విమానం వాష్ రూం లో బంగారం దొరికింది..!

  అది ఖతార్ ఎయిర్ వేస్ విమానం. గోవా ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత రెగులర్ గా చేసే చెకప్ లాగే ఆ రోజు కూడా చెక్ చేయడానికి వెళ్లారు సిబ్బంది. విమానం వాష్ రూమ్ లో వాళ్లకో బ్యాగ్ కనబడింది. ఓపెన్ చేసి చూస్తే కళ్లు జిగేల్ మన్నాయి. బ్యాగ్ నిండా బంగారం ఉంది. బాత్రూమ్ లో బంగారం బ్యాగ్. కాసేపు సిబ్బందికి నోట మాట రాలేదు. వెంటనే తేరుకుని అధికారులకు ఫోన్ చేసి ఇన్ఫర్ మేషన్ ఇచ్చారు. తూకం వేస్తే, ఆ బంగారం దాదాపు 7 కేజీలు తూగింది..! ప్రస్తుతం మార్కెట్ రేటు ప్రకారం ఆ బ్యాగ్ విలువ కోటీ 80 లక్షలకు పైమాటే. ఈ వాష్ రూం లో బంగారం ఎవరు ఎందుకు వదిలేశారో ఎవరూ చెప్పలేకపోతున్నారు. త్వరలోనే ఆ బ్యాగ్ ఎవరిదో కనిపెడతామని చెబుతున్నారు బంగారాన్ని స్వాధీనం చేసుకున్న గోవా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు..

ట్రంప్ ది ఆదిమ సంస్కృతే.. ప్రియాంక చోప్రా

  అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే అతని వ్యాఖ్యలపై ఇప్పుడు బాలీవుడ్ నటి స్పందిస్తూ విమర్శనాస్తాలు సంధించింది. గతంలో అమెరికాలోకి ముస్లింల‌ను రానివ్వ‌కుండా నిషేధం విధించాల‌ని ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ప్రియాంక చోప్రా.. ఇటువంటి చ‌ర్య ఆదిమ సంస్కృతేనంటూ.. క్లిష్ట‌మైన ఉగ్ర‌వాద నిర్మూల‌నా అంశాన్ని ఓ వ‌ర్గానికి ఆపాదిస్తూ వారిపై నిషేధం విధించ‌డం స‌రైన చ‌ర్య కాద‌ని ట్రంప్ వ్యాఖ్య‌ల‌ను తిప్పి కొట్టింది.   కాగా ప్రస్తుతం ప్రియాంక చోప్రా.. అమెరిక‌న్ టీవీ సీరియ‌ల్‌ ‘క్వాంటికో’ షూటింగ్‌లో బిజీబిజీగా ఉంది. మరోపక్క హాలీవుడ్‌ స్టార్‌ డ్వెయిన్‌ జాన్సన్‌తో కలిసి ‘బేవాచ్‌’ సినిమాలో నటించే అవకాశం సైతం కొట్టేసింది.

సరి-బేసి విధానానికి ఎంపీల నిరసన.. సైకిల్, గుర్రంపై పార్లమెంట్ కి

  ఢిల్లీలోని వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి కేజ్రీవాల్ సరి-బేసి విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ పద్దతి నుండి తమకు మినహాయింపు ఇవ్వాలని ఎంపీలు డిమాండ్ చేస్తున్న సంగతి కూడా విదితమే. ఈ నిబంధనలతో పార్లమెంట్ సమావేశాలకు వెళ్లాలంటే కష్టమని.. తమకు ఈ పద్దతి నుండి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. బీజేపీ నేతలు తమ నిరసనను ప్రదర్శించారు. బీజేపీ ఎంపీ రామ్‌ ప్రసాద్ శ‌ర్మ ఈరోజు సరి-బేసి విధానానికి వ్య‌తిరేకంగా వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. ఆయన గుర్రంపై స్వారీ చేస్తూ పార్లమెంటుకు వచ్చారు. మ‌రో బీజేపీ ఎంపీ మ‌నోజ్ తివారీ సైకిల్‌పై చ‌క్క‌ర్లు కొడుతూ.. స‌రి బేసి విధానంపై నిర‌స‌న వ్య‌క్తం చేశారు.  

