అమెరికాలో తుపాకీ కి మళ్లీ 6 బలి
posted on Jun 8, 2013 @ 12:16PM
అమెరికాలో మళ్లీ కాల్పులు జరిగాయి. కాలిఫోర్నియాలోని సాంటా మోనికాలో ఉన్న కళాశాల లైబ్రరీలోకి సాయుధుడయిన అగంతకుడు నల్లటి దుస్తులు ధరించి వచ్చి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా అనేకమంది గాయపడ్డారు. పోలీసులు సమాచారం తెలుసుకుని వచ్చి జరిపిన కాల్పుల్లో అగంతకుడు మరణించాడు. అయితే హతుడికి సంబంధించిన వివరాలు వెల్లడికాలేదు. అమెరికాలో తుపాకీ సంస్కృతి మీద భారీ ఎత్తున చర్చ జరుగుతుండగానే వరసగా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కాల్పులు జరిగిన అన్ని సంఘటనల్లో ఆగంతకులు సైకోలు అన్న విషయం తేలుతోంది. ఈ సైకోల మూలంగా అమెరికాలో భద్రత ఇబ్బందిగా మారుతోంది. ఎన్ని భద్రతా చర్యలు చేపట్టినా ఎవరు ? ఎలాంటి వారు ? అన్నది గుర్తించడం చాలా కష్టంగా మారుతుంది. తాజాగా కాల్పులకు పాల్పడిన నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ప్రతిఘటించడంతో అతన్ని కాల్చి చంపామని కాలిఫోర్నియాకు చెందిన పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.