ఓ పాట‌కాలం మ‌నిషి...పాడిమోసిన నేటికాలం మ‌నిషి

  ఈ మ‌ధ్య‌కాలంలో ఒక ముఖ్య‌మంత్రి పాడె మోసిన ఘ‌ట‌న అరుద‌నే చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ ఈ విష‌యంలో ఎంతో ఎత్తుకు ఎదిగార‌ని చెప్పాల్సి ఉంటుంది.  గ‌త  ప్ర‌భుత్వ  జ‌మానాలో కొంద‌రు నాయ‌కులు అక‌స్మాత్ మ‌ర‌ణం పాలైతే.. వారికి క‌నీసం రాజ‌లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌లేదు. అలాంటిది  నేడు తెలంగాణ రాష్ట్ర గీతం ర‌చించిన అందెశ్రీకి భారీ ఎత్తున గౌర‌వం ల‌భించింద‌నే చెప్పాలి. ఆయ‌న తాను ర‌చించిన  రాష్ట్ర‌గీతం జ‌నం  నోళ్ల‌లో నాన‌డం మాత్ర‌మే కాదు.. ఆయ‌న కంటి ముందు ప్ర‌భుత్వ ఆమోదం పొందింది. ఆపై ఇందుకుగానూ కోటి రూపాయ‌ల న‌జ‌రానా సైతం ల‌భించింది.  ఇవే ఆయ‌న త‌న జీవిత కాలంలో చూసిన అత్యున్న‌తాల‌నుకుంటే.. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయ‌న పాడె భుజానికెత్తుకుని మోసి.. గొప్ప స‌హృద‌య‌త చాటుకోవ‌డంతో ఇదొక‌ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నువ్వు చ‌రిత్ర‌లో నిలిచిపోతావు రేవంత‌న్నా! అంటూ మాట్లాడుకుంటున్నారు. దీంతో పాటు అందెశ్రీ  కోసంగానూ ఒక స్మృతి వ‌నం  సైతం ఏర్పాటు చేసే దిశ‌గా రేవంత్ నాయ‌క‌త్వంలోని ప్ర‌భుత్వం నిర్ణ‌యించ‌డంతో.. ఆహా ఓహో అని చెప్పుకుంటున్నారు తెలంగాణ వాసులు. మాములుగా అయితే అందెశ్రీ  రాసిన ర‌చ‌న‌లు ఏమంత ఎక్కువ‌గా ఉండ‌వు. చాలా చాలా ప‌రిమితంగా మాత్ర‌మే  ఉంటాయి ఆయ‌న గేయాలు. కానీ, ఇక్క‌డ‌ గొప్ప‌ద‌నం ఏంటంటే.. ఆయ‌న ర‌చ‌న‌ల్లో రాశి లేక పోయినా వాసి ఎక్కువ‌. త‌క్కువే రాసిన అది జ‌నం మాట పాట‌గా వ‌చ్చిన అరుదైన బాణీ. అంతే  కాదు తెలంగాణ ఉద్య‌మ కాలంలో తీవ్ర ప్ర‌భావితం చేసింది ఆయ‌న సాహిత్యం.  ఇక రాష్ట్ర గీత‌మే రాయ‌డంతో.. ఆయ‌న‌కు ఎక్క‌డా లేని ప్రాధాన్య‌త ల‌భించింది. అలాగ‌ని గ‌త ప్ర‌భుత్వం ఆయ‌న్ను అక్కున చేర్చుకోలేదు స‌రిక‌దా  ప‌క్క‌న  పెట్టేసింది. ఇది గుర్తించిన రేవంత్ నేతృత్వంలోని నేటి  తెలంగాణ‌ ప్ర‌భుత్వం అందెశ్రీ గీతాన్ని ఆమోదించ‌డంతో పాటు ఇదిగో ప‌రి ప‌రి విధాలుగా ఆయ‌న్ను గుర్తించి గౌర‌వించ‌డంతో.. ఇది సాహితీ చ‌రిత్ర‌లో నిలిచిపోయే ఒకానొక సువ‌ర్ణ అధ్యాయంగా భావిస్తున్నారంతా.  

టీటీడీ అంటే ఆ కుటుంబానికి ఎందుకంత దుర్మార్గ‌పు ఆలోచ‌న‌?

