కెసిఆర్ పార్టీలో 'ఆత్మహత్యల' పరకాయప్రవేశం !!

    మహాభారతం చదువుకున్నవాళ్ళకు "ముసలం'' అనే మాట తెలిసి ఉంటుంది. "యాదవకులంలో ముసలం'' అన్న పదం అదే! అలాగే, తెలుగుజాతిని విచ్చిన్నం చేయడానికి, తద్వారా తన రాజకీయ నిరుద్యోగానికి ఒక పరిష్కారంగా తెలంగాణలో తిష్ఠవేసిన కోస్తాంధ్రుడు "బొబ్బిలిదొర''గా పలువురు చెప్పుకునే కల్వకుంట్ల చంద్రశేఖర రావు టి.ఆర్.ఎస్. అనే పార్టీనొకదాన్ని స్థాపించుకున్నది లగాయతూ తోటి తెలుగు వారందరినీ కలిపి "సీమాంధ్ర దోపిడీదారులు''గా ప్రకటించి విద్వేష ప్రచారం ప్రారంభించాడు. అది మొదలు, కొంతమంది యువకుల ఆత్మహత్యలను ప్రోత్సహిస్తూ వచ్చాడు. ఫలితంగా "సీమాంధ్రులను తెలంగాణా ఆంధ్రుల మధ్యనుంచి వెళ్లగొట్టి, వారి భూముల్ని, వారి ఇళ్ళను, వారి సంస్థలను మనం స్వాధీనం చేసుకోవడంద్వారా ఉద్యోగాలన్నీ మనకే దక్కుతా''యన్న ప్రచారంద్వారా స్థానిక యువకుల్లో భ్రమలు, ఆశలు పురిగొల్పాడు. ఈ "పురి'' కొందరు తెలంగాణా యువకులపాటి టి.ఆర్.ఎస్. నాయకుడు కెసిఆర్ విధించిన 'ఉరి'గా మారి, రకరకాల పేరిట ఆత్మహత్యల్ని ప్రోత్సహించింది! చివరికి ఈ "ప్రోత్సాహం'' కెసిఆర్ పార్టీ నిర్మాణ తీరుతెన్నుల పట్ల ఏ కరీంనగర్ జిల్లా తనదేనని కెసిఆర్ భ్రమిస్తున్నాడో సరిగ్గా ఆ జిల్లాలోనే అంతర్గత కుమ్ములాటల గురించి విన్నవించుకోదలచిన ప్రధాన కార్యదర్శి, జిల్లా యువజన విభాగం నాయకుడైన గుండా నాగరాజు ఆత్మహత్యకు దారితీసింది. తోటి తెలుగువారిపై కెసిఆర్ ప్రారంభించిన విద్వేష ప్రచారంలో మొదలైన ఆత్మహత్యలు కెసిఆర్ పార్టీలోకే ప్రవేశించక తప్పలేదు! నాగరాజు ఆత్మహత్య పార్టీలోని కుమ్ములాటల గురించిన తన విజ్ఞాపనను కెసిఆర్ పట్టించుకోనందుకే గాక, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన తనను "మంథని'' శిక్షణా తరగతుల సభావేదికపైకి సహితం కెసిఆర్ ఆహ్వానించక పోవడంతో తీవ్రంగా కలతచెందిన నాగరాజు సభావేదిక సమీపంలోనే పురుగుమందు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆస్పత్రికి తీసుకువెళ్లినా బతికించడం సాధ్యపడలేదు. ఇతర కార్యకర్తలయినా ఆస్పత్రికి వెళ్ళి నాగరాజు మృతికి కుటుంబాన్ని కలుసుకొని సంతాపం తెలియజేసివచ్చారు గాని, కెసిఆర్ ఆ ఛాయలకు కూడా వెళ్ళకుండా, సరాసరి హైదరాబాద్ కు ఉడాయించడం అందరినీ ఆశ్చర్యపరిచిందని కొన్ని పత్రికలు రాశాయి. నాగరాజు మృతి వార్తను అన్ని పత్రికలూ ఒకలా రాయకుండా ప్రస్తుతపు "ఉద్రిక్త వాతావరణం''లో అగ్నికి ఆజ్యం పోయడం ఎందుకని భావించి, సెంటిమెంటు పేరిట నాగరాజు తెలంగాణా కోసం బెంగపడి ఆత్మహత్య చేసుకున్నట్టు కొన్ని పత్రికలు చిత్రించ జూచాయి. కాగా, తెలంగాణా వాదాన్ని బలపరచడం ద్వారా స్థానికంగా ఓ నాలుగు సీట్లయినా రాకపోతాయా అని భావించి అవకాశవాద రాజకీయాన్ని ఆశ్రయించి, అంతకుముందు తెలంగాణా రైతాంగసాయుధ పోరాటం ద్వారా వివిధ ప్రాంతాల్లో పరాయి పాలనల వల్ల చెల్లాచెదురై ఉన్న తెలుగువారందరినీ ఒక్క రాష్ట్రంగా (విశాలాంధ్ర) ఒక్క గొడుగుక్రింద సమీకరించిన కమ్యూనిస్టుపార్టీ దినపత్రిక "విశాలాంధ్ర'' నాగరాజు ఆత్మహత్య వార్తను యిలా అందించింది: "టి.ఆర్.ఎస్.లో వర్గపోరుకు ఒకరు బలి : కె.సి.ఆర్. సభలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు ఆత్మాహుతి'' : మంథనిలో జరిగిన శిక్షణా తరగతులకు ఆ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్రావు హాజరయ్యారు. అయితే, టి.ఆర్.ఎస్. జిల్లా ప్రధాన కార్యదర్శి గుండా నాగరాజును (29) వేదిక మీదకు ఆహ్వానించకపోవటంతో మనస్థాపం చెందాడు. క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దానిని గమనించిన నాయకులు నాగరాజును వెంటనే కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ నాగరాజు మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మంధని సి.పీ.ఐ. నేత కొవ్వూరి రాజలింగం, పట్టాన కార్యదర్శి సత్యనారాయణ, టిడిపి మంథని మండల అధ్యక్షులు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి రాజ్య, పట్టాన అధ్యక్షులు లక్కాకుల వెంకన్న విలేకరులతో మాట్లాడుతూ నాగరాజు కుటుంబానికి కెసిఆర్ తక్షణం రూ.10 లక్షణ ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. నాగరాజు మృతికి కెసిఆర్ పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పార్టీలో ఆయనకు ప్రాధాన్యత తగ్గినా దృష్ట్యా నాగరాజు కలత చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటన కారణంగా మంథనిలో టి.ఆర్.ఎస్. ఫ్లెక్సీలు, తోరణాలను నాగరాజు సహచరులు తొలగించడంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి'' కాగా, "సాక్షి'' పత్రిక కూడా నాగరాజు తెలంగాణా కోసం 12ఏళ్లుగా కష్టపడ్డాడని, కాని ఈరోజు స్టేజీమీదికి ఆయన్ని రానివ్వకపోవటంతో అవమానంతో క్రిమిసంహారకమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి బావ ప్రభాకర్ ఆరోపించారు'' [07-06-20`13] ఇక బొబ్బిలిదొర'' బందీగా ఉన్న 'టి'ఛానల్ ఒక్కటే నాగరాజు తెలంగాణా రాలేదనే ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రకటించడం ఆ ఛానల్ చూస్తున్న కొద్దిమందికి సహజంగానే ఆశ్చర్యం కల్గించలేదు! కాగా గత కొంతకాలంగా జరుగుతున్న విచిత్ర పరిణామాల వెనక రహస్యం ఎవరికీ బోధ పడడంలేదు. ఎందుకంటే, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటాన్ని సజావుగానూ, సమర్థవంతంగానూ, ఆశాజనకంగానూ, పకడ్బందీగానూ, ఆత్మవిశ్వాసంతోనూ నిర్వహించడంలో ఆరితేరిన తెలంగాణా ప్రాంత ప్రజలు ఆత్మహత్యలకు పూర్తిగా వ్యతిరేకం. 