కేవీపీ చక్రం ఎందుకు తిప్పారు?

  గులాం నబి ఆజాద్ “నెల అంటే సరిగా ముప్పై రోజులు కాదంటూ” నిన్న డిల్లీలో చేసిన ప్రకటనతో తెలంగాణా ఒక్కసారిగా భగ్గుమంది. తెలంగాణావాదులు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పైన విరుచుకుపడుతూనే మరో వైపు సీమంద్రా నాయకుల నిర్వాకాన్నివారు నిరసిస్తున్నారు. తెలంగాణావాదులందరూ కూడా దీనికి ఒకే ఒక్క వ్యక్తి కేవీపీ రామచంద్ర రావు కారకుడని ఆయన మీద తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. నిన్న మొన్నటి వరకూ కూడా తెలంగాణాకి అనుకూలంగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ, ఇక నేడో రేపో తెలంగాణా ఇచ్చేస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నఈ తరుణంలో ఆకాశం నుంచి ఉడిపడినట్లు ఊడిపడిన కేవీపీ, సీమంద్రా నేతలను వెంట బెట్టుకొని డిల్లీ వెళ్లి, అక్కడ తనకున్న పూర్వ పరిచయాలను ఉపయోగించుకొంటూ కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడగానే మొత్తం పరిస్థితి ఒక్కసారిగా తారుమారవడం తెలంగాణావాదులు జీర్ణించుకోలేకపోతున్నారు.   అసలు ఇంతవరకు తెలంగాణా, సమైక్యాంధ్ర ఉద్యమాలలో కలుగజేసుకోని కేవీపీకి ఆకస్మాతుగ్గా సమైక్యాంద్రా పట్ల ఇంత ఆసక్తి ఎందుకు కలిగింది? అని ప్రస్నించుకొన్న తెలంగాణావాదులకి అతని వెనుకున్నజగన్ మోహన్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కనబడ్డాయి. తెలంగాణా ఉద్యమంలో మొదటినుంచి చురుకుగా పాల్గొంటున్న కాంగ్రెస్ యం.పీ. మధుయాష్కీ, చాప క్రింద నీరులా చేరిన కేవీపీ కాంగ్రెస్ అధిష్టానం మనసు మార్చేడని నిప్పులు గక్కుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నపటికీ అయన జగన్ మోహన్ రెడ్డికే అనుకూలంగా పనిచేస్తున్నాడని, ఆ కారణంగానే అతని ఆదేశాలు పాటిస్తూ కేవీపీ ఈ రాయభార కార్యక్రమం జరిపి కాంగ్రెస్ పెద్దల మనసు మార్చగలిగేడని మధుయాష్కీ ఆరోపించారు.   మొన్నటి వరకూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే మీరెన్ని సీట్లు సాదించలరూ? అని సీమాంధ్రా నేతలను ఎదురు ప్రశ్నించిన కాంగ్రెస్ పెద్దలు, జగన్ మోహన్ రెడ్డి రాయభారిగా వచ్చిన కేవీపీ భరోసాతో ఒక్కసారిగా తెలంగాణా పై మాట మార్చడం తెలంగణావాదులను ఆశ్చర్యపరిచినా, నిజానికి గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ నేతలు ఒకరి తరువాత మరొకరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తుల గురించి మాట్లాడుతూనే ఉండటం వారు గమనించలేదని తెలుస్తోంది. రానున్న ఎనికలలో ఆ రెండు పార్టీలు జతకట్టి రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం సంపాదించుకోవడమే లక్ష్యంగా సాగిన ఈ చదరంగంలో కేవీపీ, జగన్, కాంగ్రెస్ అధిష్టానం ముగ్గురూ కలిసి ఆడిన చదరంగంలో అమాయుకులయిన కాంగ్రెస్ తెలంగాణా వాదులు ఓడిపోయారని చెప్పక తప్పదు.   ఇక ఈ ఆటని మరింత వెనక్కి వెళ్లి మనం చూడగలిగితే, గతంలో తన తండ్రి స్వర్గీయ వైయస్స్ రాజశేకర్ రెడ్డి కూడా తెలంగాణాను వ్యతిరేఖించేవారు గనుక, ఇప్పుడు అయన కొడుకు జగన్ మోహన్ రెడ్డి కూడా తన తండ్రి అడుగు జాడల్లోనే నడవాలనే ప్రయత్నంలోనే ఇప్పుడు తెలంగాణాను అడ్డుకొని ఉండవచ్చును. కేవీపీ కూడా ఆ గూటి చిలకే గనుక, జగన్ ప్రోద్బలంతో ఈ విదంగా తెలంగాణాకు అడ్డుపడి ఉండవచ్చును. క్రిందటి నెల జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఒక్క వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెలంగాణాకు అనుకూలంగా మాట్లాడకుండా మౌనం వహించడం కూడా జగన్ తెలంగాణాను వ్యతిరేఖిస్తునట్లు అర్ధమవుతుంది.   అయితే, తెలుగుదేశం పార్టీకి చెందిన తెలంగాణా నేతల నుండి కూడా ఇంతవరకు సరయిన స్పందన రాకపోయినా ఎందుకు పట్టించుకోలేదని ఆలోచిస్తే, వారు తెలుగుదేశం పార్టీ నిజంగానే ఈ సారి తెలంగాణకు అడ్డుపడలేదని నమ్మడమే ఒక కారణం.   కాంగ్రెస్ తెలంగాణా వాయిదా ప్రకటన చేసిన తరువాత కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణా వాదులెవరూ నోరేత్తకపోవడం, ముఖ్యంగా అచ్చ తెలంగాణావాది అయిన కొండా సురేఖ కూడా ఏమి మాట్లాడకపోవడంతో తెరాస నేతలు అందరూ కూడా జగన్ మోహన్ రెడ్డినే అనుమానిస్తున్నారు.   అయితే, తెలంగాణా ఏర్పడటంవల్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్తగా వచ్చే లాభం గానీ నష్టం గానీ ఏమీ ఉండవు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడినట్లయితే, మొదటి అవకాశం తెరాసాయే పొందుతుంది. ఏర్పడకపోతే, తెలంగాణా సెంటిమెంటుతో ఆ పార్టీ విజయావకాశాలు మరింత మెరుగవుతాయి. కాంగ్రెస్ పరిస్థితి దీనికి బిన్నం కాదు. మరి అటువంటప్పుడు ఆ రెండు పార్టీలు వేరే ఏ ప్రయోజనం ఆశించి తెలంగాణాను అడ్డుకొంటున్నాయో వారికే తెలియాలి.

జగన్ కాంగ్రెస్ హస్తం అందుకొంటాడా లేదా?

  ఇంతకాలం జగన్ మోహన్ రెడ్డిని అవినీతిపరుడంటూ జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీ సిగ్గు బిడియం, నీతి నియమం అన్నీకూడా పక్కన పెట్టేసి ఇప్పుడు అదే జగన్ తో చేతులు కలుపుదామని తహతహలాడిపోతోంది. అయితే, జైల్లో మగ్గిపోతున్నపటికీ జగన్ వైపు నుండి ఇంతవరకు సానుకూలంగా స్పందన రాలేదు. ఇంతకీ జగన్ కాంగ్రెస్ ‘హస్తం’ అందుకొంటాడా లేక బెయిలు కోసం చంద్రుని కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తూనే ఉండిపోతాడా? అని ఆలోచిస్తే కొన్ని ఆసక్తికరమయిన అంశాలు కనబడతాయి.   తనని జైల్లోవేసి దుర్బర జీవితాన్నిరుచి చూపించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేయందించినంత మాత్రాన్నఅందుకొనడానికి జగన్ మోహన్ రెడ్డి ఆసక్తి చూపకపోవచ్చును. ఎందుకంటే, ఇప్పటికే అతను 8 నెలలుగా ఏ విచారణ ఎదుర్కోకుండా రిమాండ్ ఖైదీగా జైల్లో ఉంటున్నాడు. ఒక పక్క, తనకు ప్రభుత్వం సహకరించట్లేదని సిబిఐ స్వయంగా కోర్టుకు చెపుతుంటే, మరో వైపు జగన్ తరపు లాయర్లు సిబిఐకు సహకరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కోరుండే జాప్యం చేస్తున్నందున తమ క్లయింటు జగన్ మోహన్ రెడ్డికి తీరని అన్యాయం జరుగుతోందని కోర్టుకి స్పష్టం చేస్తూ అతని బెయిలు కోరుతున్నారు. అందువల్ల, ఈ రోజు కాకపోయినా రేపయిన తనకి కోర్టే స్వయంగా బెయిలు మంజూరు చేస్తుందని గట్టి నమ్మకంతో ఉన్న జగన్, ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ సాయం తీసుకొని దానికి ప్రయోజనం చేకూర్చడం ఎందుకని ఆలోచిస్తూ ఉండవచ్చును.   కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడంవల్ల, ఇంతకాలం చేసిన పోరాటం వృధా అవడమే కాకుండా, ప్రజల ముందు విస్వసనీయతగురించి పెద్ద పెద్ద మాటలు చెప్పిన తమ పార్టీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ప్రజల ముందుకు వెళ్ళినట్లయితే తమ ‘విస్వసతనీయత’ కి కళంకం అంటుకొంటుందని ఆయన భావిస్తూ కాంగ్రెస్ కి దూరంగా ఉండిఉండవచ్చును.   ఇక, రాష్ట్ర రాజకీయాలలో తన ప్రాభల్యాన్ని సరిగ్గానే అంచనా వేసిన కాంగ్రెస్ పార్టీకి తన అవసరం ఉంది తప్ప తనకి ఆ పార్టీ అవసరం లేదని జగన్ గుర్తించడం మరో కారణం కావచ్చును. తనతో చేతులు కలిపితే, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మళ్ళీ అధికారం కైవసం చేసుకొని లాభ పడుతుంటే, కేసుల నుండి బయట పడటం తప్ప తనకి కొత్తగా ఒరిగేదేమీ ఉండదని జగన్ మోహన్ రెడ్డి భావించడం వల్ల కాంగ్రెస్ సంకేతాలకు సానుకూలంగా స్పందించట్లేదని అనుకోవచ్చును. అందువల్ల కొంత కాలం వేచి చూసి పరిస్థితులను బట్టి ఎన్నికల పొత్తుల గురించి స్పందించడం మేలని జగన్ భావిస్తుండవచ్చును.   ఇక కాంగ్రెస్ వైపు నుంచి ఆలోచిస్తే, ఎన్నికలకి ఇంకా చాలా సమయమే ఉంది కనుక, ఇప్పటికిప్పుడు జగన్ మోహన్ రెడ్డి తో తొందరపడి చేతులు కలుపకపోయినా నష్టం లేదు. గానీ, సూచన ప్రాయంగా ఇప్పటి నుండే అతనితో పొత్తుల గురించి మాట్లాడుతుంటే ప్రజలు కూడా ఎన్నికల సమయానికి మానసికంగా వారి ఎన్నికల పొత్తులని అంగీకరించే స్థాయికి వస్తారని ఆలోచనతోనే కాంగ్రెస్ ఈ ప్రస్తావన తెస్తోందని భావించవచ్చును. ప్రజలతో బాటు, జగన్ మోహన్ రెడ్డి అతని పార్టీ కూడా అందుకు మానసికంగా సిద్దపడేలా చేయడం కూడా కాంగ్రెస్ ఉద్దేశం కావచ్చును.   మరి కొంత కాలం అతనికి బెయిలు రాకుండా అడ్డుపడుతూ జైల్లోనే మగ్గనిచ్చి అతని ఆత్మవిశ్వాసం పూర్తిగా అడుగంటిపోయేవరకు ఆగి, ఇక అతనంతట అతనే ‘ప్రాహీ..ప్రాహీమాం..’ అంటూ తన కాళ్ళమీద పడేలా చేసుకోగలిగితే, అప్పుడు అతనితో తనకి నచ్చినట్లు ఆడుకోవచ్చుననే కాంగ్రెస్ ఆలోచన చేస్తుండవచ్చును. ప్రస్తుతం కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు రెండూ కూడా వేచి చూసే ధోరణితో ఉన్నాయని చెప్పవచ్చును.

కుల్జా...సిం...సిం...