  టీటీడీ మీద జ‌గ‌న్ ఫ్యామిలీ చేస్తున్న కుట్ర‌లు ఈనాటివి కావు. ఒక స‌మ‌యంలో వెంక‌టేశ్వ‌ర‌స్వామిని అన‌రాని మాట‌లు అన్న  భూమ‌న  క‌రుణాక‌ర్ రెడ్డిని ఏకంగా టీటీడీ బోర్డు చైర్మ‌న్ గా నియ‌మించ‌డం ద‌గ్గ‌ర్నుంచి మొద‌లు పెడితే ఈ ప‌రంప‌ర కొన‌సాగుతూనే వ‌చ్చింది.  ఆ త‌ర్వాత వెంక‌టేశ్వ‌ర‌స్వామికి  వ్య‌తిరేకంగా  పుస్త‌కాలు రాసిన‌ భూమ‌న సోద‌రుడు ఏకంగా శిక్ష‌ణా త‌ర‌గ‌తులు ప్రారంభించడం అదో భ్ర‌ష్టాచారంగా చెబుతారు. ధ‌ర్మారెడ్డిని టీటీడీ పాల‌న‌లో ప్ర‌వేశ పెట్టించి.. ఆయ‌న  చేత చేయించ‌ని అక్ర‌మాలు లేవ‌న‌డానికి ప‌ర‌కామ‌ణి, ఆపై ల‌డ్డూలో న‌కిలీ  నెయ్యి వ్య‌వ‌హారాలు. ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీవారికి వైయ‌స్ కుటుంబం  చేయ‌ని ద్రోహం లేదని అంటారు. ఇటీవ‌ల మాట్లాడిన భూమ‌న త‌న వాళ్లు సుమారు ఐదు వేల మంది వ‌ర‌కూ టీటీడీలో పాతుకుపోయార‌నీ.. మీకు సంబంధించిన ఏ చిన్న ర‌హ‌స్య‌మైనా త‌న చేతికి వ‌చ్చేస్తుందంటూ ఆయ‌న మాట్లాడిన మాట‌లు ఒక సంచ‌ల‌నం.  అంటే అన్ని  ర‌కాలుగా టీటీడీని ఆక్ర‌మించుకుని వారికి వారు దోచుకోడానికి పెద్ద ఎత్తున ప్ర‌ణాళిక‌లు ర‌చించిన‌ట్టు క‌నిపిస్తోంది. ప‌ర‌కామ‌ణి వ్య‌వ‌హారమే చూస్కుంటే ధ‌ర్మారెడ్డి ద్వారా అప్ప‌ట్లో ఎస్టేట్ మేనేజ‌ర్ గా ఉన్న ఒక‌ వ్య‌క్తిని టీటీడీ అడిష‌న‌ల్ ఈవోగా అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించి మ‌రీ ఈ స్కామ్ కి తెర‌లేపిన‌ట్టు గుర్తించారు సీఐడీ అధికారులు. న‌కిలీ ల‌డ్డు వ్య‌వ‌హారం ఎంత ఘోర‌మంటే.. వైసీపీ హ‌యాంలో తిరుమ‌ల ల‌డ్డూ త‌యారీ కోసం భోలే బాబా డైరీ నుంచి 250 కోట్ల విలువైన 68 ల‌క్ష‌ల కేజీల నెయ్యి కొన్నారు. ఆ డైరీ 2019- 2024 మ‌ధ్య ఒక్క లీట‌ర్ పాలు కూడా సేక‌రించ‌లేదంటే  ప‌రిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవ‌చ్చు. కొంద‌ర‌నే మాట‌ల‌ను అనుస‌రించి చెబితే.. జ‌గ‌న్ కుటుంబానికి టీటీడీ మీద అక్క‌సు ఈనాటిది  కాద‌ని.. ఇది ఆయ‌న తండ్రి వైయ‌స్ ఏడుకొండ‌ల వాడికి ఏడు కొండ‌లు ఎందుకు? రెండు కొండ‌లు మాత్ర‌మే స‌రిపోవా? అంటూ మొద‌లు పెట్టార‌నీ. వైయ‌స్ పావురాల‌గుట్ట‌లో ప‌డి అనంత‌లోకాల‌కు చేరినా ఈ పులివెందుల మాఫియాకు టీటీడీ మీదున్న దుర్మార్గ‌పు ఆలోచ‌న‌లు పోలేదనీ.. అందుకే జ‌నాన్ని మ‌భ్య పెట్ట‌డానిక‌ని.. త‌న ఇంట్లో వెంక‌న్న సెట్ వేశార‌నీ.. ఈ బూట‌కాల  నాట‌కం గుర్తించ‌బ‌ట్టే వెంక‌న్న త‌న మూడు నామాల‌లోని రెండు నామాల‌ను బ‌హుమానంగా ఇచ్చార‌నీ చెప్పుకొస్తారు శ్రీవారి భ‌క్తులు.  