1947-53 దాకా సాగిన నాటి సాయుధ పోరాటంలో ఏ ఒక్కరూ ఆత్మహత్య చేసుకోలేదు. కాని ఇప్పుడా పరిస్థితి ఎందుకు, ఎవరివల్ల వచ్చింది? తెలంగాణా యువతలో కొందరిని ఎందుకీ బలహీనత ఆవరించింది? అంతేగాదు, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల (తెలంగాణా, కోస్తాంధ్ర, రాయలసీమ)లో మిగతా రెండు ప్రాంతాలతో పోల్చితే, తెలంగాణలో ఎక్కువ ఆత్మహత్యలు జరగడానికి దారితీసిన పరిస్థితులేవి? ఈ ఆత్మహత్యలు యువతకే కట్టుబడకుండా తెలంగాణాలోని రైతులు, వ్యవసాయ కార్మికులు, బడుగు, బలహీనవర్గాల కుటుంబాల వరకూ వ్యాపించిపోవటానికి కారణం తెలంగాణా వాదమా లేక రాజకీయ, సామాజిక, ఆర్థిక అసమానతలూ ప్రధాన కారణమా? ఈ ప్రశ్నకు సాధికారికంగా సమాధానం చెప్పుకోకుండా ప్రజాసమస్యలను విశ్లేషించుకోలెము.   "పుట్టినబిడ్డ బారెడ''ని ఓ సామెత! అలాగే తన స్వార్థరాజకీయం కోసం "తెలంగాణా రాష్ట్రం ఇదిగో నేడో, రేపో, ఎల్లుండో'' అంటూ తెలంగాణా ప్రజల్ని మోసపుచ్చుతూ ఇప్పటికి కనీసం ఎంతలేదన్న డజనుసార్లు "ఉద్యమాన్ని'' వాయిదా వేసుకున్నాడు కెసిఆర్. ఈసారి 'వాయిదా' సరాసరి నవంబర్ కు నెట్టి, 2014 ఎన్నికల లక్ష్యం - "ఓట్లు, సీట్లేగాని'', తెలంగాణా కాదంటున్నాడిప్పుడు! అయితే మరి రాష్ట్రాన్ని ఎలా సాధిస్తాడట? కాంగ్రెస్ లోని టి.ఆర్.ఎస్.ను విలీనం చేయడంద్వారా, తాను ముఖ్యమంత్రి కావడం ద్వారానట! కాని ఈ మధ్యలో మరో 'చిట్కా' వదిలాడు. ఇది కూడా 'వాయిదాల'కు సంబంధించిందే! తెలంగాణా వస్తే గిస్తే 'దళితుడ్ని' ముఖ్యమంత్రిని చేస్తానని ఏడాదిన్నర నాడు ప్రకటించి, మళ్ళా ఇన్నాళ్ళూ ఆ వూసెత్తకుండా 2014 ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మరోసారి (02-0602013) ఈసారి "దళితుడే ముఖ్యమంత్రి'' అని నినదించాడు. కాని ఢిల్లీలో ఆంధ్ర భవన్ లోని దళిత అధికారిమీద 'దొర'తనం చేయిచేసుకుని గాయపరిచిన తరువాత 'నష్టపరిహారం'గా ఎన్నికలలో టి.ఆర్.ఎస్. కు ఓట్ల కోసం "దళితుడే ముఖ్యమంత్రి'' అన్న పొలికేకను వినిపించాడు! కానీ ఇతని రాజకీయ "చదరంగపు'' ఆటను, కుట్రను తెలంగాణలో దశాబ్దాల తరబడిగా 'దొర'ల, జాగిర్దార్ల,దేశ్ ముఖ్ ల దోపిడీ దౌర్జన్యాలను అనుభవించి కునారిల్లిపోయిన గిరిజన, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తరగతులు, తదితర బడుగువర్గాలన్నీ పసికట్టేశారు! ఎవరోకాదు, టి.ఆర్.ఎస్. ప్రధాన దళిత కార్యదర్శి ఎలా టి.ఆర్.ఎస్. నాయకత్వం బేరసారాల ద్వారా వందలకోట్లు వసూలు చేశారో బహిరంగంగా ఆరోపించి, ఆ నాయకత్వం ఎలా దళిత వ్యతిరేక నాయకత్వామో ఆరోపిస్తూ ప్రకటన విడుదల చేశాడు. తెలంగాణలో జరుగుతున్నా ఆత్మహత్యల స్వరూపస్వభావాల గురించి, ఆత్మహత్యలకు కారణమైన సశాస్త్రీయ కారణాల గురించీ సాయీమనీష్ (bold) అనే పరిశోధకుడు జరిపిన సర్వే ఫలితాలను, వాటి విశేషాలనూ ఇటీవల ఒక నివేదిక రూపొందించాడు. ఆ నివేదనను భారతదేశ మ్యాగజైన్ జర్నలిజంలో, ప్రత్యేక పరిశోధక నివేదికల రూపకల్పనలో, అవినీతిని, అక్రమాలను వెల్లడించడంలో సాధికారతను, విశ్వసనీయతను దేశంలోనేగాక, విదేశాలలోనూ పొందిన తేజ్ పాల "తెహల్కా'' (2013, మార్చి 9న) ప్రచురించింది. ఆ ప్రత్యేక పరిశోధనలో సాయీమనీష్ తెలంగాణలో ఆత్మహత్యలకు కారణాలను విపులంగా వివరించాడు : "స్వేచ్చా టిబెట్, (ఫ్రీ-టిబెట్) పేరిట టిబెటనలు ఆత్మాహుతి చేసుకుంటుంటారు. సరిగ్గా తెలంగాణాలో ఆత్మహత్యల దృశ్యం కూడా అలాంటిదే. కాని, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ ఒక్కటే తెలంగాణాలో జరిగే ఆత్మహత్యలకు కారణం కాదు. అదే అసలు కథ కాదు'' అని చెబుతూ ప్రాంతంలో ఆత్మహత్యల పర్వం వెనక దాగిఉన్న అసలు కారణాల్ని మనీష్ నివేదిక యిలా వెల్లడిస్తోంది.   "2009 నవంబర్ కు 2012 జనవరి నెల మధ్య కాలంలో తెలంగాణలో జరిగిన ఆత్మహత్యల సంఖ్య 849. ఈ ఆత్మహత్యల్లో కొన్ని తెలంగాణా రాష్ట్రం సమస్యపై జరిగినవైతే, వాటిలో పెక్కు ఆత్మహత్యలు నానాటికీ తీసికట్టు అవుతున్న దారుణ సాంఘిక-ఆర్థిక పరిస్థితుల మూలంగా జరిగాయి. దుర్భరదారిద్ర్యం, రుణాలు చెల్లించలేని పరిస్థితులు, వ్యవసాయరంగ సంక్షోభం, ఉద్యోగావకాశాలు సన్నగిల్లిపోవటం, ప్రత్యేకరాష్ట్రం ఏర్పడకపోతే తెలంగాణా ప్రజలకు యిక భవిష్యత్తే లేదన్న నిరంతర రాజకీయ ప్రచార మత్తు ఫలితంగానూ - తెలంగాణాలో చేనేత పనివారు, రైతులు, విద్యార్థులు ఆత్మహత్యల వైపునకు నెట్టబడ్డారు. ఇలా ఒక వైపున అమూల్యమైన జీవితాలు కొడిగట్టి పోతూండగా మరొక వైపున ఆంధ్రప్రదేశ్ లో పరస్పరం దుమ్మెత్తిపోసుకునే రాజకీయ ప్రహసనం యదేచ్చగా సాగిపోతోంది. ఇక తెలంగాణా ఉద్యమంలో అట్టడుగు బలహీన వర్గాల ఆత్మహర్యాలు మానవుడి కనీసపు ఆత్మగౌరవానికి కూడా నోచుకోని పరిస్థితులలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకా స్పష్టంగా, వాస్తవం చెప్పాలంటే తెలంగాణా పేరిట ఆత్మహత్యలు చేసుకున్నవారిలో దాదాపు అందరూ షెడ్యూల్డ్ కులాలు (ఎస్.సి.) షెడ్యూల్డ్ తరగతులకు (ఎస్.టి.) లేదా వెనుకబడిన తరగతులకు (బి.