Read more!

English | Telugu

వసుధార గదిలోకి రాగానే డోర్ లాక్ చేసిన రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -739 లో.. రిషి గదిలోకి వసుధార కాఫీ తీసుకొని వస్తుంది. రిషి వెనకాల నుంచి వచ్చి డోర్ గడియ పెడతాడు. ‌ఒక్కసారిగా వెనుకకు తిరిగి ఎవరా అని చూసి షాక్ అవుతుంది ‌వసుధార. తనకి క్లోజ్ గా వస్తుంటాడు రిషి. దాంతో వసుధారకి టెన్షన్ తో చెమటలు పడతాయి. ఆ తర్వాత భయంభయంగా కాఫీ తీసుకోండని అంటుంది. కాఫీ మళ్ళీ చేసుకోవచ్చు.. ఈ క్షణం మళ్ళీ రాదు కదా అని రొమాంటిక్ గా మాట్లాడతాడు రిషి. సర్ ఎవరో వస్తున్నారని వసుధార అంటుంది. వస్తే ఏంటి.. మనం పెళ్లి చేసుకోబోతున్నామని రిషి అంటాడు. పెళ్లి చేసుకోబోతున్నాం.. చేసుకోలేదు కదా సర్ అని వసుధార అంటుంది. ఈ శూన్యమాసం ఎప్పుడు అయిపోతుందో ఏంటో.. మనసు పలు విధాలుగా ఆలోచిస్తుందని రిషి అంటాడు. సర్ కాఫీ తాగండి‌‌.. చల్లారిపోతుందని చెప్పేసి వసుధార అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

మరోవైపు మహేంద్ర నోటిలో జగతి చెక్కరపోసి సంతోషంగా ఉందని చెప్తుంది. ఈ సంతోషం ఎందుకు? రిషి, వసుధారల పెళ్లి జరుగుతుందనేనా? అని మహేంద్ర అడుగుతాడు. అవును మహేంద్ర పెళ్ళికి దేవయాని అక్క ఏమైనా సమస్య తీసుకొస్తుందని భయపడ్డాను.. కానీ రిషి ఇంకోసారి దేవయాని అక్క నోరు తెరవకుండా మంచి సమాధానం చెప్పాడని జగతి అంటుంది. ఒక తల్లిగా నీ చేతుల మీదుగా రిషి పెళ్లి చేసే అవకాశం దేవయాని ఇవ్వకపోవచ్చు.. చూసే అవకాశం మాత్రమే ఉంటుందని మహేంద్ర అంటాడు. దానికి జగతి బాధపడుతుంది. పెళ్లి చూసి సంతోషిస్తానని ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత రిషి, వసుధారలు కాలేజీకి కార్ లో బయల్దేరుతారు. థాంక్యూ సర్.. నన్ను అర్థం చేసుకున్నందుకని వసుధార అంటుంది. నీ బాధ, నీ అలక, నీ సిగ్గు.. అవన్నీ నేను అర్థం చేసుకోగలనని రిషి అంటాడు. "నీకన్నా నాకు భయం ఎక్కువగా ఉంటుంది.. మీ ఊర్లో ఏం జరిగిందో.. ఆ విషయాలు అన్ని గుర్తు చేసుకుంటే బాధగా ఉంటుంది.. నిన్ను వదిలి ఒక్క రోజు కూడా ఉండలేను" అని రిషి అంటాడు. మీరు ఉన్నా కానీ నేను ఉండలేనని వసుధార అంటుంది. ఈ ఎండీ సర్ చెప్పినా వినవా? అని రిషి అనగానే.. కొన్ని కొన్ని వింటాను అని వసుధార అంటుంది. నువ్వు నాపై అధికారం చెలాయిస్తున్నావని నాకనిపిస్తుంది అని రిషి అనగానే.. అది ఎప్పుడు జరగదు సర్.. మీపై ప్రేమ మాత్రమే ఉంటుందని వసు అంటుంది.

ఆ తర్వాత రిషి, వసుధారలు కాలేజీకి వెళ్ళగానే పేపర్ లో వచ్చిన న్యూస్ గురించి తెలుస్తుంది. ఇక ఇద్దరు మహేంద్ర క్యాబిన్ కి వెళ్తారు. అక్కడే జగతి, మహేంద్ర ఫణింద్ర ఉంటారు. రిషి, వసు ల కిడ్నాప్ గురించి పేపర్ లో రావడం చూసిన మినిస్టర్ గారు ఫోన్ చేసి.. ఏమైందని కనుక్కుంటారు. మీరేం టెన్షన్ పడకండి సర్.. నేను చూసుకుంటానని మినిస్టర్ తో రిషి అంటాడు. మన కాలేజీ జోలికి ఎవరు రారని మహేంద్ర, ఫణింద్ర వాళ్ళకి చెప్తాడు రిషి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.