ఏపీ నిరుద్యోగులకు శుభవార్త..త్వరలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ రోజు కేబినెట్ మీటింగ్ జరిగింది. అయితే ఈసందర్బంగా కేబినెట్ నిరుద్యోగులను తృప్తి పరిచే ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని కేబినెట్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే మొదటి దశలో పదిశాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఇంకా పలు నిర్ణయాలను మంత్రివర్గం తీసుకుంది. అలాగే అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులపై కేంద్రానికి లేఖ రాయాలని, అవసరం అనుకుంటే సుప్రీం కోర్టుకు కూడా వెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరవు నివారణా చర్యలు, ఇంకుడు గుంతలు, నీరు-ప్రగతి పథకాలను సమర్థంగా అమలయ్యేలా చూడాలని నిర్ణయించారు.

ఒసామా బిన్ లాడన్ ను ఎలా చంపారో సీఐఏ ట్వీట్లు..

  అగ్ర దేశాలను సైతం గడగడలాడించి.. ఎంతో మంది ప్రాణాలను బలిగొన్న ఆల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడన్ హతమై నేటికి సరిగ్గా ఐదు సంవత్సరాలు పూర్తయింది. 2011 మే 2 వ తేదీన పాకిస్థాన్ లోని అబాటోబాద్ లో ఆర్మీ క్షేత్రాన్ని ఆనుకున్న ఉన్న రెస్ట్ హౌస్ లో ఉన్న బిన్ లాడెన్ పై అమెరికా భద్రతా దళాలు ఒక్కసారిగా ఉప్పెనలా వెల్లువెత్తి క్షణాల్లో మట్టుబెట్టి.. మృతదేహాన్ని తీసుకొచ్చి సముద్రంలో పడేసిన సంగతి తెలిసిందే. అయితే బిన్ లాడెన్ పై దాడి చేసి ఇప్పటికి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా సీఐఏ మరోసారి అప్పటి ఆపరేశషన్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మరోసారి తన ట్విట్టర్లో చాలా డిటైల్డ్ గా తెలిపింది. నాడు ఆపరేషన్ 'నెఫ్ట్యూన్ స్పియర్' పేరుతో అమెరికా సీల్స్ విశాలమైన కాంపౌండ్ కలిగిన అబోటాబాద్ లో లాడెన్ ఇంటిపై హెలికాప్టర్ తో దిగడం, వాయువేగంతో ఒక్కక్కరిని మట్టుబెట్టుకుంటూ లోపలికి వెళ్లడం, మూడవ అంతస్తులో ఉన్న లాడెన్ ను మట్టుబెట్టి తీసుకెళ్లిన విధానాన్ని కళ్లకు కట్టినట్టు చిత్రాలతో సహా ట్విట్టర్ లో సీఐఏ మరోసారి వివరించింది. మీరు కూడా ఓ లుక్కేయండి..    

నకిలీ వస్తువుల ఎగుమతిలో టాప్ ప్లేస్ లో ఇండియా..

  నకిలీ వస్తువులకు చైనా పెట్టింది పేరని మరోసారి రుజువైంది. నకిలీ వస్తువులను అత్యధికంగా ఎగుమతి చేస్తోన్న దేశాల్లో చైనా మరోసారి ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇండియా ఐదో ప్లేస్లో నిలిచింది. యూరోపియన్ యూనియన్స్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కార్యాల‌యంతో ఆర్గనైజేషన్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ సంస్థ కలిసి నిర్వ‌హించిన స‌ర్వేలో నకిలీ వస్తువులను అత్య‌ధికంగా ఎగుమతి చేస్తోన్న దేశాల్లో వ‌ర‌స‌గా చైనా, టర్కీ, సింగపూర్, థాయ్ లాండ్, ఇండియా మొద‌టి స్థానాల్లో ఉన్నాయి. దీనిలో చైనాకు 63 శాతం నకిలీ వస్తువుల వాణిజ్యం ఉండగా, టర్కీ 3.3శాతం, సింగపూర్ 1.9 శాతం, థాయ్ లాండ్ 1.6 శాతం, భారత్ 1.2 శాతం నకిలీ వ‌స్తువుల వాణిజ్యం చేస్తున్నాయ‌ని స‌ర్వే పేర్కొంది.

పొంగులేటి పార్టీ మార్పు రేవంత్ రెడ్డి.. రూ.1,500 కోట్లు ఇస్తే పార్టీ మారరా..?