సి.లు)చెందినవారేగాని, తెలంగాణా రాష్ట్రసమితి నాయకుడు, వెలమ కులానికి చెందిన కె.సి.ఆర్. కులంనుంచి ఒక్కడంటే ఒక్కడూ ఆత్మహత్య చేసుకున్నట్టు ఎక్కడా నమోదు కాలేదని ఈ సందర్భంగా గుర్తించాలి ... ఒక వైపున ఈ ఆత్మహత్యల్ని రాజకీయ సమస్యకు ఉద్రేకపూరిత స్పందనలుగా ప్రచారం చేస్తూండగా, రాష్ట్రంలోని రాజకీయవేత్తలు ఇంకొక వైపున నిరుద్యోగం, అనంతమైన రుణభారం లాంటి ప్రజాసమస్యలను బాపకిందకు తోసేసి, వ్యక్తుల దారుణ విషాద ఘటనలకు ప్రాధాన్యమిచ్చి ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు .... అంతేగాదు, మనీష్ తన నివేదికలో యింకా యిలా తెలియజేశాడు : "1996 నుంచి 2007 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఆత్మహత్యల్లో మూడింట రెండు వంతులు తెలంగాణాలోనే నమోదయ్యాయి. శ్రీకృష్ణ కమిటీ నివేదిక కూడా తెలంగాణాలో దుర్భిక్ష పరిస్థితులవల్లం కొత్తరకం పత్తివిత్తనాలు విఫలమవటంవల్ల, 2004 మే నుంచి 2005 నవంబర్ మధ్యకాలంలో చేనేత పనివారు జీవనభృతికి దూరం కావడంవల్ల - మొత్తం రాష్ట్రంలో జరిగిన 1068 ఆత్మహత్యల్లో తెలంగాణాలో నమోదైనవి 663 ఆత్మహత్యలు. ఈ లెక్కన కూడా ప్రాంతాలలోనూ ఒక్కొక్క ప్రాంతంలో పరిస్థితిని విశ్లేషించగా [కోస్తాంధ్రనుంచి ప్రకాశంజిల్లా, తెలంగాణా నుంచి మెదక్ జిల్లా, రాయలసీమలో అనంతపురం జిల్లా], ఎక్కువ ఆత్మహత్యలు కోస్తాంధ్ర, రాయలసీమల్లోని అగ్రకులాల్లో నమోదుకాగా, తెలంగాణాలో మాత్రం ఈ ఆత్మహత్యలు అగ్రకులాలు, షెడ్యూల్డ్ కులాలు, తదితర వనుకబడినవర్గాల మధ్య నమోదదయ్యాయి. తెలంగాణాలో దళితులు, వెనుకబడిన కులాలలో ఆత్మహత్యలు తరచుగా సర్వసాధారణమయ్యాయి. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రోద్యమంలో 2009-10 సంవత్సరాల మధ్యన, 2009 నవంబర్, 2010 ఫిబ్రవరి మధ్యకాలంలో 313 ఆత్మహత్యలు నమోదుకాగా, వాటిలో 218 ఆత్మహత్యలకు పాల్పడ్డవారు 18-50 సంవత్సరాల మధ్య వయస్సుగల వాళ్ళు. "వీటిలో ఎక్కువ ఆత్మహత్యలు కెసిఆర్, అతని మేనల్లుడు హరీష్ రావు విద్యోశక తరహా అపహాస్యపు ప్రకటనలకు లోనవడం వల్ల జరిగాయి. ఆ ఏడాది నవంబర్ 29న హరీష్ రావు కిరోసిన్ మీద పోసుకున్నాడు కాని నిప్పంటించడానికి అగ్గిపెట్టె దొరక్కపోవటం ఒక అట్టహాసంకాగా, పగిలిన గాజుముక్కతో కోసుకుని చస్తానన్న కెసిఆర్ బెదిరింపు మరొక అపహాస్యపు ఘటన'' అని ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎస్.సింహాద్రి చేప్పార''ని మనీష్ ఉదాహరించారు. అప్పటికే గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టబడ్డ యువకుల్లోనూ ఇతరుల మనస్సుల్లోకి కెసిఆర్, హరీష్ రావుల అపహాస్యపు పనులు ప్రమాదకరమైన సందేశం ఎక్కించినట్టయింది. ఈలాంటి సందేశం ద్వారా తమ బాధలన్నింటికీ పరిష్కారం తెలంగాణా ప్రత్యేక రాష్ట్రమేనన్న అభిప్రాయాన్ని ప్రజలకు పదే పదే గుర్తుచేస్తున్నట్టయింది. ఇలాంటి చర్యల ద్వారానే [ఆత్మహత్యలకు పాల్పడడం ద్వారానే] తమ జీవితాలు సార్థ్యక్యం పొందుతాయనీ, తాము తద్వారా 'హీరోలు'కావడానికి ఇది మంచి అవకాశమని పెక్కుమంది యువకులు భావించారన్న'' ప్రొఫెసర్ సింహాద్రి అభిప్రాయాన్ని శ్రీకృష్ణ కమిటీ కూడా తన నివేదికలో ప్రతిధ్వనించడం గమనార్హం. ఇదంతా కెసిఆర్ వాచాలత్వం, ఉదార ఫలితమని రుజువైంది. కనుకనే ఈలాంటి విస్మయకర దృశ్యాన్ని మనస్తత్వ శాస్త్రజ్ఞులు "మారిలిన్ మన్రో సిండ్రోమ్'' (మానసికస్థితి) అని నామకరణం చేశారనీ తాము అనుకున్న లక్ష్యం నెరవేరక విఫలమైనప్పుడు ఆ బలహీనతతో కొందరు గుడ్డిగా ఆత్మహత్యలకు పాల్పడతారనీ మనీష్ నివేదిక తెలిపింది. ఇందుకు ఉదాహరణగా మనీష్ హైదరాబాద్ లోని ఒక స్థానిక రెస్టారెంట్ లో తన విద్యా ఖర్చుల కోసమని పనిచేస్తున్న యాదయ్య అనే అనాథ యువకుడు ఉస్మానియా విద్యార్థీకాడు, ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడూ కాడు. కాని అతను ఆత్మహత్య చేసుకున్నది తెలంగాణా రాష్ట్రం కోసం కాదు, ఆర్థిక బాధలవల్ల ఆ పనిచేశాడు. కాని అతని ఆత్మహత్యను ఓ టి.వి.ఛానల్ 'లైవ్' చూపింది. అది చూసిన వెంటనే నానాబాపతు రాజకీయాలూ యాదయ్య ఆత్మహత్యను తెలంగాణా కోసం జరిగిన ఆత్మహత్యగా ముద్రవేయడానికి తొక్కిసలాడుకొన్నారు. అయితే యాదయ్య వద్ద ఉన్న అనేకమంది ఫోటో జర్నలిస్టులు చెప్పారు : "యాదయ్య చనిపోతూ రక్షించండి, రక్షించండి'' అంటూ కేకలు పెట్టాడనీ, టి.ఆర్.ఎస్. వర్గం చెప్పుకుంటున్నట్టు యాదయ్య నోట "జై! తెలంగాణా'' అన్న నినాదమే వినిపించలేదనీ చెప్పారు! టెలివిజన్ ప్రసారాలు చూసి ఎక్కువమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారనీ, రాజకీయవేత్తలు ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల్ని పొగడ్తలతో ముంచెత్తడం ద్వారా తెలంగాణాలోని విద్యార్థులలో ఆత్మహత్యా ధోరణులను పెంచుతున్నారని హైదరాబాద్ మనస్తత్వశాస్త్ర అధ్యయన సంస్థ శాస్త్రవేత్త డయానా మాంటిరొ ఆరోపించారు. అందుకే భూస్వామ్య వ్యవస్థ తాలూకు మనస్తత్వాలూ, నిరంతర సమస్యలూ చింత చచ్చినా పులుపు చావదన్నట్టు అంతతేలిగ్గా, త్వరగా పోవని మనీష్ వ్యాఖ్యానించాడు! అన్నివందలమంది ఆత్మహత్యలకు ప్రోత్సాహకుడు, కారకుడయిన సీమాంధ్ర "బొబ్బిలిదొర'' కెసిఆర్ దివంగతులయిన యువకుల కుటుంబాల ధర్మాగ్రహానికి అర్హుడు కాక తప్పదు!

