పవన్ కళ్యాణ్ తో కేశినేని చిన్ని భేటీ.. ఏం జరుగుతోంది?

చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సమయంలో తెలుగుదేశం పార్టీకి మరియు శ్రేణులకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మద్దతును ప్రత్యేకంగా అభినందించిన కేశినేని  చిన్ని.. పార్లమెంటు పరిధిలో చిన్ని చేస్తున్న సేవలు అన్నా క్యాంటీన్లు మెడికల్ క్యాంపులు ఇతర  సేవా కార్యక్రమాలను అభినందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు.. వన సమారాధనల పేరిట ఇతర కార్యక్రమాలతో  జనసేన  టిడిపి  కలసి ప్రయాణం చేస్తున్న వైనాన్ని వివరించిన చిన్ని.. ఉద్దానం కిడ్నీ బాధితులకు  బాసటగా నిలిచిన పవన్ కళ్యాణ్ గారు  స్ఫూర్తిగా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు  పార్లమెంటు పరిధిలోని ఏ కొండూరు మండలంలో కిడ్నీ బాధితులకు చేసిన సేవలను వివరించిన చిన్ని.. ఏ కొండూరు మండలంలోని తండాలను పర్యటించి  బాధితులకు ధైర్యాన్ని ఇవ్వాలని కోరిన చిన్ని..  

ప్లాన్ అదుర్స్

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే... జగన్ పార్టీకీ గట్టి షాక్ ఇచ్చారు. ఆ పార్టీ శాశ్వత సభ్యత్వానికే కాదు.. ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మెట్‌లో రాసిన ఆ రాజీనామా లేఖను ఆయనే స్వయంగా స్పీకర్ కార్యాలయానికి వెళ్లి మరీ సభాపతి కార్యదర్శికి అందజేశారు. అయితే ఫ్యాన్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి  వైయస్ జగన్‌కి నమ్మిన బంటులా వ్యవహరించే ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం పట్ల పోలిటికల్ సర్కిల్‌లో  పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.    ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా వెనుక బలమైన కారణాలున్నాయని ఆయన ప్రధాన అనుచరులు చెబుతున్నారు. మంగళగిరి నుంచి వరుసగా రెండు సార్లు జగన్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందినా.. ఈ రాముడిపై ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ మాత్రం.. శీతకన్ను వేశారని అంటున్నారు. అయితే   2019 ఎన్నికల్లో సైతం వరుసగా రెండోసారి ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచారని.. అదీ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, అప్పటి ఐటీ మంత్రి, అన్నిటికీ మించి తెలుగుదేశం అధినేత కుమారుడు అయిన లోకేష్ పై విజయం సాధించారు. జగన్ పార్టీ అధికారంలోకి వచ్చింది కూడా, కానీ జగన్ తనకు కేబినెట్ లో చోటివ్వలేదన్న అసంతృప్తి ఆళ్లలో ఏర్పడిందంటున్నారు. కాగా  ఇక 2019 ఎన్నిక ప్రచారంలో భాగంగా మంగళగిరి వచ్చిన  జగన్.. ఆళ్ల రామకృష్ణారెడ్డిని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించి.. అసెంబ్లీకి పంపిస్తే.. ఆయనను తన కేబినెట్‌లోకి తీసుకుంటానని నియోజకవర్గ ప్రజల సాక్షిగా షిక్కటి చిరునవ్వుతో  వాగ్దానం చేశారు. దీంతో  తమ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి అవుతారన్న ఉద్దేశంతో జనం ఆళ్లను వరుసగా రెండో సారి గెలిపించారు.  ఆ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  జగన్ ముఖ్యమంత్రి  అయ్యారు. అయితే ఆళ్లకు మాత్రం మంత్రిపదవి దక్కలేదు.  అప్పటికి సరిపెట్టుకున్న ఆళ్ల  2022  ఏప్రిల్‌లో జరిగిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో కూడా జగన్ పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురైన ఆళ్ల అప్పటి నుంచీ పార్టీ వ్యవహారాల్లో అంటీముట్టనట్టు వ్యవహరిస్తూ వస్తున్నారు.   జగన్.. కాంగ్రెస్ ను వీడి  వైసీపీని ఏర్పాటు చేసిన నాటి నుంచి  ఆయన అడుగులో అడుగు వేసినా.. తనకు మంత్రిగిరి ఇవ్వకుండా.. 2019 ఎన్నికలకు ముందు జస్ట్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చి చిలకలూరిపేట నుంచి గెలిచి తొలి సారి ఎమ్మెల్యే అయిన విడదల రజనీకి  మంత్రి పదవి కేటాయించడంతో ఆర్కే తీవ్ర నిరాశకు, అసంతృప్తికి గురయ్యారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.    మరోవైపు గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన నారా లోకేశ్ ఓటమి పాలైనా.. నిన్న మొన్నటి వరకు ఆయన మంగళగిరి నియోజకవర్గంలో ప్రజల మధ్యే ఉండడం.. వారి సమస్యలు తెలుసుకోని.. వాటి పరిష్కారం దిశగా ఆయన అడుగులు వేయడం.. అంతేకాకుండా.. ఆ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు, ఆరోగ్య సంజీవని పేరిట మొబైలు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం.. అలాగే వచ్చే ఎన్నికల్లో కలిసి వెళ్తామంటూ ఇప్పటికే జనసేన, టీడీపీలు ప్రకటించడం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల్లో సైతం ప్రభుత్వ వ్యతిరేకత కొట్టోచ్చినట్లు కనిపించడం.. అలాంటి వేళ.. రానున్న ఎన్నికల్లో ఇదే పరిస్థితి మనకు కానీ ఎదురైతే మన పరిస్థితి ఏమిటనే ఓ చర్చకు తాడేపల్లిలోని జగన్ అండ్ కో తెర తీసి.. ఆ క్రమంలో వ్యూహాత్మక పథక రచనకు శ్రీకారం చుట్టినట్లు సదరు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేతో తాడేపల్లిలోని పెద్దలు స్వయంగా పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేయించారని.. దాంతో రానున్న ఎన్నికల్లో మంగళగిరి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆర్కే బరిలోకి దిగడం.. తద్వారా ఓట్లు చీల్చడంతో.. నారా లోకేశ్‌ను ఓడించాలనే ఓ ఎత్తుగడను ఖాయం చేసినట్లు ఓ చర్చ అయితే హాట్ హాట్‌గా హీట్ హీట్‌గా సాగుతోన్నట్లు సమాచారం. ఇప్పటికే నారా లోకేశ్ మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలవలేక పోయారంటూ జగన్ పార్టీ  ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లింది.. వెళ్తోంది. అంతేకాదు.. మంగళగిరిలో నారా లోకేశ్ ఓటమి కోసం.. సీఎం జగన్ అండ్ కో శక్తియుక్తులన్నీ దారపోస్తున్నారని... ఆ క్రమంలో ఇప్పటికే మంగళగిరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎం హనుమంతరావును వైసీపీలోకి ఆహ్వానించారు. ఆ వెంటనే ఆయనకు ఎమ్మెల్సీ సీటు కేటాయించారు. అలాగే మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవిని తెలుగేదేశం నుంచి వైసీపీలోకి తెచ్చుకుని  రానున్న ఎన్నికల్లో మంగళగిరి నుంచి   పార్టీ అభ్యర్థిగా బరిలో దింపేందుకు జగన్ అండ్ కో ఇప్పటికే నిర్ణయించిందని.. ఆ క్రమంలో ఆ నియోజకవర్గం ఇన్‌చార్జీగా ఆయనకు బాధ్యతలు కట్టబెట్టిందని.. ఆ క్రమంలోనే ఆళ్ల రామకృష్ణారెడ్డితో పదవులన్నీంటికి రాజీనామా చేయించి.. కొత్త నాటకానికి తెర తీశారనీ,  ఇలా మంగళగిరిలో నారా లోకశ్ ఓటమి కోసం.. జగన్ అండ్ కో అంది వచ్చిన ప్రతీ అవకాశాన్ని నూటికి నూరు శాతం వినియోగించుకొంటూ ముందుకు వెళ్తున్నారన్న   ప్రచారం  నియోజకవర్గంలో  జోరుగా సాగుతోంది.  

వైసీపీ నుంచి వలసలు.. టీడీపీలోకి బారులు బారులు?!

ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ నుంచి వలసలు మొదలయ్యాయి. జగన్ పార్టీ నాయకుల్లో గుబులు మొదలైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకతను పసిగట్టిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు సహా సీనియర్ నాయకులు మెల్లమెల్లగా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. నిజానికి ఇప్పటికే అనేక మంది వైసీపీ సీనియర్ నేతలు టీడీపీ టచ్ లోకి వచ్చారని విశ్వసనీయంగా తెలిసింది. ఎన్నికలు ఎప్పుడనేది ఇతమిథ్దంగా తేలితే, ఫిరాయింపులు జోరందుకోవడం ఖాయంగా  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇక అన్ని రోడ్లూ రోమ్ వైపే అన్నట్లుగా వైసీపీ నుంచి బయటకు వచ్చే వారందరి చూపూ తెలుగుదేశం వైపే అన్నట్లుగా ఉంది. అయితే కొత్త వారి చేరికల విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆచితూచి నిర్ణయం తీసుకుంటారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.  ముఖ్యంగా,కష్ట కాలంలో పార్టీని నమ్ముకుని ఉన్న నాయకుల ప్రయోజనాలకు చంద్రబాబు నాయుడు ప్రథమ ప్రాధాన్యత ఇస్తారంటున్నారు. . అందుకే   పార్టీని నమ్ముకున్న స్థానిక నాయకుల అనుమతి లేకుండా కొత్త వారిని చేర్చుకోరాదని, రాష్ట్ర,  జిల్లా  స్థాయి నాయకులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే,  అనేక జిల్లాల్లో వైసీపీకి కొందరు కీలక నేతలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నా, చంద్రబాబు నాయుడు తొందరపడడం లేదని అంటున్నారు.  ఇక ఇప్పుడు తెలుగుదేశంలో అవకాశం ఉంటుందా? ఉండదా అన్న మీమాంసకు కూడా స్వస్తి చెప్పి వైసీపీ నుంచి నేతలు బయటకు వచ్చేయడానికి ఇసుమంతైనా సందేహించడం లేదు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్లరామకృష్ణారెడ్డి, గాజువాక వైసీపీ ఇన్ చార్జ్ లు వైసీపీకి కటీఫ్ చెప్పేడయాన్ని పరిశీలకులు ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. ఇంకా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు వంటి వారు తెలుగుదేశం ఎప్పుడు తలుపుతెరుస్తుందా అ    ని వేచి చూస్తున్నట్లు చెబుతున్నారు.   అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాలలో వైసీపీ అసంతృప్తులు తెలుగుదేశం తలుపు తట్టేందుకు రెడీగా ఉన్నారని చెబుతున్నారు.   అన్నిటికీ మించి ముఖ్యమంత్రి జగన్  సొంత గడ్డ ఉమ్మడి కడప జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున వైసీపీ నుంచి వలసలు ఉంటాయని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కడప జిల్లాకు చెందిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం గూటికి చేరేందుకు పులివెందుల   ఇన్  చార్జ్ బీటెక్ రవి ద్వారా  వారు చంద్రబాబుకు టచ్ లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ కారణంగానే బీటెక్ రవిపై జగన్ పోలీసులను ప్రయోగించారని కూడా జిల్లాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.   అయితే వైసీపీ ఈ పరిస్థితికి దిగజారడానికి కారణం పాలనా వైఫల్యాలతో పాటు జగన్ వ్యవహారశైలి కూడా కారణమని అంటున్నారు. జగన్ తీరు కారణంగానే బంధువులు, సన్నిహితులు కూడా ఆయనకు, పార్టీకి దూరమౌతున్నారని, గతంలో  ఆయన కష్టాల్లో ఉన్న సమయంలో అండగా నిలబడిన వారంతా ఇప్పుడు తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు.   అన్నిటికీ మించి జగన్ పట్ల వ్యక్తమౌతున్న ప్రజా వ్యతిరేకత తమనూ ముంచేస్తుందన్న భయంతో ముందుగానే చేతులెత్తేస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు.  ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి ముందే పరిస్థితి ఇలా ఉందంటే..  ముందుముందు ఇంకెలా ఉంటుందో ఊహకు అందనిదేమీ కాదని చెబుతున్నారు.  

దోచేశావు నాన్నా.. దోచేశావు!

నాన్న నాన్నే.. ఇంట్లో ఏ ఆడపిల్లకైనా.. నాన్నే హీరో.. గారాబం చేసినా.. బుజ్జిది, బుజ్జోడా అంటూ ముద్దులు కురిపించినా? ఎప్పడన్నా బడిత పూజ చేసినా ఆ ఆడపిల్లకు నాన్నే ఎవర్ గ్రీన్ రియల్ హీరో..  ఇంట్లో ఒక్కరే అయితే అదీ కూడా ఆడపిల్లే అయితే..  ఆ ఇంట్లో ఆ పాప కోసమే.. ఓ నాలుగు కంటిపాపలు నిత్యం అనుక్షణం పంచప్రాణాలుగా తపిస్తుండడమే కాదు.. పరితపించి పోతుంటాయి కూడా. సరిగ్గా అలాంటి పరిస్థితే నాది కూడానూ.   మీ అనోన్య దాంపత్యానికి చిహ్నంగా.. మీ ప్రేమకు ప్రతిరూపంగా ఉన్న నాపై మీరు చూపించిన ప్రేమానురాగాలు అద్బుతం, అనిర్వచనీయం. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా నాన్నా.. నీలో ప్రశ్నించే తత్వం, మెండి పట్టుదల, దేనినైనా లక్ష్యంగా పెట్టుకొంటే.. దాని అంతు చూసే వరకు నిద్ర పోని తత్వం, అన్యాయాన్ని సహించలేని క్రమంలో కట్టలు తెంచుకొచ్చే ఆవేశం, అలాగే మీలో జెట్ స్పీడ్‌లో దూసుకు పోయే... చొచ్చుకు పోయే స్వభావం, అలాగే పేదలకు న్యాయం చేయడం కోసం మీరు పడిన... పడుతున్న శ్రమ ఎప్పటికి వృధా కాదని.. డిసెంబర్ 7వ తేదీన నాకు పూర్తిగా అర్థమైంది నాన్నా. నా వయస్సు పెరుగుతోన్న కొద్ది.. మీరు రాజకీయంగా ఎదుగుతోన్న కొద్ది.. మీరు మాతో గడుపుతోన్న సమయం ఇకపై  దాదాపుగా తక్కువైపోతుందేమోననే ఓ విధమైన బెంగాతో మనస్సు కలత చెందుతున్నప్పుడు సైతం.. ప్రజల కోసం మీ తపన చూశాను. యూ ఆర్ రీయల్లీ గ్రేట్ నాన్నా. ఇక 2015, జూన్ 11న నా నిశ్చితార్థం సమయానికి కొద్ది రోజుల ముందు చోటు చేసుకొన్న పరిణామాలతో ఇంట్లో అందరం కుప్పుకూలిపోయాం నాన్నా.. ఇంట్లో ఒక్కగాని ఒక్క గారాల పట్టి అయిన నా నిశ్చితార్థానికి మీరు వస్తున్నారో? లేదోనంటూ.. మీ కోసం ఆ సమయంలో మేము పడిన ఆవేదన, మానసిక ఆందోళన వర్ణించలేనిది నాన్నా.. పైనున్న ఆ భగవంతుడు.. మంచి వాళ్లకు మంచే చేస్తాడని నమ్మకం ఉంది నాన్నా.. ఆయన కరుణా కటాక్షాలతో.. మీరు నా నిశ్చితార్థానికి హాజరైనప్పుడు.. ఆ సమయంలో... నేను పొందిన ఆ ఆనందాన్ని.. ఎలా వర్ణించాలి.. ఏమని వర్ణించాలో కూడా మాటలు రాలేదు నాన్నా... కానీ ఆ క్షణంలో మిమ్మల్ని చూసినప్పుడు మాత్రం.. వచ్చావా నాన్నా.. నా కోసం వచ్చావా నాన్నా.. నీ గారాల పట్టి... మరో ఇంటిలో అడుగు పెట్టడం కోసం.. జరుగుతోన్న నిశ్చితార్థ కార్యక్రమానికి విచ్చేసి... బెంగపడకమ్మా..  నీకు నేనున్నానమ్మ.. నిశ్చితంగా ఉండమ్మ అంటూ నాకు ఓ విధమైన భరోసా కల్పించేందుకు వచ్చావని.. నా హృదయం ఆనందంతో ఆనందలాస్యం చేస్తూ ఉక్కిరి బిక్కిరి అయిపోయింది నాన్నా... ఆ క్రమంలో నా కళ్లలో కన్నీరు సుడులు తిరిగినా. అంతలోనే ఇక్కడ వేడుక జరుగుతోందని.. ఇది సమయం కాదని మనస్సు మూగగా పదే పదే చెప్పడంతో.. వస్తున్న కన్నీటిని అదిమిపెట్టుకొన్నా నాన్నా.. ఇక ఆ తర్వాత నుంచి మీ జీవితంలో మార్పు  మొదలైందన్న విషయాన్ని నేను కాదు.. నా మనస్సు పసిగట్టింది నాన్నా.... ఆ క్రమంలో మీరు వేసి ప్రతి అడుగు.. మీ, మా భవిష్యత్తును క్రాంతి పథం వైపు నడిపిస్తుందనే ఓ చిగురుటాశ మొలకెత్తింది.. ఆ క్రమంలో ప్రజల కోసం పాటు పడే నాయకుడిగా ఎదుగుతున్న మీకు.. కాలమే అన్ని సమకూర్చింది నాన్నా..  అందుకే శతాబ్దాల చరిత్ర ఉన్న పార్టీలో హేమామేహీలున్నా... మీరు ఆ పార్టీలో చేరిన స్వల్ప కాలంలోనే  ఢిల్లీ నుంచి గల్లీ దాకా పార్టీ శ్రేణులనే కాదు.. పార్టీ అధిష్టానం మనస్సుతోపాటు ప్రజల మనస్సును సైతం దోచుకున్నారు నాన్నా.. ఎంతో ఘన చరిత్ర ఉన్న పార్టీలో ఇలా చేరి.. అలా హాట్ సీట్.. సీఎం కూర్చిని అధిష్టించారంటే.. అదీ కూడా ఈ వయస్సులో.. మీరు.. మీ సంకల్పం.. మీ దైర్యం, మీ పట్టుదల, మీ పోరాట పటిమ, మీ వాక్చాతుర్యంతోపాటు అమ్మ అదృష్టం, నా పూర్వ జన్మ సుకృతం... ఇవన్నీ కలిస్తేనే.. కలబొస్తేనే నువ్వు అని చెబుతోంది నాన్నా మీ గారాల పట్టి  నైమిషా మనస్సు.    

