కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

  చిత్తూరు జిల్లా పలమనేరు ముసలిమడుగులో 20 ఎకరాల్లో ఏర్పాటు చేసిన కుంకీ ఏనుగుల క్యాంప్ కేంద్రాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. కర్ణాటక నుంచి 4 ఏనుగులు తీసుకోచ్చినట్టు ఆయన తెలిపారు. ఇళ్లు, పొలాల్లోకి అడవి ఏనుగులు రాకుండా ఎలా కట్టడి చేస్తారో వివరించారు. గజరాజులకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నా పవన్.. వాటి విన్యాసాలను తిలకించి ఆహారం తినిపించారు.  అనంతరం అటవీ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.కుంకీ ఏనుగుల సంరక్షణ, శిక్షణ, వాటి బాగోగుల కోసం తీసుకుంటున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల దాడులను నివారించేందుకు కుంకీ ఏనుగులను వినియోగిస్తున్న తీరు, వాటికి కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు., కుంకీ ఏనుగులతో పరేడ్ నిర్వహించారు. కుంకీ ఏనుగులు పవన్ కు సెల్యూట్ చేశాయి. పవన్ కూడా గజరాజుల నుంచి వందనం స్వీకరించి, వాటికి అభివాదం చేశారు. 

కూలీగా మారి పార పట్టిన మంత్రి నిమ్మల

  ఏపీ జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో భవన నిర్మాణ కూలీగా మారి శ్రమదానం చేశారు. పాలకొల్లులో రూ.3 కోట్లతో నిర్మిస్తున్న గౌడ, శెట్టిబలిజ కల్యాణ మండపం నిర్మాణ పనులు జరుగుతుండగా మంత్రి నిమ్మల లేబర్ మారి కార్మికులతో కలిసి మంత్రి సైతం కంకర, ఇసుక, సిమెంట్‌ను తట్టల్లో మోసుకెళ్లి మిక్సర్‌లో వేశారు.  మంత్రి తమతో కలిసి పనిచేయడం చూసి కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో రూ.1.50 కోట్లతో మొదటి స్లాబ్ నిర్మాణం జరిగిందని మంత్రి నిమ్మల తెలిపారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో అరబస్తా సిమెంట్ పని నోచుకోలేదని మంత్రి వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.3 కోట్లతో పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.

ఎవరిది అగ్రికల్చరో... ఎవరిది డ్రగ్స్ కల్చరో చూడండి : సీఎం రేవంత్

  జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ 100 శాతం గెలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీల మధ్య ఫెవికాల్‌ బంధం ఉందని కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగించాం. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ ఎందుకు చేయలేని రేవంత్ ప్రశ్నించారు.  జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్‌ తెచ్చుకుంటే దేశం మొత్తం గెలిచినట్లేని ఆరోపించారు.. మరో కాంగ్రెస్ పార్టీ 8 ఏళ్లు మేమే అధికారంలో ఉంటాం. 2028 డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు రావు. 2029 జూన్‌లో జమిలి ఎన్నికలు వస్తాయి. నేను చెప్పేది రాసి పెట్టుకోండి.. 2034 జూన్‌ వరకూ కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమపై చేస్తున్న విమర్శలు సినిమాలో ఐటమ్ సాంగ్ లాగా ఉన్నాయని సీఎం అన్నారు.  శ్రీలీల ఐటమ్ సాంగ్ కు, కేటీఆర్ ప్రచారానికి ఏం తేడా లేదని రేవంత్ విమర్శించారు. సొంత చెల్లి కవితను , మాగంటి తల్లిని కేటీఆర్ అవమానించారని రేవంత్ అన్నారు. సొంత కుటుంబాన్నే సరిగ్గా చూసుకోలేని వ్యక్తి రాష్ట్రాన్ని సరిగ్గా చూసుకుంటాడా? అనిప్రశ్నించారు.  రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే నోరెత్తని కిషన్ రెడ్డి.. గుజరాత్ కు గులాంగిరీ చేస్తూ.. తనపై ఒంటికాలిపై లేస్తున్నారని ఎద్దేవా చేశారు. తనపై ఎగిరితే ఏమీ రాదని, ఏమన్నా ఉంటే ప్రధాని మోదీ దగ్గర మాట్లాడాలని సూచించారు. కేటీఆర్ తో కిషన్ రెడ్డి చెడు స్నేహం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలనలో  ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు,  రేషన్ కార్డులు, సన్నబియ్యం ,రూ.500కే గ్యాస్ సిలిండర్, సంక్షేమ పధకాలను అమలు చేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.  ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన  రాష్ట్రంగా తెలంగాణను నిలిచిందని తెలిపారు. కులగణన చేశామని సీఎం అన్నారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 20 వేలకు పైగా నోటిఫికేషన్లు ఇచ్చామని. మరో 60 వేలకు పైగా ఉద్యోగాలకు భర్తీ చేశామని సీఎం అన్నారు. ఎవరిది అగ్రికల్చర్.. ఎవరిది డ్రగ్స్ కల్చర్ మీరే ఆలోచించండి. ఎవరిది పబ్ కల్చర్.. ఎవరిది సామాన్యులతో కలిసే కల్చర్. ఎవరు సినీ తారలతో తిరిగే కల్చర్.. ఎవరిది సినీ కార్మికుల కోసం కృషి చేసే కల్చర్ మీరు ఆలోచించండిని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.  