డాక్ట‌ర్లంటే హ‌డ‌లిపోయేలా చేసిన... ఢిల్లీ కారు పేలుళ్ల ఘ‌ట‌న‌

  ఒక‌ప్పుడు డాక్ట‌ర్ సింబ‌ల్ ఉన్న వాహ‌నాలంటే వెంట‌నే వారిని వ‌దిలేసేవారు పోలీసులు. అదే ఇప్పుడు ఢిల్లీ ఘ‌ట‌న త‌ర్వాత మొత్తం మారిపోయింద‌ని వాపోతున్నారు వైద్యులు. కార‌ణం ఈ పేలుళ్ల వ్య‌వ‌హారంలో మొత్తం డాక్ట‌ర్లే ఎక్కువ‌గా ఉండ‌టం చాలా పెద్ద త‌ల‌నొప్పిగా త‌యారైంది వైద్య‌రంగానికి. మ‌రీ ముఖ్యంగా ఢిల్లీ పేలుళ్ల సూత్ర‌ధారి డాక్ట‌ర్ షాహీన్ గా గుర్తించారు.  అల్ ఫ‌లాహ్ వ‌ర్సిటీలో ప్రొఫెస‌ర్ గా ప‌ని చేస్తున్న డాక్ట‌ర్ షాహిన్ జైషే మ‌హ‌మ్మ‌ద్ లేడీ వింగ్ నియామ‌కాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్ట్టుగా గుర్తించారు.. ఈమె ఉగ్ర‌కార్య‌క‌లాపాల‌ను సైతం హ్యాండిల్ చేసిన‌ట్టు ఐడెంటిఫై చేశారు.  అంతే కాదు రిసిన్ అనే విషంతో సామూహిక మార‌ణ హోమం సృష్టించాల‌నుకున్న స‌య్య‌ద్ సైతం డాక్ట‌ర్ కావ‌డంతో.. డాక్ట‌ర్ చ‌దువు చ‌దువుకునేది మ‌నుషుల‌ను బ‌తికించ‌డానికా? లేక  చంప‌డానికా అన్న మాట కూడా వెలుగులోకి రావ‌డంతో డాక్ట‌ర్ల‌కు త‌ల కొట్టేసినంత ప‌ని అవుతోంది. 2900 కిలోల IED తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్న  ముజ్జామిల్ షకీల్ కూడా ఒక డాక్ట‌రే. ఫరీదాబాద్ లో నివసిస్తున్నాడు. స‌రిగ్గా అదే టైంలో ఇది పుల్వామాకు చెందినవాడు కూడా. ఇప్పుడు రైళ్ల‌లో. బ‌స్సుల్లో ప‌రిస్థితి ఎలా త‌యారైందంటే.. ఈ పేలుడు త‌ర్వాత గ‌డ్డంతో, టోపీతో క‌నిపించేవారంద‌రినీ చెక్ చేస్తున్నారు. నిజానికి వారిలో చాలా మంది అమాయ‌కులే అయి  ఉంటారు.  కానీ వారి దుర‌దృష్టం ఎలాంటిదంటే కేవ‌లం కొంద‌రంటే కొంద‌రు చేసిన ఈ ప‌నికి ఇప్పుడు వారెవ‌రికీ  పెద్ద గొప్ప‌గా గౌర‌వం లేకుండా పోతోంది. వీరికిప్పుడు సిటీలోనే కాదు ఊళ్ల‌లో కూడా ఎక్క‌డా ఇళ్లు అద్దెకు ఇచ్చేలా క‌నిపించ‌డం లేదు. ఇక ఎయిర్ పోర్టులో ప‌రిస్థితి కూడా చాలా చాలా దారుణంగా ఉండ‌బోతుంది. కార‌ణం చాటు మాటుగా త‌మ ల‌గేజీలో వీరు ఏ పేలుడు, ర‌సాయ‌న ప‌దార్ధాలు తీస్కెళ్తున్నారో అన్న భ‌యం వారిని మ‌రింత‌గా వెంటాడ‌నుంది. ఇక అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాల ప‌రిస్థితి మ‌రింత దారుణం కానుంది.  విదేశాల్లో వీరికి మ‌రింత  స‌మ‌స్య ఎదురు కానుంది. ఇప్ప‌టికే ప్యారిస్ లోని ఈఫిల్ ట‌వ‌ర్ ని సైతం త‌మ ప్రార్ధ‌నాల‌యం చేసేసుకుంటార‌న్న కామెంట్లు ట్రోలు మంటున్నాయ్. ప్యారీస్ నిండా టోపీవాలాలే అన్న ఆందోళ‌న ఫ్రెంచి వాసుల‌ను తీవ్రంగా  వెంటాడుతోంది. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా వీరి ప‌రిస్థితి రాను రాను అగ‌మ్య‌గోచ‌రంగా  త‌యారయ్యేలా తెలుస్తోంది.  