మైసూరా పై జగన్ స్పందన.. ఆయన్ని చూసి ఆరు నెలలైంది

  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎంవీ మైసూరా రెడ్డి పార్టీ రాజీనామా చేసిన నేపథ్యంలో స్పందించారు. మైసూరా రెడ్డి ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసేదేంటి.. ఆయన ఎప్పటి నుండో పార్టీకి దూరంగా ఉంటున్నారు.. మైసూరా రెడ్డిని చూసి ఆరు నెలలు అవుతోందని విమర్శించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియా సమావేశంతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై అరుణ్‌జైట్లీకి వివ‌రించాన‌ని జ‌గ‌న్ అన్నారు. చంద్రబాబు అవినీతిపై అరుణ్ జైట్లీకి వివరించానని ఈ విష‌య‌మై చంద్రబాబుపై విచార‌ణ జ‌రిపించాల‌ని విన్న‌వించాన‌ని.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పై రాసిన ఓ పుస్తకాన్ని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీకి అంద‌జేశానని చెప్పారు.

పార్టీ మారకముందే టీడీపీ ఎమ్మెల్యే అని రాసుకున్న వైసీపీ ఎమ్మెల్యే..

  టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ వ్యూహానికి వైసీపీ విలవిల్లాడుతోంది. ఇప్పటికే వైసీపీ పార్టీ నుండి 13 మంది ఎమ్మెల్యేలు టీడీపీ లోకి జంప్ అవ్వగా.. ఈరోజు ఇద్దరు ఎమ్మెల్యేలు జగన్ షాకిచ్చారు. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎంవీ మైసూరా రెడ్డి వైసీపీకి రాజీనామా చేయగా.. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవిశంకర్ టీడీపీ పార్టీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో ఎమ్మెల్యే కూడా వైసీపీకి గుడ్ బై చెప్పనున్నట్టు వార్తలు వస్తున్నాయి. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వైసీపీని వీడే యోచనలో ఉన్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈనేపథ్యంలో ఆయన తన కార్యకర్తలతో సమావేశమై వారి అభీష్టం మేరకు పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈయన ఎంట్రీకి టీడీపీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇంకా పార్టీ మారకముందే..రాజశేఖర్ రెడ్డి తన ఫేస్ బుక్ లోని తన పేజ్ ను అప్పుడే టీడీపీ లోకి మార్చేశాడు. అంతేకాదు టీడీపీ ఎమ్మెల్యే అని కూడా తన ప్రొఫైల్ లో రాసేసుకున్నాడు. మరోవైపు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పార్టీ మార్పుపై వార్తలు వస్తున్న నేపథ్యంలో పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బుజ్జగింపు చర్యలు చేపట్టడానికి ప్రయత్నించినా ఆయన మాత్రం టీడీపీలోకి వెళ్లడానికే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.

జగన్ కి దెబ్బ మీద దెబ్బ... టీడీపీ కండువా కప్పుకున్న గొట్టిపాటి

  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తగిలింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు.. ఒకే రోజు ఇద్దరు నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎంవీ మైసూరా రెడ్డి పార్టీకి రాజీనామా చేయగా.. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవిశంకర్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పేసి టీడీపీ కండువా కప్పుకున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరి పేటలోని తన నివాసం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలతో కలిసి వచ్చిన గొట్టిపాటికి విజయవాడలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఘన స్వాగతం పలికారు. పార్టీ కండువా కప్పి గొట్టిపాటిని టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. గొట్టిపాటి వెంట వచ్చిన వైసీపీ నేతలకు కూడా చంద్రబాబు పార్టీ కండువాలు కప్పారు. కర్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పేసి టీడీపీ కండువా కప్పుకున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరి పేటలోని తన నివాసం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలతో కలిసి వచ్చిన గొట్టిపాటికి విజయవాడలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఘన స్వాగతం పలికారు. పార్టీ కండువా కప్పి గొట్టిపాటిని టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. గొట్టిపాటి వెంట వచ్చిన వైసీపీ నేతలకు కూడా చంద్రబాబు పార్టీ కండువాలు కప్పారు.

ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఇచ్చిన ర్యాంకులు ఇవే..