ఏపీ కాంగ్రెస్ లోకి షర్మిల? ఏం జరుగుతుందంటే..?

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి ఇక నూకలు చెల్లినట్లేనా?  ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు, శ్రేణులు గంపగుత్తగా వెళ్లి పోవడానికి  ఒక పార్టీ రెడీ అవుతోందా? అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అదే జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.ఇంతకీ వైసీపీని అంతగా బెంబేలెత్తిస్తున్న ఆ పార్టీ ఏమిటయ్యా అంటే.. అదేమీ కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ కాదు. దశాబ్దాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యంగా అధికారం చెలాయించిన పార్టీయే రాష్ట్ర విభజన తరువాత ఇరు తెలుగు రాష్ట్రాలలోనూ నామమాత్రంగా మిగిలిన పార్టీ. ఔను కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర విభజన అనంతరం అటు తెలంగాణలోనూ, ఇటు ఏపీలోనూ కూడా ఆ పార్టీ అధికారానికి దూరమైంది. అంతే కాదు, ఇరు రాష్ట్రాలలోనూ ఆ పార్టీ ఉనికి మాత్రంగా మిగిలిపోయింది. అటువంటి పార్టీ రాష్ట్ర విభజన తరువాత దాదాపుగా దశాబ్దం తరువాత తెలంగాణలో పుంజుకుంది. తెలంగాణ ఇచ్చిన రాష్ట్రంలో ఆ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. ఇక ఇప్పుడు ఏపీ వంతు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఒకింత అభిమానం ఉంది. అయితే విభజనకు ముందు ఆ పార్టీ చేసిన తాత్సారం, అవలంబించి వైఖరి కారణంగా తెలంగాణ ఇచ్చి కూడా దశాబ్దకాలం రాష్ట్రంలో ప్రతిపక్షంగానే మిగిలిపోయింది. అయితే తాజాగా తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది.  ఇక ఇప్పుడు ఏపీలో ఎన్నికలకు వేళయ్యింది. అయితే తెలంగాణలోలా ఏపీలో కాంగ్రెస్ పట్ల ప్రజా బాహుల్యంలో సానుకూలత ఇసుమంతైనా లేదు. తెలంగాణలో తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పాట్ల సానుకూలత ఉంటే, ఏపీలో మాత్రం తమ అభీష్ఠానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని రెండుగా ముక్కులు చేసిందన్న ఆగ్రహం జన బాహుల్యంలో బలంగా వ్యక్తం అవుతోంది. ఆ కారణంగానే రాష్ట్ర విభజన తరువాత జరిగిన రెండు ఎన్నికలలో కాంగ్రెస్ ఏపీలో జనం ఆ పార్టీని అసెంబ్లీలో అడుగుకూడా పెట్టనివ్వకుండా శిక్షించారు. పదేళ్ల తరువాత కూడా ఏపీ ప్రజలలో ఆ పార్టీ పట్ల ఆగ్రహం చల్లారలేదు. అటువంటి పరిస్థితుల్లో ఏపీలో ఆ పార్టీ పుంజుకోవడానికి షర్మిల రూపంలో ఒక  ఆశ కనిపించింది.  ఏపీ జనం దివంగత సీఎం వైఎస్ రాజకీయ వారసుడిగా  ఆయన కుమారుడు జగన్ కు 2019 ఎన్నికలలో ఒక చాన్స్ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు కట్టబెట్టారు. అయితే సీఎంగా ఆయన తీరు, ఆయన పాలనపై నాలుగున్నరేళ్లలోనే విసిగిపోయారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? ప్రభుత్వాన్ని గద్దె దించుదామా అని జనం ఎదురు చూస్తున్న పరిస్థితి ఇప్పుడు ఏపీలో నెలకొని ఉంది. అలాంటి సమయంలో ఏపీ కాంగ్రెస్ లోకి వైఎస్ తనయ షర్మిల అడుగుపెట్టనున్నది. ఆమె ఏపీ కాంగ్రెస్ లోకి వస్తే..  ఏపీ కాంగ్రెస్ లో ఒక్క సారిగా నూతనోత్సాహం వస్తుందని కాదు కానీ.. అధికార వైసీపీ మాత్రం పూర్తిగా బలహీనపడుతుంది. ఏదో ఒక మేరకు కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏపీలో వైఎస్ వారసుడిగా భావించి జగన్ పంచన చేరిన పూర్వ కాంగ్రెస్ వాదులంతా మళ్లీ కాంగ్రెస్ లోకి వలస వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జగన్ పార్టీలో ఇమడ లేక, మరో మార్గం కానరాక పార్టీలోనే అనామకులుగా మిగిలిపోయిన మాజీ కాంగ్రెస్ నాయకులు ఒక్కరొక్కరుగా లేదా గంపగుత్తగా కాంగ్రెస్ లోకి వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి వస్తున్నారన్న వార్త ఇలా బయటకు వచ్చిందో లేదో అలా వైసీపీలో ఆందోళన తారస్థాయికి చేరుకుంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాను కూడా షర్మిల ఏపీ ఎంట్రీ ఖాతాలో వేసేస్తున్నారు. వైఎస్ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓ వెలుగు వెలిగి ఇప్పుడు అనామకంగా జగన్ పార్టీలో కొనసాగుతున్న వారంతా కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది.  అన్నిటికీ మించి ఇప్పటికే అధికార పార్టీలో 30 మందికి పైగా సిట్టింగులకు వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్లు అనుమానమేనన్న ప్రచారం జరుగుతోంది. అటువంటి వారిలో అత్యధికులు కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది.  అంతే కాకుండా ఇప్పటికే తల్లినీ, చెల్లినీ దూరం పెట్టిన జగన్ ఇప్పుడు సోదరి తనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేపట్టడం ఆయనకు తీవ్ర నష్టం చేయడం ఖాయం. షర్మిల ఏపీ ఎంట్రీతో వైసీపీ తీవ్రంగా నష్టపోతుందని పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు. ఆ మేరకు కాంగ్రెస్ బలపడుతుందని చెబుతున్నారు. విజయం సాధించే పరిస్థితి ఉండకపోయినా విపక్షంగా ఎదిగే అవకాశం షర్మిల రాకతో కాంగ్రెస్ కు  దక్కినట్లేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 