15 మంది ఎమ్మెల్యే లపై అనర్హత వేటు

శాసన సభలో అవిశ్వాసం సంధర్బంగా విప్ దిక్కరించిన 15 మంది ఎమ్మెల్యే లపై స్పీకర్ అనర్హత వేటు వేశారు.   అనర్హులుగా ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు: బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి - దర్శి మద్దాల రాజేష్ - చింతలపూడి ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి -కాకినాడ గొట్టిపాటి రవి- అద్దంకి సుజయ కృష్ణ రంగారావు - బొబ్బిలి పేర్ని నాని - మచిలీపట్నం ఆళ్ల నాని - ఏలూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - పుంగనూరు జోగి రమేష్ - పెడన అనర్హులుగా ప్రకటించిన టిడిపి ఎమ్మెల్యేలు: ప్రవీణ్ కుమార్ రెడ్డి - తంబళ్లపల్లి కొడాలి నాని - గుడివాడ తానేటి వనిత - గోపాలపురం అమర్నాథ్ రెడ్డి - పలమనేరు వై.బాలనాగిరెడ్డి - మంత్రాలయం సాయిరాజ్ - ఇచ్చాపురం

సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ బదిలీ కాలేదా!

        సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ బదిలీ అయ్యారని వార్తలు వస్తున్న నేపధ్యంలో..తనకు బదిలీ ఉత్తర్వులు ఇంతవరకు అందలేదని డైరెక్టర్ లక్ష్మీనారాయణ వెల్లడించడంతో, ఇప్పుడు ఈ విషయం ఆసక్తికరంగా మారింది. జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అసలు తనకు బదిలీ ఉత్తర్వులు అందలేదని..మహారాష్ట్రలో పోస్టింగ్ ఇచ్చిన విషయం తనకు మీడియాలో వచ్చిన వార్తలు చూసే తెలిసిందని అన్నారు. సీబీఐ బలమయిన వ్యవస్థ అని, తన బదిలీ మూలంగా కేసుల మీద ఎలాంటి ప్రభావం ఉండదని జేడీ అన్నారు. న్యాయస్థానం అనుమతి ఇస్తే మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని అన్నారు. అయితే ఇప్పటివరకు బదిలీ ఉత్తర్వులు అందలేదని అంటున్నారంటే డిల్లీలో ఉత్తర్వులను నిలిపివేశారని అనుకోవాలా?లేక ఉత్తర్వులు అసలు ఇవ్వలేదనుకోవాలా?

అమెరికాలో తుపాకీ కి మళ్లీ 6 బలి

        అమెరికాలో మళ్లీ కాల్పులు జరిగాయి. కాలిఫోర్నియాలోని సాంటా మోనికాలో ఉన్న కళాశాల లైబ్రరీలోకి సాయుధుడయిన అగంతకుడు నల్లటి దుస్తులు ధరించి వచ్చి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా అనేకమంది గాయపడ్డారు. పోలీసులు సమాచారం తెలుసుకుని వచ్చి జరిపిన కాల్పుల్లో అగంతకుడు మరణించాడు. అయితే హతుడికి సంబంధించిన వివరాలు వెల్లడికాలేదు. అమెరికాలో తుపాకీ సంస్కృతి మీద భారీ ఎత్తున చర్చ జరుగుతుండగానే వరసగా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కాల్పులు జరిగిన అన్ని సంఘటనల్లో ఆగంతకులు సైకోలు అన్న విషయం తేలుతోంది. ఈ సైకోల మూలంగా అమెరికాలో భద్రత ఇబ్బందిగా మారుతోంది. ఎన్ని భద్రతా చర్యలు చేపట్టినా ఎవరు ? ఎలాంటి వారు ? అన్నది గుర్తించడం చాలా కష్టంగా మారుతుంది. తాజాగా కాల్పులకు పాల్పడిన నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ప్రతిఘటించడంతో అతన్ని కాల్చి చంపామని కాలిఫోర్నియాకు చెందిన పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.