    కాంగ్రెస్ పార్టీతో అంటకాగుతున్నంత కాలం, కలెక్టరుపైనా చేయిచేసుకొన్నా, పోలీసులను బెదిరించినా తమని దేశంలో ఏకోర్టులూ ఏమి చేయలేవని మిడిసిపడిన ఓవైసీ సోదర ద్వయం, వాపును బలుపనుకొని తమ అండతోనే కాంగ్రెస్ బ్రతుకుతోందని భావిస్తూ ఆ పార్టీకి తలాకులిచ్చేసి బయటకొచ్చి తమ పార్టీని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ప్రత్యమ్నాయంగా రాష్ట్రం మొత్తం విస్తరించుదామని భారీ ప్రణాళిక ప్రకటించారు.   అయితే, వారింతవరకు పయనించిన దారి సరి కాదు, ఇప్పుడు పయనించడానికి ఎంచుకొన్న దారీ కూడా సరికాదని కోర్టులు నిరూపించాయి.   ఇక అసలు కధలోకి వస్తే, ఓవైసీ సోదర ద్వయంపై 2005వ సం.లో మెదక్ జిల్లా కలెక్టర్ పై చేయిచేసుకొన్న కేసులో పోలీసులు కేసు నమోదు చేయడం, అప్పటి నుండి ఇప్పటివరకు కోర్టు 15 నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే, అధికార ‘హస్తం’ పట్టుకొని తిరుగుతున్న ఆ సోదర ద్వయాన్ని చివరికి నాన్ బెయిలబుల్ వారంటులు కూడా ఏమి చేయలేకపోయాయి. చట్టాలు, న్యాయస్థానాలు అంటే తమకి గౌరవం అని చెప్పే ఓవైసీ సోదర ద్వయం వాటిని ఇంతవరకు కూడా అపహాస్యం చేస్తూనే ఉన్నారు.   అయితే, వినాశకాలే విపరీత బుద్ధీ అన్న సామెతను నిజం చేస్తూ, కాంగ్రెసును దిక్కరించి బయటకి రావడం, మళ్ళీ దానితోనే గొడవపడటంతో వారి పాత కేసులన్నీ ఒకటొకటిగా పోలీసులు బయటకి తీసి వారిపై చర్యలకు సిద్దం అవుతున్నారు. మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీని కూడా మిలాద్-ఉన్-నభీ పండుగ తరువాత అరెస్ట్ చేయడానికి యోచిస్తున్నట్లు తెలుసుకొన్నఆయన అతితెలివి ప్రదర్శిస్తూ, తానే స్వయంగా సంగారెడ్డి కోర్టుకు వెళ్లి నిన్నలొంగిపోయారు. అది కోర్టు మీద గౌరవం అనుకొంటే పొరబాటే. పండుగ ముందు ఆయనని అరెస్ట్ చేస్తే ముస్లిం ప్రజలు భావోద్వేగాలకు లోనయి శాంతి భద్రతల సమస్య తల్లెత్తవచ్చునని పోలీసులు ఆలోచించి ఆగితే, 8 సం.లుగా కోర్టు మొహం చూడని అయన పండుగ సమయంలో పోలీసులు తనను అన్యాయంగా జైల్లో పెట్టేరని తన వర్గం ప్రజల నుండి సానుభూతి పొంది పార్టీని వారికి మరింత చేరువగా తీసుకుపోవాలనే దురాలోచనతో కోర్టుకు లొంగిపోయినట్లు కనిపిస్తోంది. రెండు రోజులు జైల్లో ఉంది బెయిలు తీసుకొని బయటకి వచ్చేస్తే తన తలరాతలు మార్చేసుకోవచ్చుననే ఆలోచనతో బోనులోకి ప్రవేశించిన అయన చివరికి అదే బోనులో ఇరుక్కుపోయారు.   కోర్టు ఆయనని తీవ్రంగా తప్పుబట్టడమే గాకుండా అయన బెయిలు దరఖాస్తును త్రోసిపుచ్చి వచ్చే నెల 2వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విదిస్తూ జైలుకు పంపింది. ఆలీబాబా కధలో దురాశకు పోయిన ఆలీబాబా తమ్ముడు ‘కుల్జా...సిం...సిం’ అంటూ మంత్రం చదవి ధనరాసులు పోగేసున్న గుహలోకి ప్రవేశించి అంతా మూటకట్టుకోన్నాక, ఆ మంత్రం మరిచిపోవడంతో తిరిగి బయటకి వెళ్ళలేక గుహలోనే చిక్కుకుపోయిన్నట్లే, మన గౌరవనీయులయిన మజ్లిస్ శాసన సభ్యులు అసదుద్దీన్ గారు కూడా అతితెలివి ప్రదర్శించి జైల్లో ఇర్రుకుపోయారిప్పుడు.

తెలుగుదేశానికి కాంగ్రెస్ ఎసరు?

        అఖిలపక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణాకి అనుకూలంగా నిర్ణయం తీసుకొన్న తరువాత ఆ పార్టీకి తెలంగాణాలో మళ్ళీ జనాధారణ లభించడం, బాబు పాదయాత్ర వల్ల తెలుగుదేశం పార్టీ మళ్ళీ తెలంగాణాలో పుంజుకోవడం చూసిన కాంగ్రెస్ పార్టీ చాలా ఆందోళన చెందింది. బాబు నిర్ణయానికి పార్టీకి చెందిన సీమంద్రా నేతల్లోకూడా పెద్ద వ్యతిరేఖత రాకపోవడం, కాంగ్రెస్ పార్టీని మరింత కలవరపరిచింది. బాబు తన నిర్ణయంతో ఒకవైపు తెలంగాణాలో పాగా వేయడమే గాకుండా, మరో వైపు సీమంద్రాలో కూడా తనకి ఎదురుగాలి వీచకుండా పార్టీ నేతలని, శ్రేణులని అనుకూలంగా మలుచుకోవడం కాంగ్రెస్ పార్టీకి పైకి చెప్పుకోలేని కడుపుమంటగా మారింది.   చంద్రబాబుకి తెలంగాణాలో తప్పకుండా ఎదురుదెబ్బఖాయం అనుకొన్న కాంగ్రెస్ పార్టీ అంచనాలు తల క్రిందులు చేస్తూ బాబు తెలంగాణాలో దిగ్విజయంగా పాదయాత్ర ముగించుకోవడమే గాకుండా, అదే ఊపుతో నేడు ఆంధ్రా ప్రాంతంలో ప్రవేశించబోతున్నారు. తెలంగాణాలో ఆయనని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలుగానీ పార్టీకి సహకరించకపోవడంతో, ఆంధ్రా ప్రాంతంలోనయినా అడ్డుకొని అయన జోరుకి బ్రేకులు వేయకపోతే, ఇప్పటికే దారుణంగా ఉన్న పార్టీ పరిస్థితి, బాబు పాదయాత్రతో మరింత దారుణంగా మారుతుందని గ్రహించిన కాంగ్రెస్, లగడపాటి రూపంలో పావులు కదిపి సమైక్యాంద్రా సెంటిమెంటుతో తెలుగుదేశాన్ని నిట్టనిలువునా చీల్చాలని ప్రయత్నాలు ఆరంబించింది.   తెలుగుదేశం పార్టీలో సమైక్యవాదులను రెచ్చ గొట్టగలిగితే అది పార్టీలో చీలిక తేవడమేగాకుండా చంద్రబాబుపై ఒత్తిడి పెంచి అతనిని తెలంగాణా మద్దతుపై మరో మాట మాట్లాడేలా చేస్తుందని, తద్వారా తెలంగాణాలో చంద్రబాబు పునర్నిర్మించిన తెలుగుదేశం పార్టీని నాశనం చేయడమే గాకుండా, ఇటు ఆంధ్రా ప్రాంతంలో పార్టీని నిట్టనిలువుగా చీల్చవచ్చని కాంగ్రెస్ కుటిల పధకం పన్నింది.   ఆ ప్రయత్నంలో భాగంగానే, ఈ రోజు జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద కృష్ణా జిల్లాలో ప్రవేశించనున్న చంద్రబాబును అడ్డుకోవడానికి విజయవాడ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ‘కనువిప్పు యాత్ర’ ప్రకటించారు. చంద్రబాబుకి ఇకనయినా కనువిప్పు కలగాలని కోరుతూ ఆయనకు పుష్పగుచ్చాలు ఇచ్చి గాంధీగిరి చేస్తామని అయన ప్రకటించారు.   అయితే, కృష్ణా జిల్లాలో తెలుగు తమ్ముళ్ళు చంద్రబాబుకు మద్దతుగా నిలవాలనుకోవడంతో కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. స్థానిక నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తమ నాయకుడికి ఘనస్వాగతం ఇచ్చేందుకు జగ్గయ్యపేటలో ఏర్పాట్లు చేసుకొని చంద్రబాబు కోసం ఎదురుచూస్తున్నారు.   ఒకవైపు నిన్న కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన రాహుల్ గాంధీ ఇటువంటి కుళ్ళు రాజకీయాలను నిరసిస్తూ,పార్టీ నేతలు తమ తీరు మార్చుకోవాలని ఉద్బోదించినా, తమ పద్దతులు, అలవాట్లు, ఆలోచనలు అంతతేలికగా మారేవికావని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తోంది.

వైఎస్ జగన్ తో చేయికలిపితే తప్పేటున్నాదీ?

  రాష్ట్రంలో ఎన్నికలు ఇంకా ముంచుకు రాకముందే జగన్ పార్టీతో జత కట్టేందుకు సిద్దమవుతున్న కాంగ్రెస్ పార్టీ, తమ అనైతిక బంధానికి ప్రజలు మనస్సులో ఇప్పటినుండే ఇంకించే ప్రయత్నంలో భాగంగా జగన్ పార్టీతో ఎన్నికల పొత్తుల గురించి మెల్లగా మాట్లాడటం ఆరంభించింది. మొన్న సీనియర్ కాంగ్రెస్ నేత వాయలార్ రవి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తుల విషయం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చూసుకొంటుందని మొదటి సిగ్నల్ విడుదల చేయగానే, నిన్న బొత్స సత్యనారాయణ ‘జగన్ తో చేయికలిపితే తప్పేటున్నాదీ?’ అన్నట్లు మాట్లాడారు.   వయలార్ రవి ఆవిధంగా చెప్పడంలో తప్పులేదని, కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే, రాష్ట్రంలో ఎన్నికల పొత్తుల గురించి ఆలోచిస్తామని అన్నారు. ఒక వైపు జగన్ పార్టీతో చేతులు కలపడానికి సిద్ధం అంటూనే, మరో వైపు తమ పార్టీ సిద్ధాంతాలు, సోనియమ్మ నాయకత్వం పట్ల విశ్వాసం ఉన్నవారితోనే పొత్తులు ఉంటాయని చెప్పడం విశేషం.   ఈ రోజుల్లో రాజకీయ పార్టీలు సిద్ధాంతాల ప్రాతిపదికన ఎన్నికలలో పొత్తులు పెట్టుకొంటాయని అయన చెప్పడం హాస్యాస్పదం. కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయకపోతే తనపేరు చిరంజీవీ కాదని భీషణ ప్రతిజ్ఞలు చేసినవారి దయతోనే మనుగడ సాదిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, తనని నిత్యం బండ బూతులు తిడుతున్న తెరాసను తనలో కలిపేసుకోవలనుకొంటున్న కాంగ్రెస్ పార్టీ, ఇంతకాలం అవినీతిపరుడిగా చెప్పిన జగన్ తో చేతులు కలపడానికి ఒక పక్క సిద్దపడుతూనే అదే నోటితో సిద్ధాంతాలు వల్లెవేయడం ప్రజల కళ్ళకి గంతలు కట్టాలనే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. ప్రజలు అవివేకులు, వారికి ఏమి చెప్పినా గుడ్డిగా నమ్ముతారు అనుకోవడం వల్లనే రాజకీయ నేతలు ఇటువంటి మాటలు అనగలుగుతున్నారు.   ఎన్నికలు దగ్గిర పడుతున్నకోద్దీ ఈ రెండు పార్టీల మద్య ఇటువంటి సంకేతాలు మరిన్ని వెలువడి ప్రజలు తమ అనైతిక బంధం అంగీకరించే స్థాయికి చేరగానే, జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి విడుదలకావడం, ఆ వెంటనే రెండు పార్టీలు ఎన్నికల పొత్తుల చర్చలు మొదలుపెట్టడం తరువాత జరిగే ప్రక్రియ.

హైదరాబాద్ పై రిఫరెండం..ఇదేమీ కిరికిరి కేసిఆర్ ?