తెలంగాణ నుండి వైసీపీ తరుపున గెలిచిన ఒక్కగానొక్క ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అధికార పార్టీ అయిన టీఆర్ఎస్లోకి చేరుతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈసందర్భంగా పొంగులేటి.. తెలంగాణలో వైసీపీకి మనుగడలేదని.. పార్టీని బతికించడానికి ఎంతో కృషి చేశా.. తెలంగాణలో వైసీపీ వెంట ప్రజలు నడిచే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. మే నాలుగో తేదీన టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు.   అయితే పొంగులేటి పార్టీ మార్పుపై వస్తున్న వార్తలకు టీటీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆరే పొంగులేటికి బంపర్ ఆఫర్ ఇచ్చి పార్టీలోకి తీసుకున్నారని.. పొంగులేటికి రూ.1,500 కోట్లు ఎరవేస్తే పార్టీ మారడం ఏమిటి..? వైకాపానే తెరాసలోకి విలీనం చేయరా? అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌‍లో తన పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ కొనుగోలు చేస్తుందని తీవ్ర విమర్శలు గుప్పించిన వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో తన పార్టీ నేతల ఫిరాయింపులపై ఎందుకు నోరెత్తలేదని అడిగారు.

అగస్టా పై రాజ్యసభలో రచ్చ... ఎంపీ ని బయటకు వెళ్లిపోమన్న స్పీకర్

ప్రస్తుతం రాజ్యసభలో అగస్టా స్కాం గురించి ప్రతిపక్ష విపక్షాల మధ్య ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సభకు పదే పదే అడ్డుపడుతున్న నేతను రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ సభ నుండి బయటకు పంపేశారు. ఇంతకీ ఆ నేత ఎవరంటే తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు శేఖర్ రాయ్. సభలో అగస్టా స్కాం గురించి చర్చ జరుగుతుండగా.. అగస్టా చాపర్ల కుంభకోణంలో చర్చకు ఆయన నోటీసును ఇచ్చారు. అయితే దీనిని తిరస్కరిస్తున్నట్టు అన్సారీ ప్రకటించారు. కానీ శేఖర్ రాయ్ మాత్రం పట్టుబట్టి.. రక్షణ మంత్రి పారికర్ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు అన్సారీ ఎన్ని సార్లు వారించిన వినకుండా నినాదులు చేస్తుండటంతో సహనం కోల్పోయిన ఆయన శేఖర్ ను బయటకు వెళ్లిపోవాలని..ఈ రోజు తిరిగి సభలో అడుగు పెట్టరాదని ఆదేశించారు.

ఆరోగ్య శ్రీ సేవలను ఆపేస్తున్నాం..

  వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఆరోగ్య శ్రీ సేవలను తెలంగాణ వ్యాప్తంగా నిలిపివేస్తున్నట్టు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ ప్రకటించాయి. తమకు కట్టవలసిన బకాయిలు ఇప్పటి వరకూ చెల్లించలేదని..250 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని.. అందుకే తమ సేవలను నిలిపివేస్తున్నట్టు.. తెలంగాణ హాస్పిటల్స్‌ అండ్‌ నర్సింగ్‌ హోమ్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ టి. నర్సింహారెడ్డి, కన్వీనర్‌ డాక్టర్‌ ఎల్‌.సురే్‌షగౌడ్‌ తెలిపారు.   అయితే దీనికి స్పందించిన ఆరోగ్యశ్రీ ట్రస్టు.. పెండింగ్ లో ఉన్న బిల్లులను సోమవారం నుంచి చెల్లించనున్నట్టు ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో ఎం.చంద్రశేఖర్‌ చెప్పారు. ఈ సందర్భంగా ఎం.చంద్రశేఖర్ మాట్లాడుతూ బిల్లులు చెల్లిస్తున్నామని, సేవలను నిరంతరాయంగా కొనసాగించాలని కోరారు.

ఎమ్మెల్యేకు షాకిచ్చిన చంద్రబాబు.. ఆ రకంగా కోపం తీర్చుకున్నారా..?

  తెలంగాణ టీడీపీ నుండి సికింద్రాబాద్ పరిధిలోని కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందిన సాయన్న తెలంగాణ అధికార పార్టీ అయిన టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. అయితే సాయన్న విషయంలో ఇప్పుడు చంద్రబాబు తన కోపాన్ని తీర్చుకున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) పాలక మండలి కాలపరిమితిని అందరికి ఏడాది పాటు పెంచిన చంద్రబాబు సాయన్నకు మాత్రం హ్యాండిచ్చారు. వివరాల ప్రకారం.. తితిదే పాలక మండలిలో ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తితో పాటు.. బోర్డులోని 19 మంది సభ్యులు ఉండగా వారిలో తెలంగాణా రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య.. సాయన్నలు కూడా ఉన్నారు. అయితే వీరి కాలపరిమితిని ఏడాది పాటు పెంచిన చంద్రబాబు.. తితిదే బోర్డులో సాయన్న సభ్యత్వాన్ని మాత్రం పొడగించలేదు. అంతేకాదు ఆయన స్థానంలో మరొకరికి స్థానం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారంట.