సీబీఐ చేతిలో ధర్మాన ప్రసాదం

  కర్ణుడికి కవచ కుండలాలు రక్షగా నిలిచినట్లు ఇంతవరకు ధర్మానకు మంత్రి హోదా రక్షగా నిలిచింది. కానీ, అది కాస్తా ఇప్పుడు తొలగిపోవడంతో ఆయన ఇప్పుడు ఒంటరిగా నిస్సహాయంగా సీబీఐకి దొరికిపోయారు. నిన్న సీబీఐ ఆయన జ్యుడిషియల్ రిమాండ్ కోరుతూ కోర్టులో ఒక మెమో దాఖలు చేసింది. దానిని విచారించేందుకు కోర్టు ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. వాన్ పిక్ భూముల వ్యవహారంలో ఆయన అక్రమాలకూ పాల్పడ్డారని సీబీఐ ఆయనపై అభియోగం నమోదుచేసింది.   భూముల బదిలీలు(అక్రమాలు) జరిగిన మాట వాస్తవమని ఆయన ఒప్పుకొంటున్నపటికీ, అది కేవలం తన ఒక్కడి నిర్ణయమే కాదని, క్యాబినెట్ సమిష్టి నిర్ణయమని, అందువల్ల తానూ ఈ విషయంలో నిర్దోషినని ఆయన వాదన. అందుకు ఆయనకు కొందరు మంత్రులు కూడా వత్తాసు పలికినప్పటికీ, తరువాత ఆయన వాదన వెనుకున్న లా పాయింటు అర్ధం అవడంతో క్రమంగా అందరూ ఆయనకి దూరం జరిగారు. ఒకవేళ కోర్టు ఆయన వాదన సరయినదేనని అంగీకరిస్తే, అప్పుడు వైయస్సార్ మంత్రి వర్గంలో ఉన్న మంత్రులందరూ కూడా కటకటాల వెనక్కి వెళ్ళకతప్పదు.   అదిగాక, అవినీతి ఆరోపణలతో మంత్రి వర్గంలోంచి తప్పుకొన్న అటువంటి వారికోసం మాట్లాడే తీరిక, శ్రద్ధ, అవసరం గానీ ఎవరికీ లేవు గనుక ధర్మాన ఒంటరిగా మిగిలిపోక తప్పదు. అందువల్ల ఈ రోజు కాకపోయినా రేపయినా ఆయన కూడా చంచల్ గూడాలోకి ప్రవేశం తప్పకపోవచ్చును.

చిరంజీవి మెగా కోరిక

  ఇన్నాళ్ళు రామచంద్రయ్య తన భజన చేస్తుంటే కాదనలేని చిరంజీవి, డిల్లీలో అమ్మగారి ఆశీసులు అందుకున్నారో మరేమో గానీ డిల్లీలో ఒక ఇంగ్లిష్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యులో పార్టీ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి పదవి చెప్పడ్డానికి సైతం తాను సిద్ధమేనని ప్రకటించి కిరణ్ కుమార్ రెడ్డి గుండెల్లో చల్లగా బాంబులు పేల్చారు. అంటే, ఆయనలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలనే తపన ఇంకా సజీవంగానే ఉందని అర్ధం అవుతోంది. అధిష్టానం కూడా తనకు సానుకూలంగా ఉండటంతో, కాంగ్రెస్ నీటిని బాగా వంట బట్టించుకొన్నఆయన పార్టీ సంప్రదాయాల ప్రకారం తాను కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని అప్పుడప్పుడు మీడియా స్టేట్మెంట్లు ఇస్తున్నారు.   నిన్నగాక మొన్న రాజకీయాలలోకి, కాంగ్రెస్ పార్టీలో దూకిన ఆయన పార్టీలో తనకంటే చాలామంది సీనియర్లు ముఖ్యమంత్రి కుర్చీ కోసం క్యూలో చాలా ఏళ్లుగా నిలుచొని ఉన్నారని తెలిసి కూడా ఇటువంటి కోరిక వెళ్ళబుచ్చడం, ఆయనలో పెరుగుతున్న ఆత్మవిశ్వాసానికి అద్దం పడుతోంది. అటువంటి కీలక పదవులు ఆశించేవారు ముందుగా ప్రజలలో, పార్టీలో తమ ఆలోచలను వ్యాపింపజేయడం ద్వారా, కొంత సానుకూల వాతావరణం సృష్టించుకొంటుంటారు. తద్వారా అవకాశం వచ్చినప్పుడు కొత్తగా బరిలో దిగినట్లుకాక పార్టీలో తాము కూడా పాత ‘కాపు’లేనని, ఆ కుర్చీలో కూర్చోవడానికి తమకీ అర్హత, అవసరం రెండూ ఉన్నాయని గట్టిగా వాదించవచ్చును. ప్రస్తుతం చిరంజీవి కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నారు గనుక 2014లో కాకపోయినా మరో ఒకట్రొండు సంవత్సరాలలో అయినా కుర్చీకి సరిపోయేలా ముదురుతారని చెప్పవచ్చును.

బంగారు తల్లి పై అసంతృప్తి

        ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. సుమారు నాలుగు గంటల పాటు జరిగిన ఈ భేటీలో 27 అంశాలకు కేబినేట్‌లో ఆమోదం లభించింది. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘బంగారు తల్లి’ పథకానికి చట్ట బద్దత కల్పించే విషయంలో కేబినెట్‌లో ఏకాభిప్రాయం కుదరలేదు. బంగారు తల్లి పథకానికి చట్టబద్ధత కల్పించే విషయమై కేబినెట్ సబ్ కమిటీకి బదలాయించడం జరిగింది. బంగారు తల్లి పథకంపై మంత్రులు బొత్స సత్యనారాయణ, జానారెడ్డిలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందుగా కేబినెట్‌లో చర్చించి ఉండాల్సిందని వారు అభిప్రాయపడ్డారు. ఈ పథకం అమలులో లోపాలు ఉండకూడదని వారు సూచించారు. దీనిపై స్పందించిన సీఎం కిరణ్ ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తానని, పథకం అమలుపై సూచనలు చేయాలని చెప్పారు. అయినా బంగారు తల్లి పథకంపై ఏకాభిప్రాయం కుదరలేదు. మరోవైపు మంత్రుల ప్రశ్నలకు సీఎం స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేకపోయారని సమాచారం. కాగా ఈ సమావేశంలో మంత్రి వర్గం నుంచి బర్త్ రఫ్ చేసిన డిఎల్ రవీంద్రారెడ్డి అంశం ప్రస్తావనకు రాకుండా ముఖ్యమంత్రి బంగారు తల్లి పథకంపై చర్చకు అవకాశం ఇచ్చారు. దీనిపై కొందరు మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఫ్రెంచ్ ఓపెన్‌ ఫైనల్లో స్పెయిన్ బుల్

        ఫ్రెంచ్ ఓపెన్‌లో స్పెయిన్ బుల్ రఫెల్ నడాల్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌ సెమీస్‌లో మూడో సీడ్ నడాల్ 6-4, 3-6, 6-1, 6-7(3), 9-7తో టాప్ సీడ్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్‌పై పోరాడి గెలిచాడు. వరుసగా ఎనిమిదో సారి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. మట్టి కోర్ట్ లో కొదమసింహల్లా పోరాడి టెన్నిస్ అభిమానులను కనువిందు చేశారు. 4 గంటల 37 నిముషాలు సాగిన ఈ మ్యాచ్ గ్రాండ్ స్లామ్ చరిత్రలో అత్యుత్తమ మ్యాచ్ ల్లో ఒకటిగా నిలిచింది.   ఆదివారం జరిగే ఫైనల్లో నడాల్.. స్పెయిన్‌కే చెందిన డేవిడ్ ఫెర్రర్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. గాయం నుంచి కోలుకున్నాక తొలి టోర్నీలో ఆడుతున్న నడాల్ ఆత్మవిశ్వాసంతో పోరాటపటిమ కనబరిచాడు. తొలిసెట్లో నడాల్, రెండో సెట్లో జొకోవిచ్ హవా సాగింది. మూడో సెట్లో స్పెయిన్ బుల్ తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించి సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత అసలైన పోరు మొదలైంది. నాలుగో సెట్లో పుంజుకున్న నొవాక్ టైబ్రేకర్‌లో నెగ్గి విజయావకాశాల్ని సజీవంగా ఉంచుకున్నాడు. ఇక నిర్ణాయక ఐదో సెట్లో 82 నిమిషాల పాటు హోరీహోరీగా పోరాడారు. చివరకు నడాల్ ఉత్కంఠ విజయం సాధించాడు. జొకోవిచ్ అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు.