నాగార్జునకు క్షమాపణ చెప్పిన మంత్రి కొండా సురేఖ

  ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు ఆమె క్షమాపణలు తెలిపారు. గతంలో తాను వారిపై చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ అర్థరాత్రి ట్వీట్ చేశారు. నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని, తన వ్యాఖ్యల వల్ల వారు బాధపడి ఉంటే చింతిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. అయితే, అర్థరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆమె ఈ ట్వీట్ చేయడం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  ఆయన  మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశ్యం నాకు లేదు. ఆయన కుటుంబ సభ్యులను నొప్పించాలన్నా, అపకీర్తి కలిగించాలన్నా  ఉద్దేశ్యం నాకు  ఎప్పటికీ లేదు. నా వ్యాఖ్యల వల్ల ఏవైనా అనుకోని అపోహలు కలిగినట్లయితే, దానికి నేను చింతిస్తున్నాను. తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఈ వివరణతో నాగార్జున కుటుంబంపై ఉన్న అపోహలు తొలగుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు రేపు నాంపల్లి స్పెషల్ కోర్టు లో నాగార్జున పరువు నష్టం పిటిషన్ పై విచారణ జరగనున్నది. విచారణ కు ఒక రోజు ముందు మంత్రి కొండ సురేఖ... నాగార్జునను ట్యాగ్ చేస్తూ ఎక్స్ లో  పోస్ట్ పెట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్ కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో కొండా సురేఖ... హీరో నాగచైతన్య, సమంత విడాకుల అంశంపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.కొండా సురేఖ వ్యాఖ్యలపై నటుడు నాగార్జున తీవ్రంగా స్పందించారు. ఆమెపై పరువు నష్టం దావా  వేశారు. మరోవైపు నాగచైతన్య, సమంత సైతం తమ విడాకులు పరస్పర అంగీకారంతో తీసుకున్న వ్యక్తిగత నిర్ణయమని, తమ పేర్లను అనవసరంగా రాజకీయ వివాదాల్లోకి లాగవద్దని నాగార్జున విజ్ఞప్తి చేశారు.  

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ

  తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతుంది.  వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది.  మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 67,367 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,369 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న  శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.30 కోట్ల రూపాయలు వచ్చిందని  టీటీడీ అధికారులు పేర్కొన్నారు.

ఢిల్లీ పేలుడు మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన

  ఢిల్లీలో జరిగిన పేలుడులో మరణించిన బాధిత కుటుంబాలకు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా రూ.10 లక్షల  ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. శాశ్వతంగా వికలాంగులైన వారికి రూ. 5లక్షలు తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2లక్షలు అందిస్తామన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్సను అందిస్తామని తెలిపారు. బాధితులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు.  ఈ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా సంతాపం తెలియజేశారు.ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో ఈ పేలుడులో 13 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

అక్రమ ఆస్తుల కేసులో జగన్‌కు చుక్కదెరు

  అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఈ నెల 21 న విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని  సీబీఐ కోర్టు ఆదేశించింది. జగన్ అభ్యర్థనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. దీంతో వ్యక్తి గత హాజరు మినహాయింపు ఇవ్వాలన్న మోమోను జగన్ తరఫు న్యాయవాది వెనిక్కి తీసుకున్నారు.  కొంత సమయం ఇస్తే వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతారని చెప్పారు. ఇందుకోసం వారం రోజులు సమయం ఇవ్వాలని జగన్ తరఫు న్యాయవాది కోరగా.. ఈనెల 21 వరకు న్యాయస్థానం సమయం ఇచ్చింది. యూరప్ పర్యటనకు వెళితే ఈ నెల 14వరకు కోర్టుకు హాజరు కావాలని గతంలోనే సీబీఐ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