ఒక్క ఛాన్స్ పేరుతో ఏపీ నష్టపోయింది... బీహార్‌కి ఆ పరిస్థితి రావద్దు : లోకేష్

  వికసిత్ భారత్ లక్ష్యసాధనలో బీహార్ పాత్ర చాలా కీలకమైంది. బీహార్ సర్వతో ముఖాభివృద్ధికి మరోమారు బీహార్ యువత ఎన్ డీఏను గెలిపించాల్సిందిగా  ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాట్నా వెళ్లిన లోకేష్... అక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... నేను ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఇక్కడకు రాలేదు. బాధ్యతాయుతమైన భారతీయుడిగా ఇక్కడకు వచ్చాను. బీహార్ లో జరగబోయే ఈ ఎన్నిక భారత రాజకీయాల్లో ఎంతో కీలకమైనది.  బీహార్ యువత మరోమారు ఎన్ డీఏని ఎందుకు గెలిపించాలో చెప్పడానికే ఇక్కడకు వచ్చాను. మూడు కారణాలతో ఇక్కడ ప్రజలు ఎన్ డీఏని గెలిపించాలి. ఏపీలో 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో వైసీపీ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం వల్ల శాంతిభద్రతలు క్షీణించి పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. దానివల్ల మా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. అటువంటి పరిస్థితులు బీహార్ లో తెచ్చుకోవద్దని బీహార్ యువతకు విజ్ఞప్తి చేస్తున్నా. బీహార్ అభివృద్ధి కోసం ఎన్ డీఏను మరోమారు గెలిపించాలి. బీహార్ లో మూడు కారణాల వల్ల ఎన్ డీఏ ని గెలిపించాల్సిన అవసరం ఉంది.        లీడర్ షిప్ ట్రాక్ రికార్డు – స్వచ్ఛమైన, అవినీతిరహిత పాలన కోసం ఎన్ డీఏని గెలిపించాలి.ప్రధాని మోదీ బీహార్ రూపురేఖలు మార్చేశారు. బీహార్ లో నాని నరేంద్ర మోడీ , నితీష్ కుమార్ నాయకత్వం ఉంది. ఏపీలో నరేంద్ర మోడీజీ, నాయుడు  నాయకత్వం ఉంది. విజన్, సమర్థతతో వారు పాలన చేస్తున్నారు. ప్రధాని మోడీ వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో బీహార్ పాత్ర చాలా పెద్దది. బీహార్ ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే ఆయన లక్ష్యం.  డబుల్ ఇంజన్ సర్కారు – బీహార్, ఆంధ్రప్రదేశ్ లో ఎన్ డీఏ భాగస్వామ్య ప్రభుత్వాలు ఉండటం వల్ల కేంద్రబడ్జెట్ లో భారీగా నిధులు లభిస్తున్నాయి. మౌలిక సదుపాయాలు, విద్యాసంస్థలకు కేంద్రం సహకరిస్తోంది. అంతేగాక కేంద్రం తీసుకునే విధానపరమైన నిర్ణయాల్లో రాష్ట్రాల్లో ఎన్ డీఏ భాగస్వామ్య పక్షాల భాగస్వామ్యం ఉంటుంది. వివిధ పరిశ్రమలు రావడానికి కేంద్రం మద్దతు లభిస్తుంది. ఎన్ డీఏ ప్రభుత్వంలో శాంతిభద్రతలు ఉండటంతో పెద్దఎత్తున అభివృద్ధి సాధించడానికి ఆస్కారమేర్పడుతుంది. ప్రభుత్వాల కొనసాగింపు చాలా ముఖ్యం. గుజరాత్, ఒడిశా రాష్ట్రాలు ప్రభుత్వాల కొనసాగింపు వల్ల పెద్దఎత్తున అభివృద్ధి సాధించాయి. బీహార్ లో జంగిల్ రాజ్ పాలన పోయి నితీష్ కుమార్ ప్రభుత్వం వచ్చాక శాంతిభద్రతలు బాగుండటంతో పాట్నా ఎంతో అభివృద్ధి సాధించిందని బీహార్ ఇండస్ట్రీ అసోసియేషన్ నాయకులు చెప్పారు.  ఆంధ్రప్రదేశ్ లో మా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త నినాదం ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే మైక్రో, స్మాల్, మీడియం పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నారు.  బీహార్ లో ఒక పార్టీ ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెబుతోంది. ఆచరణ సాధ్యం కాని హామీలను బీహార్ యువత నమ్మవద్దు. ఎన్ డీఏ భాగస్వామిగా చెబుతున్నాం. రాష్ట్రాలు బలంగా ఉంటేనే భారతజాతి బలోపేతమవుతుంది. ప్రధాని మోడీజీ బీహార్ రూపురేఖలు మార్చేశారు. డబుల్ ఇంజన్ సర్కారు కారణంగానో బీహార్, ఏపీలకు కేంద్రంనుంచి పెద్దఎత్తున నిధులు లభిస్తున్నాయని మంత్రి లోకేష్ చెప్పారు. విలేకరుల సమావేశంలో బీహార్ స్టేట్ మీడియా విభాగం హెడ్, ఎమ్మెల్సీ సంజయ్ మయూక్, పార్లమెంటు సభ్యులు సానా సతీష్, గంటి హరీష్, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.  