జెసికి ముందే తెలుసా!

        కాంగ్రెస్ మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై ఎవరూ విమర్శలు చేసిన డీఎల్ పై తీసుకున్న విధంగానే చర్యలు వుంటాయని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత డీఎల్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం తాను ముందే ఊహించిన విషయం అని ఆయన తేల్చిచెప్పారు. తన సొంత జిల్లా రాజకీయాల గురించి కూడా జేసీ అంత ఆసక్తికరంగా స్పందించలేదు. ఆయనకు మంత్రి పదవి దక్కకుండా రఘువీరా,ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేస్తున్న ప్రయత్నం గురించి ఆయన లైట్ తీసుకున్నట్టుగా మాట్లాడారు. తాను మంత్రి పదవి కోసం ఏనాడూ పాకులాడలేదని జేసీ అంటున్నారు. మరి ముఖ్యమంత్రి అనుకూలంగా లేని రోజుల్లో పాకులాడలేదంటే అర్థం ఉంది. మరి కిరణ్ అయినా జేసీకి తగిన సత్కారం అందజేస్తాడో లేదో!

ఆయన క్కూడా బలుపెక్కువేనట

  చిత్ర సీమలో అత్యంత సీనియర్ అయిన దాసరి నారాయణ రావు ఏ కార్యక్రమానికి హాజరయినా ఏదో ఒక అంశం మీదనో లేక పరిశ్రమకు చెందిన కొందరు వ్యక్తుల మీదనో తనదయిన శైలిలో విమర్శలు చేస్తుంటారు. ఆయన ఇప్పుడు అటువంటి విమర్శలకి స్పెషలిస్టుగా పేరు తెచ్చుకొన్నారు. అందువల్ల ఆయన కార్యక్రమాలలో ఒక స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంటారు. ఆ కారణం వల్ల కూడా కొందరు నిర్వాహకులు ఆయనను తమ కార్యక్రమాలకి ఆహ్వానిస్తుంటారు.   ఇటీవల రవి తేజ నటించిన బలుపు సినిమా ఆడియో విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వం నిర్మాతల చేతిలో దర్శకులు నటులు ఉంటే, ఇప్పుడు దర్శకులు, నటుల చేతిలో నిర్మాతలు కీలు బొమ్మలుగా మిగిలిపోతున్నారన్నారు. సినీ రంగంలో కొందరు వాపును చూసి బలుపని భ్రమిస్తుంటారని, కానీ తనకున్నంత బలుపు మరెవ్వరికి లేదని అన్నారు. అది సినీ రంగాన్ని శాసిస్తున్నకొందరు పెద్ద హీరోల కొడుకులు మరియు పెద్ద నిర్మాతలు దర్శకులను ఉద్దేశించి అన్నవే. అయితే, ఇటువంటి డైలాగులు పేల్చడం వల్ల ఆయనకి కానీ, చిత్ర సీమకి గానీ ఒరిగేదేమీ లేకపోగా ఆయన కోరుండి తన చుట్టూ శత్రువులను సృష్టించుకొంటున్నారు. అయితే, చిత్ర సీమలో మారినపరిస్థితులకి, ప్రజల అభిరుచిలో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఇప్పటి తరం దర్శకులు, నటులు, నిర్మతలతో పోటీ పడుతూ విజయవంతమయిన సినిమాలు తీయలేనప్పుడు ఆయన ప్రస్తుతం ఇంతకంటే చేయగలిగింది కూడా ఏమీ ఉండదు.

మహారాష్ట్ర కు సిబిఐ లక్ష్మినారాయణ బదిలీ

        సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ బదిలీ అయ్యారు. ఇక్కడ ఆయన నిర్వహించిన బాధ్యతలను ఇక నుండి చెన్నై సిబిఐ జాయింట్ డైరెక్టర్ అరుణాచలంకు అప్పగిస్తారు. ఈ మేరకు ఢిల్లీలోని సిబిఐ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అరుణాచలం మంగళవారం బాధ్యతలు స్వీకరిస్తారు. లక్ష్మీనారాయణ డిప్యూటేషన్ కాలం ముగిసింది. ఆయన ఇక తన సొంత కేడర్ మహారాష్ట్ర వెళతారు. ఆయన మహారాష్ట్ర పోలీసు శాఖకు బదిలీ అయ్యారని సమాచారం. అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గనుల తవ్వకాల కేసులో గాలి జనార్ధన్ రెడ్డి సీబీఐ కేసలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుల విచారణ అధికారిగా ఉన్న జేడీ లక్ష్మీనారాయణ బదిలీ కావడం ఆశ్చర్యకరంగా ఉంది. ఇంతకు ముందు కేంద్రంలో బొగ్గు స్కాం విచారణ అధికారిగా ఉన్న వ్యక్తిని కేంద్రం బదిలీ చేయడంతో సుప్రీంకోర్టు ఆక్షేపించి అదే స్థానంలో నియమించాలని ఆదేశించింది. జేడీ లక్ష్మీనారాయణ మాత్రం బదిలీ అయిపోవడం చర్చకు దారితీస్తోంది.

సీబీఐ కోర్టు వద్ద జగన్ భార్య ఓవరాక్షన్

        వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి భార్య భారతి నాంపల్లి సీబీఐ కోర్టు వద్ద ఓవరాక్షన్ చేశారు. కోర్టు వద్దకు ర్యాలీగా వస్తున్న భారతితో సహ ఆమె అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు. లోపలికి వెళ్ళేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఆగ్రహించిన భారతి ఓ పోలీసుపై చేయి చేసుకున్నారు. దీంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. కాగా కోర్టులో జగన్ అనుచరులు తీరుపై న్యాయవాదులు మండిపడ్డారు. లాయర్లను జగన్ అనుచరులు తోసివేయడంపై న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.   మరోవైపు ఆరునెలల తరువాత జైలుగోడలు దాటి కోర్టుకు హాజరయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో హుషారుగా నవ్వుతూ కనిపించారు. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి మొదటిసారి కోర్టుకు హాజరయి ఎంతో ముభావంగా ఉండి కన్నీళ్లు పెట్టుకుంటే ఆమెను నవ్వుతూ జగన్ పలకరించారు. ఆరు నెలల తరువాత జైలునుండి కోర్టుకు వచ్చిన కొడుకును చూసిన విజయమ్మ కళ్లనీళ్లు పెట్టుకుంటే జగన్ ఆమెను ఓదార్చారు. జగన్ అలింగనం చేసుకుని ఆవేదన చెందింది విజయమ్మ.

6 నెలల తరువాత బయటకి వచ్చిన జగన్

        అక్రమాస్తుల కేసులో అరెస్టైన వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి దాదాపు ఆరు నెలలుగా బయట ప్రపంచాన్ని లోపలే ఉండి నడిపిస్తున్న ఆ జగన్నాయకుడు ఈ రోజు జైలు బయట కాలుపెట్టాడు. నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టుకు జగన్ హాజరయ్యారు. అయితే ఇవాళ దాల్మియా సిమెంట్స్ విషయంలో దాఖలైన ఛార్జిషీట్ పై విచారణ కొనసాగుతుంది. జగన్‌ ను ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్‌ వాహనంలో కోర్టుకు తరలించారు. ఇదే కేసులో కోర్టుకు హాజరైన మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా కూడా కోర్టుకు వచ్చారు. వాళ్లిద్జరూ కోర్టులో పక్కపక్కనే కూర్చోవడం విశేషం. ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. అంతకుముందు జగన్ ను కోర్టు బయట అతని తల్లి విజయమ్మ, భార్య భారతి, ఇతర కుటుంబ సభ్యులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా విజయమ్మ కంటతడి పెట్టారు. విజయమ్మను జగన్‌తో పాటు.. వైకాపా ఎమ్మెల్యే శోభానాగిరెడ్డిలు ఓదార్చారు. కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ న్యాయమూర్తికి జగన్ విజ్ఞప్తి చేశారు. దీనికి కోర్టు అంగీకరించింది. గంటపాటు కుటుంబ సభ్యులతో మాట్లాడవచ్చని పేర్కొంది. కోర్టు ఆవరణలో జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతి, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మరోవైపు కోర్టు బయట ఆయన పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో హడావుడి ఏర్పడింది.