తెలంగాణలో ఉగ్రవాద సంస్థలపై ఎన్‌ఐఏ చార్జిషీట్

  తెలంగాణ రాష్ట్రంలో నిషేధిత సిపిఐ మావోయిస్ట్ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలపై దర్యాప్తును వేగవంతం చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ, మూడు వేర్వేరు కేసుల్లో 21 మంది మావోయిస్ట్ కార్యకర్తలపై చార్జిషీట్ దాఖలు చేసింది. ఎన్ఐఏ వెల్లడించిన ప్రకారం, ఈ చార్జ్ షీట్లు ఈరోజు హైదరాబాద్‌లోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ముందు దాఖలు చేశారు. అరెస్టయిన 20 మందితో పాటు ఒక పరారీలో ఉన్న వ్యక్తిపైన కూడా ఉగ్రవాద నిరోధక చట్టం (UAPA), ఆయుధ చట్టం, పేలుడు పదార్థాల చట్టం మరియు BNSSలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపుతూ మూడు వేర్వేరు చార్జిషీట్లను ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో దాఖలు చేశారు. ఎన్ ఐ ఏ దర్యాప్తులో భాగంగా, నిందితులు కరిగుట్ట కొండ ప్రాంతాన్ని మావోయిస్టు కార్యకలాపాలకు సురక్షిత స్థావరంగా మార్చేందుకు కుట్ర పన్నినట్లుగా తేలింది.. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం, హింసాత్మక దాడులు జరపడం ద్వారా దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, మరియు రాజ్యాంగ వ్యవస్థను దెబ్బతీయడం ఈ కుట్ర ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.  సిపిఐ మావోయిస్టు సీనియర్ కార్యకర్తలు పన్నిన మావోయిస్టు కుట్రలో 21 మంది నిందితులు చురుగ్గా పాల్గొన్నట్లు తేలింది. ఈ సంవత్సరం మే నెలలో అదుపులోకి తీసుకున్న కుంజం లక్కా, మరిగల సుమతి, కర్తం జోగా, కర్తం భీమా, హేమల సుక్కి తదితరులు కీలక పాత్ర పోషించినట్లుగా అధికారులు గుర్తించారు.  తెలంగాణ పోలీసులు ములుగు జిల్లాలోని మూడు వేర్వేరు ప్రదేశాల్లో వీరందరినీ అదుపు లోకి తీసుకుని వారి వద్ద నుండి  ఆటోమేటిక్ అస్సాల్ట్ రైఫిళ్లు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు, మావోయిస్టు సాహిత్యం మరియు ఇతర నేరారోపణ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర పోలీసుల నుండి ములుగు జిల్లాలో నమోదైన మూడు వేర్వేరు ఎఫ్ఐఆర్‌లను  ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. సిపిఐ (మావోయిస్టు) తన పునరుజ్జీవన ప్రయత్నాలను అడ్డుకోవడం లక్ష్యంగా దర్యాప్తును కొనసాగిస్తోంది.

"ఖి" లేడి టెర్రరిస్ట్ డాక్టర్‌ షాహిన్‌

  ఢిల్లీ ఎర్రకోట వద్ద బాంబు పేలుడు కేసులో అరెస్ట్ అయిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహిళ డాక్టర్‌ షాహిన్‌ ఫోటో బయటికొచ్చింది. అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అల్ ఫలాహ్ వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆమె ఉగ్రవాద ఆపరేషన్‌‌కు నిధులు సమకూర్చడం, ఆపరేషన్‌కు సులభతరం చేయడంలో కీలకంగా పనిచేసినట్లు గుర్తించారు. దేశంలో జైషే మహమ్మద్‌ కోసం మహిళా నియామకాలను షాహీన్ పర్యవేక్షిస్తున్నట్లు నిఘా వర్గలు తెలిపాయి.   ఈ జమాత్‌ ఉల్‌ మొమినాత్‌ విభాగానికి మసూద్‌ సోదరి సాదియా అజార్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఈ విభాగంలో డా.షాహిన్‌కు కీలక బాధ్యతలు అందించినట్లు తెలుస్తోంది. ఇండియాలో ఉమెన్ విభాగాలు స్థాపించి, వారి నియామకాలు చేపట్టడం వంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.డా. షాహిన్‌ షాహిద్ లఖ్‌నవూలోని  లాల్‌బాగ్‌ నివాసి. ఫరీదాబాద్‌లోని మాడ్యూల్‌పై ఆపరేషన్‌ నేపథ్యంలో ముగ్గురు వైద్యులు అదీల్‌ అహ్మద్, ముజమ్మిల్‌ షకీల్, షాహిన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ముజమ్మిల్‌తో షాహిన్‌కు దగ్గర సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయుధాలను నిల్వ చేసేందుకు అనుమానితులు ఉపయోగించిన కారు మహిళా డాక్టర్‌ పేరు మీదే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ముజమ్మిల్‌ విచారణ నేపథ్యంలో ఈ మహిళా డాక్టర్‌ విషయం తెలియగా.. అధికారులు ఆమెను కూడా అరెస్టు చేశారు. ఈ క్రమంలో విచారణ కోసం  ఆమెను శ్రీనగర్‌కు తరలించారు. ఢిల్లీ పేలుళ్ల ఘటనలో ఆత్మాహుతి దాడిగా పరిగణిస్తున్న దర్యాప్తు బృందం..  ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఫొటోను పోలీసులు తొలిసారిగా విడుదల చేశారు. ఈ భీకర పేలుడులో 12 మంది మృతి చెందగా, 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.  