కేసీఆర్ పిలిస్తే వెళ్తా... కవిత సంచలన వ్యాఖ్యలు

  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్న… ఇప్పుడు కూడా గత ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ తిరగడం… జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో చేయడం తప్ప ప్రజల సమస్యలపై...అభివృద్ధిపై శ్రద్ధ పెట్టడం లేదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వరంగల్ జిల్లాలో జాగృతి జనం బాట కార్యక్రమంలో అన్నారు.  వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా... జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. ముందుగా పట్టణంలోని అమరవీరుల స్థూపానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని కాకతీయుల కాలంలో నిర్మించిన మాదన్నపేట చెరువును సందర్శించి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు.  కట్ట పై గల శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళాశాలల అధ్యాపకులు ఫీజు రియంబర్స్మెంట్ పై వినతిపత్రం జాగృతి అధ్యక్షురాలు కవితలు అందించారు. అనంతరం కవిత మాట్లాడుతూ... జాగృతి జనం బాటలో కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గాలలోని ప్రజలకు సమస్యలు తెలుసుకుని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కోసం ఈ జాగృతి జనం బాట కార్యక్రమం చేపట్టామన్నారు. అందులో భాగంగా ఈరోజు నర్సంపేట నియోజకవర్గం రావడం జరిగిందని నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని అన్నారు.  ముఖ్యంగా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని మాదన్నపేట చెరువుకు సంబంధించి పట్టేవాగుపై లో లెవెల్ వంతెన నిర్మాణంతోపాటు... చెరువు మత్తడి ఎత్తు పెంచి నిర్మించవలసి ఉన్నదని... ఆ విధంగా నిర్మించినట్లయితేనే ఈ ప్రాంత రైతులకు లాభం చేకూరుతుందని తెలిపారు. లో లెవెల్ వంతెన మత్తడి ఎత్తు పెంచేందుకు ఇంతకుముందే టెండర్ అయినట్టు తెలిసిందని, ఆ రెండు నిర్మించలేదని ఈ రెండిటిపై స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టి పెట్టాలని డిమాండ్‌ చేశారు. నర్సంపేట పట్టణంలోని నల్లవెల్లి మార్గం రోడ్ అంతా గుంతలు ఏర్పడిందని ఎప్పటికప్పుడు రోడ్లు మరమ్మతులు చేయవలసి బాధ్యత ప్రభుత్వం పై ఉంటుందని అన్నారు.  ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న ఇప్పుడు కూడా గత ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేయడం తప్ప ప్రజల సమస్యపై కానీ అభివృద్ధి పైన కానీ ముఖ్యమంత్రి శ్రద్ధ చూపడం లేదు అన్నారు. అదేవిధంగా నర్సంపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజీలోను అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం పూర్తి చేయలేదని 150 పడకల ఆసుపత్రి తగ్గట్టు ఇంతవరకు ఏర్పాట్లు పూర్తి కాలేదని ఈ సమస్యపై శ్రద్దపెటంటలని అన్నారు.  మొంథా తుఫాను ప్రభావంతో పంటను నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తామని మొక్కుబడిగా సమావేశం నిర్వహించారని అన్నారు. అధికారులను లోతుగా సర్వే చేయించి రైతులందరికీ వెంటనే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని, అదేవిధంగా... కళాశాలలకు సంబంధించి ఫీజ్‌ రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి అవమానకరంగా బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు షోకాజు నోటీసు కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశారని తెలిపారు. తండ్రిగా కేసీఆర్ పిలిస్తే ఇంటికి వెళ్లానని కానీ బీఆర్‌ఎస్‌కు తనకు సంబంధం లేదని స్ఫష్టం చేశారు. ఈ చర్య వెనుక పార్టీలోని కొందరి కుట్ర ఉందని  ఆరోపించారు.

తెలంగాణ పోలీసుల ఆపరేషన్...81 మంది అరెస్ట్

  తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఐదు రాష్ట్రాల్లో సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించింది. సైబర్‌ మోసాల్లో పాల్పడుతున్న 81 మందిని ఏపీ, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల్లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. దర్యాప్తులో భాగంగా నిందితులపై దేశవ్యాప్తంగా 754 కేసులు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. మొత్తం రూ.95 కోట్ల విలువైన మోసాలు జరిపినట్లు తేలింది. అరెస్టు చేసిన వారిలో 17 మంది ఏజెంట్లు, 7 మంది మహిళలు ఉన్నారు. అలాగే 58 మంది మ్యూల్‌ ఖాతాదారులు (మోసపూరిత డబ్బు బదిలీకి ఉపయోగించే వారు) ఉన్నట్లు గుర్తించారు. వారి వద్ద నుండి 84 మొబైల్‌ ఫోన్లు, 101 సిమ్‌ కార్డులు, 89 బ్యాంకు పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఖాతాల్లో ఉన్న కోట్ల రూపాయల నగదును ఫ్రీజ్‌ చేశారు. ఈ మొత్తాన్ని బాధితులకు తిరిగి అందించే చర్యలు సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో చేపడుతోంది.