 ఆర్టీసి బస్సులో రేణుకా చౌదరి  ఉచిత ప్రయాణం 

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి  ఆర్టీసి బస్సులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు రోజుల క్రితం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని మహిళలకు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో రేణుకా చౌదరి బస్సులో ప్రయాణించారు. సోమవారం గాంధీ భవన్ నుంచి మహిళలతో కలిసి బస్సులో ప్రయాణం చేశారు. ఉచిత బస్సు పథకాన్ని ఆమె మహిళలకు వివరించారు.  ఉచిత బస్సు వల్ల మహిళలకు, విద్యార్థులకు ఎంతో ఉపయోగమన్నారు. ప్రభుత్వం వచ్చి రెండు రోజులు కాకముందే విమర్శలు మొదలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ నెరవేరుస్తుందన్నారు. ఉచితాలు ప్రజల సంక్షేమం కోసమని, దాని వల్ల సోమరిపోతులు అవ్వడం ఉండదన్నారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించే మహాలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అసెంబ్లీ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖతో పాటు ఇతర మంత్రులు, సీఎస్ శాంతి కుమారి, బాక్సర్ నిఖత్ జరీన్ ఉచిత బస్సు సేవలను ప్రారంభించారు. మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణలోని మహిళలందరూ ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులో మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది. సిటీలో అయితే ఆర్డినరీ, మెట్రో బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. తెలంగాణ మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. వీరు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఏదైనా గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది.ఉచితంగా ప్రయాణించేందుకు బస్సులలో మహిళలకు సున్నా ధరతో టికెట్ ఇస్తారు. వీటికి అయ్యే ఖర్చును ఆర్టీసీకి ప్రభుత్వం రీఎంబర్స్ మెంట్ చేస్తుంది. ఈ స్కీమ్ అమలుకు రోజుకు రూ. 7 కోట్ల వరకు ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది. రద్దీ ఎక్కువగా అయితే బస్సుల సంఖ్యను కూడా పెంచుతామని ఆర్టీసీ  ఇప్పటికే స్పష్టం చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో మొత్తం ఆరు పథకాలను కాంగ్రెస్ పొందుపరిచింది. వాటిలో ఒకటి మహాలక్ష్మి ఉచిత బస్సు సర్వీసు పథకం. అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని అమలు చేయడం గమనార్హం. 

చిన్నారులే టార్గెట్ గా మరో మహమ్మారి!?

కరోనా మహమ్మారి నుంచి తేరుకునేలోగా మరోసారి చైనా నుంచి మరో అంతు చిక్కని వ్యాధి  ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న సంగతి విదితమే. చిన్నారులే ఎక్కువగా గురౌతున్న ఈ  వ్యాధి పట్ల ఎంత అప్రమత్తంగా ఉన్నా అది భారత్ లోకి ప్రవేశించేసింది.   దేశ రాజధానిలో ఈ కొత్త బ్యాక్టీరిలో ఏడుగురు పిల్లల్లో గుర్తించారు.   ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడిన చిన్నారులతో చైనా ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. ఈ వ్యాధి తీవ్రత, వ్యాప్తి తో అప్రమత్తమైన ప్రపంచ దేశాలు నివారణ చర్యతు చేపట్టాయి. ఈ వ్యాధి బారిన పడిన చిన్నారుల్లో న్యుమోనియో వంటి లక్షణాలు కనిపిస్తాయి. అధిక జ్వరం, ఊపిరితిత్తుల్లో వాపు ఈ వ్యాధి ప్రధాన లక్షణాలుగా వైద్యులు గుర్తించారు.   ఈ వ్యాధి సోకడానికి కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అయితే ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుందనీ, ముఖ్యంగా చిన్నారులకు ఈ వ్యాధి ఎక్కువగా సోకే అవకాశం ఉందనీ వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిని మైకో ప్లాస్మా న్యుమోనియాగా గుర్తించారు. బ్యాక్టీరియా కారణంగా వస్తుందని నిర్ధారించారు. ఇప్పుడీ వ్యాధి దేశ రాజధాని ఢిల్లీలో వ్యాపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. 

మాజీ నక్సల్ దంపతుల ఆత్మహత్య యత్నం

ఆజ్ణాతంలో పని చేసి జనజీవన స్రవంతిలో కలిసిపోయి సాధారణ జీవనం  సాగిస్తున్న మాజీ నక్సల్ జంట ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన రాజన్న రాజన్న సిరిసిల్ల సంచలనం సృష్టించింది. గతంలో జిల్లాలో జనశక్తి తీవ్రవాద సంస్థలో పని చేసిన  దంపతులు మల్యాల నందం, ఆయన భార్య  పద్మ సిరిసిల్ల జిల్లా  కొండాపూర్ లో  ఆత్యహత్యాయత్నానికి పాల్పడ్డారు.   లొంగిపోయిన తరువాత నందంకు అప్పటి ప్రభుత్వం కొండాపూర్ శివారులోని సర్వే నెంబర్ 116ఏలో ఎకరం 20 గుంటల భూమిని కేటాయించింది. గత పదేళ్లుగా ఇదే భూమిలో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నందం నుండి భూమిని లాక్కునేందుకు రెవెన్యూ యంత్రాంగం ప్రయత్నిస్తోందని గత కొంత కాలంగా నందం ఆరోపిస్తున్నారు. భూమి కావాలంటే రూ. 50 వేల రూపాయలు ఇవ్వాలనీ లేకుంటే భూమిని స్వాధీనం చేసుకుంటామనీ సర్వేయర్ కుమార్  వేధింపులకు గురిచేస్తున్నట్లు వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే భూమి కోల్పోతామన్న భయంతో నందం దంపతులు  సోమవారం నందం వారి భూమి వద్ద  వివిధ శాఖల అధికారులు ఫెన్సింగ్ వేస్తున్న క్రమంలో  పద్మలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితులను సిరిసిల్ల జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అమరావతి శిల్పకళ అద్భుతం... కొనియాడిన ప్రవాస బౌద్ధ పరిశోధకులు!

అమరావతి మ్యూజియంలో ప్రదర్శనలోనున్న  2000 ఏళ్ల నాటి శాతవాహన కాలపు బౌద్ధ శిల్పాలు అద్భుతమని, అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయ బౌద్ధ పరిశోధకులు భాస్కర్, తలాటం శ్రీ నగేష్ చెప్పారు. దక్షిణ భారత బౌద్ధ స్థావరాల సందర్శనలో భాగంగా వారు సోమవారం నాడు అమరావతి స్థూపాన్ని, మ్యూజియాన్ని చూశారు. ప్రముఖ బౌద్ధ నిపుణుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సిఈఓ, డా.ఈమని శివనాగిరెడ్డి వారికి అమరావతి చరిత్ర, ధరణికోట చరిత్ర, బౌద్ధ స్తూపం, మ్యూజియంలోని బుద్ధుని శిల్పాలు, శిలాఫలకాలు, శాసనాలు, ధాతుపేటికల వివరాలను తెలియజెప్పారు. మహాస్తూపం వద్ద గల అతిపెద్ద స్తంభం మీద శాతవాహనుల కాలపు బుద్ధుని అసంపూర్ణ రేఖా చిత్రం ఉందని, ఇది 2000 సంవత్సరాల నాటి శిల్పుల పనితనానికి అద్దం పడుతుందని వారికి వివరించారు. దక్షిణాపధ రాజధానిగా విలసిల్లిన ధాన్యకటకంలోని మట్టి కోట గోడను కాపాడుకోవాలని ఆయన అన్నారు.  మ్యూజియం ఇంచార్జ్ చిన్నబాబు ప్రవాస బౌద్ధ పరిశోధకులకు స్వాగతం పలికి మ్యూజియంలో ప్రదర్శనలో ఉన్న పురావస్తువుల గురించి వివరించారు. మ్యూజియాన్ని శుభ్రంగా, చక్కగా నిరవహిస్తున్నారని చిన్నబాబును భాస్కర్, శ్రీ నగేష్, ఈమని శివనాగిరెడ్డి అభినందించారు. అనంతరం వారు అమరావతికి చెందిన ప్రముఖ బౌద్ధ రచయిత వావిలాల సుబ్బారావును కలుసుకొని ఆచార్య నాగార్జునని రచనలపై చర్చించారు.

