాంక సింగ్ కి ట్యాగ్ చేసింది కాజల్. ఒక ఫంక్షన్ లో మిమ్మల్ని కలిసాను.. ఫ్యాన్స్ ని రిసీవ్ చేసుకునే తీరైతే సూపర్ అక్క అని ఒక అభిమాని అడుగగా.. థాంక్ యూ.. కానీ చాలా అరుదుగా నా కంట్రోల్ తప్పుతాను.. అలాంటప్పుడు ఆకలవుతుందనో, లేట్ అవుతుందనో లేక ఓపిక లేదనో అర్థం చేస్కోండని కోరుకుంటానని చెప్పింది కాజల్. ఇలా తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చింది కాజల్. బిబి‌ జోడిలో చైతూతో కలిసి డ్యాన్స్ చేసిన ఈ కాజల్ మళ్ళీ ప్రేక్షకులకు స్క్రీన్ పై ఎలా కన్పిస్తుందో చూడాలి మరి.