దొంగ, పోలీస్‌ ఆటాడించి అత్తను చంపిన కోడలు

  అత్త కోడలు మధ్య విభేదాలు సహజంగా ఉంటాయి. కానీ ఆ కోడలు ప్రేమతో అత్తతో దాగుడుమూతలు ఆట ఆడింది. నిజంగా అన్యోన్య భావంతో కోడలు ఆటాడిందని పొరపాటు పడొచ్చు. ఆ ఆట వెనక ఓ హత్య ఉంటుందని అత్తకు తెలియ లేదు. ఓ నిండు ప్రాణం ఆ ఆటలో ఆగిపోయింది. విశాఖలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు  సంచలనంగా మారింది.  ఆ దాగుడుమూతల ఆటలో ఏం జరిగింది విశాఖ నగర శివారు సింహాచలం దగ్గర అప్పన్నపాలెం వద్ద వర్షిని అపార్ట్మెంట్లో జయంతి కనకమాలక్ష్మి అనే వృద్ధురాలు నివసిస్తున్నారు. ఆమె కుమారుడు పురోహితుడు. భార్య ఇద్దరు పిల్లలు 66 సంవత్సరాల ఆ  తల్లితోపాటు భార్య తల్లి కూడా ఆ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. ఈ దశలో ఈనెల 7వ తేదీన కోడలు లలిత అత్త కనక మహాలక్ష్మి తో దాగుడుమూతలు ఆట ఆడాలని చెప్పింది దీనికి పిల్లలను కూడా పిలిచి నాన్నమ్మకు కుర్చీలో కూర్చోబెట్టి చేతులు కాళ్లకు తాళ్లు కట్టి దాగుడుమూతల ఆట ఆడాలని చెప్పింది .  దాంతో పిల్లలు ఆమె కలిసి అత్త కనక మహాలక్ష్మికి చేతులు కాళ్లు కుర్చీకి కట్టేశారు ఆటలో భాగంగా చిన్న పిల్లలు గదుల్లో దాక్కున్నారు. ఆ తర్వాత కొంత సేపటికి మంటలతో అత్త కనకమహాలక్ష్మి కేకలు వేస్తూ మంటల్లో తాళ్లు తెగిపోవడంతో హాల్ నుంచి దేవుడు గదిలోకి పరుగులు తీసింది ఆ కేకలు విని గదిలో ఉన్న మనవరాలు కూడా రావడంతో ఆమె కూడా మంటలకు గాయపడింది కొద్దిసేపటికి కోడలు లలిత తల్లి కూడా బయటకు వచ్చి మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు కానీ అప్పటికే తీవ్రమైన మంటల గాయాలతో కనక మహాలక్ష్మి కుప్పకూలి చనిపోయారు.. .. అతను అంతం చేసేందుకు కోడలు ట్రిక్.. .. ఒక ఇంట్లో అత్తా కోడలు నివాసం ఉండడంతో మనస్పర్ధలు ఇటీవల ఏర్పడ్డాయి తరచూ తనపై భర్తకు అత్త విషయాలు చెప్పడంతో ఆయన తనను నిందిస్తున్నారని కోడలు లలిత కోపం పెట్టుకుంది. అత్తను చంపేస్తే మంచిదని నిర్ణయించింది దీనికోసం హౌ టు కిల్ అనే యూట్యూబ్ వీడియోలను పరిశీలించింది అందులో హౌ టు కిల్ ఓల్డ్ లేడీ అనే వీడియో ఆమెను ఆకట్టుకుంది.  ఆ ప్రకారం అతను దాగుడుమూతలు ఆట ఆడుదామని చెప్పి లలిత పద్ధతి ప్రకారం చంపేసింది. ముందుగా పిల్లలతో కలిసి కుర్చీలో అత్తకు కాళ్ళు చేతులు కాళ్లతో కట్టి కట్టి వాళ్లు గదుల్లో దాక్కునగా ముందు రోజు తీసుకు వచ్చిన పెట్రోల్ అత్తపై పోసి కోడలు లలిత నిప్పు అంటించింది. మంటల్లో కాలి చనిపోతుందని ఆమె లలిత భావించింది. ఆ క్రమంలోనే అతను హత్య చేసింది. .. నిందితురాల్ని పట్టించిన రెండు కారణాలు  .. సాంప్రదాయ రీతిన జీవనం సాగించే ఇంటిలో జరిగిన ఈ ఘటన పై ఎవరికి అనుమానం రాలేదు. అత్త దాగుడుమూతలు ఆట ఆడుతుండగా టీవీ వైర్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి కాలిపోయారని కోడలు లలిత ముందుగా పోలీసులు చెప్పారు. దీంతో పోలీసులు కూడా అనుమానించలేదు. అయితే ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడగా అత్త దేవుడికి దీపం పెడుతుండగా మంటలు చెలరేగి ప్రమాదం జరిగిందని చెప్పారు  పరస్పర విరుద్ధమైన ఈ రెండు కారణాలు ఆ కోడలు ఎందుకు చెప్పారని పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో ఉదయం 8 గంటలకు ఈ ఘటన చోటు చేసుకోగా పోలీసుల విచారణలో రాత్రి 11:30 గంటలకు నిజం బయటికి వచ్చింది. తానే హత్య చేసినట్టు కోడలు లలిత అంగీకరించింది.. హౌ టు కిల్ ఓల్డ్ లేడీ అనే వీడియో ను ఆధారంగా ఈ కోడలు అత్తను అమానుషంగా చంపేసింది. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

ప‌వ‌న్ చెప్పిన‌...ఎర్ర‌చంద‌నం కొత్త సెంటిమెంట్ క‌థ‌!