స్పాట్‌ ఫిక్సింగ్‌ లో శిల్పాశెట్టి భర్త

    ఐపీఎల్ క్రికెట్ టీమ్ ఓనర్ల అసలు రూపాలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంలో బడాబాబుల పేర్లు..ఇప్పుడు బయటకు వస్తున్నాయి. శ్రీశాంత్ రూపంలో ఐపీఎల్ లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్ ఉదంతాన్ని కూపీ లాగిన పోలీసులు ఇప్పుడు పెద్ద తలలనే బయటకు తీస్తున్నారు. మొన్న చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ అల్లుడు స్పాట్ ఫిక్సింగ్ లో భాగస్వామి అని తేలితే ఇప్పుడు రాజస్థాని టీమ్ ఓనర్లలో ఒకరైన రాజ్ కుంద్రా కూడా ఈ కుట్రలో భాగస్వామి అయ్యాడని తేలింది.   రాజ్ కుంద్రాకు బెట్టింగ్ ముఠాతో సంబంధం ఉందని పోలీసులు నిర్ధారించారు. బెట్టింగ్ వ్యవహారంలో విచారిస్తున్న ముంబై పోలీసులకు అసలు విషయాన్ని రాజ్‌కుంద్రా ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. తన సొంత జట్టు రాజస్థాన్‌ రాయల్స్‌పైనే బెట్టింగ్‌లు నిర్వహించినట్లు పోలీసులు విచారణలో చెప్పారు. శిల్పాశెట్టి కూడా బెట్టింగ్ లకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె పాత్రపై కూడా పోలీసులు విచారణ చేపట్టారు.        మరోవైపు స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంలో అరెస్టైన వారికి బెయిల్ దొరకకుండా వారిపై మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నిరోధక చట్టాన్ని పెడుతున్న ఆరోపణలను పోలీసులు ఖండించారు. బెయిల్ ను అడ్డుకోవాలన్న ఉద్దేశం తమకు ఎ మాత్రం లేదని, నేరం తీవ్రతను బట్టే (మెకా) వర్తింపజేస్తామని స్పష్టం చేశారు.

కేసీఆర్ శాడిస్ట్ గా మారిపోయారు!

        టీఆర్ఎస్ ఆధినేత కేసీఆర్ శాడిస్ట్ గా మారిపోయారా! సొంత పార్టీ కార్యకర్తలే ఆయనను శాడిస్ట్ గా అభివర్ణిస్తున్నారు. అదేంటీ.. ఇంత సడన్ గా కేసీఆర్ శాడిస్ట్ గా ఎలా మారిపోయారు! కరీంనగర్ జిల్లాలో గురువారం జిరిగిన శిబిరానికి కేసీఆర్ హాజరయ్యారు. నాగరాజు అనే నాయకుడు పార్టీలో తనకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నించారు. టీఆర్ఎస్ ఇన్‌చార్జి రాంరెడ్డి వర్గీయులు ఆయనను అడ్డుకోవడంతో... కేసీఆర్ ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్పాలడ్డారు. ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోకపోవడంతో, అక్కడ ఉన్న పొలీసులు నాగరాజును అసుపత్రికి తరలించారు. కానీ నాగరాజు మరణించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ నాగరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు.. కానీ కేసీఆర్ మాత్రం హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. నాగరాజు కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించకపోవడం పై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ శాడిస్ట్ లా మారిపోయాడని అనుకుంటున్నారట. నాగరాజు మృతికి సంతాపంగా ఆయన వర్గానికి చెందిన టీఆర్ఎస్ శ్రేణులు.. పేదలకు టీఆర్ఎస్‌లో స్థానం లేదని ఆరోపిస్తూ టీడీపీ, వైసీపీ మంథని బంద్‌కు పిలుపునిచ్చాయి. 

జగన్నాటక సూత్రదారి నిజ దర్శనం నేడే

    అధికారంలో ఉండి ముఖ్యమంత్రి సైతం చేయలేని పనిని ఒకే ఒక్కడు జగన్ మోహన్ రెడ్డి మాత్రమే అవలీలగా సాధించి చూపాడు. అనేక మంది మంత్రులను, ఐఏయస్ అధికారులను, వ్యాపారవేత్తలను, పారిశ్రామిక వేత్తలను అందరికీ కూడా చంచల్ గూడా జైలు భోజనం రుచి చూపించిన ఘనుడు జగన్. ఆ విధంగా అంతమందికి జైలులో ట్రీట్ ఇవ్వడం ఎవరికీ సాద్యం కాదని ఒప్పుకోక తప్పదు.   విజయమ్మ చెప్పినట్లు ఆయన ఏనాడు ప్రభుత్వ కార్యాలయంలో అడుగుపెట్టకపోయినా, ఎన్నడూ ఎవరినీ కలువకపోయినా, ఎవరికీ క్విడ్ ప్రో చేయమని ఆదేశాలు ఇవ్వకపోయినా, సీబీఐ, కోర్టులు, మీడియా, రాజకీయ పార్టీలు అన్నీ ఆయన ఉన్నతిని చూసి ఓర్వలేక కళ్ళలో నిప్పులు పోసుకొని అన్యాయంగా జైలు పాలు చేసాయని మనందరికీ తెలుసు.అయినప్పటికీ, ఆయన విశాల హృదయంతో లోపలున్నవాళ్ళకే కాకుండా, బయట ఉండిపోయిన మరి కొంతమంది మంత్రులకు కూడా జైల్లో ట్రీట్ ఇచ్చేందుకు సిద్దంగానే ఉన్నారు. కానీ, ఆ ట్రీట్ స్వీకరించడానికి మొహమాటపడుతూ కొందరు మంత్రులు, అధికారులు అనవసర భేషజాలకి పోయి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వారందరూ కూడా పాత సినిమాలలో క్లయిమాక్స్ సీనులో కుటుంబ సభ్యులందరూ విలన్ డెన్ దగ్గిర కలుసుకొన్నట్లు, ఈ రోజు సీబీఐ కోర్టు వద్ద కలుసుకోబోతున్నారు. వారిలో మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, మోపిదేవి వంటి ప్రముఖులున్నారు. ఇంత కాలం ఆయనతో నేరుగా మాట్లాడే భాగ్యానికి నోచుకోకపోయినా, ఎవరి కంటికీ ఆయన కనిపించకపోయినా వారందరి తల రాతలు ఇంత గొప్పగా తీర్చిదిద్దిన ఆ జగన్నాటక సూత్రధారి జగన్ మోహన్ రెడ్డిని వారు ఈ రోజు ప్రత్యక్షంగా కనులారా దర్శించుకోబోతున్నారు.   ఈ వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీలు వగైరా వచ్చిపడిన తరువాత అటువంటి గొప్ప వ్యక్తుల నిజరూప దర్శనం బొత్తిగా కరువయిపోయిందని బాధపడే జనాలకి ఊరట కలిగించడానికే, కోర్టు కూడా అప్పుడప్పుడు ఇటువంటి ప్రత్యేకదర్శనం ఏర్పాట్లు చేస్తుందేమో మరి తెలియదు. సీబీఐ వారందరిపై నమోదు చేసిన 5వ చార్జ్ షీటును ఈరోజు సీబీఐ కోర్టు విచారణకి స్వీకరిస్తున్నందున వారందరికీ సపరివార సమన్లు జారీ చేసి కోర్టుకి ఆహ్వానించింది.   దాదాపు ఆరు నెలలుగా బయట ప్రపంచాన్ని లోపలే ఉండి నడిపిస్తున్నఆ జగన్నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ రోజు జైలు బయట కాలుపెట్టబోతున్నాడు కనుక, ఆయన నిజరూప దర్శనం కోసం భారీగా జనాలు తరలివస్తున్నందున పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసుకొంటున్నారు.   తాజా వార్తా: ఆయన, ఆయన అనుచరులు అందరూ తిరిగి తమ గూటికి (చంచల్ గూడా జైలుకి) ఇప్పుడే చేరుకొన్నారు. వారందరికీ కోర్టు ఈ నెల 21వరకు రిమాండ్ విదించింది.