ఎంఎస్ఎంఈల ద్వారా 5 లక్షల ఉద్యోగాలు : సీఎం చంద్రబాబు

  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. యువత ఆలోచనలతో ముందుకు వస్తే పారిశ్రామిక యూనిట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేయూత ఇస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనూ ప్లగ్ అండ్ ప్లే విధానంలో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.  విద్యుత్తు, నీటి సరఫరా, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలను ఈ పార్కుల్లో కల్పిస్తూ పెట్టుబడులకు అనువుగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెదఈర్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కును ముఖ్యమంత్రి ప్రారంభించారు. దీంతో పాటు 17 జిల్లాల్లో ఏర్పాటు చేసిన మరో 49 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 868 ఎకరాల విస్తీర్ణంలో రూ.873 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులను పరిశ్రమల శాఖ చేపట్టింది.  పారిశ్రామిక పార్కుల్లో భూమి పొందిన 1597 ఎంఎస్ఎంఈ సంస్థలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు సీఎం చేశారు. వీటితో పాటు రాష్ట్రంలో రూ.25,256 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన 38 వివిధ మెగా పారిశ్రామిక యూనిట్లను కూడా ముఖ్యమంత్రి వర్చువల్ గా  ప్రారంభించారు. అనంతరం శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కర్నూలు, అనంతపురం, చిత్తూరు తదితర జిల్లాల్లోని పారిశ్రామిక పార్కుల్లో ఏర్పాటు చేసిన పారిశ్రామిక వేత్తలతోనూ సీఎం వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. 

ఇస్లామాబాద్ లో ఆత్మాహుతి దాడి.. 12 మంది మృతి

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు సంభవించింది. ఇస్లామాబాద్ లోని  జ్యుడీషియల్ కాంప్లెక్స్ సమీపంలో మంగళవారం జరిగిన శక్తిమంతమైన పేలుడులో   12 మంది మరణించారు. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులలో అత్యధికులు న్యాయవాదులేనని తెలుస్తోంది.  స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కోర్టు గేటు వద్ద పార్క్ చేసి ఉన్న ఓ కారులో ఈ పేలుడు సంభవించింది.   ఇది అత్యంత రద్దీగా ఉండే సమయం కావడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, కారులోని గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని భావిస్తున్నా, ఇది ఆత్మాహుతి దాడి అయి ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ పేలుడు తీవ్రతకు చుట్టుపక్కల పార్క్ చేసిన అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. సుమారు 6 కిలోమీటర్ల దూరం వరకు పేలుడు శబ్దం వినిపించింది. ఈ  దాడిని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ పేలుడుకు కొన్ని గంటల ముందే దక్షిణ వజీరిస్థాన్‌లో పాక్ భద్రతా దళాలు ఓ ఉగ్రకుట్రను భగ్నం చేశాయి. వానాలోని కేడెట్ కాలేజీపై తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదులు చేయబోయిన దాడిని భద్రతా దళాలు అడ్డుకుని, ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. గత కొంతకాలంగా పాకిస్థాన్ టీటీపీ ఉగ్రవాదుల నుంచి తీవ్ర ముప్పును ఎదుర్కొంటోంది. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత పాక్‌లో టీటీపీ కార్యకలాపాలు పెరిగాయి. టీటీపీ నాయకులకు ఆఫ్ఘనిస్థాన్ ఆశ్రయం కల్పిస్తోందని ఇస్లామాబాద్ ఆరోపిస్తుండటంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