  శేషాచలంలో మాత్ర‌మే పెరిగే ఎర్ర‌చంద‌నం చెట్ల వెన‌క ఉన్న ఒకానొక ఆధ్యాత్మిక గాథ‌ను వెలుగులోకి తెచ్చారు డిప్యూటీ సీఎం, అట‌వీ శాఖా మంత్రి కూడా అయిన ప‌వ‌న్ క‌ళ్యాన్‌. గ‌తంలో ఈ ప్రాంతంలో సంచ‌రించిన వెంక‌టేశ్వ‌ర‌స్వామివారికి గాయం అయ్యింద‌ని. ఆ గాయం  కార‌ణంగా ర‌క్తం చిందింద‌ని. ఆ ర‌క్త‌మే  ఇక్క‌డి గంధ‌పు చెట్ల‌కు అంటి అవి ఎర్ర‌చంద‌నం చెట్లుగా మారాయ‌ని అన్నారాయ‌న‌. ఇంత‌టి డివైన్ స్టోరీస్ ఈ రెడ్ శాండ‌ల్ ట్రీస్ వెన‌క దాగి ఉన్నాయి కాబ‌ట్టి.. ఎవ్వ‌రూ వీటి స్మ‌గ్లింగ్ కి పాల్ప‌డ వ‌ద్ద‌ని సూచించారు. కొన్నాళ్ల పాటు చూసి ఇలాంటి రెడ్ స్మ‌గ్ల‌ర్ల ప‌ట్ల తాము క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నామ‌ని కూడా వార్న్ చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. అదెలా ఉండ‌బోతుందంటే ఇప్ప‌టికే తాము నాలుగు కింగ్ పిన్స్ ని ఐడెంటిఫై చేశామ‌నీ.. ఇలాంటి వారి కింద  ప‌ని చేసే చోటా మోటా సాధార‌ణ  కూలీల‌తో స‌హా త‌మ వ‌ద్ద వివ‌రాలున్నాయ‌ని.. ఎవ‌రైనా స‌రే వ‌చ్చే రోజుల్లో ఈ ఎర్ర‌చంద‌నం  స్మ‌గ్లింగ్ ని గానీ కంటిన్యూ చేస్తే.. వారిని ఆప‌రేష‌న్ క‌గార్ లా.. మ‌రో కొత్త ఆప‌రేష‌న్ని నిర్వ‌హించి.. ఈ రెడ్ స్మ‌గ్ల‌ర్ల‌ను స‌మూలంగా నాశ‌నం  చేస్తామ‌ని హెచ్చ‌రించారు. ఇప్ప‌టికే రెడ్ శాండ‌ల్ దేశాంత‌రాలు దాటుతోంద‌ని.. ఇక్క‌డి శేషాచ‌లం కొండ‌ల్లో మాత్ర‌మే  పెరిగే  ఎర్ర‌చంద‌నం ఎక్కోడో నేపాల్లో ప‌ట్టుబ‌డుతోంద‌ని అన్నారు డీసీఎం ప‌వ‌న్. ఇటీవ‌ల మొత్తం ఐదు రాష్ట్రాల‌తో తాము ఒప్పందం చేసుకున్నామ‌నీ.. ఈ ఒప్పందంలో భాగంగా ఎక్క‌డ ఎర్ర‌చంద‌నం దుంగ‌లు ప‌ట్టుబ‌డ్డా వాటిని  ఏపీకి అప్ప‌గించాల‌న్న టై- అప్ చేస్తున్న‌ట్టు చెప్పారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఇటీవ‌ల ఒక రాష్ట్రం వారు త‌మ‌కు ప‌ట్టుబ‌డ్డ ఎర్ర‌చంద‌నం దుంగ‌ల‌ను అమ్మితే ఏకంగా వంద కోట్ల‌కు పైగా  సొమ్ము వారి రాష్ట్ర ఖ‌జానాకు అందివ‌చ్చింద‌ని అన్నారు ప‌వ‌న్. తాము అడ‌వుల్లోకి వెళ్లి చూడ‌గా.. ఎర్ర‌చంద‌నం చెట్టు ఒక్క‌టీ  స‌జావుగా క‌నిపించ‌లేద‌నీ.. అన్ని చెట్ల‌ను న‌రికివేసిన‌ట్టు గుర్తించామ‌నీ చెప్పుకొచ్చారు ప‌వ‌న్.. ఇలా చేస్తే ఈ ప్రాంత  జియోగ్రాఫిక‌ల్ ఐడెంటిఫికేష‌న్ గా ఉన్న ఈ ఎర్ర‌చంద‌నం చెట్టు కొన్నాళ్ల‌కు పూర్తిగా క‌నుమ‌రుగై పోతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ప‌వ‌న్. ఇప్ప‌టికే ల‌క్ష‌లాది చెట్ల‌ను న‌రికి, కోట్లాది రూపాయ‌ల‌ను వెన‌కేశార‌నీ.. ఇలాంటి  నేరం ఘోరం ఇక‌పై జ‌ర‌గ‌గ‌డానికి వీల్లేదంటూ.. సాక్షాత్ ఆ వెంక‌టేశ్వ‌ర స్వామి  ర‌క్తంతో త‌డిసిన  ఈ చెట్ల ప‌ట్ల  అంద‌రూ జాగ్ర‌త్త వ‌హించాల‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌ట్టుబ‌డ్డ దుంగ‌ల‌ను ప‌రిశీలించారు ప‌వ‌న్. వీటి విలువ ఐదు వేల కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా.  ఇదిలా ఉంటే.. గ‌తంలో టాస్క్ ఫోర్స్ వారు త‌మ‌కు ప‌ట్టుబ‌డ్డ త‌మిళ‌నాడు స్మ‌గ్ల‌ర్ల చేత వెంక‌టేశ్వ‌ర‌స్వామి వారిపై ఒట్టు వేయించేవారు. ఈ సెంటిమెంటు ద్వారానైనా త‌మిళ‌నాడు జావాదిమ‌లై వంటి ప్రాంతాల నుంచి వ‌చ్చే స్మ‌గ్ల‌ర్ల‌ను అరిక‌ట్టాల‌ని చూశారు. ఆపై ఎన్ కౌంట‌ర్లు చేయ‌డం, అటు పిమ్మ‌ట‌ చెట్ల కోసం మ‌నుషుల‌ను చంపుతారా!? అంటూ త‌మిళ‌నాట పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం కావ‌డం  తెలిసిందే. ప‌వ‌న్ హెచ్చ‌రిక‌ల‌ను బ‌ట్టీ చూస్తుంటే.. మ‌ళ్లీ అలాంటి ఉప‌ద్ర‌వం ఏదో జ‌ర‌గ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ప‌వ‌న్ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో  స్మ‌గ్ల‌ర్లు వెన‌క్కు త‌గ్గుతారా? లేక‌.. ఎప్ప‌టిలాగా లైట్ తీస్కుని త‌మ న‌రుకుడు తాము చేస్కుంటూ పోతారా; తేలాల్సి ఉంది.

తిరుమలలో భక్తుల రద్దీ

  తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నాయి. దీంతో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న(శనివారం) శ్రీవారిని 80,560 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,195 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.22 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.  రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. ఆదివారం ఉద‌యం స్వామివారి సుప్ర‌భాత సేవ‌లో పాల్గొన్నారు. ఉద‌యం ఆల‌యానికి చేరుకున్న ముఖేశ్ అంబానీకి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అధికారులు స్వాగ‌తం ప‌లికి ద‌ర్శన ఏర్పాట్లు చేశారు. అనంత‌రం రంగ‌నాయ‌కుల మండ‌పంలో పండితులు శాలువా క‌ప్పి వేదాశీర్వ‌చ‌నం చేశారు. అనంత‌రం స్వామివారి తీర్థ‌ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు.