ఉత్తరాఖండ్ అడవుల్లో మంటలు... 89 రోజు నుండి తగలబడుతున్న అడవి

  ఉత్తరాఖండ్ అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు ఇప్పటివరకూ ఆగనేలేదు. దాదాపు 89 రోజు నుండి తగలబడుతున్న అటవీ ప్రాంతంలో సుమారు 70 శాతం మేరకు మంటలు వ్యాపించాయి. దీంతో దట్టంగా వ్యాపించిన పొగలవల్ల సహాయక చర్యలు కూడా చేయడానికి చాలా ఇబ్బందిగా మారింది పరిస్థితి. మరోవైపు శాటిలైట్ చిత్రాల ఆధారంగా మంటలు ఆర్పడానికి ఒకపక్క అగ్నిమాపక యంత్రాలు నిరంతరం శ్రమిస్తుండగా.. మరోవైపు ఐఏఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌, స్థానిక అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎంఐ-17 హెలికాప్టర్లు రంగంలోకి దిగి భీమ్‌తల్‌ సరస్సు నుంచి నీటిని తీసుకొచ్చి మంటలను ఆర్పుతున్నాయి. కొద్ది రోజుల్లో పూర్తిగా మంటలను ఆర్పేస్తామని ఎన్డీఆర్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఓపీ సింగ్‌ వెల్లడించారు.   ఇదిలా ఉండగా అడవుల్లోని మంటల గురించి ఉత్తరాఖండ్ గవర్నర్, స్థానిక అధికారులతో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూనే ఉన్నారు. ఇంకా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఈ ఘటనపై స్పందించి ప్రస్తుతానికి 70 శాతం మేరకు మంటలు అదుపులోకి వచ్చాయన్నారు.

మా దేశాన్ని చైనా రేప్ చేసింది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

గతంలో మన ఉద్యోగాలు చైనా వాళ్లు కొల్లగొడుతున్నారని నోరు జారిన ట్రంప్ ఇప్పుడు మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో నోరు జారారు. దఫోర్డ్‌వేన్, ఇండియానాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన అమెరికా వాణిజ్య లోటు గురించి మాట్లాడుతూ చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా ఎగుమతుల్లో అమెరికా వాటా ఎక్కువ ఉందని, చైనా తన కరెన్సీని అనుసంధానించడం వల్ల ప్రపంచ మార్కెట్‌లో తన ఎగుమతులను పెంచుకోగలుగుతుందని.. 'మా దేశాన్ని చైనా రేప్ చేయడానికి ఇక ఏమాత్రం మేము అనుమతించం' అని ఘాటుగా వ్యాఖ్యానించారు. మళ్లీ చైనాపై తనకు ఎలాంటి కోపం లేదని.. ఇంతకుముందున్న నాయకుల అసమర్థత వల్లే అమెరికా వాణిజ్యం ఇలా తయారైందని ఆరోపించారు. మరి గతంలో తమ ఉద్యోగాలు తన్నుకుపోతున్నారు అన్న ట్రంప్ వ్యాఖ్యలను చైనా వాళ్లు పొగడ్తలుగా తీసుకున్నారు. మరి ఇప్పుడు ఈ వ్యాఖ్యలను ఎలా తీసుకుంటారో చూద్దాం..

మూడేళ్లు దాచి బంగారు పోత పోసిన మృతదేహానికి పూజలు..

  చనిపోయిన తన గురువు మరణాన్ని తట్టుకోలేక ఆయన మృతదేహాన్ని దాచి.. దానికి బంగారు పూత పూసి భగవంతుడిలా కొలుచుకుంటున్నారు. వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఇంత విచిత్రమైన ఘటన దక్షిణ చైనాలో చోటుచేసుకుంది. అసలు సంగతేంటంటే.. దక్షిణ చైనాలో ఫూహోయ్ అనే బాలుడు తన 13వ ఏట బౌద్ధ భిక్షువుగా మారి, ధమ్మ సూత్రాలను బోధిస్తూ, 94 సంవత్సరాల పాటు చాంగ్ ఫూ దేవాలయంలోనే గడిపారు. అయితే 2012 లో ఆయన మరిణంచగా.. అది జీర్ణించుకోలేని అతని శిష్యులు ఆయన మృతదేహాన్ని మూడు సంవత్సరాలు ప్రత్యేక రసాయనాలతో కూర్చున్న భంగిమలో ఓ కుండలో భద్రపరిచారు. ఇటీవలే ఆ మమ్మీని బయటకు తీసి దానికి బంగారంతో పోత పోసి అక్కడే పూజలు నిర్వహిస్తూ, దేవుడని కొలుస్తూ, ఆయనపై ఉన్న తమ భక్తిని చాటుకుంటున్నారు.