టాలీవుడ్ తీరుపై నూతన మంత్రి అసహనం

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు సినీ పరిశ్రమకు చెందినవారు స్వయంగా వెళ్లి ప్రభుత్వ పెద్దలను కలవడమో లేక ఫోన్ ద్వారా విష్ చేయడమో చేస్తుంటారు. ముఖ్యంగా నూతన సినిమాటోగ్రఫీ మంత్రికి సినీ పరిశ్రమ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతాయి. అయితే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి నిర్మాత దిల్ రాజు తప్ప ఎవరూ విషెస్‌ చెప్పలేదట. ఈ విషయాన్ని స్వయంగా కోమటిరెడ్డే రివీల్ చేశారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా.. రోడ్లు, భవనాలు తో పాటు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కోమటిరెడ్డి  బాధ్యతలు స్వీకరించారు. అయితే కోమటిరెడ్డికి టాలీవుడ్ నుంచి దిల్ రాజు తప్ప ఎవరూ విషెస్ చెప్పకపోవడంతో.. ఆయన అసహనం వ్యక్తం చేశారు.  సినీ పరిశ్రమ నుంచి నిర్మాత దిల్‌ రాజు తప్ప ఎవరూ నాకు ఫోన్‌ చేయలేదు. సినీ పరిశ్రమలో ఏం జరుగుతుందో నాకు తెలియాలి. వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని మా సెక్రటరీని ఆదేశించానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే త్వరలోనే సినీ పరిశ్రమ నుంచి ఓ బృందం వెళ్ళి స్వయంగా మంత్రిని కలవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 

మంగళగిరి వైసీపీ ఖాళీ?.. అదే దారిలో గాజువాక?

వైసీపీ నుంచి వలసలు గట్టు తెగిన వరద గోదారిలా సాగుతున్నాయి. ఇంత కాలం అసమ్మతిని, అసంతృప్తిని పంటిబిగువున దాచుకుని పిల్లిమెడలో గంట కట్టేదెవరన్నట్లుగా ఉన్న వైసీపీ నేతలకు ఆ గంట కాస్తా కట్టేసి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దారి చూపారు. వైసీపీ అధినేత, సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికీ, శాసన సభ్యత్వానికీ కూడా రాజీనామా చేసేశారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామాను అసెంబ్లీ కార్యదర్శికి స్పీకర్ ఫార్మాట్ లో అందించారు. అయితే జగన్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఆళ్ల రాజీనామా వేనుక విపక్ష తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాన్న కుట్ర ఉందన్న అభిప్రాయం కూడా రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతున్నది. ఆళ్ల దారిలో మరి కొందరు కూడా నడుస్తారనీ, వారి వారి నియోజకవర్గాలలో బీసీలను నిలబెడతామన్న ప్రచారం ద్వారా వైసీపీ తెలుగుదేశం బీసీ బేస్ ను బద్దలు కొట్టాలన్న కుట్రలో భాగమే ఆళ్ల రాజీనామా అన్న ప్రచారం ఒక పక్క జరుగుతోంది. అది పక్కన పెడితే ఆళ్ల రాజీనామాతో మంగళగిరిలో వైసీపీ ఖాళీ అయిపోతుందా అన్న రీతిలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇలా ఆళ్ల రాజీనామా చేయగానే అలా నియోజకవర్గ పరిధిలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు రాజీనామాల బాట పట్టారు. ఇప్పటి వరకూ   వైసీపీ పార్టీ పదవులకు తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు బుర్ర ముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి, తాడేపల్లి రూరల్ మండల అధ్యక్షుడు,  జేసీఎస్ కన్వీనర్ మున్నంగి వివేకానంద రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి, తాడేపల్లి పట్టణ జేసీఎస్ కన్వీనర్ ఈదులముడి డేవిడ్ రాజ్, జిల్లా  సోషల్ మీడియా కన్వీనర్ మేకా వెంకటరామిరెడ్డి,  మంగళగిరి రూరల్ మండలం   కన్వీనర్ అన్నపురెడ్డి బ్రహ్మర్గన రెడ్డి తమ తమ పదవులకు రాజీనామాలు చేసేశారు. అయితే ఇది ఇక్కడితో ఆగేలా లేదని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జిగా గంజి చిరంజీవి నియామకం ఖరారైన నేపథ్యంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారని అంటున్నారు. అసలు గంజి చిరంజీవి  వైసీపీలో చేరిన నాటి నుంచే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి మంగళగిరిలో ప్రత్యేకంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడంతో ఇక అనివార్యంగా ఆయన పార్టీకి రాజీనామా చేశారని అంటున్నారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి గత ఎన్నికలలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై విజయం సాధించిన తరువాత జగన్ కేబినెట్ లో స్థానం దక్కుతుందని అంతా భావించారు. అప్పుడే కాదు, ఆ తరువాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణలోనూ ఆళ్లకు జగన్ అవకాశం ఇవ్వలేదు. దీంతో ఒకింత అసంతృప్తికి లోనైనా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇక ఇప్పుడు వచ్చే ఎన్నికలలో తనకు టికెట్ దక్కే అవకాశం లేదని తేలడంతో పార్టీ నుంచి వైదొలిగారు. అయితే వైసీపీలో ఈ రాజీనామాల పర్వం ఒక్క  మంగళగిరి నియోజకవర్గంతో ఆగదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణలకు తగ్గట్టుగానే గాజువాక నియోజకవర్గం నుంచి కూడా రాజీనామాల పర్వం ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు తిప్పల దేవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే తిప్పన కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డిలాగే జయంట్ కిల్లర్. గత ఎన్నికలలో ఆయన గాజువాక నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విజయం సాధించారు. జయంట్ కిల్లర్ గా తనకు జగన్ కేబినెట్ లో స్థానం కల్పిస్తారని ఆశించారు. అయితే జగన్ అసలు తిప్పన పేరునే పరిశీలించలేదు. ఇక పోతే ఏడు పదులు పైబడిన వయస్సున్న తిప్పన వచ్చే ఎన్నికలలో తనకు బదులుగా తన కుమారుడు తిప్పన దేవన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు. ఇంతలో ఏమైందో కానీ ఎమ్మెల్యే కుమారుడు దేవన్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేసేశారు. మొత్తంగా ఇంత కాలం వైసీపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్నఅసంతృప్తి ఇప్పుడు నిప్పుల గుండంగా బయటపడుతోందని, ఈ రాజీనామాల పర్వం రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలకు విస్తరించే అవకాశం ఉందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఏపీ కాంగ్రెస్ లోకి షర్మిల? జగన్ కు ఇక కష్టకాలమే!

తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకుని చక్రం తిప్పాలనుకున్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల.. సరిగ్గా ఎన్నికలకు ముందు పార్టీ తెలంగాణలో పోటీకి దూరం అని ప్రకటించి కాంగ్రెస్ నెత్తిన పాలు పోశారు. కాంగ్రెస్ కు మద్దతుగానే తమ పార్టీ పోటీ నుంచి వైదొలగుతుందని షర్మల చేసిన ప్రకటనతో వైఎస్సార్టీపీకి తెలంగాణలో నూకలు చెల్లినట్లైంది. ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు పార్టీ అంతా రాజీనామా చేసింది. షర్మిల వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయకపోయినా.. పోటీ నుంచి కాంగ్రెస్ కు మద్దతుగా వైదొలగుతున్నట్లు చేసిన ప్రకటనతో అదే జరిగినట్లైంది. ఇక ఇప్పుడు షర్మిలకు తెలంగాణలో చేయడానికి ఏ పనీ లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత కూడా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ కంటే సమర్థులు, అనుభవజ్ణులూ ఉన్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు.. ఆమెను తెలంగాణ రాజకీయాల నుంచి దాదాపు దూరం చేసేసినట్లేనని పరిశీలకులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆమె కాంగ్రెస్ గూటికి చేరి.. తెలంగాణను వదిలి ఏపీలో రాజకీయాలు చేసుకోవలసిందేనని కూడా విశ్లేషిస్తున్నారు. కాగా వైఎస్సార్టీపీ కాంగ్రెస్ లో విలీనం అంటు పెద్ద ఎత్తున చర్చ జరుగుతన్న సమయంలోనే తెలుగువన్.. ఇక ఆమె రాజకీయ క్షత్రం ఏపీయే తప్ప తెలంగాణ అయ్యే అవకాశాలు ఇసుమంతైనా లేవని విస్పష్టంగా చెప్పింది.  ఇప్పుడు అదే జరగబోతోంది. ఆమె కాంగ్రెస్ గూటికి చేరి ఏపీలో పని చేయనున్నారు. ఈ విషయం ఇంకెంత మాత్రం ఊహాగానం కాదు. ఎందుకంటే ఏపీ పీసీసీ చీఫ్  గిడిగు రుద్రరాజు స్వయంగా షర్మిల ఏపీ కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ లో వైఎస్ షర్మిల కీలక పాత్ర పోషిస్తారని గుడుగు పేర్కొన్నారు.  దీంతో ఇంత కాలం ఆమె ఏం చేసినా ఆమె టార్గెట్ మాత్రం ఏపీ సీఎం, తన సోదరుడు జగన్ మాత్రమేనని తేటతెల్లమైపోయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా కర్నాటక సీఎం డీకే శివకుమార్ తో తెలంగాణలో వైఎస్సార్టీపీ విలీనం చర్చల సందర్భంగా చెప్పినట్లు రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఆ కారణంతోనే వైఎస్సార్టీపీని కాంగ్రస్ లో విలీనం ప్రతిపాదనను ఆమె కాంగ్రెస్ ముందుంచారని కూడా అంటున్నారు. అయితే వైఎస్సార్టీపీ విలీనం ప్రతిపాదన ద్వారా  తెలంగాణలో తనతో కలిసి నడిచిన వారికి న్యాయం చేయాలన్నదే ఆమె ఉద్దేశం. అయితే ఆమె ప్రతిపాదనను తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె తెలంగాణలో పోటీ నుంచి కాంగ్రెస్ కు మద్దతుగా వైదొలిగారని విశ్లేషిస్తున్నారు. సరిగ్గా ఆ సందర్భంలోనే తెలుగువన్.. షర్మిల తెలంగాణలో పోటీ నుంచి వైదొలిగి ఏపీలో కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషిస్తారనీ, పార్టీ అధ్యక్ష పగ్గాలను ఆమె చేపట్టినా ఆశ్చర్యం లేదనీ తెలుగువన్ చెప్పింది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అదే జరిగే అవకాశాలు ఉన్నాయనిపించక మానదు.  షర్మిల కాంగ్రెస్ పార్టీ గూటికి చేరితే పార్టీ ఆమెను వైఎస్ వారసురాలిగా ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా వైసీపీలో జగన్ తీరు నచ్చకపోయినా గత్యంతరం లేక ఆ పార్టీలో కొనసాగుతున్న మాజీ కాంగ్రెస్ వాదులందరికీ షర్మిల చేరికతో సొంత గూటికి ద్వారాలు తెరిచినట్లౌతుంది. వైఎస్ వర్గంగా వారంతా షర్మిల నాయకత్వం కింద పని చేయడానికి ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశాలు ఉండవు. అదీ గాక ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ లో పదవులలో ఉన్నవారంతా నామ్ కే వాస్తే గా పదవులలో కొనసాగుతున్నవారే కానీ రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు, బలోపేతానికి వారు చేసిందిగానీ, చేయగలిగింది కానీ ఏమీ లేదనే చెప్పారు. అదే గనుక ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తే.. కాంగ్రెస్ శ్రేణులలో ఉత్సాహం రావడమే కాకుండా.. పార్టీ కార్యక్రమాలలో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న నేతలలో చురుకు పుడుతుంది. అదే సమయంలో పార్టీని వీడి ఇతర పార్టీలలో సర్దుకున్న వారంతా తిరిగి పార్టీ గూటికి చేరే అవకాశాలున్నాయి. ప్రజలలో కూడా  వైఎస్ రాజశేఖరరెడ్డి పట్ల ఉన్న అభిమానం షర్మిల కారణంగా పార్టీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక జగన్ విషయానికి వస్తే తండ్రి  మరణం తరువాత కాంగ్రెస్ తో విభేదించి సొంత పార్టీ పెట్టుకున్నారు. అప్పట్లో వైఎస్ కుటుంబం మొత్తం  ఆయన వెన్నంటి నిలిచి  వైఎస్ రాజకీయ వారసుడు జగనే అని చాటారు. అయితే అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఆయన తీరుతో కుటుంబం మొత్తం ఆయనకు దూరమైంది. మరీ ముఖ్యంగా సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో జగన్ వ్యవహరించిన తీరు, ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి వత్తాసుగా  వివేకా కుమార్తెను ఇబ్బందులకు గురిచేసిన సంఘటనలతో  కుటుంబం జగన్ కు దూరమైంది. చివరకు సొంత తల్లి, చెల్లి కూడా ఆయనకు దూరం జరిగారు. అదే సమయంలో వివేకా హత్య కేసు దర్యాప్తు తీరుపై డాక్టర్ సునీత చేసిన, చేస్తున్న న్యాయపోరాటానికి షర్మిల మద్దతుగా నిలవడంతో వైఎస్ కుటుంబం  షర్మిల వెనుక  నిలిచారు. ఇక ప్రజలు కూడా వైఎస్ వారసుడిగా జగన్ ను చూడటం ఎప్పుడో మానేశారు. ఈ తరుణంలో షర్మిల కాంగ్రెస్ గూటికి చేరితే.. పార్టీకి దూరమైన అన్ని వర్గాలు, అలాగే వైఎస్ కుటుంబం కాంగ్రెస్ కు దన్నుగా మారే అవకాశాలున్నాయి. ఇది  జగన్ కు రాజకీయంగా పూడ్చుకోలేని నష్టం చేకూర్చడం తథ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

 జానారెడ్డిని కలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎల్ పి నేత జానారెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ ఎన్నికలలో జానారెడ్డి కుమారుడు కుందూరు జైవీర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. జయవీర్ రెడ్డి నాగార్జునసాగర్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుత క్యాబినెట్లో ఏడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉన్న జానారెడ్డి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో   హోమ్ మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. వివిధ మంత్రిత్వ శాఖలను నిర్వహించిన జానారెడ్డి అనుభవాలను రేవంత్ రెడ్డి వినియోగించుకోనున్నారని తెలుస్తోంది. తిరిగి తన క్యాబినెట్లో అవకాశం కల్పించాలని రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం.   ఈ సందర్బంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి జానారెడ్డి శాలువాతో సత్కరించారు.  జానారెడ్డి  ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో   ట్రబుల్ షూటర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికలకు ముందు అతనికి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. అసంతృప్తులను బుజ్జగించడానికి  ఆయన నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీ  ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఎఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్ రావ్ ఠాక్రే, దీపాదాస్ మున్షీ, మీనాక్షి నటరాజన్ సభ్యులుగా ఉన్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు అసెంబ్లీ టికెట్ల కోసం  దాదాపు వెయ్యి మంది కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. అయితే అసంతృప్తినేతలను బుజ్జగించడానికి కాంగ్రెస్ పార్టీ  జానారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఎంఎల్ సి, కార్పోరేషన్ చైర్మన్ పదవులు, అవసరమైతే లోకసభ ఎన్నికలలో అవకాశం ఇవ్వనున్నట్లు జానారెడ్డి వారిని  బుజ్జగించారు. కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చడానికి  జానారెడ్డి ఎనలేని సేవలందించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కువగా గెలుపొందింది నల్గొండ జిల్లాలోనే. అదే జిల్లాకు చెందిన జానారెడ్డి కొత్త ప్రభుత్వంలో కొలువు తీరడానికి సిద్దం కానున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.  ప్రభుత్వానికి తాను పూర్తిగా సహకరిస్తానని సోమవారం  తనను కలిసిన విలేకరులతో జానారెడ్డి న్నారు. ఇటీవలె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ ని ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సంగతి తెలిసిందే.