  మెున్నటి వరకూ చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చిన దానిపై రగడ జరిగింది. ఇప్పుడు తాజాగా చంద్రబాబు ఎమ్మెల్యేలు, పార్టీ ఇంఛార్జ్ ల పనితీరుపై సర్వేచేసి ర్యాంకులు ప్రకటించారు. అయితే ఆశ్చర్యమేంటంటే.. ఈ సర్వేలే చంద్రబాబుకు వచ్చిన ఐదవ స్థానంలో నిలిచారు. మరి ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఇచ్చిన ర్యాంకులు ఏంటో ఓ లుక్కేద్దాం.. * తంబళ్లపల్లె ఎమ్మెల్యే జి.శంకర్‌ యాదవ్‌.. మొదటి స్థానం..  రాష్ట్రస్థాయిలో 10వ ర్యాంక్‌ * ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమ నాయుడు, తిరుపతి ఎమ్మెల్యే సుగుణ, పలమనేరు ఇన్‌చార్జి సుభా్‌షచంద్రబోస్‌.. 2వ స్థానం.. రాష్ట్రస్థాయిలో 15వ ర్యాంక్‌. * మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి.. 3వ స్థానం.. రాష్ట్రంలో 35వ ర్యాంక్‌ * పుంగనూరు ఇనఛార్జి వెంకట్రమణరాజు..4వ స్థానం.. రాష్ట్రస్థాయిలో 53వర్యాంకు * చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీమంత్రి గల్లా అరుణకుమారికి, పీలేరు ఇన్‌చార్జి ఇక్బాల్‌ అహ్మద్.. 5వ స్థానం.. రాష్ట్రస్థాయిలో 73వర్యాంకు * సత్యవేడు ఎమ్మెల్యే ఆదిత్య.. 6 వ స్థానం..  రాష్ట్రస్థాయిలో 116వ ర్యాంకు. * చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ.. 7వ స్థానం..  రాష్ట్రంలో 121వ ర్యాంకు * పూతలపట్టు ఇన్‌చార్జి లలితకుమారి.. 8వ స్థానం.. రాష్ట్రంలో 126వ ర్యాంకు * జీడీనెల్లూరు ఇన్‌చార్జి కుతూహలమ్మ.. 9వస్థానం.. రాష్ట్రస్థాయిలో 138 వ ర్యాంకు ఇక మదనపల్లి నియోజక వర్గానికి ఇంఛార్జ్ లేకపోవడంతో చిట్టచివరి స్థానంలో నిలిచింది. రాష్ట్రస్థాయిలో 159వ ర్యాంకు వచ్చింది.

అగస్టా చర్చతో అట్టుడుకుతున్న పార్లమెంట్..

  పార్లమెంట్ బడ్జెట్ రెండో దశ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పటికే ఉత్తరఖండ్ రాజకీయ సంక్షోభం పై సభ దద్దరిపోతుంది. ఈ ఆందోళనలతో సభ ముందుకు సాగలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు దీనికి తోడు అగస్ట్ వెస్ట్ ల్యాండ్ చాపర్ కుంభకోణంతో సభలో మాటల యుద్దం జరుగుతోంది. కొత్తగా రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం స్వీకారం చేసిన సుబ్రహ్మణ్యస్వామి సభలో ఈ అంశాన్ని లేవదీశారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వెల్ లోకి దూసుకెళ్లి ఆందోళనలు చేపట్టారు. అంతేకాదు అంశంపై చర్చ చేపట్టాలని తాము వాయిదా తీర్మానం ఇస్తామని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు. మరోపక్క, తమ పాలన హయాంలో నిషేధం విధించిన సంస్థను తిరిగి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో ఎన్డీయే ఎలా భాగస్వామ్యం చేసిందని కాంగ్రెస్ నేత ఆజాద్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ప్రారంభమైన పార్లమెంటు సమావేశం అగస్టా చర్చతో అట్టుడుకుతోంది.

ఎమ్మెల్యేలకు చంద్రబాబు ర్యాంకులు.. చంద్రబాబుకు ఏ స్థానమంటే..?

  ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రుల పనతీరును బట్టి వారికి ర్యాంకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ర్యాంకులపైన పెద్ద రచ్చ కూడా జరిగిన సంగతి విదితమే. అయితే ఇప్పుడు చంద్రబాబు ఎమ్మెల్యేలు పనితీరును బట్టి వారికి ర్యాంకులు ఇచ్చారు. ఈ ఏడాది జనవరి నుండి మార్చి వరకూ ఎమ్మెల్యేలు, పార్టీ ఇంఛార్జ్ ల పనితీరుపై జరిపిన సర్వేలో తంబెళ్ల ఎమ్మెల్యే శంకర్ మొదటి స్థానంలో ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో 10వ స్థానంలో నిలిచారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి చందబాబు నాయుడు జిల్లా పరంగా ఐదవ స్థానంలో నిలవగా.. రాష్ట్ర స్థాయిలో 79వ స్థానంలో నిలిచారు.   కాగా ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిల నిబద్ధత, నిజాయితీ, ప్రజలకు అందుబాటులో ఉండటం, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, నియోజకవర్గ పార్టీ శ్రేణులను, జన్మభూమి కమిటీలను సమన్వయ పరచి ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం ప్రధాన అంశాలుగా టీడీపీ ప్రతి నాలుగు నెలలకోసారి సర్వే నిర్వహిస్తోంది.