రైతులకు మద్దతుగా పోలీసు స్టేషన్ వద్ద అవినాష్ రెడ్డి ధర్నా

  కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం  లింగాల మండలంలో విపరీతంగా, విచ్చల విడిగా రైతులకు సంబంధించిన వ్యవసాయ విద్యుత్  మోటార్ల కేబుల్స్ చోరీకి గురవుతన్నాయని, వెంటనే అరికట్టి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం లింగాల పోలీసు స్టేషన్ ఎదుట కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రైతులతో కలిసి బైఠాయించారు.  లింగాల మండల పరిధిలోని పలు  గ్రామాల్లో రైతులకు సంబంధించిన వ్యవసాయ విద్యుత్ మోటార్లు కేబుల్ వైర్లను దొంగలించడంతో రైతులందరూ ఎం.పి వై.ఎస్ అవినాష్ రెడ్డినికలసి ఫిర్యాదు చేశారు. దీంతో ఎం.పి వై.ఎస్ అవినాష్ రెడ్డి  రైతులతో  లింగాల ఎస్.ఐ అనిల్ కుమార్ ను కలసి ఇటీవల రైతుల కేబుల్ వైర్లు దొంగతనాల పై చర్చించారు. అలాగే ఈ దొంగతనాల పై షెల్కే నచికేతన్ విశ్వనాథ్ తో కూడ ఫోన్ లో మాట్లాడారు. వీలైనంత త్వరగా దొంగలను  పట్టుకొని కఠినంగా శిక్షించి రికవరీ చేయించాలని కోరారు.       అనంతరం ఎం.పి  రైతులతో కలసి లింగాల పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గత కొన్ని రోజులుగా మండల పరిధిలోని పలు గ్రామాల్లో రైతుల వ్యవసాయ మోటార్ల కేబుల్ వైర్లను దొంగలు చోరీ చేయడంతో రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.  నిన్న రాత్రి ఒక్క రోజే 40 మంది రైతులకు సంబంధించిన కేబుల్స్ చోరీకి గురయ్యాయన్నారు.  రైతుల కేబుల్స్ దొంగతనాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తోందని ఆయన ప్రశ్నించారు.   కొమ్మనూతల గ్రామానికి చెందిన  పురుషోత్తమరెడ్డి భార్యకు సంబంధించి 1000 మీటర్ల కేసుబ్ చోరీ గురి కావడంతో రూ.2.5 లక్షలు నష్టపోయారన్నారు.  ఈ విషయాన్ని ఎస్.ఐ దృష్టికి తీసుకెళ్లడంతో త్వరలో రికవరీ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. రైతులకు జరుగుతున్న  నష్టాన్ని గుర్తించి రికవరీ విషయంలో శ్రద్ధ చూపాలని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లామన్నారు.   ప్రస్తుతం అరటి పంట కు టన్ను రూ.4 వేలు, 5 వేలు అడుగు తుండడంతో  రైతులు ఆర్థికంగా చితికి పోతున్నారన్నారు.   దీనికి తోడు దొంగలు ఇష్టానుసారంగా రైతుల కేబుల్ వైర్లను తస్కరించడంతో రైతుల బాధ వర్ణణాతీతమన్నారు. వీలైనంత త్వరగా కేబుల్ వైర్ల దొంగలను పట్టుకుని వైర్లు రికవరీ చేయాలని, అలాగే కేబుల్ వైర్ లోని రాగి వైరు కొన్న వారిని కూడ అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నట్లయితే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావన్నారు.  కేబుల్ వైర్లు పోయిన రైతులకు నష్టపరిహారం కూడ అందేలా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు.సాగుచేసిన పంటలకుగిట్టు బాటు ధరలు లభించక రైతులు ఇబ్బందులు పడుతుంటే నేడు మోటార్ కేబుల్స్ చోరీకి పాల్పడు తుండండతో ఆర్థికంగా మరింత ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారన్నారు.  తప్పుడు పనులు చేసే వారు మానుకోవాలని, రైతుల పొట్ట కొట్ట వద్దని ఎం.పి వై.ఎస్ అవినాష్ రెడ్డి కోరారు.

సీఎం రేవంత్‌రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువ

  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పుట్టినరోజు సందర్బంగా రాజకీయ ప్రముఖులతో పాటు సినీ సెలబ్రిటీలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ .. సీఎంకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కర్నాటక సీఎం సిద్దరామయ్య, తమిళనాడు సీఎం స్టాలిన్,  రేవంత్‌రెడ్డికి   పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి నారా లోకేష్ కూడా ఆయన బర్త్ డే విషెస్ తెలిపారు. ఆయన ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ట్వీట్టర్‌లో ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు పవన్ పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, సందీప్ రెడ్డి వంగా, రామ్ చరణ్, నాగవంశీ, ఎక్స్ లో బర్త్ డే విషెస్ చెప్పారు. పాలమూరు నెల నుంచి రాష్ట్రం ఆకాశం వరకు మీ ప్రయాణం వికాసించాలని సందీప్ రెడ్డి వంగా ఆకాంక్షించారు.  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు కేబినెట్ మంత్రులు, అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మరియు ఇతర పార్టీల నాయకులు స్వయంగా కలిసి లేదా సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించేందుకు ఆయనకు ఈ జన్మదినం మరింత శక్తిని ఇవ్వాలని నేతలు ఆకాంక్షించారు.ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం రేవంత్ కు ఎక్స్ లో బర్త్ డే విషెస్ చెప్పారు

ఎర్రచందనం జోలికి వెళ్తే తాట తీస్తాం.... పవన్ వార్నింగ్

  ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వారి తాట తీస్తామని డిప్యూటీ సీఎం పవన్  కళ్యాణ్ హెచ్చరించారు. ఎర్రచందనం చెట్లను వెంకటేశ్వర స్వామి తన రక్తంతో సృష్టించారని డిప్యూటీ సీఎం తెలిపారు. ఎర్ర చందనం చెట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే లా అండ్ ఆర్డర్ తో పాటు ఎర్రచందనం స్మగ్లింగ్ పై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.  వైసీపీ హయంలో భారీగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందని వెల్లడించారు. ఆన్ రికార్డు ప్రకారం లక్షా 30 వేల ఎర్రచందనం చెట్లను అడ్డగోలుగా నరికేశారని వీటి విలువ రూ. 2 నుంచి 5 వేల కోట్లు ఉంటుందని పవన్ తెలిపారు. అనధికారికంగా రూ.8 నుంచి 10 వేల కోట్ల స్మగ్లింగ్ జరిగిందని పేర్కొన్నారు.ఆపరేషన్ కగార్ లాగా ఇక్కడ మరో ఆపరేషన్ చేపడతామని ఎర్ర చందనం చెట్లు కొట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకువస్తామని పవన్ అన్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్న కింగ్ పిన్ లను త్వరలోనే పట్టుకుంటామని డిప్యూటీ సీఎం స్ఫష్టం చేశారు. తిరుపతి జిల్లా మంగళంలో ఉన్న అటవీశాఖ ఎర్రచందనం గోడౌన్‌ను పవన్ కళ్యాణ్  పరిశీలించారు. అక్కడ ఉన్న 8 గోడౌన్లో నిల్వ చేసిన ఎర్రచందనం లాట్ల వివరాలను తెలుసుకున్నారు. ఎ, బి, సీ మరియు నాన్‌గ్రేడ్‌ల వారీగా దుంగల వివరాలు తెలుసుకొని రికార్డులు పరిశీలించారు. ప్రతి గోడౌన్లో రికార్డులను పరిశీలించిన అనంతరం, ప్రతి ఎర్రచందనం దుంగకు ప్రత్యేక బార్‌కోడ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. పట్టుబడిన నాటి నుండి విక్రయమయ్యే వరకు ఒక్క దుంగ కూడా మిస్ అవ్వకుండా కఠినమైన పర్యవేక్షణ ఉండాలని తెలిపారు.