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా

వైసీపీలో  అంతర్గత సంక్షోభం రోజు రోజుకూ తీవ్ర మౌతోంది. ఆ పార్టీలో ఎమ్మెల్యేలెవరూ సంతృప్తిగా లేరనీ,  వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ కన్ఫర్మ్ కాదన్న ఆందోళన దాదాపుగా అధికార పార్టీ ఎమ్మెల్యేలలో ఉందనీ గత కొంత కాలంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జగన్ సమీప బంధువు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని పార్టీ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసే విషయంలో ఎలాంటి సంకోచాలూ మొహమాటాలూ లేకుండా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా పలువురు ఎమ్మెల్యేలు కూడా పార్టీ కార్యక్రమాలకు డుమ్మా కొడుతూ తమ అసమ్మతిని తెలియజేస్తూనే ఉన్నారు. నేడో రేపో వారంతా పార్టీకి షాక్ ఇవ్వడం ఖాయమని పొలిటికల్ సర్కిల్స్ లో  చర్చ జరుగుతూనే ఉంది. ఇహ ఇప్పుడు వైసీపీలో అసంతృప్తి నిజమే. ఎమ్మెల్యేల వలస ఎంతో దూరంలో లేదు అన్న స్పష్టత వచ్చేసింది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికీ, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసేశారు. గత కొద్ది కాలంగా పార్టీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తనకు పార్టీ టికెట్ లభించదన్న నిర్ధారణకు వచ్చేసిన ఆళ్ల ఏ మాత్రం ఉపేక్షించకుండా పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసేశారు. ఎమ్మెల్యే పదవికి తన రాజీనామాను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. స్పీకర్ ఫార్మాట్ లోనే ఆళ్ల ఆ రాజీనామా లేఖ అందించేసినట్లు చెబుతున్నారు. అలాగే పార్టీకి కూడా రాజీనామా చేసేశారు.  మంగళగిరి వైసీపీ ఇన్ చార్జిగా గంజి చిరంజీవిని నియమించనుండటం, ఆ గంజి చిరంజీవి ఆదివారం (డిసెంబర్ 10) మంగళగిరిలో ప్రత్యేకంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడంతో ఇక పార్టీలో కొనసాగి ప్రయోజనం లేదన్న భావనకు వచ్చిన ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. గత ఎన్నికలలో ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన తెలుగుదేశం అభ్యర్థి నారా లోకేష్ పై విజయం సాధించి జెయంట్ కిల్లర్ గా సంచలనం సృష్టించారు. అప్పట్లోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంత్రి పదవిని ఆశించారు. అయితే జగన్ ఎన్నికలకు ముందు లోకేష్ ను ఓడిస్తే మంత్రి పదవి ఇస్తానని ఇచ్చిన హామీని విస్మరించి తొలి క్యాబినెట్ లో కానీ, ఆ తరువాత పునర్వ్యవస్థీకరణలో కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డికి అవకాశం ఇవ్వలేదు. దీంతో ఒకింత అసంతృప్తితో ఉన్న ఆయన ఇప్పుడు ఇక వచ్చే ఎన్నికలలో టికెట్ కూడా హుళక్కే అని తేలడంతో రాజీనామా చేశారు.   వైసీపీ ఇన్ ఛార్జిగా గంజి చిరంజీవిని నియమిస్తుండడంతో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. నిన్న (ఆదివారం) గంజి చిరంజీవి ప్రత్యేకంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆర్కే ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు.

ఇంతింతై.. వటుడింతై.. లోకేష్

రాజకీయాలలో తొలి అడుగులు వేసే సమయంలోనే రాజకీయ ప్రత్యర్థులు ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. బాడీ షేమింగ్ చేశారు. ఆహారం, ఆహార్యంపై ఎగతాళి చేశారు. పప్పు అన్నారు. అడుగడుగునా విమర్శలు చేశారు. అయితే అన్నిటినీ తట్టుకుని తనదైన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుని లోకేష్ మూడువేల కిలో మీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు.   పాదయాత్రకు ముందే.. గత ప్రభుత్వంలో మంత్రిగా తన సమర్థతను నిరూపించుకున్న లోకేష్ ఇప్పుడు ప్రజా నాయకుడిగా, ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంగా ఎదిగేందుకు లోకేష్ కు యువగళం పాదయాత్ర దోహదపడింది.  ఇప్పుడు నాయకుడిగా, ప్రజా నాయకుడిగా, యువతకు ఉత్తేజాన్నిచ్చే శక్తిగా లోకేష్ ఎవరికీ ప్రూవ్ చేసుకోవలసిన అవసరం లేదు.   ఇప్పుడు ఈ పాదయాత్ర యువతలో ఉత్తేజాన్ని నింపడంతో పాటు.. సీనియర్లు కూడా బద్ధకాన్ని వదుల్చుకుని పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేలా చేసింది. గత నాలుగున్నరేళ్లుగా జగన్ సర్కార్ వేధింపులకు లోనైన పార్టీ కార్యకర్తల్లో స్థైర్యాన్నీ, ధైర్యాన్నీ నింపింది. జనాలకు భవిష్యత్ పై ఆశలు రేకెత్తించింది. అయితే ఇదంతా అంత ఆషామాషీగా జరగలేదు. వేల మంది పోలీసులు, వందల మంది వైసీపీ సోషల్ మీడియా సిబ్బంది, అంతకంటే ఎక్కువగా వైసీపీ మూకలు అడుగడుగునా లోకేష్ పాదయాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు శతథా ప్రయత్నించారు. అసలు జనమే లేరంటూ అధికార పార్టీ సోషల్ మీడియా వింగ్ సామాజిక మాధ్యమంలో పోస్టుల మీద పోస్టులతో బదనాం చేయాలని ప్రయత్నిస్తే.. పోలీసులు లోకేష్ పాదయాత్ర దారిలో జనమే లేరన్న ఫొటోలను క్రియేట్ చేసి అధికార పార్టీ సోషల్ మీడియా వింగ్ కు అందించడంలో మునిగిపోయారు. ఇక వైసీపీ మూకలైతే పాదయాత్రలో గందరగోళం సృష్టించి, శాంతి భద్రతల సమస్య తలెత్తేలా చేయడానికి చేయని ప్రయత్నం లేదు. చివరాఖరికి లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడమే లక్ష్యంగా  జగన్ సర్కార్    జీవో 1 తీసుకు వచ్చింది. ఆ జీవో పేరుతో లోకేష్ మైకు కూడా లాక్కొంది. ఆయన నిలబడిన స్టూల్ కూడా లాగేసింది.  కానీ లోకేష్ వాటన్నిటినీ అధిగమించారు. సోమవారం (డిసెంబర్ 11)న లోకేష్ పాదయాత్ర మూడువేల కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించింది.  ఈ పాదయాత్ర   లోకేష్ స్టామినా ఏంటో  ప్రపంచానికి తెలియజెప్పింది.  జగన్ సర్కార్ గుక్కతిప్పుకోలేని విధంగా విమర్శల బాణాలను సంధిస్తూ ప్రజలతో మమేకమై లోకేష్ ముందుకు సాగారు. సాగుతున్నారు. పాదయాత్రకు ముందు లోకేష్ వేరు.. ఇప్పుడు లోకేష్ వేరు ఆయన పూర్తిగా మేకోవర్ అయ్యారు. దానిని జనం ప్రత్యక్షంగా తమ కళ్లతో చూశారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఆయనను ఆరంభంలో ఎగతాళి చేసిన వారు సైతం కళ్లప్పగించి ఆయన మేకోవర్ చూశారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పనులను ప్రజలకు గుర్తు చేస్తూ.. ఇప్పుడు జగన్ సర్కార్ వైఫల్యాలను, అనుసరిస్తున్న కక్ష పూరిత వైఖరిని ప్రజలకు వివరిస్తూ లోకేష్ ప్రజల మనసులో  సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. స్వీయ క్రమశిక్షణ, కఠోర శ్రమ, ఆ రెంటికీ మించి ప్రజల కష్టాలు తీర్చాలి, ప్రజా సేవ చేయాలన్న రాజకీయ సంకల్పంతో లోకేష్ అడుగులు వేశారు.  నిస్సందేహంగా నారా లోకేష్ పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే లోకేష్ కు ముందు పలువురు రాజకీయ నేతలు పాదయాత్రలు చేశారు. అయితే వారి పాదయాత్రలకు లోకేష్ పాదయాత్రకూ చాలాచాలా తేడా ఉంది. లోకేష్ విపక్ష నేత కాదు. పోనీ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న నాయకుడు కాదు. ఒక సాధారణ నేత.  ప్రజల కష్టాలు తెలుసుకుని, వాటికి పరిష్కారాలు కనుగొనే ఉద్దేశంతో  ఎలాంటి యాస్పిరేషన్స్, పదవీ కాంక్ష లేకుండా చేసిన యాత్ర. అన్నిటికీ మించి ఈ పాదయాత్ర ప్రజలలో లోకేష్ పట్ల విశ్వసనీయత పెంచింది. అలా పెంచేలా లోకేష్ మాట, నడక, నడత ఉంది. గతంలో ఎన్నడూ, ఎవరూ చేయని విధంగా నారా లోకేష్ ప్రతి వంద కిలోమీటర్ల నడక పూర్తి చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని తానిచ్చిన హామీలతో శిలాఫలకాలు వేయించారు.  తెలుగుదేశం టీడీపీ అధికారంలోకి ఆ హామీలన్నీ నెరవేరుస్తానని వాటి ద్వారా చెరిపేయడానికి, విస్మరించడానికీ తావులేని ఆధారాలను ఆయనే ఆ శిలాఫలకాల ద్వారా ప్రజలకు ఇచ్చారు .  మొత్తంగా లోకేష్ ను ఒక సంపూర్ణమైన నాయకుడిగా ఈ పాదయాత్ర ఆయనను ప్రజల ముందు ఆవిష్కరించింది. 