  తెలంగాణా ఉద్యమం జోరుగా సాగుతున్నప్పుడు కేసిఆర్  అకస్మాత్తుగా మాయం అయిపోవడం, లేదా ఎవరూ ఊహించలేని విధంగా ఏదో ప్రకటన చేసి కొంత గందరగోళం సృష్టించడం అందరూ ఎరిగినదే. కేంద్రం నుండి తెలంగాణాకి అనుకూలంగా బలమయిన సంకేతాలు వస్తున్న ఈ తరుణంలో, కేవలం మరొక పదిరోజుల్లో తెలంగాణా అంశంపై తాడోపేడో తేలనున్న ఈ తరుణంలో, మళ్ళీ కేసిఆర్  కొద్ది రోజులుగా కనబడక పోవడమే గాకుండా, తిరిగిరాగానే హైదరాబాద్ పై రెఫరెండం పెట్టి, అది ఎవరికీ చెందాలో నిర్నయిద్దామని ప్రకటించి, కేంద్రానికి, సీమంద్రవాసులకు రాని ఒక సరికొత్త ఐడియాను చెప్పడంతో తెలంగాణావాదులు భగ్గుమన్నారు.   హైదరాబాదును కొన్ని సం.ల పాటు ఉమ్మడి రాజధానిగా చేస్తే ఎలా ఉంటుందని కేంద్రం ఆలోచిస్తున్న ఈ తరుణంలో, కేసిఆర్  ఈ విధంగా హైదరాబాద్ పై రెఫరండం అనడం చూస్తే అయన కోరుండి హైదరాబాదును వదులుకోవాలని ఆలోచిస్తున్నారా? అనే సందేహం కలుగక మానదు. ఎందుకంటే, జంట నగరాలలో తెలంగాణావారికన్నా కూడా ఎక్కువగా సీమంధ్ర మరియు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన స్థిరపడిన ప్రజలే ఉన్నారు. ఆ కారణం చేతనే తెరాస ఇంతవరకు జరిగిన ఎన్నికలలో జంట నగరాలలో తన ప్రభావం చూపలేకపోతోంది. మరటువంటప్పుడు అయన తెలంగాణాపై రెఫరెండంకి వెళదామని అనడంలో ఆయన ఉద్దేశం ఏమిటి అని తెలంగాణావాదులే ప్రశ్నిస్తున్నారు.   కీలకమయిన ఈ సమయంలో అయన విధమయిన ప్రకటనచేయడం తెలంగాణా విషయంలో కేంద్రాన్నితప్పుదారి పట్టించడంలో అయన ఉద్దేశం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కేసిఆర్  ఈవిధంగా ప్రకటించడం చూస్తే, సీమంద్రులకి ఆయనే స్వయంగా ఒక ఆయుధం అందించి, దశాబ్దాలుగా రావణకాష్టంలా మండుతున్న తెలంగాణా అంశానికి సరిగ్గా పరిష్కారం అయ్యే దశలో సైంధవునిలా అడ్డుపడుతున్నారని తెలంగాణావాదులు భగ్గుమన్నారు.   అసలు ఈ విధంగా ఎవరూ ఊహించని ప్రతిపాదన అయన ఎందుకు చేసారని ఆలోచిస్తే మనకు రెండు మూడు కారణాలు కనిపిస్తాయి. తెలంగాణా నుంచి హైదరాబాద్ ఎట్టి పరిస్థితుల్లో విడిపోకూడనే అయన తాపత్రయం కారణం కావచ్చును. జంట నగరాలలో తమ పార్టీకున్న బలంతో ప్రజలను నయాన్నో భయాన్నో తెలంగాణకు అనుకూలంగా ఓటువేయించుకోవచ్చుననే ధీమాతోనే ఆయన ఆ ప్రతిపాదన చేసి ఉండవచ్చును.   కాంగ్రెస్ తెలంగాణా రాష్ట్రం ప్రకటించేమాటయితే తెరాసను ఆ పార్టీలో కలిపేస్తామని కేసీర్ స్వయంగా ప్రతిపాదించేరు గనుక, జనవరి 28వ తేదిన కేంద్రం తెలంగాణా ప్రకటన చేసే సూచనలు ఉన్నందున మాట ప్రకారం తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేయవలసివస్తే, ఇక తనకీ, తన నేతలకి కూడా ఇంతవరకు ప్రజలలో ఉన్న ప్రత్యేక గుర్తింపు ఉండబోదనే నిజం గ్రహించడంవలన ఆ ఆందోళనతో తెలంగాణా ప్రకటనను జాప్యం చేయించే ఆలోచనతో ఈ ప్రకటనచేసి ఉండవచ్చును.   ఇంతకాలం తెరాస అధినేతగా రాష్ట్ర రాజకీయాలు శాసిస్తున్న కేసిఆర్ , కాంగ్రెస్ పార్టీలో జేరవలసి వస్తే, ఇంతవరకు ఏ సోనియమ్మ, రాహుల్ గాంధీలను, అధిష్టానాన్నినోరార తిట్టేడో, ఇప్పుడు వారి కాళ్ళ వద్దే పడిఉండక తప్పదనే ఆలోచనే ఆయనకి చాల భయంకరంగా కనిపించడం కూడా ఒక కారణం కావచ్చును.   తెలంగాణా ప్రకటనకి, తెరాస కాంగ్రెస్ పార్టీలో విలీనానికి ముడిపెట్టి అయన స్వయంగా చేసిన ప్రతిపాదన ఇప్పుడు ఈవిధంగా అకస్మాతుగా తన మెడకే చుట్టుకోవడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న కేసిఆర్  అందులోంచి బయటపడే ప్రయత్నంలో భాగంగానే ఈ రెఫరెండం ప్రతిపాదన చేసి తద్వారా ఈ గండం నుండి ఎలా గట్టేకాలో ఆలోచించేందుకు కొంత సమయం పొందే ప్రయత్నం కావచ్చును.   ఎన్నికల సమయం వరకు కేంద్రం ఖచ్చితంగా తెలంగాణా ప్రకటించదని ధృడంగా విశ్వసిస్తున్నకేసిఆర్ , రానున్న ఎన్నికలలో తెలంగాణాలో అన్ని నియోజక వర్గాలకు తెరాస పోటీచేయబోతోందని ముందే ప్రకటించడం జరిగింది. తెలంగాణా సెంటిమెంట్ బలంగా ఉంటేనే ఎన్నికలలో పూర్తీ మెజార్టీ సాదించే అవకాశం ఉంది.   కాంగ్రెస్ పార్టీ తెలంగాణా అంశంపై ఎంత జాప్యంచేస్తే అంత తెరాసకు లాభం అని కాంగ్రెస్, తెరాస రెండూ గ్రహించాయి. గానీ, ఊహించని విధంగా ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణా ప్రకటన చేసేందుకు సిద్దం కావడంతో తన కలలు కల్లలు కాబోతున్నందున కేసిఆర్  తీవ్ర ఆందోళనకి గురయి కేంద్రం తన నిర్ణయాన్ని మరికొంత కాలం వాయిదా వేసేందుకు ఈ ప్రతిపాదన తెచ్చి ఉండవచ్చును.   ఒక వేళ కేంద్రం దీనికి అంగీకరిస్తే, సమస్య ఎటూ మరింత జటిలం చేయగలిగే సత్తా తనకి ఉంది కనుక, ఎన్నికల సమయం దగ్గిర పడేవరకూ తెలంగాణ భావోద్వేగాలను తనకు అనుకూలంగా మలుచుకొనే అవకాశం ఉంటుంది.   స్వయంగా రాజ్యాదికారం పొందగలిగే అవకాశాన్ని వదులుకొని, కాంగ్రెస్ పంచన జేరడం అటువంటి వ్యక్తిత్వం ఉన్నవారెవరూ ఊహించలేరు. కనుకనే, ఎన్నికల వరకు తెలంగాణా అంశాన్ని సాగ దీయడం కోసం ఈ ప్రతిపాదన చేసి ఉండవచ్చును.   తెలంగాణా అంశం, భావోద్వేగాలు లేనప్పుడు సహజంగానే కేసిఆర్ , అయన నాయకులూ, అయన తెరాస పార్టీ, జేయేసీలు అన్నీ కూడా తమ ప్రాధాన్యతని కోల్పోతాయి. అందువల్లనే, తెలంగాణా అంశం ఎంతకాలం సాగదీస్తే అంట మంచిదని అయన భావిస్తూ ఇటువంటి ప్రతిపాదన చేసి ఉండవచ్చును.   ఏది ఏమయినప్పటికీ, కేంద్రం తెలంగాణా ప్రకటన చేసినట్లయితే అయన తన మాటకు కట్టుబడి తెరాసను కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తారా లేదా, ఆ విధంగా చేయకపోతే కాంగ్రెస్ తెలంగాణా ప్రకటన చేస్తుందా లేదా అనే రెండు సందేహాలు మిగిలిపోయాయి. ఇటువంటి అన్ని ధర్మ సందేహాలు ఈ నెల 28వ తేదీ కేంద్ర ప్రకటనతో తీరుతాయని ఆశిద్దాము.

ఒక మహనీయుని దివ్య స్మృతి

  తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి 17వ వర్ధంతి నేడు. తెలుగు సినిమా చరిత్రలో మరింకెవరూ కూడా చేయని, చేయలేని అన్నిరకాల పాత్రలు పోషించడమే గాకుండా అపూర్వమయిన తన నటన కౌశలంతో ప్రజల మనసుల్లో ఆరాధ్య దైవంగా నిలిచిపోయేరు. ఒక మహానటుడిగా ఆయన ఎంతటి ఉన్నత శిఖరాలు అధిరోహించారో, రాజకీయ నాయకుడిగా కూడా యావత్ దేశంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. తెలుగుజాతి ఆత్మా గౌరవానికి, పౌరుషానికి ప్రతీకగా నిలిచిన అయన, రాష్ట్రాన్ని, తెలుగు ప్రజనీ యావత్ దేశమూ గుర్తించేలా చేసిన ఘనుడు.   మిష్టర్ గిరీశంగా ప్రజలకి కల్లబొల్లి కబుర్లు చెప్పి ప్రజలకి వినోదంపంచిన ఆయనే, భారతమాతకు జేజేలు అంటూ బడిపంతులుగా పాఠాలు చెప్పి ఏంతో హృద్యమయిన నటన కనబరిచేరు. ‘పాంచాలీ...పంచభతృకీ...’అంటూ అయన పలికిన డైలాగులు నేటికీ తెలుగు ప్రజల చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంటాయి. సామాజిక, జానపద, పౌరాణిక సినిమాలలో అయన కనబరిచిన ప్రతిభ, అయన ధరించిన వైవిధ్యమయిన పాత్రలు నభూతో నభవిష్యతి అని చెప్పవచ్చును. అయన సినిమాలు, అయన పోషించిన పాత్రలు, ఆయన ప్రతిభ గురించి సవివరంగా చెప్పదలచుకొంటే అదొక మహా గ్రంధమే అవుతుంది.   శ్రీరామునిగా, శ్రీకృష్ణునిగా ప్రజలచేత దండాలు పెట్టించుకొన్నఅయనే కర్ణ, దుర్యోధన, లంకేశ్వరుని వంటి ప్రతినాయక పాత్రలు కూడా పోషించి ప్రజలని మెప్పించారు. అయన నటన, ఆహార్యం, రాజసం చూసిన తెలుగు ప్రజలు, ఆయా దేవుళ్ళు, రాజులు కూడా నిజంగా ఆయనలాగే ఉంటారని భావించేంత గొప్పగా సాగింది అయన నటన.   ఇక, రాజకీయాలలో సాధారణ రాజకీయ నేతలకు బిన్నంగా, మనసుతో ఆలోచించే రాజకీయవేత్తగా యన్టీఆర్ ప్రజలచేత నీరాజనాలు అందుకొన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9నెలల్లోనే రాష్ట్రంలో అధికారం చేప్పట్టిన ఘనుడు ఆయన. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి, తెలుగు పౌరుషానికి ప్రతీకగా నిలచిన ఆయన, రాష్ట్రంలో మొట్ట మొదటిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పరచిన ఘనుడు. తెలుగు బాష, తెలుగు ప్రజ,తెలుగు సినిమా, తెలుగు సంస్కృతీ, తెలుగు నేల.. ఇలాగ తెలుగుతో ముడిపడిన ప్రతీ అంశాన్ని అభిమానించే అచ్చ తెలుగు హృదయం ఆయనది.   రాష్ట్రంలో అనేక సంస్కరణలు అమలుచేసి ఒక నూతన శకానికి నాందిపలికి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తన పాలన సాగాలనుకోనేవారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అధికారం చెప్పటినా కూడా, సర్వసంగ పరిత్యాగిగానే పాలన చేసారు. రాష్ట్ర వనరులకు, సంపదలకు అయన ఒక ధర్మకర్తగా వ్యవహరించారు తప్ప, వాటిని దోచుకొని దాచుకోవాలని ఏనాడు కలలో కూడా అనుకోలేదు.   తెలుగు జాతి కీర్తిని దశదిశలా వ్యాపింపజేసి, తెలుగు జాతిని యావత్ ప్రపంచం కూడా గుర్తించేలా చేయగలిగిన ఆయనని మాత్రం మన సంకుచిత రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు నేటికీ రాజకీయ రంగుటద్దాలలోంచే చూస్తూ ఆయనకు ఈయవలసిన గౌరవం ఈయలేకపోతున్నారు. ఒక మహా నటుడిని, తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన ఒక మహనీయుడికీ ప్రభుత్వాలు గౌరవ పురష్కారాలు అందించకపోయినా, అయన తెలుగు ప్రజల మనస్సులో శాశ్వితంగా కోలువయున్నాడు. అటువంటి వ్యక్తిని గుర్తించలేక పోవడం ప్రభుత్వ దురదృష్టమే తప్ప ఆయనది కాదు. అయన 17వ వర్దంతి సందర్భంగా యావత్ తెలుగు ప్రజానీకం ఆయనకు ఘన నివాళులు అర్పిస్తోంది.

త్వరలో మధ్యంతర ఎన్నికలు రానున్నాయా?