ప్రతి లైబ్రరీలోనూ అందెశ్రీ నిప్పుల వాగు.. రేవంత్

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు తెలంగాణ ప్రజానీకం అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. హైదరాబాద్‌లోని లాలాపేట్‌ నుంచి ఘట్‌కేసర్‌ వరకు అందెశ్రీ అంతిమయాత్ర కొనసాగింది. సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఘట్‌కేసర్‌లోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమ సంస్కారాలకు సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్‌ బాబు, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.   అంతిమయాత్ర సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందెశ్రీ పాడెను మోశారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. వారికి అండగా ఉంటానని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.   అనంతరం   మీడియాతో మట్లాడిన రేవంత్ రెడ్డి.. ఓ కళాకారుడిగా, రచయితగా అందెశ్రీ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పడ్డారో తనకు తెలుసునని చెప్పిన రేవంత్ రెడ్డి, అందెశ్రీ పశువుల కాపరిగా, తాపీ మేస్త్రిగా పనిచేశారు. ఉద్యమకారుడిగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో అందెశ్రీ గొప్ప పాత్ర పోషించారు. ఆయనను కోల్పోవడం తెలంగాణ సమాజంతో పాటు వ్యక్తిగతంగా తనకు కూడా తీరని లోటన్నారు.  అందెశ్రీ రాసిన ప్రతీ పాట తెలంగాణ ప్రజల్లో స్ఫూర్తి నింపిందని సీఎం రేవంత్‌ అన్నారు. అందుకే ఆయన రాసిన  జయ జయహే తెలంగాణ  గీతాన్ని పాఠ్యాంశంగా చేర్చేందుకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అందెశ్రీ పేరుతో ఓ స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. అలాగే ఆయన పాటల సంకలనం  నిప్పుల వాగు  ఒక భగవద్గీతగా, బైబిల్‌గా, ఖురాన్‌గా తెలంగాణ సమస్యలపై పోరాడేవారికి మార్గదర్శకంగా పయోగపడుతుందన్న రేవంత్ రెడ్డి అందుకే నిప్పుల వాగు పుస్తకాన్ని తెలంగాణలోని ప్రతీ లైబ్రరీలో  అందుబాటులో ఉంచుతామన్నారు.  ప్రత్యేక రాష్ట్ర సాధనలో తన పాటలతో అలుపెరుగని కృషి చేసిన అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని గత ఏడాది కేంద్రానికి లేఖ రాశామని సీఎం రేవంత్‌ అన్నారు. ఈ సంవత్సరం కూడా కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. ఆయనకు పద్మశ్రీ గౌరవం దక్కేలా కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆయనను పద్మశ్రీతో గౌరవించుకునేందుకు కృషి చేద్దామని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. 

ఢిల్లీ పేలుడు కేసు...ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం

    పేలిపోయిన హ్యుందాయ్ ఐ20 కారు మొదట ఎండీ సల్మాన్ సొంతం, కానీ నదీమ్ కు అమ్మివేయబడింది, తరువాత అతను దానిని ఫరీదాబాద్ లోని రాయల్ కార్ జోన్ అనే యూజ్డ్ కార్ డీలర్ కు విక్రయించాడు. తరువాత దీనిని తారీఖ్ కొనుగోలు చేశాడు. తారీఖ్ ఫరీదాబాద్ లో నివసిస్తున్నాడు కానీ పుల్వామాకు చెందినవాడు. 2900 కిలోల ఐఈడీ తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్న డాక్టర్ ముజ్జామిల్ షకీల్ కూడా ఫరీదాబాద్ లో నివసిస్తున్నాడు మరియు పుల్వామాకు చెందినవాడు కూడా. ఇవన్నీ ముడిపడి ఉన్నట్లు కనిపిస్తోంది.  డాక్టర్ ముజ్జామిల్ ను అరెస్టు చేసి ఎర్రకోట దాడిని నిర్వహించిన తర్వాత తారీఖ్ భయపడినట్లు కనిపిస్తోంది, బహుశా ఇది ఒక ఫిదాయీన్ చర్య కావచ్చు.  మరోవైపు పేలుడు కేసును కేంద్ర హోం శాఖ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకి  అప్పగించింది. త్వరలో పేలుడు ఘటనపై ఏన్ఐ అధికారులు దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదికను ఇవ్వనున్నారు. ఫరీదాబాద్ లో మరోసారి భారీగా పేలుడు పదార్థాలు లభ్యమైంది.  లక్నోకు చెందిన డాక్టర్ షాహీనా షాహిద్ ను అదుపులోకి తీసుకున్నారు  