విశాఖలో భారీ అగ్నిప్రమాదం.. 40 ఫైరింజన్లు.. 14 గంటలు

  విశాఖపట్నంలో భారీ అగ్నిప్రమాదమే సంభవించింది. విశాఖ దువ్వాడ ఎస్‌ఈజెడ్‌లోని బయోమాక్స్ కంపెనీలో నిన్న రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి 7.30 గంటల సమయంలో కంపెనీలో ఆయిల్ రిఫైనరీ ట్యాంకర్లు పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. బయోమ్యాక్స్ కంపెనీలోని 18 ముడి చమురు ఆయిల్ ట్యాంకర్లలో 12 ట్యాంకర్లు తగలబడగా.. అందులో 6 ట్యాంకర్లు పూర్తిగా దగ్ధమయ్యాయినట్టు అధికారులు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా ట్యాంకర్లు పేలడం వల్ల భారీగా ఎగసిపడుతున్న మంటలను ఆర్పడానికి ఫైర్ సిబ్బంది తంటాలు పడుతున్నారు. మొత్తం 40 ఫైరింజన్లతో దాదాపు 14 గంటల నుండి మంటలను ఆర్పడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నా.. మంటలను ఆర్పలేకపోతున్నారు ఫైర్ ఇంజన్ సిబ్బంది. కాగా ఈ ప్రమాదం వల్ల దాదాపు 200 కోట్ల నష్టం జరిగినట్టు తెలుస్తోంది.   మరోవైపు 100 అడుగులకుపైగా ఎత్తులో ఎగసిపడిన మంటలు చుట్టుపక్కల ప్రజలను భయభ్రాంతులకు గురిస్తున్నాయి. బయో డీజిల్ ట్యాంకర్లు పేలడంతో పొగ కాలుష్యం ఆ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు విశాఖ నగరాన్ని కమ్మేసింది. అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు బుధవారం ఉదయం ఆరా తీశారు. ఘటనా స్ధలాన్ని హోంమంత్రి చినరాజప్ప, మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్‌, ఫైర్‌ సర్వీసెస్‌ డీజీ, నౌకాదళ అధికారులతో మాట్లాడారు. కంపెనీ పరిసర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రులు సూచించారు.

కన్నయ్య కుమార్ మరో పోరాటం.. నేటి నుండి నిరాహార దీక్ష

  జెఎన్యూలో రోజు రోజుకి వివాదాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు తాజాగా మరో వివాదానికి తెర తీస్తున్నారు జెన్యూ విద్యార్ధులు. అఫ్జ‌ల్ గురు ఉరిశిక్ష అమ‌లు పరచి ఏడాది గ‌డిచిన సంద‌ర్భంగా జేఎన్‌యూలో స‌ద‌రు ఉగ్ర‌వాది ఉరితీత‌కు వ్య‌తిరేకంగా విద్యార్ధులు నిరసన కార్యక్రమం నిర్వ‌హించిన సంగతి తెలిసిందే. దీనిపై జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంపై విచారించిన ఉన్న‌త‌స్థాయి క‌మిటీ క‌న్న‌య్య‌కు రూ.10 వేల జరిమానా విధించింది. అంతేకాదు విద్యార్థులను వ‌ర్సిటీ నుంచి బ‌హిష్క‌రించింది. దీనికి గాను వర్శిటీ విద్యార్ధులు నిరాహార దీక్షకు దిగనున్నారు. దీనిలో భాగంగా నేడు గంగా ధాబానుంచి అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ వరకూ నిరసన ప్రదర్శన నిర్వహించి, నిరాహార‌ దీక్ష చేపట్టనున్నారు. ఈ సందర్భంగా క‌న్న‌య్య మాట్లాడుతూ.. త‌మ‌పై విచార‌ణ‌కు క‌మిటీని వేయడాన్ని గ‌తంలో తాము వ్య‌తిరేకించామ‌ని, ఇప్పుడు ఆ క‌మిటీ నివేదిక ప్ర‌కారం వ‌ర్సిటీ త‌మ‌పై బ‌హిష్క‌రణ విధించ‌డాన్ని వ్య‌తిరేకిస్తున్నామని వ్యాఖ్యానించారు. మరి ఇది ఎంతవరకూ వెళుతుందో చూడాలి.