  రాష్ట్ర విభజన సమస్య పై తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉన్న ఈ సమయంలో మధ్యంతర ఎన్నికల గురించి ఆలోచన అసంబద్ధంగా అనిపించవచ్చును. గానీ, ప్రస్తుత పరిణామాలను బట్టి కేంద్రం ఈ సంవత్సరం జూన్ నెల లోపుగానే మధ్యంతర ఎన్నికలకి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి.   ఈ నెల 28వ తేదీతో తెలంగాణా అంశంపై కేంద్రం తాడో పేడో తేల్చక తప్పదు. ఇప్పటివరకూ అందుతున్న సంకేతాలను బట్టి కేంద్రం రాష్ట్ర విభజనకే మొగ్గు చూపుతున్నట్లు అర్ధమవుతోంది. ఒకవేళ రాష్ట్రాన్ని విభజించడమే జరిగితే, ఆ ప్రయోజనాన్ని కాంగ్రెస్ స్వంతం చేసుకోవాలని ఆలోచించడం సర్వ సాధారణ విషయం. తెలంగాణా ప్రకటించక ముందే తెరాసను తనలో కలిపేసుకోవచ్చును. అదే జరిగితే, వెంటనే ఎన్నికలకి వెళ్లకపోయినట్లయితే మళ్ళీ తెరాస కొత్త పేచీలు మొదలు పెట్టి, ఏవో కుంటి సాకులు చెప్పి కాంగ్రెస్ పార్టీకే హస్తం ఈయక మానదు. అలా జరగకూడదంటే, తెలంగాణా ప్రకటన జరిగిన రెండు, మూడు నెలలలోపే కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్ళాల్సిఉంటుంది.గానీ సాంకేతికంగా ఆ అవకాశం లేదు గనుక మరొక్క రెండు నెలల తరువాతనయిన ఎన్నికలకి వెళ్ళవచ్చును.   తెలంగాణా ఇచ్చిన ఆనందంలోనే ప్రజలు కాంగ్రేసుకు ఓటేసే అవకాశం ఉంటుంది కనుక, వీలయినంత తొందరగా ఎన్నికలకి వెళ్ళాల్సిఉంటుంది. తెలంగాణా ప్రకటించినప్పటికీ, తరువాత ఏర్పడే వివాదాల కారణంగా, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణా ఇచ్చిన ఫలితం దక్కకపోగా, రాష్ట్రంలో ఏకాకిగా మారిపోయే ప్రమాదం ఉంది. గనుక, సమస్యలేవీ తలెత్తక మునుపే కాంగ్రెస్ ఎన్నికలకి వెళ్ళక తప్పదు. తెలంగాణాలో అధికారం సంపాదించగలిగితే చాలావరకు సమస్యలను అదుపుచేసే అవకాశం కూడా కాంగ్రెస్ కు ఉంటుంది.   ఇక, తెలంగాణా కాక వేరే ఏరకమయిన ఆలోచన చేసినా కూడా తెలంగాణాలో కాంగ్రెస్ మట్టికరవడం ఖాయం. తెలంగాణా ఇచ్చి ఒక చోటయిన గెలిచే అవకాశం ఉంది. గానీ, తెలంగాణా ఈయకపోయినా, సీమాంధ్రాలో కాంగ్రేసుకు గెలిచే అవకాశాలు లేవు.   ఒకవైపు జగన్ పార్టీ, మరో వైపు తెలుగుదేశం పార్టీ రెంటికీ కూడా ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య వంటివి గనుక, ఆ రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీని గెలవనిస్తాయని అనుకోలేము. కేవలం ప్రముఖ కాంగ్రెస్ నేతలు లగడపాటి, రాయపాటి, కావూరి, బొత్స వంటి పెద్ద తలకాయలు మాత్రమే సీమంధ్రలో గెలిచే అవకాశం ఉంది.   ఒకవేళ సీమంద్రాలో కూడా ఎలాగయినా గెలిచి తీరాలని కాంగ్రెస్ భావిస్తే, ఎన్నికలు ప్రకటించక ముందే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కూడా తనలో కలిపేసుకొనో లేదా జగన్ మోహన్ రెడ్డితో ఎన్నికల ఒప్పందం చేసుకొనో అతనిని జైలు నుండి విడుదల చేసే అవకాశం ఉంది. అదే గనుక జరిగితే, కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాలలో గెలిచే అవకాశాలు బాగా మెరుగు పడతాయి.     అలా వీలుకాని పక్షంలో, తెలంగాణా ఇచ్చి ఒకచోటయిన గెలవడమే మంచిదని కాంగ్రెస్ భావించే అవకాశం ఉంది. ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ రెంటికీ చెడిన రేవడి అవుతుంది.   ఇక, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సబ్సిడీ సిలిండర్లు 6 నుండి 9కి పెంచేందుకు పెట్టిన ముహూర్తం కూడా అందుకు తగ్గట్టుగానే ఉంది. జనవరి నుంచే ఇచ్చే అవకాశం ఉన్నపటికీ అది ఏప్రిల్ 1వ తేది ముహూర్తం ఎంచుకోవడం చూస్తే, అది ఆ వెంటనే మధ్యంతర ఎన్నికలు ప్రకటించి ప్రజల ఓట్లు దండుకొనే ప్రయత్నం చేయవచ్చునని పిస్తోంది.   ఇది గాక, నగదు బదిలీ పధకాన్ని ఓట్ల వేటలో తన ముఖ్యమయిన అస్త్రమని బహిరంగంగానే ప్రకటించుకొన్న కాంగ్రెస్ పార్టీ, దానిలో ఎన్ని లోటుపాట్లు ఉన్నపటికీ దానిని వెంటనే అమలుచేయడానికి పడుతున్న తొందర చూస్తే, మధ్యంతర ఎన్నికలు ముంచుకొస్తున్నట్లే కనిపిస్తుంది. మరో ఏడాది తరువాతనో మరెప్పుడో వచ్చే ఎన్నికల కోసం కాంగ్రెస్ అంత తాపత్రయపడవలసిన అవసరం లేదని గ్రహిస్తే, కాంగ్రెస్ త్వరలోనే ఎన్నికలకి సిద్ధం అవుతోందని అర్ధం అవుతుంది.   ఈ నెల 28వ తేదీన తెలంగాణా ప్రకటన లేదా మరే ప్రకటన చేసిన వెంటనే, రాష్ట్రంలో లేదా రెండు రాష్ట్రాల్లో సమర్దులయిన కొత్త నాయకులని ఎంచుకొని పరిస్థితులు తనకు అనుకూలంగా ఉన్నాయని నమ్మకం కుదరగానే కాంగ్రెస్ పార్టీ మధ్యంతర ఎన్నికలు ప్రకటించావచ్చును. బహుశః జూన్ లేదా జులై నెలాకరులోగా ఎప్పుడయినా ఆ ప్రకటన చేయవచ్చును.

పతనం అంచున పాక్

  మనకన్నా కొన్ని గంటలముందే స్వాతంత్రం పొందిన పాకిస్తాన్, నాటి నుండి నేటి వరకు ఏనాడు కూడా నిలకడగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పరుచుకోలేకపోయింది. మళ్ళీ ఈరోజు కూడా ఏ క్షణాన్నయినా కుప్ప కూలిపోయేలా ఉంది.   కెనడా దేశం నుండి తిరిగివచ్చిన తెహర్-ఉల్-కద్రి నాయకత్వంలో వేలాది పాక్ ప్రజలు గత రెండు రోజులుగా వీదులలోకి వచ్చి సర్వవిధాల భ్రష్టుపట్టిపోయిన పర్వేజ్ ప్రభుత్వం దిగిపోయి, పార్లమెంటును రద్దు చేయాలనీ కోరుతూ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. అది చాలదన్నట్లు, అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పాక్ ప్రధాని పర్వేజ్ అష్రఫ్ ను 24గంటలలోపుగా అరెస్ట్ చేయాలనీ పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.   ప్రజలకు ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్న “కద్రి’ పాకిస్తాన్ సైన్యం ప్రభుత్వంపై ప్రయోగించిన మిస్సైల్” అని పాక్ పత్రికలూ వర్ణిస్తున్నాయి. మరో వైపు ఆ కధనాలు నిజం చేస్తున్నట్లు కద్రి తన ప్రసంగంలో పాక్ సైన్యాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. పాక్ సైన్యం, న్యాయ వ్యవస్థ రెండూ కూడా దేశాన్ని కాపడుతున్నాయని అయన అన్నారు.   ఏ క్షణానయినా కుప్ప కూలేలా ఉన్న తన ప్రభుత్వ పరిస్థితి, సైన్యం అండ చూసుకొని తిరుగుబాటు చేస్తున్న కద్రిని చూసి, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ ఆలీ జర్దారి తన కుటుంబంతో సహా దుబాయ్ పారిపోయినట్లు పుకార్లు వస్తున్నాయి. ఈ విదంగా పాకిస్తాన్ లో సంక్షోభం తల ఎత్తడం ఇది మొదటిసారీ కాదు, అటువంటి పరిస్థితుల్లో దేశం విడిచి పారిపోవడం ఆ దేశాది నేతలకి కొత్తా కాదు. మళ్ళీ పరిస్థితులు అనుకూలించినప్పుడు తిరిగిరావడం, మళ్ళీ ఎన్నికలలో పోటీ చేయడం కూడా అక్కడ రివాజే.   ఇటువంటి క్లిష్ట పరిస్థితుల కారణంగానే పాకిస్తాన్ ప్రభుత్వం తన ప్రజల దృష్టి మళ్ళించేందుకు సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు సృష్టించింది. అయినా ఫలితం లేకపోగా, అది పాల్పడిన హేయమయిన చర్యకు ప్రపంచం ముక్త కంఠంతో ఖండించింది.   ఈరోజు మన సైనికులు, భారతీయ సరిహద్దుల వద్ద పాక్ సైనికులు ఏర్పాటు చేసిన ల్యాండ్ మైన్లను కనుగొనడంతో, భారత ప్రభుత్వం మరింత ఆగ్రహించింది. 60సం.ల వయసు దాటిన పాక్ జాతీయులకి ఈ రోజు నుండి వాఘా సరిహద్దు వద్ద భారత్ లో ప్రవేశించేందుకు అక్కడికక్కడే వీసాలు జారీ చేయాలనుకొన్న భారత ప్రభుత్వం, ఆ ఆలోచనను విరమించుకొంది. అంతేగాక, మన దేశంలో హాకీ ఆడేందుకు వచ్చిన పాక్ హాకీ క్రీడాకారులను వెనక్కి తిప్పి పంపేసింది. భారత ప్రభుత్వం కన్నా వేగంగా స్పందించిన నరేంద్ర మోడీ, ‘వైబ్రాంట్ గుజరాత్’ వ్యాపార సదస్సులో పాల్గొనడానికి వచ్చిన పాక్ ప్రతినిధులను వారి హోటల్ నుండే వెనక్కి త్రిప్పి పంపేశాడు.   ప్రజల దృష్టి మళ్ళించేందుకు సరిహద్దుల వద్ద పాక్ ప్రభుత్వం చేసిన ప్రయోగం ఈ విదంగా వికటించడమే గాకుండా, ఇప్పుడిప్పుడే మెరుగవుతున్న ఇరు దేశాల సబందాలను మరో మారు ఘోరంగా దెబ్బతీసింది. ఇంతచేసినా అక్కడ పాక్ ప్రభుత్వం నిలబడే పరిస్థితిలో లేదిప్పుడు.   అయితే, ఆ దేశంలో అస్థిరత ఏర్పడితే దాని ప్రభావం అందరికన్నా ముందు మన దేశం పైనే తీవ్రంగా ఉంటుంది. దేశంలో నిర్భయంగా తిరుతున్న ముష్కర మూకలు, ప్రభుత్వాన్ని లోబడి పనిచేయడానికి ఇష్టపడని సైన్యాదికారులు, మరో వైపు తాలిబాన్లతో నిండిన పాకిస్తాన్ ఒక విద్వంసక శక్తిగా మారే అవకాశం ఉంది. అందుకే అక్కడ సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలని మన దేశం ఎల్లపుడూ కోరుకొంటుంది. అయితే, అది ఎప్పటికీ తీరని కలగానే మిగిలిపోతోంది.