కన్న కొడుకును హతమార్చిన తండ్రి

  దురలవాట్లకు బానిసలయిన పిల్లలను భరించే స్థితి ని తల్లిదండ్రులు కోల్పోతున్నారు డ్రగ్స్ మద్యం యువతరం జీవితాలను నాశనం చేస్తుంది. అదే సమయంలో తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బందులకి గురి చేస్తోంది దీంతో తల్లిదండ్రులు క్షణికావేశంలో కన్నా కొడుకులను కడతేర్చడానికి వెనుకాడడం లేదు. అలా విశాఖలో మద్యానికి బానిసైన  కొడుకు వై ప్రసాద్ (36)ను తండ్రి లక్ష్మణరావు(60) హతమార్చాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మద్యానికి డబ్బులు కావాలని వేధించడంతో  ఈనెల ఆరవ తేదీన  మధ్యాహ్నం సుమారు మూడున్నర గంటల ప్రాంతంలో కొడుకు ప్రసాదును   కర్రతో బలంగా తలపై కొట్టడంతో  మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని  ఆ మరుసటి రోజు  జోడిగుడ్లపాలెం  స్మశాన వాటికలో పూడిచిపెట్టాడు. మృతుడు ప్రసాదు  కు 2019లో వివాహం కాగా  ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాలతో భార్య వై.రాజీ విజయవాడలో నివసిస్తున్నారు. విషయం భార్య రాజీకి తెలియడంతో ఆమె ఫిర్యాదు మేరకు  ఆరి లోవ పోలీసులు దర్యాప్తు చేయగా  నిందితుడు కన్న తండ్రి లక్ష్మణరావు గా నిర్ధారించారు.  

నెల్లూరులో లారీ బీభత్సం..ముగ్గురు స్పాట్ డెడ్

  నెల్లూరు ఎన్టీఆర్ నగర్ వద్ద జాతీయ రహదారిపై చేపల లోడుతో వెళ్తున్న కంటైనర్‌ లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన లారీ రోడ్డు పక్కన గల షాపులతో పాటు టాటా ఏస్,  3 బైక్‌లతో పాటు ఓ చెట్టును ఢీకొట్టింది.ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.  . క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  పోలీసులు  సహాయక చర్యలు చేపట్టారు.ఎప్పుడూ చాలా రద్దీగా ఉండే ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.  

ఢిల్లీ పేలుడు సూత్రధారులను వదిలే ప్రశ్నే లేదు.. మోడీ

ఢిల్లీఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ఈ దారుణానికి పాల్పడిన కుట్రదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని   హెచ్చరించారు. సోమవారం (నవంబర్ 10) జరిగిన ఈ ఘటనలో13 మంది మరణించగా, 20 మంది గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండు రోజుల పర్యటన నిమిత్తం భూటాన్‌లో ఉన్న ప్రధాని మోదీ... థింపూలో మాట్లాడుతూ  ఈ పేలుడు వెనుక ఉన్న కుట్రను మన దర్యాప్తు సంస్థలు ఛేదిస్తాయి. సూత్రధారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.   ఢిల్లీ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ఎంతో భారమైన హృదయంతో ఇక్కడికి వచ్చానని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.  బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.  పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్న అన్ని ఏజెన్సీలతో తాను రాత్రంతా టచ్‌లోనే ఉన్నానని ప్రధాని వెల్లడించారు.

ఛత్తీస్‌గఢ్‌ లో భారీ ఎన్‌కౌంటర్‌.. పలువురు నక్సల్స్ మృతి?

ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, నక్సల్స్ మధ్యా ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర సరిహద్దులోని బీజాపూర్   జిల్లాలో మంగళవారం (నవంబర్ 11) ఉదయం నుంచి జరుగుతున్న ఎన్ కౌంటర్ లో పలువురు మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు ధృవీక రించారు.   పలువురు నక్సల్స్ మరణించారనీ, అయితే ఎంత మంది మరణించారన్న విషయంలో స్పష్టత లేదనీ అన్నారు.  కాగా ఆదివారం (నవంబర్ 9)న గురియాబంద్ జిల్లాలో కూడా మావోలు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. ఆ ఎన్ కౌంటర్ నుంచి తప్పించుకున్న నక్సలైట్లే ఇప్పుడు బీజాపూర్ వద్ద ఎన్ కౌంటర్ లో ఉన్నారని అంటున్నారు.  పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.