పొలాల్లో నాటుకోళ్లు వదిలి వెళ్ళిన దుండగులు.. ఎగబడ్డ జనం

  హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి  సిద్దిపేట జాతీయ రహదారి వెంట సుమారు 2000 కోళ్లను గుర్తు తెలియని వ్యక్తులు వదిలిపోవడంతో అక్కడి ప్రజలు కోళ్ల కోసం ఎగబడ్డారు. రోడ్డంతా కోళ్లతో నిండిపోవడంతో ఆసక్తిగా వాటిని పట్టుకునే హడావుడి సాగింది.  డీసీఎం వ్యాన్‌లో వచ్చిన దుండగులు ఎలుకతుర్తి మండలం మోడల్ స్కూల్ వద్ద  పొలాల్లో వదిలారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతుండగా, అధికారులు వెంటనే స్పందించారు. నాటు కోళ్లను పట్టుకున్న వారు అవి తినకూడదని హెచ్చరించారు. ఆ కోళ్లను పరీక్ష నిమిత్తం వరంగల్‌కు పంపించాలని సూచించారు. పరీక్ష ఫలితాలు వచ్చే వరకు ఎవరు తినకూడదని సోషల్ మీడియా ద్వారా అధికారుల విజ్ఞప్తి చేశారు.  

ఒలంపిక్స్‌లో భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ లేనట్లే!

  అంతర్జాతీయ టోర్నీల్లో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే క్రికెట్‌ అభిమానులకు ఉత్కంఠ పెరిగిపోతుంది. అయితే, 2028 ఒలింపిక్స్‌లో మాత్రం దాయాదుల పోరు జరిగే అవకాశాలు కన్పించట్లేదు. ఐసీసీ రూపొందించిన కొత్త రూల్స్‌తో భారత్‌-పాక్‌ మ్యాచ్‌జరగడం అనుమానమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుదీర్ఘకాలం తర్వాత ఒలింపిక్స్‌లో ఈసారి క్రికెట్‌ను కూడా చేర్చిన సంగతి తెలిసిందే.  2028లో లాస్‌ ఏంజెలెస్‌ వేదికగా జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఎలా నిర్వహించాలన్న దానిపై ఐసీసీ కొన్ని నిబంధనలు రూపొందించింది. తాజాగా దుబాయ్‌లో జరిగిన సమావేశంలో వీటిని ఖరారు చేసినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ఆరు జట్లు చొప్పున పురుషులు, మహిళల జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. ప్రాంతీయ అర్హతతో ఈ జట్లను ఎంపిక చేయాలని ఐసీసీ నిర్ణయించినట్లు సమాచారం. ఈ లెక్కన ఆసియా, ఓషియానియా, యూరప్‌, ఆఫ్రికా రీజినల్స్‌లో టాప్‌లో ఉన్న జట్లకు ఒలింపిక్స్‌లో నేరుగా ప్రవేశం లభిస్తుంది.  ఇక ఆతిథ్య దేశానికి చోటు దక్కనుంది. ఆరో జట్టును క్వాలిఫయర్‌ రౌండ్‌ ఏర్పాటుచేసి నిర్ణయిస్తారు. ఐసీసీ ర్యాంకుల ప్రకారం ఆసియా నుంచి భారత్‌, ఓషియానియా నుంచి ఆస్ట్రేలియా, ఆఫ్రికా నుంచి దక్షిణాఫ్రికా, యూరప్‌ నుంచి ఇంగ్లాండ్‌ జట్లు అర్హత సాధించే అవకాశం ఉంది. ఈ ఒలింపిక్స్‌కు అమెరికా, వెస్టిండీస్‌ ఆతిథ్యం కల్పిస్తున్నాయి. ఈ రెండింటిలో ఒక జట్టును ఎంపిక చేయనున్నారు.  ఇక, ఆరో స్థానం కోసం క్వాలిఫయర్‌ పోటీలపై త్వరలోనే ఐసీసీ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఒలింపిక్స్‌ గ్లోబల్‌ ఈవెంట్‌ కనుక అన్ని ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం ఉండేందుకు ఒక్కో రీజియన్‌ నుంచి ఒక్కో జట్టును ఎంపిక చేసి క్వాలిఫయర్‌ రౌండ్‌ నిర్వహించే అవకాశం ఉంది. అలా చూస్తే ఆసియాలో ర్యాంకింగ్స్‌ ప్రకారం పాక్‌కు ప్రాతినిధ్యం దక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.  అదే జరిగితే ఈ టోర్నీలో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ఉండకపోవచ్చంటున్నారు.128 ఏళ్ల తర్వాత 2028లో జరగనున్న ఒలింపిక్స్‌లో ఈసారి క్రికెట్‌కు చోటు దక్కింది. టీ20 ఫార్మాట్‌లో పురుషులు, మహిళల జట్లు బరిలోకి దిగనున్నాయి. ఒలింపిక్స్‌లో తొలిసారి, చివరిసారిగా 1900 సంవత్సరంలో క్రికెట్‌ నిర్వహించారు. అప్పుడు డెవాన్‌ అండ్‌ సోమర్‌సెట్‌ వండరర్స్‌ క్లబ్‌ (బ్రిటన్‌), ఫ్రెంచ్‌ అథ్లెటిక్‌ క్లబ్‌ యూనియన్‌ (ఫ్రాన్స్‌) మధ్య రెండు రోజుల మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్‌లో బ్రిటన్‌ విజేతగా నిలిచింది.  