వివాదాలలో తెలుగు సినిమాలు నిదరోతున్న సెన్...సార్లు

  చిత్ర పరిశ్రమకి వివాదాలు కొత్త కాకపోయినప్పటికీ, ఇటీవల అవి కొంచెం ఎక్కువవుతున్నాయి. కొద్ది కాలం క్రితం విడుదలయిన ‘అయ్యారే’ ‘విమన్ ఇన్ బ్రాహ్మనిజం’ ‘దేనికయినా రెడీ’ ‘కెమెరామాన్ గంగతో రాంబాబు’ మొదలయినవి చాలానే ఉన్నాయి.   కమల్ హస్సన్ నటించి దర్శకత్వం వహించిన విశ్వరూపం వివాదం ముగిసింది. ఈ నెల 11న విడుదలకావలసిన ‘విశ్వరూపం’ సినిమా ఇదే నెల 25కి వాయిదా పడగా, టీవీ సెట్లలో డీటీహెచ్ ద్వారా వచ్చే నెల 2వ తేది ఒక్క రోజు మాత్రమే ప్రదర్శింపబడుతుంది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టిన కమల్ హస్సన్, ఇన్ని సమస్యలు ఎదురవడంతో వెనక్కి తగ్గక తప్పలేదు. కానీ, అన్ని కోట్లు ఖర్చుచేసి నిర్మించుకొన్న తన చిత్రాన్ని తనకిష్టమయిన విదంగా విడుదలచేసుకోలేక పోయినందుకు బాధ పడిన కమల్ హస్సన్, సినిమా విడుదలచేసుకోవడంలో తన హక్కులకి భంగం కలిగిందంటూ రేగులేటరీ కమీషన్లో పిర్యాదు చేయడంతో వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.   ఇప్పుడు కొత్తగా, రామ్ చరణ్ నటించిన ‘నాయక్ సినిమా వివాదంలో చిక్కుకోంది. విశాఖకు చెందిన వైయస్సర్సీ పార్టీ పరవాడ శాసనసభ్యుడు గండి బాబ్జీ ఆ సినిమాలో విలన్ పాత్రకు తన పేరు పెట్టడానికి అభ్యంతరం తెలుపుతూ మొదట దర్శకుడు వి.వి.వినాయక్ తో మాట్లాడారు. వారంలోగా ఆ పేరు మార్పు జేస్తామని హామీ ఇచ్చినప్పటికీ దానిని అమలు చేయకపోవడంతో నిన్న విశాఖలోని పెందుర్తి పోలీసు స్టేషన్లో నాయక్ సినిమా దర్శకుడు, నిర్మాత, మరియు చిత్ర సమర్పకుల మీద ఆయన పిర్యాదు చేసారు.   ఒక బాధ్యతాయుతమయిన, గౌరవనీయమయిన శాసనసభ్యుడయిన తన పేరును ఆ చిత్రంలో విలన్ కి పెట్టడం ద్వారా సమాజంలో తన గౌరవప్రతిష్టలకు భంగం వాట్టిలుతోందని అయన అన్నారు. సినిమాలో తన పేరున్న విలన్ హత్యలు, కిడ్నాపులు, భూదందాలు, సెట్టిల్మెంట్స్ వంటి సంఘ వ్యతిరేఖ కార్యక్రమాలు చేయడంవల్ల, ఆ పాత్ర తననుదేశ్యించి తీసినదేనని ప్రజలు చెవులు కోరుకొంటున్నారని ఆయన బాధపడుతూ వెంటనే రాష్ట్రంలో ఆ సినిమా ప్రదర్శను నిలిపివేయాలని పోలీసులను కోరారు. ఇప్పటికయినా వెంటనే తన పేరును సినిమాలోంచి తొలగించకపోతే, దర్శక నిర్మాతలపై పరువునష్టం దావా వేస్తానని గండి బాబ్జీ హెచ్చరించారు.   అయితే, ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శింపబడుతున్న ఈ సినిమాలో మార్పులు చేయడం కష్టమేనని సాంకేతిక నిపుణులు అంటున్నారు. రాజకీయ నేపద్యం కల్గిన మన సెన్సార్ బోర్డ్ సభ్యులు ఏవిదంగా సర్టిఫికేట్ ఇచ్చేసారని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. వారే గనుక మొదటే అభ్యంతరం వ్యక్తం చేసినట్లయితే, ఇటువంటి తప్పులను సరిదిద్దడానికి అవకాశం ఉండేది. గానీ, వారు బాధ్యాతా రహితంగా వ్యహరిస్తూ సినీ పరిశ్రమ వివాదాలలో చిక్కుకోనేందుకు వారే ప్రధాన కారణం అవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. వారే గనుక, తమ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తిస్తే, ఇన్ని వివాదాలకు తావుండేదేకాదని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.

భోగీ మంటలు రాజేస్తున్న రాజకీయ నేతలు

  ఇక నేడోరేపో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనపై తన నిర్ణయాన్నిప్రకటించే సమయం ఆసన్నం అవుతున్నకొద్దీ, రాష్ట్రంలో ఆంధ్ర, తెలంగాణా రాజకీయాలు ఊపందుకొంటున్నాయి. రెండు వర్గాలు కూడా దేనికవే తమకు స్పష్టమయిన సంకేతాలు అందుతున్నట్లు నమ్మకంగా ప్రచారం చేసుకొంటున్నాయి. అంతటితో ఆగితే పరువాలేదు, గానీ ఆ రెండు వర్గాలు కేంద్రం మీద తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకొనే విధంగా ఒత్తిడి తచ్చే ప్రయత్నంలో రకరకాల ప్రణాలికలు, సభలు ప్రకటిస్తూ ప్రశాంతంగా ఉన్న రాష్ట్ర ప్రజలను ఆందోళనలకు ఉసిగొల్పుతున్నాయి.   తెలంగాణా, సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న ప్రజలో లేక వారి వెనుకనున్న జేయేసిలో ఆపని చేస్తే అది సహజమేననుకోవచ్చును. గానీ, రాష్ట్రాన్ని పాలిస్తున్న బాధ్యాతాయుతమయిన మంత్రి పదవులలో ఉన్నవారు, శాసన సభ్యులే స్వయంగా ప్రజలను, అవతలి వర్గం వారినీ కూడా రెచ్చగొట్టే తీరున మాట్లాడుతూ, సమావేశాలు నిర్వహించడం విచారకరం. కాంగ్రెస్ పార్టీ ఈ నెల 28వ తేదిలోగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని స్పష్టంగా తెలియజేసిన తరువాత కూడా, ఆ పార్టీకి చెందిన మంత్రులు, శాసనసభ్యులు కూడా ఈ విదంగా ప్రవర్తించడం చాలా విచారకరం. అటువంటివారిని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ గానీ ఏమి అనలేని నిస్సహాయస్థితిలో ఉన్నారు.   ఇక, కేంద్రం ఏ నిర్ణయం ప్రకటించినప్పటికీ రాష్ట్రంలో రాజకీయ విస్పోటనం తప్పక పోవచ్చును. తెలంగాణా ప్రకటించకపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చేస్తామంటున్న తెలంగాణావాదులొక వైపు, విభజిస్తే వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమాలు మొదలుపెడతామని హెచ్చరికలు జారిచేస్తున్న సీమాంధ్ర నాయకులూ మరోవైపు, రాష్ట్రంలో ప్రశాంతత లేకుండా చేయడమే గాకుండా రాబోయే రోజుల్లో రాష్ట్ర పరిస్థితి ఏవిదంగా ఉండబోతుందో ఇప్పుడే ప్రజల కళ్ళకి కటినట్లు చూపుతున్నారు.   తనను తానూ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకి పెద్దన్నగా చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీ ఈ క్లిష్ట పరిస్థితులను ఏవిధంగా పరిష్కరించాలనే ఆలోచనలతోనే సతమతమవుతోందిప్పుడు. అది మరో సారి అసమర్దంగా వ్యహరిస్తే, రాష్ట్రంలో తీవ్ర అశాంతి, అరాచకానికి దారితీస్తుంది.

SVSC affect on film industry

    A simultaneous release of Nayak and SVSC films has given scope for a new debate on the quality and content of our Telugu films. Would these films were released on different periods, there would be no scope for this kind of debate. Since both of they are entirely different on ever aspect, film critics and movie lovers had a chance to give their verdict on Telugu films.   People have made it clear that commercial films will be their second choice, when a pleasant film is available on screens. They do not think about its big budget or its heavy star cast, but it is the quality and concept they look for.   They don’t see any thing wrong if big heroes, who were trapped in their own image, want to come out of it for doing soft films like this. A Telugu title will not be a disadvantage but it adds additional marks to the film.   Presenting Telugu traditions, family values and bonds will not seen as a dull subjects but brings more viewers to the film.   If a heroine has to play sister or sister-in-law role of the hero, or a top hero has to play elder brother or father role like Venkatesh and Prakash Raj did in the film SVSC, it won’t affect their image or confine them to do same kind of roles, instead if they could deliver their best they will be hugged by the audiences as their own family members. Anjali, who played as sister-in-law of Mahesh babu has bagged more marks than Samantha, who shakes legs with Mahesh babu in this film.   People are keen about the story, concept, performance and presentation of a film rather than its lavish foreign shootings and commercial elements. People were forced to watch the violence and bloodshed in the action or commercial movies only because there were no soft films like SVSC.   This clearly spells what people are wanting and what the industry is offering. Hope it will be an eye opener for industry biggies and bring us watch worthy films in future.

'సీతమ్మ వాకిట్లో..' నాయక్ రామ్ చరణ్

  ఇంచుమించుగా ఒకేసారి విడుదలయిన రెండు సినిమాలు 'నాయక్' మరియు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినీ విశ్లేషకుల నుంచి మంచి రేటింగ్స్ రాబట్టుకోవడమే గాకుండా, ప్రేక్షకుల మెప్పును కూడా పొందగలిగేయి. ఒకటి మాస్ ప్రేక్షకులను, ముఖ్యంగా యువతను ఆకట్టుకొంటే, రెండోది వారితో బాటు ఫ్యామిలీ ఆడియన్సును కూడా ఆకట్టుకొంది. మొత్తం మీద కొత్త సం.లో విడుదలయిన రెండు పెద్ద చిత్రాలు కూడా చిత్రసీమకి మంచి బోణీ ఇచ్చిఅందరికీ మంచి ఉత్సాహం కలిగించేయి.   ఇక, నాయక్ సినిమా పక్కా కమర్షియల్ సినిమా అయినప్పటికీ, అందులో దర్శకుడు వినాయక్ స్క్రీన్ ప్లేలో చూపిన మంచి పనితనం, తనదయిన శైలిలో జోడించిన మంచి కామెడీ ట్రాక్, రామ్ చరణ్ చేత చేయించిన ఫైట్స్, డాన్స్ లు, పేల్చిన పంచ్ డైలాగులు, ఇద్దరు హీరోయిన్ల  అందాలు అన్నీ ఆ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచేయి. దర్శకుడు వీ.వీ.వినాయక్, రామ్ చరణ్ చేత మొట్ట మొదటిసారిగా ద్విపాత్రాభినయం చేయించి, అభిమానులను దియేటర్లవైపు రప్పించుకొన్నాడు. తెలుగు సినిమా పరిశ్రమ మొదలయినప్పటినుండి చూస్తున్న ద్విపాత్రబినయం సినిమాని, మరోమారు కూడా ఎక్కడా బోరుకొట్టకుండా చక్కగా చూపించి, అవసరమయితే మరో వందసార్లు కూడా తీసుకోవచ్చుననే భరోసా ఇచ్చేడు దర్శకుడు.   ఇక, సీతమ్మ వాకిట్లోకి వస్తే మనమందరం కలలుగనే ఒక అద్భుతమయిన స్వంత కుటుంబములోకి వచ్చినట్లు ఉంటుంది. అటువంటి ఆప్యాయతలు,కుటుంబ విలువలు, సంప్రదాయాలు చూసి ఎంత కాలమయియింది అనిపిస్తుంది. సినిమాలో నటించిన అందరూ కూడా ఎక్కడా అతిలేకుండా నటించడంతో సినిమా బాగా పండింది. ఎంచుకొన్న కధాంశం అందరికీ తెలిసిందే అయినప్పటికీ దానిని దర్శకుడు మనసులకు హత్తుకునేలా వెండి తెరమీద ఆవిష్కరించడంతో సినిమా అందరి మెప్పు పొందింది.   సినిమాలో ప్రతీ ఒక్కరు అద్బుతంగా నటించినప్పటికీ, మహేష్ బాబు చేసిన చిలిపిఅల్లరి ప్రేక్షకులను బాగా ఆకట్టుకొందని చెప్పవచ్చును. ప్రేక్షకులకోసం తన సినిమాలలో నిత్యం రక్తం ఓడ్చేమహేష్ బాబు, ఈ విదంగా కనిపించడం అందరినీ ఆకట్టుకొంది.వెంకటేష్, ప్రకాష్ రాజ్, సమంత, అంజలి అందరూ కూడా ఎవరి పాత్రలలో వారు చక్కగా ఒదిగిపోయి సినిమాలో వారు కాక వారి పాత్రలే కనిపించేలా నటించేరు.   ఇక, రామ్ చరణ్ ‘నాయక్’ సినిమాను ఒంటి చేత్తో విజయం వైపు నడిపిస్తే, సీతమ్మ వాకిట్లో కలుసున్న ప్రతీ ఒక్కరూ దాని విజయంలో భాగస్వాములే.   నాయక్ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రబినయం చేసినప్పటికీ, ఒక్కడే ఇద్దరు హీరోయిన్లతో రోమాన్స్ చేస్తే, సీతమ్మ వాకిట్లో రెండు జంటలు సినిమాని నడిపించాయి.     నాయకుడు జనాన్ని రఫ్ ఆడించేసి హృదయాలు గెలుచుకొంటే, సీతమ్మ కుటుంబ సభ్యులు పండుగ రోజున ప్రేక్షకులకు మంచి కమ్మటి భోజనం పెట్టి ప్రశంసలు అందుకొన్నారు.   ఒకటి మాస్ మరొకటి క్లాసు అయిన రెండూ రెండే! తెలుగు ప్రజలు రెంటినీ ఎప్పటికీ ఆదరిస్తారని ఈ రెండు సినిమాలు మరో మారు నిరూపించేయి.   నాయక్ సినిమా స్క్రీన్ ప్లే, కమర్షియల్ ఎలిమెంట్స్, సాంకేతికత మీద ఆధారపడితే, సీతమ్మ చక్కటి , కధాంశం, తారల నటన, తెలుగుతనం మీద రాణించింది.   ఇది వరకు ఎన్నడు లేని విదంగా, ఈ రెండు సినిమాలపై ట్వీట్టర్, ఫేస్ బుక్ వంటి సామాజిక వెబ్ సైట్లలో యువత చాలా లోతుగా ఆసక్తిగా చర్చలు చేయడం వాటిపై వారికున్న అంచనాలకు ఒక నిదర్శనంగా నిలుస్తుంది. ఈ సినిమాలు షూటింగ్ మొదలయిన మొదటి రోజునుండే మొదలయిన ఈ చర్చలు నేటికీ సాగడం మరో విశేషం. అదే విదంగా దర్శకులిద్దరూ కూడా సినిమా మొదలు పెట్టగానే సినిమా గురించి ఎప్పటికప్పుడు విశేషాలు తెలియజేయడం మరింత చర్చకు అవకాశం ఇచ్చింది.   దర్శకుడు (వి)నాయక్ సినిమా మొదలు పెట్టిన మొదటి వారంలోనే ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలచేసి అభిమానులలో అంచనాలు పెంచగా, సీతమ్మ వాకిలి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, మహేష్ బాబు పేరును తన ఫ్యామిలీ సినిమాకు జోడించి అందరిలో ఆసక్తి రేపాడు. ఇద్దరు దర్శకులు అభిమానులు ఊహించినట్లే వారి అంచనాలను అందుకొని పండుగ సమయంలో ప్రేక్షకులకు మంచి విందు చేసారు.

