జగన్ ది అపరిచితుడు క్యారెక్టర్.. పుస్తకాలు రాసుకుంటా.. మైసూరా
posted on Apr 27, 2016 @ 12:01PM
వైసీపీ సీనియర్ నేత ఎంవీ మైసూరా రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. జగన్ వ్యవహారం అపరిచితుడు క్యారెక్టర్ ను తలపిస్తోందని.. మానవీయ కోణంలోనే తాను వైసీపీలో చేరానన్న ఆయన... జగన్ కు మాత్రం మానవీయ కోణం లేదన్నారు. వ్యక్తిగతంగానే కాక కనీసం ఫోన్ లో కూడా జగన్ దొరకరని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు వైసీపీకి రాజీనామా చేసిన మైసూరా రెడ్డి బీజేపీ, టీడీపీలో ఏపార్టీలో చేరతారన్న సందేహాలు అప్పుడే వస్తున్నాయి. అయితే దీనికి మైసూరా రెడ్డి.. రాజకీయాల్లో తనకు ఓ అపవాదు ఉందని పార్టీలు మారుతుంటానని అయితే ఇప్పుడు మాత్రం ఏ పార్టీలో చేరనని పుస్తకాలు రాస్తానని అన్నారు.