డిప్యూటీ కే హోం!

      ఒక్కొక్కటిగా కాంగ్రెస్‌ పంచాయితీలు కొలిక్కి వస్తున్నట్టుగా కనిపిస్తుంది.. సబిత రాజీనామతో కాలీ అయిన హోం శాఖ కోసం నిన్నటి వరకు భారీ పోటి నేలకొంది.. అయితే ఇదే సమయంలో డియల్‌ బర్తరఫ్‌తో ఆంద్రా నాయకులంతా డిల్లీ చేరి అన్ని అంశాలపై భారీ లాభీయింగ్‌నే నడిపారు.. దీంతో ఇప్పుడు హోం శాఖ కేటాయింపుపై స్పష్టత వచ్చినట్టుగానే కనిపిస్తుంది.. సభిత రాజీనామా తరువాత చాలా మంది రాష్ట్ర నాయకులు హోంశాఖ పై ఆశపడ్డారు. వీరిలో జానా రెడ్డి, శ్రీదర్‌బాబు,దామోదర రాజనరసింహ, డికె అరుణ, సునీతా లక్ష్మారెడ్డి లాంటి వారు ఉన్నారు.. అయితే జానా.. తనకు ఇంతకు ముందు హోం శాఖ నిర్వర్తించిన అనుభవం కూడా ఉండటంతో మరోసారి తనకే అవకాశం దక్కుతుందని భావించారు..         వీరితో పాటు తెలంగాణ సెంటిమెంట్‌తో డిప్యూటి సియం దామోదర రాజనరసింహ, వివాద రహితుడినని శ్రీదర్‌బాబు, మహిళ కోటాలో డికె అరుణ, సునీతా లక్ష్మారెడ్డిలు హోం శాఖ కోసం గట్టిగానే ప్రయత్నించారు.. కాని గత వారం రోజులుగా రాష్ట్రంలో మారుతున్న రాజకీయసమీకరణాలతో హోం శాఖ డిప్యూటినే వరించినట్టుగా తెలుస్తుంది..         తన సొంతం నిర్ణాయాలతో సియం పార్టీకి నష్టం చేస్తున్నాడన్న వాదన బలంగా వినిపిస్తున్న రాజనరసింహకు ఈ హోం ఇవ్వడంతో సియంకు కూడా అధిష్టానం ఓ హెచ్చరిక చేయాలనుకుంటుంది అంటున్నారు విశ్లేషకులు.. ఇప్పటి వరకు ఇవన్ని ఊహాగానాలే అయినా దాదాపు దామోదర రాజనరసింహకే హోం శాఖ పగ్గాలు అప్పచెపుతారంటున్నాయి కాంగ్రెస్‌ వర్గాలు..

డీయల్ పై ముఖ్యమంత్రి అనుచరుల కుట్ర

  కిరణ్ కుమార్ దెబ్బకు మంత్రిపదవి పోగొట్టుకొన్న రవీంద్రారెడ్డి, ముఖ్యమంత్రి అనుచరులు త్వరలో తాను పార్టీ వీడి వైకాపాలో జేరబోతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తూ తనను ఇప్పుడు పార్టీ నుండి కూడా బయటకి పంపేందుకే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఏది ఏమైనపటికీ తానూ మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఆయన మళ్ళీ మరో మారు కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన్న పథకాలను తీవ్రంగా విమర్శించారు. వాటి ప్రచారంపై ఉన్న శ్రద్ధ అమలులో చూపించాకపోవాదాన్ని ఆయన తప్పు పట్టారు. ముఖ్యమంత్రి తన స్వంత ఇమేజ్ పెంచుకోనేందుకే టా పధకాల కోసం ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తానూ పదవుల కోసం ఏనాడు వెంపర్లాడలేదని, కిరణ్ కుమార్ రెడ్డి పెట్టే భిక్ష తనకి అవసరం లేదన్నారు.

కాంగ్రెస్ లోనే కొనసాగుతా, కిరణ్ కుమార్ కి ఎసరు పెడతా!

  మాజీ మంత్రి డీయల్ రవీంద్ర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తానూ ఎన్నటికీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని తెలిపారు. త్వరలో మొదలవనున్న శాసన సభ బడ్జెట్ సమావేశాల తరువాత తానూ తన నియోజక వర్గంలో పర్యటించి, పార్టీ కార్యకర్తలకి ప్రజలకీ జరిగిన విషయాలన్నీ వివరిస్తానని అన్నారు. ఆయన శాసనసభ సమావేశాల తరువాత తన పర్యటనకి ముహూర్తం పెట్టుకోవడం గమనిస్తే ఈసారి ఆయన శాసన సభ సాక్షిగానే ముఖ్యమంత్రిపై తీవ్రంగా దాడిచేయబోతున్నారని అర్ధం అవుతోంది.   సభలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పధకాలలో లోటుపాట్లను, వాటి అమలులో జరుగుతున్న లోపాలను, ముఖ్యమంత్రి ప్రచారాడంబరత, దానిపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చుల గురించి ఆయన ప్రస్తావించి ముఖ్యమంత్రిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయవచ్చును. సభలో ఆయన ప్రవర్తించిన తీరును బట్టి ఆయనను పార్టీలో కొనసాగించాల లేక బహిష్కరించాలా అనే విషయంపై ముఖ్యమంత్రి ఒక నిర్ణయానికి రావచ్చును.   డీయల్ తానూ పార్టీ నుండి బయటకి వెళ్ళిపోయే ఆలోచన గానీ, ఉంటే ఈ సమావేశాలలో ముఖ్యమంత్రికి నరకం చూపించే అవకాశం ఉంది. పాలక పక్ష సభ్యుడయిన ఆయనే ప్రభుత్వంపై విమర్శలు చేయడం వలన ప్రతిపక్షాలకు మరిన్ని ఆయుధాలు అందించినట్లవుతుంది. మరి ఆయనను ముఖ్యమంత్రి ఏవిధంగా ఎదుర్కొంటారో చూడాలి.