ఇంటిని చక్క దిద్దుకోలేని పాక్

  నియంత్రణ రేఖ దాటివచ్చి భారత సరిహద్దులోకి జోరబడటమే గాక, ఇద్దరు భారతీయ సైనికులను అతి కిరాతకంగా చంపిన పాక్ సైన్యం, ఎన్నివిమర్శలు కురుస్తున్నా దున్నపోతూమీద వానపడినట్లు లెక్క జేయకుండా గత మూడు రోజులుగా జమ్మూకాశ్మీర్ లోని పూంచ్ సరిహద్దుల వద్ద భారత సైనికులపై కాల్పులు జరుపుతోంది. జరిగిన తప్పును వెంటనే సవరించుకోవలసింది పోయి, ఇటువంటి సమస్యలో ఇర్రుకొన్న ప్రతీసారీ ఆదేశం ఆడే నాటకాన్నే మళ్ళీ పాక్ ఇప్పుడు ఆడుతోంది. భారత్ సైనికులే తమ సరిహద్దులలోకి జొరబడి జరిపిన కాలుపుల్లో తన సైనికుడు ఒకడు చనిపోయాడని, అయినా కూడా ఈ సంఘటన ఇరుదేశాల మద్య జరుగుతున్నశాంతి ప్రక్రియలకు అడ్డంకి కాబోదని చెపుతూ, తప్పు భారత్ దే అయినా తాము ఓరిమితో ఉన్నట్లు మాట్లాడుతూ అతితెలివి ప్రదర్శిస్తోంది.   అంతే గాక, కాశ్మీర్ అంశాన్ని ఎలాగయినా అంతర్జాతీయ వేదికల మీదకు లాగి, భారత్ ను ఇరకాటంలో పెట్టాలని చూసే పాక్, ఈ సంఘటను ఆధారంగా చేసుకొని మరోసారి ఐక్యరాజ్య సమితి జోక్యం కోరగానే, భారత్ పాక్ కుయుక్తులను పసిగట్టి, ఐక్యరాజ్య సమితి జోక్యాన్ని నిర్ద్వందంగా తిరస్కరించి తెలివిగా మసులుకొంది. అంతే గాకుండా, తన సహనానికి ఈవిదంగా పరీక్షలు పెట్టి శాంతి ప్రక్రియలకు విఘాతం కలిగించవద్దంటూ పాక్ కు తీవ్రస్వరంతో హెచ్చరికలు జారీ చేసింది. కానీ, వాటిని పెడచెవినపెడుతూ పాక్ ఇంకా సరిహద్దుల వద్ద భారత్ సైనికులపై కాల్పులు జరుపుతూనే ఉంది.   అయితే, పాక్ ఉండుండి ఇటువంటి కవ్వింపు చర్యలకు ఎందుకు పాల్పడుతోంది అని ఆలోచిస్తే, తన దేశంలో అరాచక పరిస్థితుల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న పాక్ ప్రజలు ప్రభుత్వంపై కన్నెర్ర చేసినప్పుడల్లా ఇటువంటి చర్యలకు పాల్పడుతూ వారి దృష్టిని మళ్ళించే ప్రయత్నంగా చెప్పవచ్చును. అంతే గాకుండా, టెర్రరిస్ట్ మూకలకు నెలవయిన పాకిస్తాన్లో సమాంతర ప్రభుత్వం నడిపిస్తున్న వారికి భయపడి వారిని నిత్యం సంతృప్తి పరిస్తే తప్ప ప్రభుత్వం మనుగడ సాగించలేని అసహాయ పరిస్థితిలో ఉన్నదున ఇటువంటి చర్యలకు ఒడిగడుతూ ఉండవచ్చును. అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ను ఒక అంటరాని దేశంగా చూస్తున్నపటికీ, పాక్ ఉగ్రవాదానికి వత్తాసు పలుకుతూ తన పరిస్థితిని మరింత దిగాజార్చు కొంటోంది. అయినాకూడా ప్రపంచ దేశాల ముందు మేకపోతు గాంభీర్యం మాత్రం ప్రదర్శించక తప్పట్లేదు.   పాకిస్తాన్ లో శాంతి నెలకొనే వరకూ, ఆ దేశసమస్యలు కూడా మనకి ఈ విదంగా తలనొప్పులు తేకమానవు. అయితే, పాకిస్తాన్ లో శాంతి ఎప్పటికయినా నేలకొంతుందా అంటే అనుమానమే. అంటే, మనకీ పాక్ తో తలనొప్పులు శాశ్వితమే అనుకోక తప్పదు. ఇంటిని చక్క దిద్దుకోలేని పాకిస్తాన్ పోరుగింటికీ నిప్పు పెట్టాలని చూడడం దారుణం.

చిత్ర పరిశ్రమ విచిత్ర సమస్యలు

  దక్షినాది చిత్రపరిశ్రమతోబాటు మన తెలుగు చిత్రపరిశ్రమ కూడా జనవరి 7వ తేదిన సర్వీస్ టాక్స్ రద్దు చేయాలంటూ ఒక్కరోజు బంద్ పాటించి, ప్రభుత్వానికి తన నిరసన తెలియజేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే తాము పీకలలోతు కష్టాలలో కూరుకుపోయున్నామని, మళ్ళీ తమపై కొత్తగా సర్వీస్ టాక్స్ పేరిట మరింత భారం మోపడం చాలా అన్యాయమని యావత్ దక్షినాది చిత్ర పరిశ్రమ వర్గాలవారు నిరసన తెలియజేస్తూ ఒక్కరోజు బంద్ పాటించేరు.   అయితే, మిగిలిన వారి సంగతి ఎలాఉన్నపటికీ, మన చిత్ర పరిశ్రమలో నిర్మించిన ప్రతీ చిన్న, పెద్దా సినిమా పదిరోజులు కూడా ఆడకపోయినా ‘సూపర్ హిట్’ అంటూ విజయోత్సవాలు జరుపుకొంటూ, ‘రికార్డ్ కలెక్షన్ల’ని సదరు నిర్మాతలు ప్రకటించుకోవడం మనం చూస్తూనే ఉన్నాము. గత రెండు సం.లో విడుదలయిన అనేక చిన్న, పెద్దా సినిమాలు విడుదలయిన మొదటి వారంలోనే డబ్బాలు సర్దుకొని వెనక్కి వెళ్లిపోతుంటే, పరువు తక్కువని పెద్ద హీరోల సినిమాలను బలవంతంగా కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు నడిపించిన సంగతి మనకి తెలుసు. అయినప్పటికీ ఆ సినిమాలకు ‘సూపర్ హిట్’, ‘రికార్డ్ కలెక్షన్స్’ ట్యాగులు తగిలించుకొని బేషజాలు ప్రదర్సించడం ఆనవాయితీగా మారింది.   అల్లు అర్జున్ నటించిన ‘వరుడు’ మరియు ‘బద్రీనాథ్’ మహేష్ బాబు- ‘ఖలేజా’, జూ.యన్టీఆర్-‘శక్తి’ పవన్ కళ్యాణ్-‘తీన్ మార్’, ‘పంజా’ బాలకృష్ణ- ‘శ్రీమన్నారాయణ’ ఇలాగ చెప్పుకొంటూపోతే చాల పెద్ద లిస్టు అవుతుంది. భారీ బడ్జెట్ తో నిర్మింపబడిన ఈ సినిమాలన్నీ నిర్మాతలను ఆర్దికంగా దెబ్బతీసినాకూడా సదరు నిర్మాతలు ‘సూపర్ హిట్’, ‘రికార్డ్ కలెక్షన్స్’ అనే ట్యాగులు తగిలించుకొని తిరిగినప్పుడు, అసలే డబ్బుకు కటకటలాడుతున్నప్రభుత్వం దృష్టి వీరిపై పడటంలో ఆశ్చర్యం ఏముంది? సినిమాలు బాగా ఆడేయా లేదా అనే సంగతి ఆలోచించవలసిన అవసరం ప్రభుత్వానికి లేదు. గానీ, నిర్మాతలు స్వయంగా పేపర్లకి, టీవీలకి ఎక్కి మరీ వేసుకొన్న ‘టముకు’ మాత్రం వారి ముక్కు పిండి టాక్స్ లు వసూలుచేయడానికి ప్రభుత్వానికి మంచి మార్గం చూపుతోంది. ఆదాయపన్ను శాఖ కళ్ళు ఎప్పుడూ తమ సినిమాపరిశ్రమ మీదే ఉన్నసంగతి తెలిసికూడా నిర్మాతలు ఈ విదంగా భేషజాలకు పోవడంవల్లనే, ‘సినిమా పరిశ్రమ వద్దనుండి ఎంతయినా సొమ్ము పిండుకోవచ్చుననే’ ఆలోచనని మన చిత్రసీమలోని పెద్దలే స్వయంగా ప్రభుత్వానికి కలిగించేరని చెప్పక తప్పదు. దేశంలో మిగిలిన చిత్రపరిశ్రమలు కూడా ఇందుకు మినహాయింపు కాదని చెప్పక తప్పదు.   ఇక, మన చిత్రపరిశ్రమలో భారీ నష్టాలు పాలవుతున్నామని గగ్గోలుపెడుతున్న మన నిర్మాతలు మరియు ఫైనాన్సర్స్ మరి చిత్రనిర్మాణ వ్యయం తమ అదుపు తప్పుతున్నసంగతి తెలిసి కూడా, భారీ బడ్జెట్ సినిమాలకే ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారో వారికేతెలియాలి. హీరోలకి, దర్శకులకే తమ బడ్జెట్లో కోట్లాది రూపాయలు ఎందుకు సమర్పించుకొంటున్నారో తెలియదు. పెద్ద హీరోలతో సినిమా తీసినట్లయితేనే తమకి ఒకేసారి పెట్టిన పెట్టుబడికి పదింతలు వచ్చేస్తుందనే వారి గుడ్డి నమ్మకమే దానికి కారణం అయి ఉండవచ్చును. అయితే, పైన పేర్కొన్నవన్నీ పెద్ద హీరోలతో తీసినవే, నిర్మాతలను నట్టేట ముంచినవే. అయినా, నిర్మాతల ఆలోచనలో మార్పురాలేదు. అదికాక, పెద్ద సినిమా అంటే విదేశాలలో రెండు మూడు పాటలయినా ఉండాలనే సిద్దాంతం ఎవరు కనిపెట్టేరో గానే అది చిన్న నిర్మాతల పాలిత కూడా గుదిబండగా మారిందిప్పుడు.   సినీ పరిశ్రమ బాగుంటేనే అందరూ బాగుంటామని మైకులు పట్టుకొని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే నిర్మాతలు, దర్శకులు, సంగీత దర్శకులు, కధా రచయితలూ మరి వారి పారితోషికాలు ఎందుకు తగ్గించుకోవడం లేదు? చిత్ర పరిశ్రమ గురించి అంత బాధపడేవారు స్వచ్చందంగా తాము తీసుకొంటున్న లక్షలాది లేదా కోట్లాది రూపాయల పారితోషికం తగ్గించుకొంటామని ఒక్కసారీ కూడా ఎందుకు అనలేక పోతున్నారు? ఆ విదంగా తగ్గించుకోమని ఎందుకు నిర్మాతలు అడగలేకపోతున్నారు? ఒక హీరో లేదా హీరోయిన్ ఒక సినిమాలో నటించడానికి అసలు అంత ఎక్కువ ఎందుకు ఇవ్వాలి? అని అడగలేని మన చిత్రపరిశ్రమ ప్రభుత్వాన్ని నిలదీయడం అవివేకం.   ఒక పెద్ద హీరో లేదా దర్శకుల కాళ్ళ మీదపడి మరీ కోట్లు సమర్పించుకొనే మన నిర్మాతలు, మరి జూనియర్ ఆర్టిస్టూలకి కనీసం రోజుకి రూ.500 కూడా ఇచ్చేందుకు ఎందుకు మనస్కరించడంలేదు? తమకు కోట్లు ముడుతున్నపుడు తమ కన్నా ఎక్కువ శ్రమపడే జూనియర్ ఆర్టిస్టూలకి కూడా సమాన న్యాయం జరగాలని ఏ హీరోకూడా ఎందుకు కోరుకోవట్లేదు? తమ సినిమా విజయవంతం అవడంలో ఎంతోకొంత పాత్ర పోషించిన జూనియర్ ఆర్టిస్టూలకి, లయిట్ బాయ్ లు, మేకప్ మనుషులు, వంటి అనేక మందిని పట్టించుకోని మన చిత్రపరిశ్రమని ప్రభుత్వం మాత్రం ఎందుకు పట్టించుకోవాలి?ముందుగా మన చిత్రపరిశ్రమ తనని తానూ సరిదిద్దుకొని తరువాత ప్రభుత్వ సహాయానికి ఎదురు చూస్తే అందరు హర్షిస్తారు.   అయినా, ప్రభుత్వం పెంచే ప్రతీ పైసా పన్నును వారు భరిస్తున్నారా? అంటే లేదనే సమాదానం వస్తుంది మనకు. పెరిగిన టాక్స్ లను, టికెట్ ధరలను పెంచడం ద్వారా తిరిగి ప్రేక్షకుల నెత్తినపెట్టి వారు తప్పుకొంటున్నారు. మరి అటువంటప్పుడు, ప్రభుత్వం ఎంత పన్నువేస్తేవారికేమి తేడా చేస్తుంది?   గతంలో దాదాపు రెండు నెలలు పాటు స్ట్రయిక్ చేసి, తనకు తానే ఆర్దిక సమస్యలోకి నెట్టుకొన్నమన చిత్రపరిశ్రమ, ఇప్పుడు తానూ నష్టాలలో ఉన్నామని గగ్గోలు పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. ఆనాడు చిత్రపరిశ్రమలో అందరూ కలిసి తీసుకొన్న నిర్ణయాలలో కొన్నిటినయినా వారు ఖచ్చితంగా అమలు చేసి ఉంటే, వారీనాడు ఈవిదంగా వీధినపడే అవసరం వచ్చేది కాదేమో. తనను తానూ సంస్కరించుకోలేని మన చిత్రసీమకు మరొకరిని నిందించే హక్కు ఉండదు.