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక దృష్ట్యా సీపీ ఆంక్షలు జారీ

  జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 9  సాయంత్రం 6 గంటల నుంచి   11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమలు ఉంటాయిని నోటిఫికేషన్ విడుదల చేశారు. కౌంటింగ్ సందర్భంగా నవంబర్ 14 ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు..  ప్రజాశాంతి, భద్రత కోసం జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ అమల్లో ఉండనున్నట్లు తెలిపారు. ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది ఒక్కచోట గుంపుగా ఉండొద్దని సూచించారు. పోలింగ్ కేంద్రాల నుంచి 200 మీటర్ల వరకు ఈ రూల్ వర్తిస్తుందని తెలిపారు. ఈ నిర్దేశించిన సమయాల్లో నియోజవర్గంలో పరిధిలోని మద్యం దుకాణాలు , రెస్టారెంట్‍లు, క్లబ్బులు మూసివేయాలని సీపీ ఆదేశించారు. జూబ్లీహిల్స్ నియెజకవర్గ పరిధిలో ఎవ్వరూ బాణాసంచా పేల్చొద్దని  సీపీ వీసీ సజ్జనార్ సూచించారు.

వివేకా హత్య కేసులో కీలక పరిణామం...ఆ ఇద్దరిపై కేసు

  మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇద్దరు పోలీసు అధికారులపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాజుపాలెం పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డిలపై కేసు నమోదు చేశారు. వివేకా హత్య వ్యవహారంలో గతంలో వీరు తప్పుడు కేసులు నమోదు చేశారు.  పులివెందులకు చెందిన కుళాయప్ప అనే వ్యక్తి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. .వివేకా హత్య కేసులో సునీత, రాజశేఖర్ రెడ్డి దంపతులు, అప్పటి విచారణాధికారి రామ్ సింగ్‌ లపై తప్పుడు కేసు నమోదు చేయడానికి ఈ ఇద్దరు పోలీస్ అధికారులు కారకులు. అప్పట్లో సునీత రాజశేఖర్ రెడ్డి దంపతులు, విచారణాధికారి రామ్ సింగ్‌లు తమను వేధిస్తున్నారని వివేకా పీఎ కృష్ణా రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ అంశంలో ముగ్గురిపైనా తప్పుడు కేసు నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే తాజాగా చర్యలకు ఉపక్రమించారు.  

48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్‌

  పెన్షన్ల పంపిణీ, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీలో పాల్గొనని 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ 48 మంది శాసన సభ్యులకు తక్షణమే నోటీసులు జారీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.పెన్షన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందేనని సీఎం తెలిపారు.  నోటీసులు తీసుకున్న  శాసన సభ్యులకు వివరణ తర్వాత చర్యలకు వెనకాడబోమని ముఖ్యమంత్రి స్ఫష్టం చేశారు. ఎమ్మెల్యేలు కార్యకర్తలను కలుపుకొని వెళ్లాలని తెలిపారు. ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందేనని తెలిపారు. విశాఖలో ఈ నెల 14,15 సీఐఐ సమ్మిట్ నిర్మాణాత్మకంగా జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. పెట్టుబడుల లక్ష్యంగా మంత్రి లోకేశ్ తీవ్ర కృషి చేస్తున్నారని తెలిపారు. గడుపులోపే క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. మీడియాతో చంద్రబాబు చిట్‌చాట్‌ నిర్వహించారు. అమరావతి బ్రాండ్‌ ఇమేజ్‌ రోజురోజుకూ పెరుగుతోందని ముఖ్యమంత్రి  తెలిపారు. హైదరాబాద్‌ స్థాయిలో భారీ ఈవెంట్లు ఇప్పుడు అమరావతిలో జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం కూడా ఈవెంట్లకు పూర్తి స్థాయిలో ప్రోత్సాహం ఇస్తోందని, ఇటీవల జరిగిన తమన్‌ మ్యూజికల్‌ నైట్‌, విజయవాడ ఉత్సవ్‌, ఇళయరాజా మ్యూజికల్‌ నైట్‌ వంటి కార్యక్రమాలు రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయని పేర్కొన్నారు. ఓవైపు ఈవెంట్లు, మరోవైపు భారీ పెట్టుబడులతో ఏపీ వేగంగా అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని సీఎం చెప్పారు.  నాయుడుపేటలో తెలంగాణకు చెందిన ప్రీమియర్‌ ఎనర్జీస్‌ సంస్థ పెట్టుబడులు పెట్టడం శుభ పరిణామమని అభివర్ణించారు. అంతేకాకుండా పార్టీ వ్యవహారాలపై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. పార్టీ కమిటీలు నెలాఖరులోగా పూర్తి చేసేలా కసరత్తు జరుగుతోందని తెలిపారు. పార్లమెంటు కమిటీల ఏర్పాటుపైనా చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.  

మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్

  తిరుపతి జిల్లా, మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎర్ర చందనం గొడౌన్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. 8 గోడౌన్లలో ఉన్న ఎర్రచందనం లాట్ల వివరాలను అధికారులను డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు. ఎ, బి. సీ, నాన్ గ్రేడ్ ల వారీగా దుంగల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి గోడౌన్ లో రికార్డులు పరిశీలించారు. ప్రతి ఎర్ర చందనం దుంగకి ప్రత్యేక బార్ కోడింగ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడుపోయే వరకు ఒక్క దుంగ కూడా మిస్ అవకూడదని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. స్థానిక అధికారులతో కలిసి పవన్ మొక్కలు నాటారు.  అడవిలో నాలుగు కిలోమీటర్లు  డిప్యూటీ సీఎం పవన్  ప్రయాణించారు. రెండు కిలోమీటర్ల మేర కాలినడకన ప్రతి చెట్టునీ పరిశీలించారు.ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనబడే అరుదైన మొక్కలు పరిశీలించి అటవీ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. నేపిరయర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుంచి మొత్తం అటవీ ప్రాంతం మొత్తం పరిశీలించారు. వెలిగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణ ముఖీ నది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. గుంటి మడుగు వాగు ఒడ్డున కూర్చుని, పరిసరాలను ఆసక్తిగా తిలకించారు. వాగుకి ఇరు వైపులా ఉన్న చెట్ల వివరాలపై ఆరా తీశారు.