జగన్ ది అపరిచితుడు క్యారెక్టర్.. పుస్తకాలు రాసుకుంటా.. మైసూరా

వైసీపీ సీనియర్ నేత ఎంవీ మైసూరా రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. జగన్ వ్యవహారం అపరిచితుడు క్యారెక్టర్ ను తలపిస్తోందని.. మానవీయ కోణంలోనే తాను వైసీపీలో చేరానన్న ఆయన... జగన్ కు మాత్రం మానవీయ కోణం లేదన్నారు. వ్యక్తిగతంగానే కాక కనీసం ఫోన్ లో కూడా జగన్ దొరకరని ఆయన వ్యాఖ్యానించారు.   మరోవైపు వైసీపీకి రాజీనామా చేసిన మైసూరా రెడ్డి బీజేపీ, టీడీపీలో ఏపార్టీలో చేరతారన్న సందేహాలు అప్పుడే వస్తున్నాయి. అయితే దీనికి మైసూరా రెడ్డి.. రాజకీయాల్లో తనకు ఓ అపవాదు ఉందని పార్టీలు మారుతుంటానని అయితే ఇప్పుడు మాత్రం ఏ పార్టీలో చేరనని పుస్తకాలు రాస్తానని అన్నారు.

అంత్రాక్స్ మళ్లీ బయటకొచ్చింది..అది కూడా ఏపీలో..!

2001లో ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన అంత్రాక్స్ మహమ్మారి మళ్లీ పడగవిప్పుతోంది. విశాఖ ఏజెన్సీలో అంత్రాక్స్ ప్రబలి గతంలో చాలా మంది మృత్యువాత పడ్డారు. తాజాగా హుకుంపేట మండలం పనసకుట్టులో 16 మందికి అంత్రాక్స్ లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మండలంలోని తాడిపుట్టు, ఉర్రాడ, నిమ్మపాడు, బొడ్డాపుట్టు గ్రామాల్లోని కొందరు గత వారం రోజులుగా కాళ్లు, చేతులపై మచ్చలుతో బాధపడుతున్నారు. ఇవి అంత్రాక్స్ లక్షణాలను పోలి ఉండటంతో వైద్యులు వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. దీంతో ఆయా గ్రామల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ వ్యాధికి సోకిన వారికి తీవ్ర జ్వరం, వాంతులు, పొత్తి కడుపులో నొప్పి, శరీరంపై ఎర్రని మచ్చలు, దగ్గు, తలనొప్పి, గొంతునొప్పి వస్తాయి.

సిద్దరామయ్య ముఖ్యమంత్రి పదవికి గండం..! రేసులో ఇద్దరు..

  కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు పదవికి గండం తప్పనుందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. దీనికి కారణం కాంగ్రెస్ అధిష్టానం సిద్దరామయ్యపై తీవ్ర అసంతృప్తితో ఉండటమే. అందుకే ముఖ్యమంత్రిగా మరో నేతను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు కాంగ్రంస్ చేస్తున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గత కొద్దికాలంగా సిద్దరామయ్యపై పలు ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే.. అంతేకాదు తన కొడుకుకి కాంట్రాక్టులు కట్టబెట్టడంపై కూడా అధిష్టానం చాలా సీరియస్ గా ఉందట.. దీనితోపాటు బీజేపీ విభాగం పగ్గాలు మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప తిరిగి చేపట్టడం కూడా కాంగ్రెస్ లో గుబులు రేగడానికి ఒక కారణంగా తెలుస్తోంది. మరోవైపు ఈ ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత ఎస్ ఎం కృష్ణతోపాటు, ప్రస్తుతం ఆ రాష్ట్ర హోం మంత్రిగా ఉన్న జి.పరమేశ్వర పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి పీఠం ఎవరిని వరిస్తుందో చూడాలి.

50 కోట్లతో బీజేపీ నేతలు కొనడానికి ప్రయత్నించారు..

ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభంలో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టాలని బీజేపీ, బీజేపీని ఇరకాటంలో పెట్టాలని కాంగ్రెస్ పార్టీలు తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజేంద్ర భండారి, జీత్ రామ్ బీజేపీపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. రూ. 50 కోట్లతో తమను కొనడానికి బీజేపీ నేతలు ప్రయత్నించారని.. అంతేకాదు తదుపరి ఎన్నికల్లో త‌మ‌ కుటుంబ సభ్యుల్లో ఒకరికి టికెట్, రాజ్యసభ సీటు ఇస్తామంటూ ప్ర‌లోభ పెట్టార‌ని తెలిపారు. దీనికి బీజేపీ నేతలు స్పందిస్తూ.. కాంగ్రెస్ నేతలు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. త‌గిన ఆధారాలు లేకుండానే కాంగ్రెస్ త‌మ‌పై ఆరోప‌ణ‌లు గుప్పిస్తుంద‌ని పేర్కొంది.