సెంచరీ చేసిన 63 ఏళ్ళ యువకుడు, చంద్రబాబు!

  ఆరోగ్యవంతులయిన యువకులు కూడా చేయ సాహసించని ఒక బృహత్ కార్యక్రమానికి 63 ఏళ్ళ యువకుడు అని చెప్పుకోవలసిన చంద్రబాబు నాయుడు చేసారు. సరిగ్గా వంద రోజుల క్రితం అనంతపురం జిల్లాలో హిందూపూర్ నుండి ‘వస్తున్నా మీ కోసం’ అంటూ పాదయాత్ర మొదలు పెట్టిన చంద్రబాబు ఇంతవరకు 9 జిల్లాలలో ఏకదాటిగా నడుస్తూ మారుమూల గ్రామాలను సైతం పర్యటించారు. అక్కడి ప్రజల కష్టనష్టాలు తెలుసుకొంటూ, వారితో మమేకమవుతూ ముందుకు సాగుతున్న చంద్రబాబు నిన్నటితో తన వరంగల్ జిల్లా పాదయాత్ర ముగించుకొని ఖమ్మం జిల్లాలో అడుగు పెట్టారు.   ఇంతవరకు చంద్రబాబు నాయుడు 42 అసెంబ్లీ నియోజకవర్గాలు, 88 మండలాలు, 13 మునిసిపాలిటీలు, 683 గ్రామాలు సందర్శించారు. అనంతపురం జిల్లాలో 252 కి.మీ, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో 200 కిలోమీటర్లు, నిజామాబాద్ జిల్లాలో 120 కిలోమీటర్లు నడిచారు.   ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ సీనియర్ నేతలు నామా నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు కోటేశ్వర రావు తదితరులు మాదిరాపురం గ్రామంలో దాదాపు రూ.50 లక్షలు వెచ్చించి వంద రోజుల పాదయాత్ర ప్రతీకగా వందఅడుగుల ఎత్తుగల ఒక విజయ స్థూపాన్నికూడా నిర్మిస్తున్నారు. చంద్రబాబు దానిని అవిష్కరించిన తరువాత, అక్కడే ఏర్పాటు చేసిన ఒక బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతారు. ఈ సందర్భముగా పార్టీ సీనియర్ నేతలందరూ కూడా సభలో పాల్గోనవచ్చునని సమాచారం. వీరే గాకుండా బాలకృష్ణ, లోకేష్ తదితరులు కూడా పాల్గొనవచ్చును. నిన్నరాత్రి ఖమ్మం జిల్లాలో మాదిరాపురం గ్రామంలో గల మిషనరీస్ కళాశాలలో బసచేసిన చంద్రబాబు, అదే కళాశాల ఆవరణలోనే రాష్ట్ర స్థాయి పార్టీ సమావేశం నిర్వహిస్తారు. సీనియర్ నేతలందరూ పాల్గొనే ఈ సమావేశంలో రానున్న స్థానిక సంస్థల, సహకార సంస్థలెన్నికలలో పార్టీ అనుసరించవలసిన వ్యూహాల గురించి చర్చిస్తారు. ఆ తరువాత స్థానిక సమస్యలు, విద్యుత్ ధరల పెంపు వంటి ఇతర సమస్యలను కూడా చర్చిస్తారు.    పార్టీ అధ్యక్షుడు స్వయంగా తమ జిల్లాలో ఇన్ని రోజులు పర్యటిస్తునందున, ఈ పర్యటనద్వారా పార్టీకి వీలయినంత ఎక్కువ ప్రయోజనం చేకూరే విదంగా స్థానిక నేతలు అయన పర్యటిస్తున్న మార్గంలో అనేక సభలు, సమావేశాలకు రూపకల్పన చేసారు. అదేవిదంగా పార్టీ అధ్యక్షుడితో కార్యకర్తల ముఖాముఖి కార్యక్రమాలకి కూడా ఏర్పాటు చేసి, పార్టీని మరింత పటిష్టపరిచే విధంగా అనేక పధకాలు తయారు చేసారు.   చంద్రబాబు ఖమ్మం జిల్లాలో దాదాపు 102కిమీ. పాద యాత్ర చేసి ఈ నెల 15వ తేదిన జగ్గయపేట నుండి తన కృష్ణజిల్లా పాదయాత్ర ప్రారంబిస్తారు.   ఇంతవరకు స్థానిక ప్రజలో తెలుగుదేశం పార్టీ తెలంగాణా వ్యతిరేఖమనే భావనను తన యాత్ర ద్వారా చంద్రబాబు పూర్తిగా తుడిచిపెట్టేయడమే గాకుండా, తెలంగాణా జిల్లలో నిర్వీర్యమయిన తన పార్టీ క్యాడర్ ను కూడా పునరుజీవింపజేసుకొన్నారు. అదే సమయంలో చంద్రబాబు స్వయంగా మారు మూల గ్రామాలను సైతం పర్యటించడం వల్ల స్థానిక సమస్యల పట్ల అవగాహన పెంచుకోవడమే గాకుండా గ్రామీణ స్థాయిలో ఉన్న సామాన్య కార్యకర్తలను కూడా అయన స్వయంగా కలుసుకొని వారి సాధక బాధకాలు తెలుసుకోగలిగేరు.     ఈ యాత్ర వల్ల తెలుగుదేశం మరో విదంగా కూడా చాల లాభపడిందని చెప్పవచ్చును. ఆయన పాదయాత్ర మొదలు పెట్టిన మొదలుగా రాష్ట్రాన్ని, దేశాన్నిపాలిస్తున్నకాంగ్రెస్ పార్టీ వరుసపెట్టి చేస్తున్న తప్పులను, చంద్రబాబు ప్రజల మద్యనే ఉన్నందున వాటిని ఎప్పటికప్పుడు ప్రజలకి వివరిస్తూ, కాంగ్రెస్ పాలనను సమర్ధంగా ఎండగట్టగలిగేరు. నిత్యం సరికొత్త వివాదాలలో ఇర్రుకొంటూ, ఈ మూడు నెలల్లో అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రకటిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబుకి ఆయన పాద యాత్ర చేస్తునంత కాలం కూడా చాలానే ఆయుధాలు అందజేస్తూ, అయన పాదయాత్ర విజయవంతం అయ్యేందుకు పరోక్షంగా చాలా సహాయపడినందుకు చంద్రబాబు మరియు అయన పార్టీ కూడా కాంగ్రేసు పార్టీకి కృతజ్ఞతలు చెప్పుకోక తప్పదు.  

రాజకీయ రంగులద్దుకొంటున్న అక్బరుద్దీన్ కేసు

  సాధారణంగా ఏదయినా వివాదంలో చిక్కుకొన్న రాజకీయ పార్టీ మొట్టమొదట చేసే పని ఎదురుదాడికి దిగడం, ఆ తరువాత దానిని రాజకీయం చేయడం. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ఇదొక విజయవంతంగా నిరూపింపబడిన మంచి రాజకీయ ఫార్ములా అయిపోయింది. ప్రస్తుతం యం .ఐ.యం. పార్టీ శాసనసభ్యుడు అక్బరుదీన్ ఓవైసి కేసులో కూడా ఆ పార్టీ అదే చేస్తోంది.   సోమవారం సాయంత్రం ముగిసిన సమావేశంలో ఆ పార్టీ అధినేత అసదుదీన్ ఓవైసి మాట్లాడుతూ, తమ పార్టీ సభ్యుడికి తమ పూర్తీ మద్దతు ఉంటుందని ప్రకటించారు. అసలు కాంగ్రెస్ పార్టీయే స్వయంగా ఈ కుట్రపన్ని తమపైకి పోలీసులను ఉసిగొల్పుతోందని అయన అన్నారు.ఈ నెల 26 లేదా 28వ తేదిల్లో ఈ కుట్ర వెనుక దాగి ఉన్న అసలు రహస్యం బయటపెడతానని అయన అన్నారు. వచ్చే ఎన్నికలలో తమ పార్టీ అత్యంత ఎక్కువ సీట్లు సాదించబోతోందని ఆయన అనడం, ఈ కేసు ద్వారా రాజకీయ ప్రయోజనాలు కూడా పొందాలని ఆ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు అర్ధం అవుతోంది.   ఆ పార్టీ ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, ఇంతవరకు తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినందునే, ఇదివరకు ఇటువంటి సంఘటనలలో నమోదు చేయబడిన కేసులను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని, గానీ ఇప్పుడు ఆ పార్టీకి తమ మద్దతు ఉపసంహరించుకోవడం వల్లనే ఈ విదంగా కుట్రపన్ని తమను కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని అన్నారు. తాము ఇటువంటి తాటాకు చప్పు ళకు బయపడేవారము కామని, అవసరమయితే కోర్టుల్లో న్యాయ పోరాటానికి కూడా తాము సిద్దమని చెప్పారు.   గత ఐదు దశాబ్దాలుగా నలుగుతూన్న తెలంగాణా సమస్యని కేంద్రం మరో 20 రోజుల్లో పరిష్కరించబోతున్న ఈ సమయంలో, తెలంగాణాలో అకస్మాత్తుగా ఇటువంటి మతకలహాలు చెలరేగడం, తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడటం, షిండే ప్రకటన వెలువడిన కొద్దిరోజులకే ఇదంతా మొదలవడం చూసి ఆందోళన చెందుతున్న తెరాస పార్టీ నేతలు, ఇది కాంగ్రెస్ , జగన్ కాంగ్రెస్, తెలుగుదేశం మరియు యం.ఐ.యం.పార్టీలు కలిసి మొదలుబెట్టిన నాటకమని దుయ్యబడుతున్నారు. తెలంగాణాలో అరాచక పరిస్థితులను సృష్టించి, కేంద్రాన్నిబయపెట్టి, వచ్చే తెలంగాణాని అడ్డుకోనేందుకే అందరూ కలిసి నాటకమాడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.   ఇక భారతీయజనతాపార్టీ కిరణ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక దేశ ద్రోహిని అరెస్ట్ చేయలేకపోతున్న ప్రభుత్వమూ ఒక ప్రభుత్వమేనా అని ఎద్దేవా చేసింది. యం.ఐ.యం.ని విమర్శిస్తూ ఆ పార్టీ కాంగ్రెసును వీడి బయటకి వచ్చిన తరువాత రాజకీయంగా ఎదిగెందుకే ఈ డ్రామా మొదలు పెట్టిందని, ఇంతవరకు పాతబస్తీ పార్టీగా మిగిలిపోయిన ఆ పార్టీ రానున్న ఎన్నికలలో తన పరిదిని, సీట్లను పెంచుకోవడానికే ఈ నాటకమాడుతోందని విమర్శించింది.   ఇక తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో క్లుప్తంగా స్పందిస్తూ అక్బరుదీన్ ప్రసంగాన్ని ఖండించింది .   అయితే, ఈ విషయంలో అసలు నోరు మెదపని ఒకే ఒక పార్టీ వై.యస్సార్,కాంగ్రెస్ పార్టీ. అది నామ మాత్రంగానయినా అక్బరుద్దీన్ వ్యాఖలను ఖండించక మౌనం వహిస్తోంది.   మొత్తం మీద యం.ఐ.యం.పార్టీకి ఇప్పుడు అక్బరుదీన్ అరెస్ట్ అయినట్లయితే మైనార్టీ వర్గాలనుండి సానుభూతి పిండుకోనే అవకాశమే కాకుండా, ఈ వ్యవహారం వల్ల తమ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రచారం లబించినందుకు సంతోషపడుతోంది. అందువల్ల ఈ కేసు ఎంత కాలం సాగదీస్తే ఆ పార్టీకి అంత ప్రచారం, అంత సానుభూతి ఫ్రీగా దొరుకుతాయి.   అయితే, ఇటువంటి వివాదాలవల్ల యం.ఐ.యం. పార్టీ తాత్కాలికంగా మైనార్టీ వర్గాలను ఆకర్షించగలదేమో గానీ, దీర్ఘకాల రాజకీయ ప్రయోజనాలు మాత్రం పొందలేదు. రాజకీయంగా ఎదగాలనుకొనే ఆ పార్టీ ఇంతకంటే మంచి దారులను ఎంచుకొన్నపుడు మాత్రమే మైనార్టీలు సైతం తాము విస్వసించదగ్గ రాజకీయ పార్టీగా గుర్తించి ఆదరిస్తారు. తాము ఓటువేసే పార్టీ తమ ప్రయోజనాలను కాపాడుతుందని, ఇతర రాజకీయ పార్టీలకన్నా యం.ఐ.యం. మేలని వారు భావించినప్పుడే ఆ పార్టీకి రాజకీయ భవిష్యత్ ఉంటుంది. కేవలం వివాదాలు, సంచలనాల ఆదారంగా మన దేశంలో ఏ రాజకీయ పార్టీ పైకెదిగిన దాఖలాలు లేవు అని యంఐ.యం. ఇప్పటికయినా తెలుసుకొంటే మంచిది.