ఫిబ్రవరిలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు?

తెలంగాణ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇక వెంటనే ఏపీలో ఎన్నికల సందడి ఆరంభం కానుంది. ఔను ఏపీలో మరో రెండు నెలలలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాజకీయ వర్గాలలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఒక్క ఏపీ ఎన్నికలే కాదు సార్వత్రిక ఎన్నికలు కూడా ఆ నెలలోనే జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో మూడు రాష్ట్రాలలో విజయం సాధించిన జోష్ లో సార్వత్రిక ఎన్నికలను నెల నెలా పదిహేను రోజుల ముందుకు జరపాలని భావిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఐదు రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికలలో విజయం ఇచ్చిన జోష్ లో ముందస్తుకు వెళ్లడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించేయవచ్చన్న భావన బీజేపీ హై కమాండ్ లో వ్యక్తం అవుతోందని అంటున్నారు.  ఏపీ విపక్ష నేత నారా చంద్రబాబు కూడా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలోనే ఉండొచ్చని అంటున్నారు.  ఇక జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే బీజేపీ నెల లేదా నెలన్నర ముందుగానే ఎన్నికలు వెళ్లే అవకాశాలు ఉన్నాయని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.  అన్నిటికీ మించి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల ఏర్పాటును దాదాపుగా పూర్తి చేసేసింది. ముఖ్యంగా ఏపీలో  రిటర్నింగ్ ఆఫీసర్లను నియామకం,  ఈవీఎంలను నియోజకవర్గాలకు చేర్చడం వంటివి పూర్తైపోయాయి. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిషా వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలుకూడా జరగాల్సి ఉంది. వాటికీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఎన్నికల నిర్వహణకు చివరి సన్నాహం అయిన ఓటర్ల జాబితాను అప్ డేట్ చేసే ప్రక్రియ జోరందుకుంది. ఏపీలో జనవరి 8న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. అంటే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి ఈసీ రెడీ అయిపోయిందనే చెప్పాలి. మామూలుగా అయితే సార్వత్రి ఎన్నికలకు మార్చిలో షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. అయితే అంత సమయం ఇచ్చే అవకాశం లేదనీ ఫిబ్రవరిలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయనీ గత కొంత కాలంగా ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ జనవరి మూడు లేదా నాలుగో వారంలో వెలువడే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  జనవరి నెలాఖరు నాటికి షెడ్యూల్ విడుదల చేసి మొత్తం సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను రెండు నెలలలో పూర్తి చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. అదీ గాక ఈ సారి సార్వత్రి ఎన్నికలను నాలుగైదు విడతలలోనే ముగించాలని కూడా సీఈసీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.  ఇక ఏపీలో మాత్రం ఒకే విడతలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల పోలింగ్ నిర్వహించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. జగన్ ఏపీ అసెంబ్లీ ఎన్నికలను నాలుగైదు లేదా అంతకంటే ఎక్కువ విడతలలో నిర్వహించాలని కోరినట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో పరిశీలకులు అలా జరిగే అవకాశాలు ఇసుమంతైనా లేవని అంటుండటం  కొసమెరుపు.

ఏపీకి సాయం చేయాలంటూ ప్రధానికి లేఖ.. రాసిందెవరో తెలుసా?

మిచౌంగ్ తుపాను ఏపీ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. 30లక్షలకు పైగా ఎకరాల్లో పంట నష్టం జరిగింది. తుపాను ముగిసి రోజులు గడిచిపోయినా ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయం అందలేదు. సహాయం చేస్తామన్న ప్రకటనలకే ప్రభుత్వం పరిమితమైపోయింది. ముఖ్యమంత్రి పరామర్శ కూడా పరదాల చాటున సాగింది. వైసీపీ ప్రచార కార్యక్రమంలా జనసమీకరణ చేసి, ఓ సభ పెట్టి విపక్షంపై విమర్శలు గుప్పించి, ఆదుకుంటామంటూ ఓ హామీ పారేసి మమ అనిపించేశారు. విపత్తులు వస్తే ఇలా ఎలా వహరించగలుగుతున్నారని రైతులు విస్తుపోయారు. ప్రభుత్వం సహాయం చేసే పరిస్థితి ఎటూ లేదు కనీసం కేంద్ర నుంచి సహాయం పొందేందుకు ప్రయత్నం చేయాలన్న ధ్యాసా లేని సీఎం జగన్ విపక్షంపై విమర్శించడానికే తుపాను బాధితుల పరామర్శ అంటూ ఓ కార్యక్రమాన్ని పెట్టుకున్నారన్న విమర్శలు అన్ని వర్గాల నుంచీ వెల్లువెత్తాయి.  ఇక అంబటి లాంటి మంత్రులైతే.. విపక్షాన్ని విమర్శించడమే తుపాను కారణంగా నష్టపోయిన జనాలను ఆదుకోవడం అన్నట్లు వ్యవహరించారు. అలాంటి వేళ ప్రధానికి మిచౌంగ్ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఏపీని ఆదుకోవాలంటూ ఓ లేఖ అందింది. ఆ లేఖ రాసింది. ముఖ్యమంత్రి కాదు. ఏపీ ప్రభుత్వం కాదు. మరి ఎవరు? విపక్ష నేత నారా చంద్రబాబునాయుడు. తుపాను బాధితులను పరామర్శించిన ఆయన ఆ సందర్భంగానే కేంద్రం సాయం కోసం సీఎం ప్రధానికి, కేంద్రానికి విజ్ణప్తి చేయకపోవడాన్ని ఎత్తి చూపి ఆ పని తానే చేస్తానన్నారు. అలాగే చేశారు.  నష్టం అంచనాలకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు. నష్టం తీవ్రంగా ఉందని.. లక్షల మంది రైతులు పంటనష్టపోయి కుదేలయ్యారనీ ఆ లేఖలో పేర్కొన్నారు.  రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి,  తాగునీరు, విద్యుత్, కమ్యూనికేషన్ రంగాలకు అస్తవ్యస్థమైపోయాయి.  ఆక్వా రంగం కూడా నష్టపోయిందని సాయం చేయాలని కోరారు.  ప్రజల పక్షాన నిలబడేందుకు అధికారంలో ఉండాల్సిన అవసరమే లేదనీ, వారిని ఆదుకోవాలన్న సంకల్పం చాలనీ చంద్రబాబు మరోసారి రుజువు చేశారు. బాధితుల వద్దకు స్వయంగా వెళ్లి భరోసా ఇచ్చిన చంద్రబాబు.. కేంద్రానికి నష్టం వివరాలను కూడా బాధ్యతాయుతంగా అందించారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం చేయని పనిని తాను చేసి చూపారు. బాధలో ఉన్న వారిని ఓదార్చారు. అండగా ఉంటామన్న భరోసాను కల్పించారు. ధైర్యం చెప్పారు. మరో వైపు తుపాను బీభత్సంతో రాష్ట్రం చిగురుటాకులా వణుకుతున్న సమయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫంక్షన్లలో బిజీగా ఉంటే.. ఆయన కేబినెట్ లో రోజా వంటి మంత్రులు రీల్స్ చేస్తూ వాటిని సామాజిక మాధ్యమంలో పోస్టు చేస్తూ యమా బిజీగా ఉన్నారు. చంద్రబాబు ఆదేశం మేరకు తెలుగుదేశం శ్రేణులు తుపాను బాధితులకు సహాయ కార్యక్రమాలలో నిమగన్నమయ్యారు. ప్రజల కోసం నిలబడే నేత ఎవరో ఈ ఆపత్సమయంలో అందరికీ అర్ధమైందని జనం చెబుతున్నారు.