పశ్చిమ బెంగాల్ లో మరోసారి హింస.. నలుగురు మృతి

  పశ్చిమ బెంగాల్ లో రెండు రోజుల క్రితమే ఐదో దశ ఎన్నికల పోలింగ్ కూడా ముగిసిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో టీఎంసీ పార్టీ కార్యకర్తలకు, సీపీఎం పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరగగా.. ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తరువాత కూడా మాల్దా ప్రాంతంలో హింస చలరేగింది. కాంగ్రెస్ పార్టీ, టీఎంసీ కార్యకర్తల మధ్య గొడవ జరిగి అది కాస్త హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో నలుగురు టీఎంసీ నేతలు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు బాంబులను విసిరారని, ఈ కారణంతోనే తమవారు మరణించారని తృణమూల్ ఆరోపించగా, కాంగ్రెస్ దాన్ని ఖండించింది.

దావూద్ గురించి రహస్య సమాచారం ఉంది.. మోడీకి మాత్రమే ఇస్తా..

  మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడానికి మన ప్రభుత్వం తలలు పట్టుకుంటుంటే.. దావూద్ గురించిన విలువైనరహస్య సమాచారం తన వద్ద ఉందని గుజరాత్ కు చెందిన మనీష్ భాంగోరే చెబుతున్నారు. దావూద్ మాట్లాడిన ఫోన్ కాల్స్ రికార్డు చేసిన సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి.. కానీ ఈ రహస్య సమాచారం ఎవరికి తెలుపను.. కేవలం ప్రధాని నరేంద్ర మోడీ గారికి మాత్రమే ఇస్తానని చెప్పాడు. ఎందుకంటే.. ఈ సమాచారాన్ని సేకరించేందకు నేను నా జీవితాన్నే పణంగా పెట్టాను.. ఎంతో కష్టపడి సమాచారం సేకరించాను.. అయితే మొదట వడోదరా పోలీసులు ఈ విషయంలో సహకరించారు కానీ.. ఆతరువాత వేధించడం మొదలుపెట్టారు.. తాను తప్పుడు ప్రచారం చేస్తున్నానని పోలీసు కమిషనర్ ఈ రాధాకృష్ణన్ అసత్యాలు చెబుతున్నారు అని ఆరోపించారు. మోడీ కలవడానికి ఎన్నో సార్లు ఆయన కార్యాలయం చుట్టూ తిరిగా.. ఎన్నో సార్లు మోడీని కలవాలని ప్రయత్నించినా కుదరలేదు అని.. ఒక్కసారి అవకాశం ఇస్తే ఆయనను కలిసి తన వద్ద ఉన్న సాక్ష్యాలు అప్పగిస్తానని అన్నాడు. ఒకవేళ తన వద్ద ఉన్న సమాచారం తప్పని తెలిస్తే ఉరితీయాలని మనీష్ వ్యాఖ్యానించాడు.

అగస్టా దర్యాప్తులో సీబీఐ వేగవంతం.. విచారణలో త్యాగి

  అగస్టా స్కామ్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతమయినట్టు తెలుస్తోంది. ఈ కుంభకోణంలో ఇప్పటికే భారీగా ముడుపులు అందాయన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్.పి త్యాగికి ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఇప్పుడు సీబీఐ త్యాగిని విచారిస్తుంది.   మరోవైపు ఈ కేసులో ఇప్పటికే సోనియా గాంధీపై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా దీనిపై రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ మాట్లాడుతూ.. ఈనెల 4వ తేదీన పూర్తి వివరాలతో కూడిన దస్త్రాలన్నింటినీ పార్లమెంట్ లో ప్రవేశపెడతానని, దాంతో ఎవరి తప్పెంతన్నది తేలుతుందని ఆయన అన్నారు.

తెలంగాణలో కూడా జగన్ కు దెబ్బ.. టీఆర్ఎస్ లోకి పొంగులేటి, మరో ఎమ్మెల్యే..!