సర్వరోగ నివారిణి-నగదు బదిలీ పధకం

  నగదు బదిలీ పధకాన్ని ఒక ‘గేం చెంజర్’గా అభివర్ణిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఆ పధకాన్ని‘సర్వ రోగ నివారిణి’గా భావిస్తున్న తీరుచూస్తే, ఆపధకంపై గంపెడు ఆశలు పెట్టుకొన్నట్లు కనిపిస్తోంది. కానీ, ఏడాది కాలంగా ఆ పధకాన్ని రాజస్తాన్ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో పైలట్ ప్రాజెక్ట్ గా అమలుచేసి విఫలమయినపటికీ, లొసుగులమయమయిన దానినే పట్టుకొని ఇంకా వ్రేలాడుతూ, తమ పార్టీని రాగల ఎన్నికలలో అదే ఆదుకొంటుందని గుడ్డిగా నమ్ముతూ ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీని చూస్తే జాలి కలుగక మానదు.   ఒక వైపు గ్యాస్, కరెంటు, పెట్రోలు వంటి నిత్యావసరాలను సామాన్య ప్రజలకి అందనంత ఎత్తుకి తీసుకుపోతూ, వాటిని కూడా విలసవస్తువుల జాబితాలో చేర్చేసిన కాంగ్రెస్ పార్టీ, తానూ తీసుకొంటున్న ఈ ప్రజావ్యతిరేక నిర్ణయాలన్నిటినీ కూడా తన ‘సర్వ రోగ నివారిణి’ నగదు బదిలి పధకం మాటునదాచేసి ఎన్నికల గండాన్నిగట్టేకేయవచ్చుననే భ్రమలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు, సామాన్యుడిని అధిక ధరలతో, కరెంటు సర్ చార్జీలతో నడ్డి విరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, తానూ విదిలించే నాలుగైదు వందల రూపాయల నగదు బదిలీతో ప్రజలని భ్రమింపజేసి ఎన్నికలలో గెలిచేయగలనని భావించడం ఆత్మవంచన తప్ప మరొకటి కాదు.   అనేక సం.లు అధికారంలో ఉండి, అనేక ఎన్నికలలో భంగాపాటు చవిచూసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ప్రజల నాడిని, వారి మూడును పసికట్టలేకపోవడం ఒక వింతయితే, పసికట్టలేకపోయినా ఈ విదంగా ఆత్మవంచన చేసుకోవడమే మరో వింత.   కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు మరియు డిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, ఈ పధకాన్ని ప్రసంశిస్తూ, ‘దాని ద్వారా ప్రభుత్వం పేదవారికిచ్చే రూ.500లలో నలుగురయిదుగురున్న ఒక కుటుంబం నెలంతా హాయిగా బ్రతికేయగలదు’ అని చెప్పడం, కాంగ్రెస్ పార్టీ ప్రజల గురించి ఎంత హీనంగా ఆలోచిస్తోందో తెలియజేపుతోంది.   ప్రజలు ఆ పధకాన్ని మాహాద్భుతం అని నమ్మకపోయినా కనీశం కాంగ్రెస్ పార్టీ అయినా నమ్ముతోందా అంటే సందేహమే. నిన్న తూర్పు గోదావరి జిల్లాలో అత్యంత ఆర్భాటంగా ఆరంబించిన ఈ పధకాన్నిముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆకాసానికి ఎత్తేస్తుంటే, పక్కనే ఉన్నకేంద్ర మంత్రి జై రామ్ రమేష్, నగదు బదిలీ పధకం అంటే అన్ని కష్టాలను, సమస్యలను మాయం చేసే మంత్రందండం కాదు, అని చురకలు వేసేరు. దానినిబట్టి కాంగ్రెస్ పార్టీలో కొందరయిన ఆ పధకం తమని ఆదుకోదని అర్ధం చేసుకొన్నట్లు అర్ధం అవుతోంది.   ఒకవైపు, ప్రజలని నానా ఇబ్బందులకు గురిచేస్తూ, “మీరు ఇంకా ఇంకా త్యాగాలు చేయడానికి సిద్దం కావలసిందే అంటూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ పార్టీని, రానున్న ఎన్నికలలో ప్రజలు త్యాగం చేస్తారేమో అనే బెంగ అంతర్లీనంగా ఉండబట్టే కాంగ్రెస్ పార్టీ ఇటువంటి చవకబారు ఆలోచనలతో ముందుకు సాగిపోతోంది.   దేశానికి ఒక గొప్ప యువనాయకుడిని అందించబోతున్నామని గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్ పార్టీకి మరి ఆ నాయకుడు చేస్తున్న దిశానిర్దేశం ఇదేనా అని ఆలోచిస్తే, రేపు అతని పాలన మరెంత సమ్మగా ఉండబోతోందో ఇప్పుడే అర్ధం అవుతోంది.   కాంగ్రెస్ పార్టీ, గుజరాత్ ఎన్నికలలో చావుదెబ్బ తిన్నతరువాతనయిన, ప్రజలు తమ నుండి ఏమి కోరుకొంటున్నారో తెలుసుకోకుండా, ఇటువంటి పధకాలతో ముందుకు సాగితే కాంగ్రెస్ పార్టీని నిజంగానే ప్రజలు త్యాగం చేయక తప్పదు.      

ఏమి కోరు కమిటీలవి? ఏమి కబుర్లవి?

  హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మొదలుపెట్టిన నెల రోజుల సస్పెన్స్ సీరియల్ క్లైమాక్స్ ఎలావుంటుందో తెలియదుగానీ, డిల్లీ పెద్దలు నలుగురు చేరి తలుపులేసుకొని ఏదో ‘కోరు’ కమిటీలుగా ఏర్పడి రోజూ రకరకాల కాంబినేషన్స్ ఉన్ననేతలతో చర్చోపచర్చలు చేస్తూ హాడావుడి చేస్తుంటే, బ్రేక్ తరువాత ఏమవుతుందో అనే ఆత్రంతో ఇక్కడ రాజకీయ నాయకులు, ప్రజలు కూడా బీపి.లు పెంచేసుకొంటున్నారు.   ఒకరోజు కోరు కమిటీ సమావేశంలో హోంమంత్రి షిండేగారు అఖిలపక్షానికి సోనియమ్మ రాలేదుగనుక, ఆమెకి అక్కడ ఏమిజరిగిందో పూసగుచ్చినట్లు వివరించి బ్రేక్ ఇస్తే, మరుసటిరోజు వీరందరూ కలిసి మరో కోరుకమిటీగా ఏర్పడి ప్రధానమంత్రి మన్మోహన్ సింగువారిని మద్యలో కూర్చోబెట్టుకొని, మళ్ళీ జరిగిన కధంతా మొదటి నుంచి చెపుతారు. ఇంకా, రేపు విదేశాల నుండి తిరిగి రాబోతున్నరాహుల్ యువరాజుల వారికీ ఈ కధంతా చెప్పాలంటే మళ్ళీ మరో కోరు తప్పదు. ఈ విదంగా కాంగ్రేసు పెద్దలందరూ కలిసి రాష్ట్ర సమస్యని కొబ్బరి కోరినట్లు తలుపులేసుకొని మరీ కోరేస్తుంటే, ఇక్కడ రాజకీయనాయకుల బీపీలు గంటకో తీరున లేచి పడి పోతున్నాయి.   ఇక మీడియాకి కూడా వేరే హాట్ న్యూస్ ఏమి ఇంకా దొరకనందున, అక్కడ వార్ రూమో లేక ఏ.సి. రూములోనో తలుపులు బిడాయించుకొని మరీ మాట్లాడుకొంటున్న కాంగ్రెస్ పెద్దలు, ఏమేమి మాట్లాడుకొన్నారో, ఎవరితో ఎవరు ఏమన్నారో, అప్పుడు సోనియమ్మా ఎలా కోప్పడిందో, చిదంబరం చంకలోఉన్న ఫైల్లోంచి ఏఏ కాగితాలు చుపించేడో, ఎవరు టీ తాగేరో, దగ్గేరో, తుమ్మేరో వంటి అన్ని వివవరాలను స్వయంగా వారిపక్కన కూర్చొని చూసోచ్చిన్నట్లు రకరకాల కధనాలు స్క్రోలింగులు ఇచ్చేస్తూ, అచ్చొత్తి పడేస్తూ అటు నేతలకు, ఇటు ప్రజలకు కూడా మంచి కాలక్షేపం కల్పిస్తోంది.   బ్రేక్ తరువాత అంటే కోరుకమిటీ సమావేశం తరువాత, ఏమయినా మంచి సంచలనమయిన వార్త ఎవరయినా చెపుతారేమోనని ఆశగా చూస్తున్న మీడియాకి చిన్న పాటి క్లూ కూడా ఈయకుండా వారు కారెక్కి వెళ్ళిపోతుంటే, అక్కడ ఎంతో ఓపిగ్గా ఎదురుచూస్తున్న కెమెరామాన్ గంగతో రాంబాబులు మరీ నిరాశాపడిపోకుండా , “ఇపుడే ముగిసిన కీలకమయిన కోరుకమిటీ సమావేశం, ఆ...జాదూగారు వెళ్తూ వెళ్తూ చేయి ఆడించేరు. అంటే, ఇక తెలంగాణా ఈయరని మనకొక సందేశం ఇచ్చేరు. ఆయన కారువెనుక పొగ గొట్టం నుండి వస్తున్ననల్లని పొగ కూడా మనకు అదే సంకేతం ఇస్తోంది...పావనీ..ఓవర్ టు స్టూడియో...అని వారు చెప్పేయగానే, రాష్ట్ర సమస్యపై పేటెంట్ హక్కులు కలిగిన ఓ నలుగురు పెద్ద మనుషులు అప్పటికే స్టుడియోలో కూర్చొని, పెద్ద గొంతులతో ఒకరిమాట మరొకరికి వినబడకుండా ‘చేయి అడ్డంగా ఊపలేదు, నిలువుగానే ఊపేరు గనుక...’అంటూ టీవీలు బద్దలయిపోయెంత గట్టిగా వాదులాడుకోవడం వెన్వెంటనే జరిగిపోతుంది.   ఇక పత్రికలకి ఆ అవకాశం ఉండదు గాబట్టి, తాపీగా కూర్చొని ‘ఆ..జాదూ చేయి అలా ఎందుకు ఊపేడు? ముఖ్యమంత్రి హుటాహుటిన డిల్లీ ఎందుకు వెళ్ళేరు? ఎక్కడో ఉన్న బన్సాల్ మంత్రిని ఎందుకు డిల్లీ పిలిపించేరు? సీమంద్ర నాయకుడయిన ఫలానా మంత్రి డిల్లీలో మూడు రోజులుగా ఎందుకు మకాం వేసేడు? చిరంజీవి నల్గొండలో ఎందుకలాగ అన్నాడు? రాహుల్ గాంధి మళ్ళీ ఇండియాకి ఎందుకు తిరిగివచ్చేస్తున్నాడు? పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో సోనియా ఏమి మంతనాలు చేసారు? అంటూ రకరకాల పాయింట్స్ లేవనెత్తుతూ ‘సంక్రాంతికి విడుదల కానున్న తెలంగాణా’ అని ఒక పత్రిక వ్రాస్తే, ‘సమైక్యాంద్రాకి మొగ్గుచూపుతున్నఅంబికా సోనీ’ అంటూ మరో పత్రిక వ్రాసేస్తుంది.   కాంగ్రెస్ క్లైమేక్స్ ఎలాగ ఉంటుందో తెలియనప్పటికీ, ఈ సస్పెన్స్ సీరియల్ వల్ల, తమ డెయిలీ జీడిపాకం సీరియళ్ళు చూసే వాళ్ళు బాగా తగ్గిపోయారని కొన్ని టీవీ ఛానళ్ళ వారు తలపట్టుకొంటున్నారు. గానీ, విజ్ఞానదాయకమయిన ఈ కాంగ్రెస్ సీరియాల్ వల్ల ప్రజలకి రాజకీయ పరిజ్ఞానం పెరుతోందని మాత్రం అందరూ ఒప్పుకోక తప్పదు.