  ఒకపక్క ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ టీడీపీలోకి చేరి వైసీపీ అధినేత జగన్ కు చెమటలు పట్టిస్తుంటే.. ఇప్పుడు తెలంగాణ నుండి కూడా జగన్ షాకులు ఎదురవుతున్నాయి. తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పార్టీని వీడి టీఆర్ఎస్లోలోకి జంప్ అవ్వనున్నట్టు తెలుస్తోంది. అయితే గత కొంత కాలంగా పొంగులేటి టీఆర్ఎస్లో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నప్పటికీ ఇప్పుడు ఆ సందేహాలకు తెర దించుతూ ఆయన టీఆర్ఎస్ ఎంట్రీ ఖాయమని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈనేపథ్యంలోనే ఆయన సోమవారం వైసీపీ పార్టీకి రాజీనామా చేయనున్నారు.   పొంగులేటితోపాటు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా టీఆర్ఎస్లో చేరుతన్నట్టు సమాచారం. ఇంకా వీరితోపాటు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీ, 102 మంది ఎంపీటీసీలు, నలుగురు జెడ్పీటీసీలు, ముగ్గురు ఎంపీపీలు, 15 మంది కౌన్సిలర్లు, 8 మంది సొసైటీ చైర్మన్లు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగి టీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.   ఇదిలా ఉండగా మరోవైపు తాను పార్టీ మారడం లేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్టు సమాచారం. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

ఆరు అంతస్తుల భవనం కుప్పకూలిపోయి 17 మంది మృతి

  కెన్యాలో భారీ తుఫాను సంభివించింది. ఈ తుఫాను వల్ల 17 మంది ప్రాణాలు కోల్పోయారు. వివరాల ప్రకారం కెన్యా రాజధాని నైరోబీలో తుఫాను సంభవించడం వల్ల కుండపోత వర్షాలకు ఆరు అంతస్తుల భవనం కుప్పకూలిపోయి 17 మంది మరణించడంతో పాటు 121 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. అలాగే వరదలు, భవనాలు కూలడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు వారు చెప్పారు. కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యాట్టా ఘటనా స్థలిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిథిలాల నుంచి పది మృతదేహాలు వెలికితీశామని, 80 మందికి చికిత్స అందించి డిశ్చార్జి చేసినట్లు వెల్లడించారు.

టీడీపీ రూ.20 కోట్ల భూమి ఆఫర్ చేసింది.. వైసీపీ ఎమ్మెల్యే

  వైసీపీ ఎమ్మెల్యేలు వరుసపెట్టి టీటీడీపీలోకి చేరుతున్న వేళ మరో వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ పై సంచలనమైన ఆరోపణలు చేశారు. విశాఖపట్టణం జిల్లాలోని మాడుగుల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ..  తనను టీడీపీ పార్టీలోకి చేర్చుకునేందుకు గాను సీఎం రమేష్ మధ్యవర్తిత్వం వహించారని.. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ నుంచి తనకు ఆఫర్ వచ్చిందని.. రూ.20 కోట్లు, రాజధానిలో భూమి ఇచ్చేందుకు తనకు ఎర చూపారని ఆరోపించారు. అంతేకాదు సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ లను కలిసే ఏర్పాటు చేస్తానని సీఎం రమేష్ తనతో అన్నారని, అయితే, ఈ ఆఫర్ ను తాను తిరస్కరించానని చెప్పారు.

కేజ్రీ ప్లాన్ ఫ్లాప్ అయిందా.. 23 శాతం కాలుష్యం పెరిగింది

  ఢిల్లీలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు గాను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సరి-బేసి విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈమధ్యే మలి దశను ప్రారంభించిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ పద్దతి సత్ఫలితాన్ని ఇవ్వలేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. బ్రీత్ ఎయిర్ క్వాలిటీ గణాంకాల ప్రకారం, ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ నాటికి కాలుష్యం 23 శాతం పెరిగిపోయిందట. తొలి రెండు వారాల్లో ఘనపు మీటర్ పరిధిలో 56.17 మైక్రోగ్రాముల కాలుష్య కారకాలుండగా, సరి-బేసి విధానం ముగిసేనాటికి అది 68.98 మిల్లీగ్రాములకు పెరిగిందట. దీంతో బస్ సర్వీసులను పెంచడం, పరిశ్రమలకు అడ్డుకట్ట, కాలుష్య కారకాలను వెదజల్లే వాహనాల అదుపు వంటి అదనపు చర్యలు తీసుకోకుంటే, దీర్ఘకాలంలో సరి-బేసి విధానం పని చేయదని వెల్లడైనట్లయింది. మరి దీనికి కేజ్రీవాల్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.